Telugu govt jobs   »   TGSRTC నోటిఫికేషన్

తెలంగాణ ప్రభుత్వం 3000 TGSRTC పోస్టుల భర్తీకి ఆమోదం, త్వరలో నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC)లో డ్రైవర్లు, డిప్యూటీ సూపరింటెండెంట్, డిపో మేనేజర్లు/ అసిస్టెంట్ ట్రాఫిక్‌ మేనేజర్లు మరియు వివిధ కేటగిరీల్లో పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. తొలి దశలో 3,035 ఉద్యోగాల భర్తీకి నిర్ణయించగా. సీఎం కూడా ఆమోదించారు అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ వెల్లడించారు. 2-3 వారాల్లో నోటిఫికేషన్లు వస్తాయి. మరో మూడు, నాలుగు వేల పోస్టుల భర్తీ అంశాన్ని పరిశీలిస్తున్నాం అని అన్నారు.

వివిధ కేటగిరీల్లో 3,035 పోస్టుల భర్తీ

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC)లో మొత్తం 11 రకాల పోస్టులకు నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. భర్తీ చేసే పోస్టులలో 2000 డ్రైవర్‌, 743 మంది శ్రామిక్‌, 114 డిప్యూటీ సూపరింటెండెంట్లు (మెకానిక్), 84 డిప్యూటీ సూపరింటెండెంట్లు (ట్రాఫిక్), 25 డిపో మేనేజర్లు/అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్లు, 23 అసిస్టెంట్ ఇంజనీర్లు (సివిల్), 15 అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్లు, 11 సెక్షన్ ఆఫీసర్లు ఉన్నారు. ఏడుగురు మెడికల్ ఆఫీసర్లు (జనరల్), ఏడుగురు మెడికల్ ఆఫీసర్లు (స్పెషలిస్ట్), మరియు ఆరుగురు అకౌంట్స్ ఆఫీసర్లు పోస్టులు ఉన్నాయి

త్వరలో నోటిఫికేషన్

TGSRTC లో చివరిసారిగా 2012లో నియామకాలు జరిగాయి. ఆ తర్వాత 12 ఏళ్లలో కారుణ్య నియామకాలు మినహా ఇతర పోస్టులు భర్తీ చేయలేదు. దీంతో సంస్థలో భారీ సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి. కారుణ్య నియామకాల్లో.. కండక్టర్‌ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉండటంతో, ఆ పోస్టులకు ఆర్టీసీ ప్రతిపాదనలు పంపలేదని తెలుస్తోంది. మొత్తంగా 3,035 పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉంది.

TSPSC గ్రూప్ 1 కోసం చదవాల్సిన పుస్తకాలు, సబ్జెక్ట్ వైజ్ బుక్‌లిస్ట్_30.1

Adda247 APP

TSRTC పోస్టుల వివరాలు

TSRTC పోస్టుల వివరాలు
పోస్టు పేరు ఖాళీలు
డ్రైవర్లు 2000
శ్రామిక్‌ 743
అసిస్టెంట్ మెకానికల్ ఇంజినీర్ 15
డిపో మేనేజర్లు/ అసిస్టెంట్ ట్రాఫిక్‌ మేనేజర్లు 25
అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్) 23
మెడికల్ ఆఫీసర్స్ (స్పెషలిస్ట్‌) 7
మెడికల్ ఆఫీసర్స్ (జనరల్) 7
డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్) 84
సెక్షన్ ఇంజినీర్‌ (సివిల్) 11
డిప్యూటీ సూపరింటెండెంట్ (మెకానికల్) 114
అకౌంట్స్ ఆఫీసర్ 6
మొత్తం 3,035

TEST PRIME - Including All Andhra pradesh Exams

మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు APP ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు Youtube Official Channel ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!