Telugu Mega Quiz Practice Questions and Answers : Practice Telugu Questions and Answers , If you have prepared well for this section, then you can score good marks in the examination. This is very easy and scoring section.so candidates should concentrate on this section.
Telugu Mega Quiz Practice Questions and Answers : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే SSC, రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.
APPSC/TSPSC Sure shot Selection Group
Telugu Mega Quiz Practice Questions for APPSC Group-4
Telugu Practice Questions -ప్రశ్నలు
Q1. “మేమందరము గుడికి వెళ్ళుచున్నాము” అను వాక్యం ఏ పురుషలో ఉంది?
- ఉత్తమ పురుష
- మధ్యమ పురుష
- ప్రథమ పురుష
- ద్వితీయ పురుష
Q2. ఈ క్రింది వాక్యాల లో సంయుక్త వాక్యం ను కనుగొనండి?
“అజిత అక్క శైలజ చెల్లెలు “
- అజిత చెల్లెలు, శైలజ
- శైలజ, అజిత, అక్కా, చెల్లి
- అజిత, శైలజ అక్కా చెల్లెళ్లు
- శైలజ, అజిత చెల్లెలు
Q3. ఉపమానాన్ని సమాన ధర్మం తో కలపడానికి వాడే పదం ఏమిటి?
- ఉపమానం
- ఉపమేయం
- సమానధర్మం
- ఉపమావాచకం
Q4. ఈ క్రింది వాటిలో ఏది జాతీయ లోకోక్తి
బాధ కలిగించే విధం అను అర్థం వచ్చే జాతీయం :
- వేలెత్తి చూపు
- చాప కింద నీరుల
- పక్కలో బల్లెం
- మనసొప్పు
Q5. కీర్తి (Fame) యొక్క పర్యాయపదాలను ఈ క్రింది వాటిలో గుర్తించండి?
- ఖ్యాతి, ఖననం
- కరుణ, కీరీటం
- వివరణ, యశస్సు
- యశస్సు, ఖ్యాతి
Q6. ‘శిరం’ అర్థం ను గుర్తించండి?
- పెదవులు (Lips)
- నాలుక (Tongue)
- కరము (Hand)
- తల (Head)
Q7. ఇచ్చిన పదం “చాలకున్న” లో ఏది సరైన శబ్ద పది (ఎన్ని పదాలు ఉన్నాయి) గుర్తించండి?
- చాలక + ఒన్న
- చాలకు + అన్న
- చాలక + ఉన్న
- చాలకు ఉన్న
Q8. ఈ క్రింది వాటిలో బుద్ధి హీనుడు విగ్రహ వాక్యంను గుర్తించండి?
- బుద్ధి వలన హీనుడు.
- బుద్ధి చేత హీనుడు.
- బుద్ధి నందు హీనుడు.
- బుద్ధి కొరకు హీనుడు.
Q9. ‘పుష్ప ఆలోచిస్తూ పుస్తకం చదువుతున్నది’. ఈ వాక్యంలో వర్తమాన అసమాపక క్రియను గుర్తించండి?
- క్వార్థకం
- చేదర్థకం
- శత్రర్థకం
- తుమున్నరకం
Q10. ప్రజలు కరోనా సమస్య నుంచి శాంతిని కోరుతున్నారు. ఈ వాక్యాన్ని కర్మణీ వాక్యంగా వ్రాయండి?
- ప్రజలచే కరోనా సమస్య నుంచి శాంతి కోరబడుతోంది.
- ప్రజల చేత కరోనా సమస్య నుంచి శాంతి కాంక్షిస్తుంది.
- ప్రజలు అందరిచేత కరోనా సమస్య నుంచి శాంతి పరిక్షిస్తుంది.
- ప్రజలచే కరోనా సమస్య నుంచి శాంతిని కోరుతున్నారు.
Q11. ఈ క్రింది వాటిలో ‘మనమున్నాము’ అనే పదానికి సంధి ని గుర్తించండి?
- ఉత్వ సంధి
- అత్వ సంధి
- ఉకార సంధి
- ఇత్వ సంధి
Q12. అర్ధరాత్రి అను పదానికి సమాస నామం పేర్కొనండి?
