Telugu govt jobs   »   Monthly & Weekly Current Affairs   »   AP and Telangana states June Weekly...

AP and Telangana states June Weekly Current affairs Part 2, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల జూన్ వారాంతపు కరెంట్ అఫైర్స్ పార్ట్ 2

AP and Telangana state Weekly Current affairs, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వారాంతపు కరెంట్ అఫైర్స్

Current affairs play a very important role in the competitive examinations and hence, aspirants have to give undivided attention to it while doing preparation for the government examinations. The banking or state govt examinations comprise a section of “General Awareness” to evaluate how much the aspirant is aware of the daily happenings taking place around the world. To complement your preparation, we are providing you with a compilation of the  Current affairs of June 3rd and 4th week.

AP and Telangana state Weekly Current affairs, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వారాంతపు కరెంట్ అఫైర్స్

Weekly current Affairs PDF in Telugu : APPSC, TSPSC గ్రూప్స్ , SI మరియు కానిస్టేబుల్ పరీక్షలలో  జనరల్ అవేర్‌నెస్ చాలా ముఖ్యమైన విభాగాలలో ఒకటి మరియు మీరు మీ సమయాన్ని హృదయపూర్వకంగా కేటాయించినట్లయితే ఈ అంశం నుండి చాలా మంచి మార్కులు సాధించగలరు. పరీక్షల  ముందు అప్పటికప్పుడు  ఈ అంశాన్ని చదువుకొని వెళ్ళడం ద్వారా ఎక్కువ మార్కులు సాధించడం అసాధ్యం.  GA మీరు 10-15 రోజుల్లో పూర్తి  చేయగల విభాగం కాదు. మీరు జనరల్ అవేర్నెస్ పై పట్టు సాధించడానికి  ఉత్తమ మార్గం రోజూ వార్తాపత్రికలను చదవడం లేదా వారపు వార్తల ద్వారా వెళ్ళడం.

దీని ద్వారా   నెలవారీ లేదా 6 నెలల వార్తల ద్వారా తెలుసుకొనే సమాచారం కంటే ఎక్కువ సమాచారం తెలుసుకోవచ్చు. ఇక్కడ మేము మీకు అన్ని వార్తాపత్రికల నుండి సమకాలీన అంశాల సారాంశాన్ని అందిస్తున్నాము, ఇది మీ సమయాన్ని ఆదా చేస్తుంది మరియు మీరు ఆ సమయాన్ని వారాంతపు సమకాలీన అంశాలు 2022 అధ్యయనం కోసం కేటాయించవచ్చు.

AP and Telangana states June Weekly Current affairs Part 1, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల జూన్ వారాంతపు కరెంట్ అఫైర్స్ పార్ట్ 1_40.1APPSC/TSPSC Sure shot Selection Group

 

Telangana state June Weekly Current affairs

1. తెలంగాణలో ఫాక్స్‌కాన్‌ యూనిట్‌ ఏర్పాటు

AP and Telangana states June Weekly Current affairs Part 2,_4.1

ఎలక్ట్రానిక్స్‌ రంగ దిగ్గజం, తైవాన్‌కు చెందిన హాన్‌ హై టెక్నాలజీ గ్రూప్‌ (ఫాక్స్‌కాన్‌)యూనిట్‌ను తెలంగాణలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ఫాక్స్‌కాన్‌ ఛైర్మన్‌ యంగ్‌ లియును కోరారు.  ఢిల్లీలో లియుని కలిసిన కేటీఆర్‌ దేశంలో కంపెనీ విస్తరణ ప్రణాళి కలను చర్చించారు. తెలంగాణలో ఎలక్ట్రానిక్స్‌ తయారీని ప్రోత్సహించడానికి మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ఆయనకు వివరించారు.

