Telugu govt jobs   »   TSPSC Group 1   »   TSPSC గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష తేదీ

TSPSC గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్ష తేదీ 2024 విడుదల, పరీక్ష షెడ్యూల్‌ను తనిఖీ చేయండి

TSPSC గ్రూప్ 1 పరీక్ష తేదీ

తెలంగాణ గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్ష తేదీ 2024: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) TSPSC గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష తేదీ 2024ని తన అధికారిక వెబ్‌సైట్ tspsc.gov.inలో 06 మార్చి 2024 న విడుదల చేసింది. TSPSC గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష తేదీ అక్టోబరు 21 నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించింది. TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలకు అర్హులు. తెలంగాణ రాష్ట్ర పరిపాలనలో సివిల్ సర్వెంట్లను రిక్రూట్ చేయడానికి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్ 1 పరీక్షను నిర్వహిస్తుంది. పరీక్షను ప్రిలిమ్స్, మెయిన్స్ అనే రెండు దశల్లో నిర్వహిస్తారు.

TSPSC Group 1 Exam Pattern

TSPSC గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష తేదీ 2024 వెబ్ నోట్

TSPSC గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను అక్టోబరు 21 నుంచి ప్రారంభమవుతాయి. ఈ మెయిన్స్ పరీక్షల్లో మొత్తం 7 పేపర్లు ఉంటాయి. పేపర్ల వారీగా షెడ్యూలు త్వరలో వెల్లడి కానుంది. ప్రిలిమినరీ పరీక్ష పూర్తయిన నెలరోజుల్లోగా ప్రధాన పరీక్షలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెల్లడించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) భావిస్తున్నట్లు సమాచారం. TSPSC గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష జూన్ 9,2024న జరిగనుంది,  అక్టోబరు 21 నుండి గ్రూప్ 1 మెయిన్స్ జరిగుతుంది.  TSPSC ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల చేసిన తర్వాత అభ్యర్థులకు 4 నెలల సమయం ఇచ్చి మెయిన్స్ పరీక్షలు నిర్వ హించేందుకు కమిషన్ ఏర్పాట్లు చేసింది.

TSPSC Group 1 Mians 2024 Exam Date

TSPSC గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష తేదీ 2024 అవలోకనం

TSPSC గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష తేదీ 2024
సంస్థ పేరు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్
పరీక్ష పేరు TSPSC గ్రూప్ 1 (గ్రూప్ 1)
TSPSC గ్రూప్ 1 ఖాళీ 563
వర్గం ప్రభుత్వ ఉద్యోగాలు
పరీక్షా విధానం ఆఫ్‌లైన్
మెయిన్స్ పరీక్ష తేదీ 21 అక్టోబర్ 2024
ఎంపిక ప్రక్రియ ప్రిలిమ్స్- మెయిన్స్
ఉద్యోగ స్థానం తెలంగాణ
అధికారిక వెబ్‌సైట్ https://tspsc.gov.in/

 

APPSC గ్రూప్ 2 ఆన్సర్ కీ 2024 విడుదల, ప్రిలిమ్స్ కీ PDFని డౌన్‌లోడ్ చేయండి_30.1

Adda247 APP

TSPSC గ్రూప్ 1 2024 ముఖ్యమైన తేదీలు

TSPSC గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష తేదీ 2024ని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది . TSPSC గ్రూప్ 1 రిక్రూట్‌మెంట్ 2024కి సంబంధించిన అన్ని ముఖ్యమైన తేదీలు క్రింద ఇవ్వబడ్డాయి.

TSPSC గ్రూప్ 1 2024 ముఖ్యమైన తేదీలు

ఈవెంట్స్ తేదీలు
TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష తేదీ 9 జూన్ 2024
TSPSC గ్రూప్ 1 ఆన్సర్ కీ 2024 జూన్ 2024
TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు 2024 జూలై 2024
TSPSC గ్రూప్ 1 మెయిన్స్ హాల్ టికెట్ 2024 అక్టోబర్  2024
TSPSC గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష తేదీ 2024 21 అక్టోబర్ 2024
TSPSC గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు

TSPSC గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష షెడ్యూల్ 2024

TSPSC Group 1 Mains Exam Schedule 2024: అభ్యర్థులు ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో వారి చాయిస్ మేరకు పరీక్షలు రాయవచ్చు. జనరల్‌ ఇంగ్లిష్‌ పేపర్‌ మినహా మిగతా అన్ని పేపర్‌లకు అభ్యర్థులు తాము ఎంచుకున్న భాషలో పరీక్ష రాసుకోవచ్చని పేర్కొంది. ఈ ప్రధాన పరీక్షల్లో మొత్తం 7 పేపర్లు ఉంటాయి. పేపర్ల వారీగా షెడ్యూలు త్వరలో వెల్లడి కానుంది

Papers Marks Duration Exam Date
జనరల్ ఇంగ్లిష్(అర్హత పరీక్ష) 150 మార్కులు 3 గంటలు
పేపర్-I – జనరల్ ఎస్సే 150 మార్కులు 3 గంటలు
పేపర్‌-II – హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ 150 మార్కులు 3 గంటలు
పేపర్‌-III – ఇండియన్ సొసైటీ, కానిస్టిట్యూషన్, గవర్నెన్స్ 150 మార్కులు 3 గంటలు
పేపర్-IV – ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్ 150 మార్కులు 3 గంటలు
పేపర్-V – సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్‌ప్రెటేషన్ 150 మార్కులు 3 గంటలు
పేపర్-VI – తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర అవతరణ 150 మార్కులు 3 గంటలు

TSPSC గ్రూప్ 1 మెయిన్స్ హాల్ టికెట్ 2024

TSPSC గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష హాల్ టికెట్ పరీక్షకు ఒక వారం ముందు హాల్ టికెట్ విడుదల చేయబడుతుంది. TSPSC గ్రూప్ 1 మెయిన్స్ హాల్ టికెట్ అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేయబడుతుంది. ప్రిలిమ్స్ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థులకు మాత్రమే మెయిన్స్ హాల్ టికెట్ విడుదల చేయబడుతుంది.

TSPSC Group 1 Mains Admit Card 2024 ( inactive)

TSPSC Group 1 Syllabus

Sharing is caring!

FAQs

TSPSC గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష తేదీ 20223 ఏమిటి?

TSPSC తన అధికారిక వెబ్‌సైట్‌లో TSPSC గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష తేదీలను 2023 విడుదల చేసింది. TSPSC గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష 21 అక్టోబర్ నుండి నిర్వహించబడుతుంది.

TSPSC గ్రూప్ 1 సర్వీసెస్ కోసం ఎంపిక ప్రక్రియ ఏమిటి?

అభ్యర్థులు 2 దశల రిక్రూట్‌మెంట్ ప్రక్రియ-ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ద్వారా షార్ట్‌లిస్ట్ చేయబడతారు