- తృతీయ తత్పురుష సమాసం
- సప్తమి తత్పరుష సమానం
- ద్వితీయ తత్పురుష సమాసం
- ప్రథమా తత్పురుష సమాసం
Q13.ఈ క్రింది వాటిలో అంతస్థాలును గుర్తించండి?
- క,చ,ట,త,ప.
- స,శ,హ,ష.
- య,ర,ల,వ,ళ.
- ప,ఫ,బ,భ,మ.
Q14. ఉభయాక్షరాలు ఎన్ని పేర్కొనండి?
- 6
- 4
- 5
- 3
Q15. ఉదమాన ధర్మాన్ని ఉపమేయంలో ఆరోపించి, వీటి రెండింటికి ఆ భేధాన్ని చెప్పే అలంకారం?
- ఉపమాలంకారం
- రూపకాలంకారం
- ఉత్ప్రేక్ష అలంకారం
- స్వభావోక్తి అలంకారం
Q16. శయ్య అనే పదానికి వికృతిని గుర్తించండి?
- పాన్పు
- శయ్య
- సెజ్జ
- శెజ
Q17. ‘జిహ్వ పర్యాయ పదం కానిది గుర్తించండి?
- రసన
- నాలుక
- కకుత్తు
- కేయూరు
Q18. ఈ క్రింది వాటిలో వప్రము అర్థం గుర్తించండి?
- గోడ రంగు
- కోట అందం
- గోడ రంద్రం
- కోట గోడ
Q19. “నీవు మధురముగా మాట్లాడతావు” ఇది ఏ వాఖ్యం గుర్తించండి?
- శుద్ధ వాక్యం
- ఆశుద్ధ వాక్యం
- ప్రత్యక్షవాక్యం
- పరీక్ష వాక్యం.
Q20. ఈ క్రింది వాటిలో అశుద్ధ వాక్యము ఏది?
- నా కరములతో పుష్పగుచ్ఛము ఉంది.
- నా ఖరములలో పుషఐచ్ఛికము ఉన్నది.
- నా కరము పుష్పగుచ్ఛముగా ఉన్నది.
- నా ఖరమే పుష్ప గుచ్ఛము.
Q21. అరణ్యం నకు వెళ్ళిన సీతారాములు. ఈ వాక్యంలో ‘అరణ్యం’అను పదానికి గల పర్యాయ పదాలు గుర్తించండి?
(a) ఆటవికం, అడుగు, వర్గం, విపినం.
(b) అర్థాంగి, పత్ని, ఇల్లాలు, భార్య.
(c) విపినం, అటవి, అడవి, వనం.
(d) పైవన్నీ
Q22. ఈ క్రింది వాటిలో ‘సుంత’ అను పదానికి గల పర్యాయపదాలను గుర్తించండి?
(a) ఇంచుక, ఇసుమంత, కొంచెం
(b) ఇబ్బంది, ఇరుకు, ఇనుడు.
(c) ఇల్లు, గేహం, నికేతం.
(d) b మరియు c
Q23. ఈ క్రింది వాటిలో “సంఘం” అను పదానికి గల పర్యాయ పదాల ను గుర్తించండి?
(a) సంత, బృహత్సం, గురుకులం
(b) సమూహం, బృందం, గుంపు
(c) కెంపు, బృందావనం, సమాజం
(d) సమాజం, భవిత, భవిష్యం
Q24. ఈ క్రింది వాటిలో ‘కైరవం’ అను పదానికి పర్యాయ పదాలు గుర్తించండి?
(a) ఆదేశం, ఆన, ఉత్తరువు, నిర్దేశం
(b) కోపం, క్రోధం, అలుక, ఆగ్రహం
(c) అక్షి, చక్షువు, నేత్రం, నయనం
(d) కలువ, కల్హారం, కుముదం, ఇందిరవం
Q25. ఈ క్రింది వాటిలో ‘చాడ్పు’ అను పదానికి పర్యాయపదం కానిది గుర్తించండి?