2. హైదరాబాద్‌లో టర్కీ ఫుడ్‌ ఫెస్టివల్‌ ప్రారంభం

AP and Telangana states June Weekly Current affairs Part 2,_5.1

బంజారాహిల్స్‌లోని హయత్‌ ప్లేస్‌ వేదికగా  జులై 3వ తేదీ వరకు ఫ్లేవర్స్‌ ఆఫ్‌ టర్కీ పేరుతో టర్కీష్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌ను నిర్వహించనున్నారు. ఈ ఫుడ్‌ ఫెస్టివల్‌ ప్రారంభ కార్యక్రమాన్ని  హయత్‌ ప్లేస్‌లో ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా టర్కీ కాన్సులేట్‌ జనరల్‌ ఒర్హాన్‌ ఎల్మాన్‌ ఒకన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌ నగరవాసులకు తమ ఆహారం, సంస్కృతిని మరింత దగ్గర చేయాలనే ఉద్దేశ్యంతో ఈ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశామని అన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా టాప్‌ టెన్‌లో టర్కిష్‌ ఫుడ్‌ వెరైటీస్‌ ఉంటాయని తెలిపారు. హైదరాబాదీ ఫుడ్‌కు, టర్కీ ఫుడ్‌కు సారూప్యత ఉంటుందన్నారు.  ఈ ఫుడ్‌ ఫెస్టివల్‌లో పాల్గొనే వారు లక్కీ డ్రాలో భాగంగా టర్కీలో ఉచితంగా బస చేసే బహుమతిని పొందవచ్చని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌రంజన్‌ తదితరులు పాల్గొన్నారు.

3. సజయకు కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు

AP and Telangana states June Weekly Current affairs Part 2,_6.1

రచయిత్రి, సామాజిక ఉద్యమకారిణి కాకర్ల సజయకు 2021 సంవత్సరానికి సంబంధించి అనువాద విభాగంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం దక్కింది. ప్రముఖ రచయిత్రి భాషాసింగ్‌ రచించిన అదృశ్య భారత్‌(నాన్‌ ఫిక్షన్‌) హిందీ పుస్తకాన్ని సజయ ‘అశుద్ధ భారత్‌’పేరిట తెలుగులోకి అనువదించారు. అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ కాంబర్‌ నేతృత్వంలోని కార్యనిర్వాహక బోర్డు  సమావేశమై 22 పుస్తకాలను సాహిత్య అకాడమీ అనువాద అవార్డులకు ఎంపిక చేసింది.

జనవరి 1, 2015 నుంచి డిసెంబరు 2019 మధ్య ప్రచురితమైన పుస్తకాల నుంచి అవార్డు గ్రహీతలను ఎంపిక చేసినట్లు తెలిపారు. జ్యూరీ సభ్యులుగా ఎస్‌.శేషారత్నం, వై.ముకుంద రామారావు, గుమ్మ సాంబశివరావు వ్యవహరించారు. దేశంలోని పారిశుధ్య కార్మికుల వాస్తవ జీవన చిత్రాన్ని అశుద్ధ భారత్‌ పుస్తకం ఆవిష్కరించింది. త్వరలో నిర్వహించే కార్యక్రమంలో అవార్డు గ్రహీతలకు రూ.50 వేల నగదు, తామ్రపత్రం అందజేయనున్నారు.

4. అవయవ మార్పిడి నోడల్‌ సెంటర్‌గా గాంధీ ఆస్పత్రి

AP and Telangana states June Weekly Current affairs Part 2,_7.1

సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి మరో అరుదైన ఘనతను సొంతం చేసుకోనుంది. అవయవాల మార్పిడి సర్జరీల నోడల్‌ సెంటర్‌గా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ రూపొందించి అమలు చేయనున్నారు. అత్యాధునిక మాడ్యులర్‌ ఆపరేషన్‌ థియేటర్లు ఏర్పాటుకు రూ. 30 కోట్ల నిధులు కేటాయించగా, తెలంగాణ వైద్యవిద్య మౌళిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) ఆధ్వర్యంలో త్వరలోనే నిర్మాణ పనులు చేపట్టనున్నారు. దీనికి సంబంధించి డిటెల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్టు (డీపీఆర్‌)కు వైద్యశాఖ మంత్రి హరీష్‌రావు ఇటీవలే ఓకే చెప్పారని ఆస్పత్రికి చెందిన ఓ అధికారి తెలిపారు.

