TS హైకోర్టు జిల్లా న్యాయమూర్తి పరీక్ష తేదీ 2023 విడుదల
తెలంగాణ హైకోర్టు అధికారిక వెబ్సైట్ tshc.gov.in లో జిల్లా న్యాయమూర్తి పరీక్ష తేదీ 2023 ని విడుదల చేసింది. TS హైకోర్టు జిల్లా న్యాయమూర్తి పరీక్ష 22 జులై 2023 మరియు 23 జులై 2023 తేదీలలో నిర్వహించనున్నారు. TS హైకోర్టు జిల్లా న్యాయమూర్తి పరీక్ష హాల్ టికెట్ పరీక్ష కి వారం రోజుల ముందు విడుదల చేయబడుతుంది. తెలంగాణ హైకోర్టు జిల్లా జడ్జి నోటిఫికేషన్ ప్రకారం, మొత్తం 11 ఖాళీలు విడుదలయ్యాయి. ఈ కధనంలో మేము TS హైకోర్టు జిల్లా న్యాయమూర్తి పరీక్ష షెడ్యూల్ అందించాము. TS హైకోర్టు జిల్లా న్యాయమూర్తి పరీక్ష షెడ్యూల్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కధనంలో తెలుసుకోండి.
APPSC/TSPSC Sure shot Selection Group
TS హైకోర్టు జిల్లా న్యాయమూర్తి పరీక్ష అవలోకనం
TS హైకోర్టు జిల్లా న్యాయమూర్తి పరీక్ష 22 & 23 జులై 2023 తేదీలలో నిర్వహించనుంది. TS హైకోర్టు జిల్లా న్యాయమూర్తి పరీక్ష యొక్క అవలోకనాన్ని దిగువ పట్టికలో అందించాము.
TS హైకోర్టు జిల్లా న్యాయమూర్తి పరీక్ష అవలోకనం | |
సంస్థ | తెలంగాణ హై కోర్టు |
పోస్ట్ | జిల్లా న్యాయమూర్తి |
ఖాళీలు | 11 |
వర్గం | పరీక్షా తేదీ |
పరీక్షా తేదీ | 22 జులై 2023 & 23 జులై 2023 |
హాల్ టికెట్ | పరీక్షకి వారం రోజుల ముందు |
ఉద్యోగ ప్రదేశం | తెలంగాణ |
అధికారిక వెబ్సైట్ | tshc.gov.in |
TS హైకోర్టు జిల్లా న్యాయమూర్తి పరీక్ష షెడ్యూల్
తెలంగాణ హై కోర్టు 19 జులై 2023 న అధికారిక వెబ్సైట్ లో TS హైకోర్టు జిల్లా న్యాయమూర్తి పరీక్ష తేదీని విడుదల చేశారు. TS హైకోర్టు జిల్లా న్యాయమూర్తి పరీక్ష 22 జులై 2023 నుండి 23 జులై 2023 (శనివారం & ఆదివారం) వరకు జరుగుతుంది. TS హైకోర్టు జిల్లా న్యాయమూర్తి పరీక్ష లో 3 పేపర్లు ఉంటాయి. పేపర్ I, 22 జులై 2023 తేదీన ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. పేపర్ III, 22 జులై 2023 న మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:30 వరకు జరుగుతుంది. పేపర్ II, 23 జులై 2023న ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. TS హైకోర్టు జిల్లా న్యాయమూర్తి పరీక్ష షెడ్యూల్ దిగువ పట్టిక రూపంలో అందించాము.
పేపర్ | సబ్జెక్ట్ | పరీక్ష తేదీ | పరీక్ష సమయం |
పేపర్ I | రాజ్యాంగం మరియు సివిల్ చట్టాలు | 22 జులై 2023 | 10:00 A.M – 1:00 P.M |
పేపర్ II | ఇంగ్షీషు
పార్ట్-I (30 మార్కులు): భాషా అనువాదం (ఇంగ్లీష్ నుండి తెలుగు మరియు తెలుగు నుండి ఇంగ్లీష్) పార్ట్-II (70 మార్కులు): వ్యాస రచన (లీగల్ సబ్జెక్టులు), గ్రామర్ మరియు పదజాలం |
22 జులై 2023 | 2:30 P.M – 5:30 PM |
పేపర్ III | క్రిమినల్ చట్టాలు | 23 జులై 2023 | 10:00 A.M – 1:00 P.M |
TS హైకోర్టు జిల్లా న్యాయమూర్తి పరీక్ష తేదీ వెబ్ నోట్
తెలంగాణ హైకోర్టు అధికారిక వెబ్సైట్ tshc.gov.in లో జిల్లా న్యాయమూర్తి పరీక్ష తేదీ 2023 ని విడుదల చేసింది. TS హైకోర్టు జిల్లా న్యాయమూర్తి పరీక్ష తేదీ వెబ్ నోట్ లో పరీక్ష తేదీ మరియు పరీక్ష షెడ్యూల్ వివరాలు ఉంటాయి. TS హైకోర్టు జిల్లా న్యాయమూర్తి హాల్ టికెట్ పరీక్షకి వారం రోజుల ముందు విడుదల అవుతుంది. TS హైకోర్టు జిల్లా న్యాయమూర్తి పరీక్ష తేదీ వెబ్ నోట్ PDF ను ఇక్కడ అందించాము. దిగువ ఇచ్చిన లింక్ క్లిక్ చేయడం ద్వారా TS హైకోర్టు జిల్లా న్యాయమూర్తి పరీక్ష తేదీ వెబ్ నోట్ ను డౌన్లోడ్ చేసుకోగలరు.
TS హైకోర్టు జిల్లా న్యాయమూర్తి పరీక్ష తేదీ వెబ్ నోట్ PDF
TS హైకోర్టు జిల్లా న్యాయమూర్తి పరీక్ష సరళి
TS హైకోర్టు జిల్లా న్యాయమూర్తి రాత పరీక్ష మొత్తం 300 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్షా సరళి గురించి మరింత తెలుసుకోవడానికి క్రింది పట్టిక ద్వారా వెళ్ళండి.
పేపర్ | సబ్జెక్ట్ | మార్కులు | వ్యవధి |
పేపర్ I | రాజ్యాంగం మరియు సివిల్ చట్టాలు | 100 | 3 గంటలు |
పేపర్ II | ఇంగ్షీషు
పార్ట్-I (30 మార్కులు): భాషా అనువాదం (ఇంగ్లీష్ నుండి తెలుగు మరియు తెలుగు నుండి ఇంగ్లీష్) పార్ట్-II (70 మార్కులు): వ్యాస రచన (లీగల్ సబ్జెక్టులు), గ్రామర్ మరియు పదజాలం |
100 | 3 గంటలు |
పేపర్ III | క్రిమినల్ చట్టాలు | 100 | 3 గంటలు |
మొత్తం | 300 |
- పేపర్ III అర్హత పరీక్షగా మాత్రమే పరిగణించబడుతుంది మరియు వైవా వోస్ పరీక్ష కోసం అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేయడానికి మొత్తంగా గణించడంలో సెట్ పేపర్ 3లో పొందిన మార్కులు చేర్చబడవు.
- ప్రతి పేపర్‌కు వంద మార్కులు ఉండాలి, ఒక్కో పేపర్ వ్యవధి 3 గంటలు ఉండాలి. పరీక్ష మాధ్యమం ఇంగ్లీషుగా ఉండాలి
TS హైకోర్టు జిల్లా న్యాయమూర్తి హాల్ టికెట్
TS హైకోర్టు జిల్లా న్యాయమూర్తి పరీక్షా 22 & 23 జులై 2023 తేదీలలో తెలంగాణ హై కోర్టు నిర్వహించనుంది. TS హైకోర్టు జిల్లా న్యాయమూర్తి పరీక్షకి వారం రోజుల ముందు విడుదల చేస్తారు. TS హైకోర్టు జిల్లా న్యాయమూర్తి హాల్ టికెట్ విడుదల చేయగానే మేము ఇక్కడ అప్డేట్ చేస్తాము. దిగువ ఇచ్చిన లింక్ క్లిక్ చేయడం ద్వారా TS హైకోర్టు జిల్లా న్యాయమూర్తి హాల్ టికెట్ ని డౌన్లోడ్ చేసుకోగలరు.
TS హైకోర్టు జిల్లా న్యాయమూర్తి హాల్ టికెట్ లింక్ (ఇన్ ఆక్టివ్)
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |