Telugu govt jobs   »   Telugu Current Affairs   »   AP and Telangana state Weekly Current...

AP and Telangana state Weekly Current affairs, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వారాంతపు కరెంట్ అఫైర్స్

AP and Telangana state Weekly Current affairs, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వారాంతపు కరెంట్ అఫైర్స్

Current affairs play a very important role in the competitive examinations and hence, aspirants have to give undivided attention to it while doing preparation for the government examinations. The banking or state govt examinations comprise a section of “General Awareness” to evaluate how much the aspirant is aware of the daily happenings taking place around the world. To complement your preparation, we are providing you with a compilation of the  Current affairs of MAY 4th week.

AP and Telangana state Weekly Current affairs, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వారాంతపు కరెంట్ అఫైర్స్

Weekly current Affairs PDF in Telugu : APPSC, TSPSC గ్రూప్స్ , SI మరియు కానిస్టేబుల్ పరీక్షలలో  జనరల్ అవేర్‌నెస్ చాలా ముఖ్యమైన విభాగాలలో ఒకటి మరియు మీరు మీ సమయాన్ని హృదయపూర్వకంగా కేటాయించినట్లయితే ఈ అంశం నుండి చాలా మంచి మార్కులు సాధించగలరు. పరీక్షల  ముందు అప్పటికప్పుడు  ఈ అంశాన్ని చదువుకొని వెళ్ళడం ద్వారా ఎక్కువ మార్కులు సాధించడం అసాధ్యం.  GA మీరు 10-15 రోజుల్లో పూర్తి  చేయగల విభాగం కాదు. మీరు జనరల్ అవేర్నెస్ పై పట్టు సాధించడానికి  ఉత్తమ మార్గం రోజూ వార్తాపత్రికలను చదవడం లేదా వారపు వార్తల ద్వారా వెళ్ళడం.

దీని ద్వారా   నెలవారీ లేదా 6 నెలల వార్తల ద్వారా తెలుసుకొనే సమాచారం కంటే ఎక్కువ సమాచారం తెలుసుకోవచ్చు. ఇక్కడ మేము మీకు అన్ని వార్తాపత్రికల నుండి సమకాలీన అంశాల సారాంశాన్ని అందిస్తున్నాము, ఇది మీ సమయాన్ని ఆదా చేస్తుంది మరియు మీరు ఆ సమయాన్ని వారాంతపు సమకాలీన అంశాలు 2022 అధ్యయనం కోసం కేటాయించవచ్చు.

AP and Telangana state Weekly Current affairs, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వారాంతపు కరెంట్ అఫైర్స్_40.1APPSC/TSPSC Sure shot Selection Group

Telangana state Weekly Current affairs

1. 2021 – 22 ఐటీ రంగంలో తెలంగాణ రూ.1.83 లక్షల కోట్ల ఎగుమతులు

AP and Telangana state Weekly Current affairs, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వారాంతపు కరెంట్ అఫైర్స్_50.1
Telangana IT exports Reached Rs 1.83 lakh crore in 2021 – 22

ఐటీ రంగంలో తెలంగాణ గత ఎనిమిదేళ్లలో అద్భుతమైన పురోగతి సాధించిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. ఈ రంగంలో భారతదేశ వృద్ధి తగ్గుతుంటే తెలంగాణ మాత్రం గణనీయమైన ప్రగతి సాధిస్తోందన్నారు. రాష్ట్రంలో ఈ ఎగుమతులు 2020 – 21లో రూ.1,45,522 కోట్లు ఉండగా 2021 – 22లో అవి రూ.1,83,569 కోట్లకు చేరుకున్నాయని తెలిపారు. అంటే 2021 కంటే 26.14% ఎక్కువని అన్నారు. ఐటీ తెలంగాణ అయిదో వార్షిక నివేదికను ఆయన హైటెక్‌ సిటీలోని టెక్‌ మహీంద్రా కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ఐటీ పురోగతిని వివరించారు. టీఎస్‌ఐసీ, వీహబ్, టీహబ్, టీవర్క్స్, టాస్క్‌ వంటి సంస్థల ద్వారా ఆవిష్కరణలను, అంకురాలను ప్రోత్సహిస్తున్నాం. రాష్ట్రంలో 1,423 ఓపెన్‌ డేటా సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. టీ ఫైబర్‌కు కేంద్రం అనుమతి లభించిందని మంత్రి తెలిపారు.

