Telugu govt jobs   »   Cut Off Marks   »   TS constable cut off marks

TS Constable Previous year cut off marks | TS కానిస్టేబుల్ కట్ఆఫ్ మార్క్ లు

TS Constable Cut Off Marks 2022: Telangana Constable Prelims Cutoff and TS Police Constable Mains Cutoff Marks. Constable Qualifying Marks, TS Police Previous Year Cutoff and TS Constable Cutoff Marks Read the complete article to know more details.

TS కానిస్టేబుల్ కట్ ఆఫ్ మార్కులు 2021 గురించి వివరాలు తెలుసుకోండి. అలాగే తెలంగాణ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ కటాఫ్ మరియు TS పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ కటాఫ్ మార్కులను తనిఖీ చేయండి.  కానిస్టేబుల్ క్వాలిఫైయింగ్ మార్కులు, TS పోలీస్ గత సంవత్సరం కటాఫ్ మరియు TS కానిస్టేబుల్ కట్ఆఫ్ మార్క్ లు మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి పూర్తి ఆర్టికల్ ని చదవండి.

Read More: TSLPRB Constable Hall Ticket

TS Constable Previous year cut off marks- Introduction : పరిచయం

పూర్తి  ప్రక్రియలో  రెండు రాత పరీక్షలతో పాటు కఠినమైన భౌతిక తనిఖీ  ఉంటుంది. ప్రిలిమ్స్ మరియు ఫైనల్ రాత పరీక్ష యొక్క నమూనా ఒకే విధంగా ఉంటుంది, రెండింటిలో  200 బహులైచ్చిక ప్రశ్నలు   ఉంటాయి, ప్రతి సమాధానం కు  1 మార్కు. రెండు పేపర్లలో కూడా నెగటివ్ మార్కింగ్ లేదు.

Read more:  TSPSC కానిస్టేబుల్ సిలబస్ గురించి పూర్తి సమాచారంతెలుసుకోండి.

Read more: పరీక్షా విధానం గురించి పూర్తి సమాచారం తెలుసుకోండి.

TS కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ కోసం జరిగిన పరీక్ష పూర్తయిన తర్వాత TS కానిస్టేబుల్ కట్ ఆఫ్ మార్కులను తెలంగాణ స్టేట్ లెవెల్  పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (TSPLRB ) అధికారిక వెబ్‌సైట్ లో విడుదల చేస్తుంది. గత సంవత్సరం మొదటి దశ సెప్టెంబర్ 30, 2020 న జరిగింది. TSPSC కానిస్టేబుల్ కట్ ఆఫ్ మార్కులు నిర్దిష్ట దశ ఫలితాలతో పాటు విడుదల చేసింది.ప్రస్తుతం TS కానిస్టేబుల్ కట్ ఆఫ్ మార్కులు మొత్తం మార్కులలో 60% ఉంటుందని అంచనా. కానీ అది వివిధ అంశాల మీద ఆధార పది ఉంటుంది మరియు మార్పులు కూడా ఉండవచ్చు.

ఒక సూచన కోసం 2019 సంవత్సరానికి TSPSC కానిస్టేబుల్ కట్ ఆఫ్‌ని గమనించండి. గత సంవత్సరం కట్ ఆఫ్ కూడా ప్రస్తుత సంవత్సరం కట్ ఆఫ్ నిర్ణయించడంలో పాత్ర పోషిస్తుంది మరియు అభ్యర్థులు పరీక్షలో వారి పనితీరు ని నిర్ధారించుకోడానికి సహాయ పడుతుంది.

TS Constable Previous year cut off marks-Factors deciding Cutoff Marks :తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ కట్ ఆఫ్ మార్కులను నిర్ధారించే అంశాలు

TS పోలీస్ కానిస్టేబుల్ పరిక్ష ప్రకటన ప్రతి సంవత్సరం వెలువడదు. గత సంవత్సరం నోటిఫికేషన్తో చూద్దాము,  ఇది వివిధ కారకాల ద్వారా ప్రతీ సంవత్సరం మారుతుంది. కట్ ఆఫ్‌ను ప్రభావితం చేసే అంశాలు ఇక్కడ ఉన్నాయి

  • కానిస్టేబుల్ పోస్టుల కోసం అందుబాటులో ఉన్న ఖాళీల సంఖ్య.
  • పరీక్ష రాసిన మొత్తం అభ్యర్థుల సంఖ్య
  • వర్గాల వారిగా  ఖాళీల సంఖ్య
  • పరీక్ష యొక్క క్లిష్టత స్థాయి.
  • అభ్యర్థులు సాధించిన మార్కులు

TS Constable Previous year cut off marks For 2019 : తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ 2019 కి కట్ అఫ్ మార్కులు

మాకు తెలిసిన సమాచారం ప్రకారం గత నోటిఫికేషన్ లో అభ్యర్ధుల సాధించిన ఫలితాలను బట్టి కట్ ఆఫ్ మార్కులను నిర్ధారించడం జరిగింది ఇవి అధికారిక ప్రకటన కాదు.

విభాగం  పురుషుల కట్ ఆఫ్ మార్కులు   మహిళల కట్ ఆఫ్ మార్కులు
OC 125-140 115-135
BC 115-135 110-120
SC, ST 110-125 95-115

Also Read: TS Police Constable Events, Physical Efficiency Test and Physical Measurements

TS Constable Previous year cut off marks For 2021 : తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ 2021 కి కట్ అఫ్ మార్కులు

గత సంవత్సర ఖాళీలు వివరాలు, పరిక్ష రాసిన అభ్యర్ధులు , పరీక్షా స్థాయి ని బట్టి తదుపరి నోటిఫికేషన్ కోసం తయారు అయ్యే అభ్యర్దుల కోసం మేము కట్ ఆఫ్ మార్కులను అంచనా వేశాము ఇవి పరీక్షా స్థాయి ని బట్టి వెలువడనున్న ఖాళీలును బట్టి మారవచ్చు. కానీ అభ్యర్ధుల సౌలభ్యం కోసం మేము అంచనా వేసి మార్కులను అందజేస్తున్నాము.

విభాగం  పురుషుల కట్ ఆఫ్ మార్కులు   మహిళల కట్ ఆఫ్ మార్కులు
OC 135-145 110-130
BC 120-140 115-125
SC, ST 115-130 90-110

TS Constable Previous year cut off marks- How to caliculate prelims & mains marks : ప్రిలిమ్స్ మరియు ఫైనల్ రాత పరీక్ష మార్కులను ఎలా లెక్కించాలి?

సరైన మార్కును 1 మార్కుతో మరియు తప్పును సున్నాగా తీసుకోండి ( ఋణాత్మక మార్కులు లేదా నెగటివ్ మార్కులు లేవు) ఇలా లెక్కించడం ద్వారా ఎవరైనా సులభంగా వారి మార్కులనుతెలుసుకోవచ్చు. ఇప్పుడు మీరు సరిగ్గా సమాధానం చేసిన ప్రశ్నలు మొత్తం మీ మార్కులను తెలియజేస్థాయి.

Also Read: TSLPRB Constable Previous Papers PDF Download 2022

TS Constable Previous year cut off marks-Qualifying Marks : కనీస అర్హత మార్కులు

ఒక అభ్యర్థి పరీక్షలో ఉత్తీర్ణులయ్యారా లేదా విఫలమయ్యారో సూచించే మార్కులు కనీస అర్హత మార్కులు. అర్హత మార్కుల కంటే తక్కువ మార్కులను సాధించినట్లయితే, వారు నియామకానికి అర్హత సాధించడంలో విఫలమయ్యారని అర్థం. ఏదేమైనా, తదుపరి దశకు చేరుకోవడానికి, మీరు అర్హత మార్కుల కంటే చాలా ఎక్కువ మార్కులను పొందాల్సి ఉంటుంది.

విభాగం  అర్హత మార్కులు
OC 40%
BC 35%
SC, ST 30%

ఈ వ్యాసం మీకు సమాచారం మరియు ఉపయోగకరంగా ఉందని మేము ఆశిస్తున్నాము.  అలాగే, మిమ్మల్ని మీరు మెరుగుపరచుకోండి  మరియుమా Adda247 Telugu వెబ్ సైట్ లేదా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. అన్ని పోటీ మరియు ప్రభుత్వ పరీక్షల కోసం ఇప్పుడు సిద్ధం కావడం ప్రారంభించండి, ఇక్కడ మీరు పూర్తి స్టడీ మెటీరియల్ మరియు మరెన్నో ఉచితంగా పొందగలరు.

Also Read: TS Police SI and Constable 2022 Exam Date

TS Constable Previous year cut off marks: FAQ’s

Q.TS కానిస్టేబుల్ లో మార్కులని ఎలా లేక్కించుకోవాలి ? 

Ans. ప్రతి సరి అయిన సమాధానం కి 1 మార్కు చొప్పున లేక్కించుకోవాలి.

Q. TS కానిస్టేబుల్ లో నెగటివ్ మార్కింగ్ ఉందా?

Ans. గత నోటిఫికేషన్ లో నెగటివ్ మార్కింగ్ లేదు .

Q. TS కానిస్టేబుల్ లో కట్ ఆఫ్ మార్కులు వస్తే సరిపోతుందా  ?

Ans. కట్ ఆఫ్ మార్కుల కన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి అప్పుడే మేరు మెరిట్ జాబితా లో ఉంటారు

Q. TS కానిస్టేబుల్ పరిక్ష ఏ మాధ్యమం లో ఉంటుంది  ?

Ans. ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ  మాధ్యమం లో పరిక్ష జరుగుతుంది.

Q. TS కానిస్టేబుల్ అధికారిక ప్రకటన ఎప్పుడు వెలువడుతుంది ?

Ans. TS కానిస్టేబుల్ అధికారిక తొందర్లోనే వెలువడుతుంది మరిన్ని తాజా వివరాలకు adda 247 లేదా adda247.com/teను చూడండి.

TELANGANA POLICE 2022
TELANGANA POLICE 2022

 

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  క్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

 

Sharing is caring!