Telugu govt jobs   »   కోవిడ్ రెండో దశ అనంతరం ₹6.28 లక్షల...

కోవిడ్ రెండో దశ అనంతరం ₹6.28 లక్షల కోట్ల ప్యాకేజీ ని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం : పూర్తి వివరాలకై ఇక్కడ తనిఖీ చేయండి

కోవిడ్ రెండో దశ అనంతరం ₹6.28 లక్షల కోట్ల ప్యాకేజీ ని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం : పూర్తి వివరాలకై ఇక్కడ తనిఖీ చేయండి_2.1

కోవిడ్ రెండో దశ అనంతరం ₹6.28 లక్షల కోట్ల ఉద్దీపనలను ఆవిష్కరించిన ప్రభుత్వం

  • MSMEలకు మరిన్ని రుణాలు
  • ఎరువుల్లో అన్నదాతకు మరిన్ని రాయితీలు
  • ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలు
  • విద్యుత్తు సంస్కరణలు
  • పర్యాటకానికి ప్రోత్సాహకాలు
  • కొవిడ్‌ కారణంగా దెబ్బతిన్న రంగాలకు చేయూత
  • మరిన్ని ఎగుమతులకు బాటలు
  • బ్రాడ్‌ బ్యాండ్‌ విస్తరణకు చర్యలు
  • నవంబరు వరకు నిరుపేదలకు 5 కేజీల ఉచిత బియ్యం

కొవిడ్‌ రెండో దశ కారణంగా దెబ్బ తిన్న రంగాలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం మరో భారీ ప్యాకేజీని ప్రకటించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, తాజాగా రూ.6,28,993 కోట్ల ప్యాకేజీని   ప్రకటించారు. ఇందులో భాగంగా, కొవిడ్‌తో ప్రభావితమైన రంగాలను ఆదుకోవడానికి ఎనిమిది రకాల పథకాలను వెల్లడించారు. వీటిలో నాలుగు కొత్తవి కాగా.. ఇందులో ఒకటి ప్రత్యేకంగా ఆరోగ్య రంగానికి కేటాయించబడినది.

కోవిడ్-19 నుండి ఆర్థిక ఉపశమనం రూ.3,76,244 కోట్లు
ప్రజారోగ్యం కోసం కొత్త పథకం రూ.15, 000 కోట్లు
ఎదుగుదల మరియు ఉపాధికి ప్రేరణ రూ.2,37,749 కోట్లు
మొత్తం రూ.6,28,993 కోట్లు

ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల విస్తరణ

  • కొవిడ్‌తో ప్రభావితమైన రంగాలను ఆదుకోవడానికి రూ.1.1 లక్షల కోట్ల రుణ హామీ పథకాన్ని కేంద్రం ప్రకటించింది. ఇందులో రూ.50 వేల కోట్లను కేవలం వైద్య రంగంలో మౌలిక సదుపాయాలను విస్తరించడానికే కేటాయించింది.
  • ఈ పథకం కింద 7.95 శాతం వడ్డీని మించకుండా గరిష్ఠంగా రూ.100 కోట్ల రుణాన్ని అందిస్తారు.
  • ఇవి కాకుండా మరో రూ.23,200 కోట్లను ప్రజారోగ్యానికి కేటాయించారు. ఇందులో రూ.15 వేల కోట్లతో ఎమర్జెన్సీ హెల్త్‌ సిస్టమ్స్‌ ప్రాజెక్టును ప్రకటించారు.
  • కరోనా రెండో దశ లో ఆక్సిజన్‌ సంక్షోభంతో వైద్య రంగం అతలాకుతలమైన సంగతి తెలిసిందే. త్వరలో మూడో దశ వచ్చే అవకాశం ఉందనే అంచనాలూ వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఈ నిధులను స్వల్ప కాలంలోనే అత్యవసర వైద్య సదుపాయాలను ఏర్పాటు చేయడానికి వినియోగిస్తారు.
  • కొవిడ్‌ ఆస్పత్రులు, అంబులెన్సులు, మందులు, ఐసీయూ, ఆక్సిజన్‌ పడకలను పెంచడానికి వెచ్చిస్తారు. చిన్నపిల్లల వైద్యానికి సంబంధించిన సదుపాయాల కల్పనకు ఉపయోగిస్తారు.

 తెలుగు లో Static GK PDF  

బ్రాడ్‌ బ్యాండ్‌కు మరో రూ.19,041 కోట్లు

  • దేశవ్యాప్తంగా రెండున్నర లక్షల పంచాయతీలకు బ్రాడ్‌ బ్యాండ్‌ సౌకర్యాన్ని కల్పించడంలో భాగంగా ప్రకటించిన భారత్‌ నెట్‌ పథకానికి మరో రూ.19,041 కోట్లను కేటాయించారు.

సూక్ష్మ రుణ సంస్థలకు హామీ

  • రూ.1.1 లక్షల కోట్ల రుణ హామీ పథకంలోని మిగిలిన రూ.60 వేల కోట్లను ఇతర రంగాలకు కేటాయించారు.
  • పథకంలో భాగంగా, సూక్ష్మ ఆర్థిక సంస్థల నుంచి పూచీకత్తు లేకుండా రూ.1.25 లక్షల వరకూ రుణం తీసుకోవచ్చు. దీని ద్వారా దాదాపు 25 లక్షల మందికి లబ్ధి కలిగే అవకాశం ఉంది.
  • అయితే, వీటిని కొత్తగా రుణాలు తీసుకునే వారికే ఇవ్వాలని, ఉన్న రుణాలను తిరిగి చెల్లించే వారికి కాదని నిర్మల తెలిపారు. అలాగే, భారీ స్థాయిలో ఎలకా్ట్రనిక్స్‌ తయారీ పరిశ్రమలకు ఇచ్చే ప్రొడక్షన్‌ లింక్‌డ్‌ ఇన్సెంటివ్‌ను మరో ఏడాది పొడిగించారు.
  • ఇప్పటికే ఐదేళ్ల పాటు ప్రకటించిన ఈ పథకం 2025-26 వరకూ కొనసాగనుంది.

తెలంగాణ స్టేట్ GK PDF

MSME కొరకు మరో లక్షన్నర కోట్ల రుణాలు 

  • ఎమర్జెన్సీ క్రెడిట్‌ లైన్‌ గ్యారెంటీ స్కీం (ECLGS) పథకం కింద గతంలో రూ.3 లక్షల కోట్లను కేటాయించగా, ఇప్పుడు దానిని రూ.4.5 లక్షల కోట్లకు పెంచారు.
  • ఈ పథకం కింద MSMEలకు బ్యాంకులు పూచీకత్తు లేకుండా రుణాలు ఇస్తాయి.
  • ఆత్మ నిర్భర్‌లో భాగంగా ప్రకటించిన ఈ పథకంలో ఇప్పటికే రూ.2.73 లక్షల కోట్లను మంజూరు చేశారు. రూ.2.10 లక్షల కోట్లను విడుదల చేశారు.
  • ఈ పథకం కింద ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవడానికి ఆస్పత్రులకు రాయితీ రుణాలు ఇస్తారు.
  • తాజా ప్రకటన ప్రకారం,ఆస్పత్రులు, నర్సింగ్‌ హోంలు, క్లినిక్‌లు, మెడికల్‌ కాలేజీలు ఆక్సిజన్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవడానికి రూ.2 కోట్ల వరకూ నూటికి నూరు శాతం రుణ గ్యారెంటీ ఉంటుంది.
  • ఈ రుణాలకు వడ్డీ గరిష్ఠంగా 7.5 శాతం మాత్రమే ఉంటుంది.

5 లక్షల మందికి  ఉచిత వీసాలు

  • కొవిడ్ కారణంగా బలైపోయిన మరో రంగం పర్యాటకం. ట్రావెల్‌ ఏజెన్సీలకు రూ.10 లక్షలు, ట్రావెల్‌ గైడ్‌లకు రూ.లక్ష వరకూ రుణాలు అందిస్తారు.
  • మొదటి 5 లక్షల మంది విదేశీ పర్యాటకులకు ఉచితంగానే వీసాలు ఇస్తారు. దీనివల్ల సర్కారుపై రూ.100 కోట్ల భారం పడనుంది.

ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF

ఆత్మ నిర్భర భారత్‌ రోజ్‌గార్‌ యోజన పథకాన్ని మార్చి 31,2022 కి పొడిగింపు 

  • ఆత్మ నిర్భర భారత్‌ రోజ్‌గార్‌ యోజన పథకాన్ని ప్రభుత్వం వచ్చే ఏడాది మార్చి 31 వరకూ పొడిగించింది.
  • వేతనం రూ.15 వేలలోపు ఉండే కొత్త ఉద్యోగులకు ఉద్యోగి, యజమాని చెల్లించాల్సిన ప్రావిడెంట్‌ ఫండ్‌ వాటాను ప్రభుత్వమే చెల్లిస్తుంది. తద్వారా, కంపెనీలకు వెసులుబాటు కలుగుతుందని, మరిన్ని కొత్త ఉద్యోగాలు వస్తాయని భావిస్తోంది.
  • ఈ పథకంలో భాగంగా, ఇప్పటి వరకూ రూ.902 కోట్లను చెల్లించింది. దేశవ్యాప్తంగా 79,577 సంస్థలకు చెందిన 21.42 లక్షల మంది ఉద్యోగులు లబ్ధి పొందారు.

ఎగుమతులకు రూ.33 వేల కోట్లుకు పెంపు 

  • ఎగుమతులను పెంచడమే లక్ష్యంగా వస్తు ఎగుమతులకు రూ.88 వేల కోట్లు; ప్రాజెక్టుల ఎగుమతులకు రూ.33 వేల కోట్ల బీమా కవరేజీని ప్రకటించారు.
  • ఈ నిధులను ఎక్స్‌పోర్ట్‌ క్రెడిట్‌ గ్యారెంటీ కార్పొరేషన్‌, నేషనల్‌ ఎక్స్‌పోర్ట్‌ ఇన్యూరెన్స్‌ అకౌంట్‌ (ఎన్‌ఈఐఏ) ట్రస్ట్‌ ద్వారా పంపిణీ చేస్తారు.

జూన్ 4వ వారం కరెంట్ అఫైర్స్ PDF

ఎరువుల సబ్సిడీ మరో రూ.42 వేల కోట్లుకు పెంపు 

  • ఎరువులకు ఇచ్చే పోషకాహార సబ్సిడీని మరో రూ.42,275 కోట్లకు పెంచారు.
  • ఎరువులను కొనుగోలు చేయడానికి రైతులకు నేరుగా మరో రూ.14,775 కోట్ల అదనపు సబ్సిడీని కూడా ప్రకటించింది.
  • అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకునే 21 రకాల విత్తనాలను సర్కారు విడుదల చేయనుందని, వీటిని ICMR అభివృద్ధి చేసిందని నిర్మల తెలిపారు.

 

ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:

మే నెల వారి కరెంట్ అఫైర్స్ PDF  తెలుగులో  మే నెలవారీ కరెంట్ అఫైర్స్PDF  English లో
జూన్ 4వ వారం కరెంట్ అఫైర్స్ PDF ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF
తెలంగాణా స్టేట్ GK PDF తెలుగు లో Static GK PDF 

Adda247 app లో AP మరియు TS సెక్షన్ ఎంచుకొని భాషను తెలుగులోనికి మార్చుకోవడం ద్వారా APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,అపరిమితమైన క్విజ్లు మరియు ఉచిత pdf లను కూడా పొందగలరు.

     adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

 

కోవిడ్ రెండో దశ అనంతరం ₹6.28 లక్షల కోట్ల ప్యాకేజీ ని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం : పూర్తి వివరాలకై ఇక్కడ తనిఖీ చేయండి_3.1కోవిడ్ రెండో దశ అనంతరం ₹6.28 లక్షల కోట్ల ప్యాకేజీ ని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం : పూర్తి వివరాలకై ఇక్కడ తనిఖీ చేయండి_4.1

 

కోవిడ్ రెండో దశ అనంతరం ₹6.28 లక్షల కోట్ల ప్యాకేజీ ని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం : పూర్తి వివరాలకై ఇక్కడ తనిఖీ చేయండి_5.1కోవిడ్ రెండో దశ అనంతరం ₹6.28 లక్షల కోట్ల ప్యాకేజీ ని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం : పూర్తి వివరాలకై ఇక్కడ తనిఖీ చేయండి_6.1

Sharing is caring!