2. సింగరేణి చరిత్రలోనే 6.50 కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి

AP and Telangana state Weekly Current affairs, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వారాంతపు కరెంట్ అఫైర్స్_60.1
6.50 crore tonnes of coal production in the history of Singareni

సింగరేణి చరిత్రలోనే అత్యధికంగా 2021 – 22 ఆర్థిక సంవత్సరంలో 6.50 కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసినట్లు ఆ సంస్థ తెలిపింది. బొగ్గు, విద్యుత్‌ అమ్మకాల ద్వారా రూ.26 వేల కోట్ల వార్షిక టర్నోవర్‌ రికార్డును కూడా సాధించినట్లు ప్రకటించింది. సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం 2021 – 22లో 9,353 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి చేసి దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలలో అత్యుత్తమ ఉత్పత్తి శాతం (పి.ఎల్‌.ఎఫ్‌.)తో అగ్రస్థానంలో నిలిచిందని సింగరేణి సంస్థ సీఎండీ శ్రీధర్‌ వివరించారు.

3. తెలంగాణ రాష్ట్రానికి రూ.4,200 కోట్ల పెట్టుబడులతో కుదిరిన ఒప్పందాలు

AP and Telangana state Weekly Current affairs, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వారాంతపు కరెంట్ అఫైర్స్_70.1
Agreements reached with an investment of Rs 4,200 crore for the state of Telangana

పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ దావోస్‌ పర్యటన ముగిసింది. దీని ద్వారా రూ.4200 కోట్లకుపైగా పెట్టుబడులను సమీకరించినట్లు ఆయన వెల్లడించారు. 45 ప్రసిద్ధ సంస్థలతో ఆయన సమావేశమయ్యారు. దావోస్‌లో తొలిసారిగా ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్‌ ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత్‌తో పాటు పలు అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు దానిని సందర్శించి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. కొన్ని సంస్థలు పెట్టుబడులు ప్రకటించగా, మరికొన్ని విస్తరణ ప్రణాళికలను వెల్లడించాయి. ఇంకొన్ని పరస్పర సహకారానికి అంగీకరించాయి.

4. కర్బన ఉద్గారాలు తగ్గించేందుకు గూగుల్‌తో ఒప్పందం

AP and Telangana state Weekly Current affairs, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వారాంతపు కరెంట్ అఫైర్స్_80.1
Telangana has signed an agreement with Google to reduce carbon emissions

అత్యాధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానంతో తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో వాహనాల రాకపోకలను నియంత్రిస్తున్న ట్రాఫిక్‌ పోలీసులు వాహనాల ద్వారా వెలువడే కర్బన ఉద్గారాలను తగ్గించేందుకూ కృషి చేస్తున్నారు. ఇందుకోసం దేశంలోనే తొలి కాలుష్య రహిత కూడలి (గ్రీన్‌ ట్రాఫిక్‌ జంక్షన్‌)ని రూపొందించనున్నారు. తర్వాత క్రమంగా మొత్తం 150 ట్రాఫిక్‌ జంక్షన్లను పర్యావరణమిత్ర కూడళ్లుగా మార్చనున్నారు. ఇందుకోసం గూగుల్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. కూడళ్ల వద్ద సిగ్నలింగ్‌ వ్యవస్థలో మార్పులు చేర్పులు చేయడం ద్వారా వాహనాల నుంచి విడుదలయ్యే కార్బన్‌ డయాక్సైడ్, కార్బన్‌ మోనాక్సైడ్‌ వంటి విషవాయువులను తగ్గించనున్నారు.

