“డీప్ ఓషన్ మిషన్” కు కేబినెట్ ఆమోదం
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం “డీప్ ఓషన్ మిషన్” అమలుకు ఆమోదం తెలిపింది. వనరుల కోసం లోతైన మహాసముద్రాన్ని అన్వేషించడానికి మరియు సముద్ర వనరుల స్థిరమైన ఉపయోగం కోసం లోతైన సముద్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి ఈ మిషన్‌ను ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ (MoES) ప్రతిపాదించింది.
మిషన్ గురించి:
- 5 సంవత్సరాల మిషన్ ను దశల వారీగా రూ.4077 కోట్ల అంచనా వ్యయంతో అమలు చేయనున్నారు.
- మొదటి దశ ను 2021-2024 లో, రూ. 4 కోట్ల అంచనా వ్యయంతో అమలు చేయనున్నారు.
- డీప్ ఓషన్ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం భారత ప్రభుత్వం యొక్క బ్లూ ఎకానమీ చొరవలకు మద్దతు ఇవ్వడం.
- ఈ బహుళ సంస్థాగత ప్రతిష్టాత్మక మిషన్ ను అమలు చేయడానికి ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ (MoES) నోడల్ మంత్రిత్వ శాఖగా ఉంటుంది.
డీప్ ఓషన్ మిషన్ కింది ఆరు ప్రధాన భాగాలు :
- డీప్ సీ మైనింగ్ మరియు మ్యాన్డ్ సబ్‌మెర్సిబుల్ కోసం టెక్నాలజీల అభివృద్ధి
- ఓషన్ క్లైమేట్ చేంజ్ అడ్వైజరీ సర్వీసెస్ అభివృద్ధి
- లోతైన సముద్ర జీవవైవిధ్యం యొక్క అన్వేషణ మరియు పరిరక్షణ కోసం సాంకేతిక ఆవిష్కరణలు
- డీప్ ఓషన్ సర్వే అండ్ ఎక్స్ప్లోరేషన్
- మహాసముద్రం నుండి శక్తి మరియు మంచినీరు
- ఓషన్ బయాలజీ కోసం అడ్వాన్స్డ్ మెరైన్ స్టేషన్
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
- కేంద్ర ఎర్త్ సైన్సెస్ మంత్రి: డాక్టర్ హర్షవర్ధన్.
కొన్ని ముఖ్యమైన లింకులు
- adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
- Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
- Telangana State GK PDF డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- 16 జూన్ 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- monthly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
- weekly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి