ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్విస్ కమిషన్ గ్రూప్-2 కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. తొలుత జనవరి 10 ని దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీగా ప్రకటించింది కానీ చివరి నిముషంలో దరఖాస్తు చేసుకోడానికి అభ్యర్ధులు ప్రయత్నించడంతో APPSC సర్వర్ సరిగ్గా పనిచేయకపోవడంతో దరఖాస్తు తేదీని 17 జనవరి 2024 వరకు పొడిగించారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్విస్ కమిషన్ గ్రూప్ 2 పరీక్షకీ దరఖాస్తు చేసుకోడానికి గడువుని జనవరి 17. గ్రూప్ 2 ద్వారా వివిధ ప్రభుత్వ శాఖలలో ఉన్న 897 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
APPSC గ్రూప్ 2 పరీక్ష కీ పోటీ ఎలా ఉంది?
APPSC గ్రూప్ 2 పరీక్ష కోసం 21 డిసెంబర్ 2023 న దరఖాస్తు ప్రక్రియ 17 జనవరి 2024తో ముగిసింది. చివరి తేదీ నాటికి దాదాపుగా 4.8 లక్షల మంది అప్లై చేసుకున్నారు. గ్రూప్-2 నియామక ప్రక్రియలో 897 ఖాళీలను ప్రకటించింది, ఇందులో నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్ట్ లు 566, ఎగ్జిక్యూటివ్ పోస్ట్ లు 446 ఉన్నాయి. నిపుణుల అంచనా ప్రకారం నిన్నటి వరకు అప్లై చేసిన అభ్యర్ధుల ఆధారంగా దాదాపు ఒక్కో పోస్ట్ కు 533 మంది పోటీ పడుతున్నారు. దరఖాస్తు గడువు పొడిగించడం తో పోటీ కొంచం తీవ్రమైంది, కావున అభ్యర్ధులు వారి ప్రణాళికను మరింత పటిష్టంగా తయారుచేసుకుంటే గ్రూప్ 2 పరీక్ష లో విజయం సాధించగలరు. APPSC పరీక్ష లో అడ్డంకులని తట్టుకుని విజయం సాధించడానికి మెరుగైన ప్రణాళికా శైలి మరియు దృఢ నిశ్చయంతో ముందుకి సాగాలి.
APPSC గ్రూప్ 2 ఎంపిక ప్రక్రియ 2024
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక నోటిఫికేషన్ PDF ద్వారా APPSC గ్రూప్ 2 ఎంపిక ప్రక్రియను విడుదల చేస్తుంది. ఆశావాదులు పరీక్ష అవసరాలకు అనుగుణంగా వారి వ్యూహాన్ని సిద్ధం చేయడానికి APPSC గ్రూప్ 2 రిక్రూట్‌మెంట్ ఎంపిక ప్రక్రియను తనిఖీ చేయాలి. APPSC గ్రూప్ 2 నోటిఫికేషన్ PDF ప్రకారం, ఎంపిక ప్రక్రియ క్రింది దశలను కలిగి ఉంటుంది.
- స్క్రీనింగ్ టెస్ట్/ప్రిలిమినరీ పరీక్ష
- మెయిన్స్ పరీక్ష
- కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్
APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎంపిక ప్రక్రియ
స్క్రీనింగ్ టెస్ట్/ప్రిలిమినరీ పరీక్ష APPSC గ్రూప్ 2 ఎంపిక ప్రక్రియలో మొదటి దశ.
- APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష విధానంలో ఒక విభాగం ఉంటుంది, అంటే జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ.
పరీక్షలో భారతీయ చరిత్ర, భూగోళశాస్త్రం, భారతీయ సమాజం, కరెంట్ అఫైర్స్ మరియు మెంటల్ ఎబిలిటీ అనే ఐదు ఉప భాగాలు ఉన్నాయి. - స్క్రీనింగ్ టెస్ట్ 150 మార్కులకు, అంటే ప్రతి సబ్ సెక్షన్‌కు 30 మార్కులకు నిర్వహించబడుతుంది.
APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎంపిక ప్రక్రియ | |||||
సబ్జెక్టు | ప్రశ్నలు | మార్కులు | మొత్తం మార్కులు | సమయం | |
ప్రాచీన, మధ్యయుగ మరియు ఆధునిక చరిత్ర | 30 | 30 | 150 నిమిషాలు | 150 నిమిషాలు | |
భూగోళ శాస్త్రం | 30 | 30 | |||
భారతీయ సమాజం | 30 | 30 | |||
కరెంట్ అఫైర్స్ (సమకాలీన అంశాలు) | 30 | 30 | |||
మెంటల్ ఎబిలిటీ | 30 | 30 |
APPSC గ్రూప్ 2 పరీక్ష పుస్తకాల జాబితా (కొత్త సిలబస్)