5. తెలంగాణలో రూ.1400 కోట్లతో భారీ పరిశ్రమ స్థాపనకు హ్యుందాయ్‌ ఒప్పందం

AP and Telangana state Weekly Current affairs, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వారాంతపు కరెంట్ అఫైర్స్_90.1
Hyundai to invest Rs 1,400 crore in Telangana

తెలంగాణలో భారీ పెట్టుబడులతో పరిశ్రమలను స్థాపించేందుకు హ్యుందాయ్‌ రూ.1400 కోట్లతో, జీఎంఎం ఫాడ్యులర్‌ రూ.50 కోట్లతో, ఈఎంపీఈ రూ.50 కోట్లతో పరిశ్రమల ఏర్పాటు కోసం, విఖ్యాత ఆర్థిక సేవల సంస్థ మాస్టర్‌కార్డ్‌ రాష్ట్రంలో ప్రపంచస్థాయి ఆర్థిక సేవల కోసం మంత్రి కేటీఆర్‌ సమక్షంలో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న గతిశక్తి సమూహం (మొబిలిటీ క్లస్టర్‌) వ్యాలీలో రూ.1400 కోట్ల పెట్టుబడితో భారీ పరిశ్రమను స్థాపించాలని ప్రసిద్ధ వాహన తయారీ సంస్థ హ్యుందాయ్‌ నిర్ణయించింది. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా దావోస్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్‌లో హ్యుందాయ్‌ సీఐవో యంగ్‌చోచి తమ ప్రతినిధి బృందంతో రాష్ట్ర మంత్రి కేటీ రామారావును కలిశారు.

6. తెలంగాణలో రూ.1000 కోట్లతో రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు, 2500 మందికి ఉద్యోగావకాశాలు

AP and Telangana state Weekly Current affairs, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వారాంతపు కరెంట్ అఫైర్స్_100.1
Rs 1000 crore rail coach factory to come up in Telangana,

స్విట్జర్లాండ్‌కు చెందిన స్టాడ్లర్‌ రైల్‌ సంస్థ తెలంగాణలో రూ. వెయ్యి కోట్ల పెట్టుబడితో అంతర్జాతీయ రైల్వేకోచ్‌ల కర్మాగారం ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. దీంతో పాటు ఇప్పటికే రాష్ట్రంలో పరిశ్రమలు నడుపుతున్న ఫెర్రింగ్‌ ఫార్మా, విద్యుత్‌ వాహనాల సంస్థ ష్నైడర్‌లు తమ కొత్త యూనిట్ల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందా (ఎంవోయూ)లు చేసుకున్నాయి. పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ సమక్షంలో దావోస్‌లో జరిగిన ఈ కార్యక్రమాల్లో ఆయా కంపెనీల ప్రతినిధులు, రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌లు ఎంవోయూలపై సంతకాలు చేశారు.

AP and Telangana state Weekly Current affairs, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వారాంతపు కరెంట్ అఫైర్స్_110.1

Andhra Pradesh state Weekly Current affairs

1. ఏసీబీ 14400 యాప్‌ను ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

అవినీతికి ఏమాత్రం తావులేని స్వచ్ఛమైన పాలన అందించడమే మనందరి కర్తవ్యం కావాలని అధికార యంత్రాంగానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎవరైనా సరే.. ఎక్కడైనా సరే.. అవినీతికి పాల్పడితే కచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చ రించారు. అవినీతిని నిరోధించేందుకు ఏసీబీ ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్‌ యాప్‌ ‘ఏసీబీ 14400’ని ముఖ్యమంత్రి జగన్‌ జూన్‌ 1 (బుధవారం) తన క్యాంపు కార్యాలయంలో ‘స్పందన’ సమీక్ష సందర్భంగా ఆవిష్కరించి మాట్లాడారు.

AP and Telangana state Weekly Current affairs, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వారాంతపు కరెంట్ అఫైర్స్_120.1
Chief Minister YS Jagan launches ACB 14400 app

డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, ఏసీబీ డీఐజీలు అశోక్‌కుమార్, పీహెచ్‌డి రామకృష్ణ ఇందులో పాల్గొన్నారు. ఎక్కడా అవినీతి ఉండకూడదనే మాట ఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి చాలా గట్టిగా, స్పష్టంగా, పదేపదే చెబుతున్నామని సీఎం జగన్‌ పేర్కొన్నారు. వ్యవస్థ ప్రక్షాళన దిశగా అనేక కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు. చరిత్రలో ఎప్పుడూలేని విధంగా, ఏ రాష్ట్రం లోనూ లేని విధంగా రూ.1.41 లక్షల కోట్లను ఎలాంటి అవినీతికి తావు లేకుండా, నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి అత్యంత పారదర్శ కంగా జమ చేశామని చెప్పారు.