ప్రభుత్వ సెక్టార్‌లో ఉస్మానియా, నిమ్స్‌ ఆస్పత్రుల్లో అవయవాల మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలో ఒకటి రెండు అవయవమార్పిడి సర్జరీలు విజయవంతంగా చేపట్టినప్పటికీ అవసరమైన ఆధునిక ఆపరేషన్‌ థియేటర్లు అందుబాటులో లేకపోవడంతో అవయవ మార్పిడిపై పెద్దగా ఆసక్తి చూపించలేదు.

5. కాలుష్య సమస్యలతో హైదరాబాద్‌లో పరిశ్రమలకు అత్యల్ప సంఖ్యలో అనుమతులు

AP and Telangana states June Weekly Current affairs Part 2,_8.1

 

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కాలుష్య సమస్య కారణంగా కొత్త పరిశ్రమలకు ప్రభుత్వం అనుమతులు నిరాకరిస్తోంది. గత ఎనిమిదేళ్ల కాలంలో మొత్తంగా కేవలం 32 పరిశ్రమలు మాత్రమే హైదరాబాద్‌కు వచ్చాయి. ఇవి కాలుష్య సమస్య లేని ఐటీ పరిశ్రమలు. మేడ్చల్‌ – మల్కాజిగిరి జిల్లాలో అత్యధిక అనుమతులిచ్చారు. అక్కడ ఎనిమిదేళ్లలో 3,805 ( 22.2 శాతం) ఏర్పాటయ్యాయి. ఆ తర్వాత స్థానాల్లో సంగారెడ్డి 1,410 (8.25 శాతం),  కరీంనగర్‌ 1,223 (7.4 శాతం) నిలిచాయి. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన తెలంగాణ పారిశ్రామిక అనుమతులు, స్వీయ ధ్రువీకరణ విధానం (టీఎస్‌ఐపాస్‌) నివేదిక ఈ అంశాలను వెల్లడించింది.

6. ఫ్లిప్‌కార్ట్‌తో తెలంగాణ సెర్ప్‌ రూ.500 కోట్ల ఒప్పందం

AP and Telangana states June Weekly Current affairs Part 2,_9.1

మహిళా సంఘాల ఉత్పత్తులను దేశ విదేశాల్లో మార్కెటింగ్‌ చేసేందుకు ఫ్లిప్‌కార్ట్‌తో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) కుదుర్చుకొన్న ఒప్పందం చరిత్రాత్మకమని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ఈ సంస్థతో కలిసి స్వయం సహాయక బృందాలు ఈ ఏడాదికి రూ.500 కోట్ల వ్యాపార లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయని పేర్కొన్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో మంత్రి సమక్షంలో సెర్ప్‌ సీఈవో సందీప్‌కుమార్‌ సుల్తానియా, ఫ్లిప్‌కార్ట్‌ గ్రోసరీ వైస్‌ ప్రెసిడెంట్‌ స్మృతి రవిచంద్రన్‌లు మార్కెటింగ్‌ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.

 

AP and Telangana states June Weekly Current affairs Part 1, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల జూన్ వారాంతపు కరెంట్ అఫైర్స్ పార్ట్ 1_110.1

 

Andhra Pradesh state June Weekly Current affairs

1. విశాఖలో ప్రతిష్టాత్మక ఐసీఐడీ కాంగ్రెస్‌

AP and Telangana states June Weekly Current affairs Part 2,_11.1

 

అంతర్జాతీయంగా అత్యంత ప్రతిష్టాత్మక ఐసీఐడీ(ఇంటర్నేషనల్‌ కమిషన్‌ ఆన్‌ ఇరిగేషన్‌ అండ్‌ డ్రైనేజ్‌) 25వ కాంగ్రెస్‌ నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం దక్కించుకుంది. వచ్చే ఏడాది నవంబర్‌ 6 నుంచి 13 వరకూ విశాఖపట్నంలో ఐసీఐడీ 25వ కాంగ్రెస్‌తో పాటు, ఆ సంస్థ 75వ ఇంటర్నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌(ఐఈసీ) సమావేశం నిర్వహించనుంది. ప్రపంచవ్యాప్తంగా 78 దేశాల ప్రతినిధులు, శాస్త్రవేత్తలు ఈ సమావేశాల్లో పాల్గొంటారు. ప్రపంచానికి జలభద్రత చేకూర్చడం, తక్కువ నీటితో అధిక విస్తీర్ణంలో పంటల సాగుకు దోహదం చేసే అత్యాధునిక నీటి పారుదల విధానాలపై సమావేశంలో చర్చిస్తారు.

ఈ ఏడాది అక్టోబర్‌ 3 నుంచి 10 వరకూ ఐసీఐడీ 24వ కాంగ్రెస్, 74వ ఐఈసీ సమావేశాలు ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో జరగనున్నాయి. జల వనరుల సంరక్షణ తక్కువ నీటితో అధిక విస్తీర్ణంలో పంటల సాగు విధానాలపై అధ్యయనం చేసి, వాటి ఫలితాలను ప్రపంచానికి అందించడమే లక్ష్యంగా 1950, జూన్‌ 24న సిమ్లా వేదికగా ఐసీఐడీ ఆవిర్భవించింది. ఐసీఐడీ తొలి కాంగ్రెస్‌ను 1951, జనవరి 11–16 వరకూ ఢిల్లీలో నిర్వహించారు. 1953, జూన్‌లో బెంగళూరు వేదికగా నాలుగో సమావేశాన్ని నిర్వహించారు. ఐసీఐడీ ఆరో కాంగ్రెస్‌ను దేశంలో చివరగా ఢిల్లీలో 1966, జనవరి 4–13 వరకూ నిర్వహించారు.

2. త్వరలో బీఎస్‌–6 ఆయిల్‌

AP and Telangana states June Weekly Current affairs Part 2,_12.1

భారత్‌ స్టేజ్‌ –6 (బీఎస్‌–6) వాహనాలు విన్నాం, ఇక నుంచి బీఎస్‌–6 ఆయిల్‌ కూడా అందుబాటులోకి రానుంది. ఇందుకు విశాఖ కేంద్రంగా మారనుంది. తక్కువ కాలుష్యాన్ని మాత్రమే వదులుతూ వాహనాల ఇంజన్‌ సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు బీఎస్‌–6 ఆయిల్‌ దోహదపడనుంది. దీన్ని ఉత్పత్తి చేసేందుకు విశాఖలోని హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌) రిఫైనరీ సిద్ధమవుతోంది. దేశానికి విశాఖ నుంచే బీఎస్‌–6 పెట్రోల్‌/డీజిల్‌ సరఫరా కానుంది అనడంలో అతిశయోక్తి లేదు.

ఇందుకోసం ప్రస్తుతం ఉన్న రిఫైనరీ సామర్థ్యాన్ని ఏడాదికి 8.3 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల (ఎంఎంటీపీఏ) సామర్థ్యం నుంచి 15 ఎంఎంటీపీఏకు పెంచేందుకు విస్తరణ, ఆధునికీకరణ పనులను సంస్థ చేపడుతోంది. ఇందుకోసం ఏకంగా రూ.26,264 కోట్లను వెచ్చిస్తోంది. అన్నీ అనుకూలిస్తే 2023 మార్చి నాటికి విశాఖ కేంద్రంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు బీఎస్‌–6 పెట్రోల్‌/డీజిల్‌ సరఫరా కానుంది.

3. అమ్మ ఒడికి రూ.6,594.60 కోట్లు

AP and Telangana states June Weekly Current affairs Part 2,_13.1

రాష్ట్రంలో ఏ ఒక్కరి చదువులకు పేదరికం అడ్డు కాకూడదనే ఉద్దేశంతో నవరత్నాల్లో భాగంగా జగనన్న అమ్మఒడి పథకం కింద ఈ ఏడాది 43,96,402 మంది తల్లులకు లబ్ధి చేకూర్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో 54 శాతం మంది బీసీలు, 21 శాతం మంది ఎస్సీలు, 6 శాతం మంది ఎస్టీలు, 19 శాతం మంది ఓసీలు ఉన్నారు. ఈ పథకం కింద ఈ నెల 27న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.6,594.60 కోట్లను సీఎం జమ చేయనున్నారు. ఈ ఏడాది కొత్తగా అమ్మ ఒడి పరిథిలోకి 5,48,329 మంది తల్లులు వచ్చారు. ఈ పథకం ద్వారా 82,31,502 మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతారు.

4. జీశాట్‌–24 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం

AP and Telangana states June Weekly Current affairs Part 2,_14.1

ఫ్రాన్స్‌లోని ఫ్రెంచ్‌ గయానా కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్‌–5 రాకెట్‌ ద్వారా న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌ఎస్‌ఐఎల్‌), కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్పేస్‌(డీఓఎస్‌) సంయుక్తంగా రూపాందించిన జీశాట్‌–24 కమ్యూనికేషన్‌ ఉపగ్రహాన్ని బుధవారం వేకువజామున విజయవంతంగా రోదసీలోకి ప్రవేశపెట్టారు. 4,180 కిలోల బరువు కలిగిన జీశాట్‌–24 ఉపగ్రహాన్ని నిర్ణీత సమయంలో నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు.

ఈ  ఉపగ్రహంలో 24 కేయూ బ్యాండ్‌ ట్రాన్స్‌ఫాండర్లు అమర్చి డీటీహెచ్‌ అప్లికేషన్‌ అవసరాలను తీర్చేందుకు పాన్‌ ఇండియా కవరేజీతో రోదసీలో పంపారు.  ఇప్పటిదాకా 4వేల కిలోల పైన బరువు కలిగిన భారీ ఉపగ్రహాలను కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించడంలో భాగంగా  ఈ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు. జీశాట్‌–25తో డీటీహెచ్‌ అప్లికేషన్‌లో నూతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుందని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌(షార్‌)లో రెండో ప్రయోగవేదిక నుంచి ఈనెల 30న సాయంత్రం 6 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ53 ప్రయోగాన్ని నిర్వహించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

5. ఏపీ @ గ్రీన్‌ ‘పవర్‌’

AP and Telangana states June Weekly Current affairs Part 2,_15.1

ప్రకృతి ప్రసాదించిన వనరులను సద్వినియోగం చేసుకుంటూ ఇటు కాలుష్య రహితమైన విద్యుదుత్పత్తి అటు అన్నదాతలకు ఆర్థిక లాభం, యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. భౌగోళిక పరిస్థితుల అనుకూలత కారణంగా రాష్ట్రంలో 30 వేల మెగావాట్లకు పైగా పవన్, సౌర విద్యుత్తు లాంటి గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తికి అపార అవకాశాలున్న నేపథ్యంలో దీన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించింది.

అదానీ గ్రీన్‌ ఎనర్జీ రూ.15,376 కోట్ల వ్యయంతో ప్రతిపాదించిన పంప్డ్‌ స్టోరేజ్‌ విద్యుదుత్పత్తి కేంద్రంతో పాటు పలు ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు (ఎస్‌ఐపీబీ) ఆమోదం తెలిపింది.

6. రాష్ట్రంలో మరో భారీ సిమెంట్‌ ప్లాంటు ఏర్పాటు

AP and Telangana states June Weekly Current affairs Part 2,_16.1

రాష్ట్రంలో మరో భారీ సిమెంట్‌ ప్లాంటు ఏర్పాటు కానుంది. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడులో ప్రఖ్యాత శ్రీ సిమెంట్‌ కంపెనీ తమ తదుపరి ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇక్కడ ఇంటిగ్రేటెడ్‌ సిమెంట్‌ ప్లాంట్‌ను రూ. 2,500 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్నట్లు శ్రీ సిమెంట్‌ యాజమాన్యం పేర్కొంది.

ఏడాదికి 1.5 మిలియన్‌ టన్నుల క్లింకర్, 3 మిలియన్‌ టన్నుల సిమెంట్‌ ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు శ్రీ సిమెంట్‌ కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. దేశంలో ప్రస్తుతం ఉన్న శ్రీ సిమెంట్‌ కంపెనీ ప్లాంట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 46.4 మిలియన్‌ టన్నులుగా ఉంది. ఉత్పత్తి సామర్థ్యంలో 2021–22 ఆర్థిక సంవత్సరంలో 64 శాతం వినియోగించుకుంది. రూ. 2,500 కోట్ల పెట్టుబడిని అంతర్గతంగా, రుణాల ద్వారా సమీకరించనున్నట్లు కంపెనీ పేర్కొంది.

7. విశాఖలో అంతర్జాతీయ యానిమేషన్‌ చిత్ర నిర్మాణం

AP and Telangana states June Weekly Current affairs Part 2,_17.1

అంతర్జాతీయ యానిమేషన్‌ చిత్రం ‘నోహాన్‌ ఆర్క్‌’ విశాఖ కేంద్రంగా రూపుదిద్దుకోనుంది. విశాఖ ఐటీ పార్కులోని సింబయాసిస్‌ టెక్నాలజీస్‌ సంస్థలో అమెరికా, బ్రెజిల్‌ దేశాలకు చెందిన నిర్మాతలు దీనిని నిర్మిస్తున్నారు. ఇందుకోసం రూ.45 కోట్లను వెచ్చిస్తున్నారు. అత్యంత నాణ్యతా ప్రమాణాలతో యానిమేషన్‌ ఫిల్మ్‌గా దీనిని  రూపొందిస్తున్నట్టు సింబయాసిస్‌ టెక్నాలజీస్‌ సీఈవో ఓ.నరేష్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. చిత్ర నిర్మాణంలో భాగంగా సముద్రంలో తుపానులను సృష్టించే వీఎఫ్‌ఎస్‌ల కోసం ప్రత్యేక కంప్యూటర్లను వినియోగిస్తామన్నారు.

ఇటువంటి అంతర్జాతీయ చిత్రాలు మరిన్ని నిర్మించడానికి వీలుగా వీఎఫ్‌ఎక్స్, లైవ్‌ల్యాబ్, డబ్బింగ్‌ స్టూడియో, ఫిల్మ్‌ ల్యాబ్‌లను సిద్ధం చేశామన్నారు. షార్ట్‌ ఫిల్మ్‌లు, యాడ్‌ ఫిల్మ్‌లు చిత్రీకరించి, ఎడిటింగ్, డబ్బింగ్‌ చేసే విధంగా అత్యున్నత సదుపాయాలను తమ సంస్థలో నెలకొల్పడం జరిగిందన్నారు. అంతర్జాతీయ యానిమేషన్‌ చిత్రాల రూపకల్పనలో విశాఖకు మంచి గుర్తింపు లభించినట్టుగా తాము భావిస్తున్నామన్నారు.

****************************************************************

Also check Previous :

AP and Telangana state May Weekly Current affairs

AP and Telangana state June Weekly Current affairs

 

AP and Telangana states June Weekly Current affairs Part 1, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల జూన్ వారాంతపు కరెంట్ అఫైర్స్ పార్ట్ 1_200.1

 

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  క్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

 

Sharing is caring!