2. అసాంక్రమిక, సాంక్రమిక వ్యాధుల సర్వే (ఎన్‌సీడీ, సీడీ)

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో క్యాన్సర్‌ కేసులు పెరుగుతున్నాయి. ఆరోగ్య శ్రీ ట్రస్టు ద్వారా 1.81 లక్షల కేసులు నమోదుకాగా, ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకుంటున్న వారు వేలల్లో ఉంటారని అంచనా. ప్రస్తుతం నిర్వహిస్తున్న అసాంక్రమిక, సాంక్రమిక వ్యాధుల సర్వే (ఎన్‌సీడీ, సీడీ)లో 32 వేల మందిలో వివిధ రకాల క్యాన్సర్‌ అనుమానిత లక్షణాలు బయటపడ్డాయి. ఇందులో సర్వైకల్‌ 17 వేలు, ఓరల్‌ 10 వేలు, రొమ్ము క్యాన్సర్ల లక్షణాలు ఐదు వేల మందిలో గుర్తించారు. గతేడాది ఆగస్టులో కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఏపీలో మూడున్నరేళ్లలో 2.06 లక్షల మంది ఈ వ్యాధి బారినపడ్డారు

ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా 2018 – 19 నాటికి 1,25,848 క్యాన్సర్‌ కేసులు నమోదై ఉన్నాయి. ఈ సంఖ్య 2019 – 20లో 1,23,273కు, 2020 – 21లో 1,46,806కు, 2021 – 22 నాటికి 1,81,957కు చేరింది. ఈ 1.81 లక్షల కేసుల్లో 26% రొమ్ము, 23% సర్వైకల్‌ కావడం తీవ్రతను చాటుతోంది. గ్లోబకాన్‌ – 2020 (డబ్ల్యూహెచ్‌వో సంస్థ) లెక్కల ప్రకారం.. 2020లో దేశవ్యాప్తంగా 13.24 లక్షల కేసులు బయటపడ్డాయి. వీరిలో 6.78 లక్షలు పురుషులు, 6.46 లక్షల మంది మహిళలున్నారు. 8.51 లక్షల మంది మరణించారు.

3. తిరుపతి చీని, నిమ్మ నర్సరీకి త్రీస్టార్‌ రేటింగ్‌

AP and Telangana state Weekly Current affairs, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వారాంతపు కరెంట్ అఫైర్స్_130.1

తిరుపతిలోని చీని, నిమ్మ పరిశోధనా స్థానంలోని నర్సరీకి జాతీయ ఉద్యాన మండలి ఇటీవల త్రీస్టార్‌ రేటింగ్‌ ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు రంగ నర్సరీల్లో జాతీయ ఉద్యాన మండలి నిబంధనలకు అనుగుణంగా నడుస్తున్న వాటిని నిపుణుల బృందం మార్చిలో పరిశీలించి ర్యాంకులు ప్రకటించింది. అందులో తెలుగు రాష్ట్రాల్లో త్రీస్టార్‌ రేటింగ్‌ దక్కించుకున్నది తిరుపతి చీని, నిమ్మ మొక్కల నర్సరీ ఒక్కటే కావడం విశేషం. దీనిని 1964లో ఏర్పాటు చేశారు. ఏటా 15 లక్షల మొక్కల వరకు డిమాండు ఉండగా రెండున్నర లక్షలు మాత్రమే ఉత్పత్తి చేయగలుగుతున్నారు. వైరస్‌ రహిత మొక్కల ఉత్పత్తి లక్ష్యంగా పనిచేస్తున్నామని పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ నాగరాజు తెలిపారు.

 

AP and Telangana state Weekly Current affairs, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వారాంతపు కరెంట్ అఫైర్స్_140.1

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

AP and Telangana state Weekly Current affairs, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వారాంతపు కరెంట్ అఫైర్స్_150.1

Sharing is caring!

Download your free content now!

Congratulations!

AP and Telangana state Weekly Current affairs, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వారాంతపు కరెంట్ అఫైర్స్_170.1

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Download your free content now!

We have already received your details!

AP and Telangana state Weekly Current affairs, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వారాంతపు కరెంట్ అఫైర్స్_180.1

Please click download to receive Adda247's premium content on your email ID

Incorrect details? Fill the form again here

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Thank You, Your details have been submitted we will get back to you.