(a) విధం
(b) భంగి
(C) రీతి
(d) ఏది కాదు
Q26. ఈ క్రింది వాటిలో ‘ధరణి’ అను పదానికి పర్యాయపదాలు గుర్తించండి?
(a) భూమి, ధరిత్రి, పృథ్వి
(b) పుడమి, రణం, పోరు.
(c) కాంత, కౌముది, లత.
(d) ముఖం, ఆననం, మోము.
Q27. ఈ క్రింది వాటిలో ‘కుసుమం’ అను పదానికి పర్యాయపదాలు గుర్తించండి?
(a) పుష్పం, విరి, పూవు.2
(b) ఇరులు, పుష్పాలు,పల్లవి
(c) కాంచనం, పూవు, విన్మయం
(d) చీకటి, అంధకారం, ఇడుములు
Q28. ఈ క్రింది వాటిలో ‘నరుడు’ అను పదానికి గల పర్యాయ పదాలు గుర్తించండి?
(a) మనిషి, నారాయణుడు, హరి
(b) రిపువు, మనువు, వైరి
(c) మనువు, మర్త్యుడు, మందరుడు
(d) మానవుడు, మనిషి, మర్త్యుడు
Q29. ఈ క్రింది వాటిలో ‘భాగీరథి’ అను పదానికి గల పర్యాయ పదాలు గుర్తించండి ?
(a)పావని, గౌతమి, వైనతేయ
(b) గంగ, యమున, సరస్వతి.
(C) గంగానది, జాహ్నవి, పావని
(d) పావని, సువర్ణముఖి, పంచవటి
Q30. ఈ క్రింది వాటిలో ‘అన్నం’ అను పదానికి గల పర్యాయపదాలను గుర్తించండి?
(a) బువ్వ, కూడు, బోనం
(b) తిండి, ఆహారం, భోగం
(c) ఆహారం, ఓగిరం, ఒన్నం
(d) అననం, అమృతం,కాణాచి.
Solutions
S1. Ans (a)
Sol. ఉత్తమ పురుష : తనను గురించి తెలియజేయునది ‘ఉత్తమ పురుష‘
ఉత్తమ పురుష లో బహువచనం ‘మేము‘, ప్రత్యయం ‘ము”
Q2. Ans (c)
Sol. సంయుక్త వాక్యంగా మారడంలో వచ్చే మార్పు రెండు నామపదాలు ఒకచోట చేరి చివర బహువచనం చేరింది.
S3. Ans (d)
Sol.ఉపమావాచకం, ‘వలె అనే పదం.
S4. Ans (c)
Sol. పక్కలో బల్లెం = బాధ కలిగించే విధం
S5. Ans (d)
Sol. కీర్తి= యశస్సు, ఖ్యాతి.
S6. Ans (d)
శిరం=తల[head]
S7. Ans (c)
Sol. చాలకున్న = చాలక + ఉన్న = (అ+ఉ) = ఉత్వ సంది.
ఉత్వ సంది : ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి నిత్యంగా వస్తుంది.
S8. Ans (b)
Sol. బుద్ది చేత హీనుడు
తృతీయ తత్పురుష సమాసం- ప్రత్యయాలు చేత,చే,తోడ,తొ
S9. Ans (c)
Sol. శత్రర్ధకం= వర్తమాన అసమాపక క్రియ ధాతువుకు ‘తూ‘ అనే ప్రత్యయం చేరుతున్నది.
S10. Ans (a)
Sol. వాక్యంలో క్రియకు ‘బడు ధాతువు చేరి, కర్తకు తృతీయ విభక్తి చేరే వాక్యమే కర్మణీ వాక్యం.
S11. Ans (a)
Sol. మనము + ఉన్నాము = ఉత్త్వ సంధి
ఉత్త్వ సంధి: ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి నిత్యంగా వస్తుంది.
Q12. Ans (d)
Sol. ప్రథమా తత్పురుష సమాసం : రాత్రి యొక్క అర్థం = అర్థ రాత్రి. ప్రత్యయం: “ము.”
S13. Ans (b)
Sol. అంతస్థాలు: య, ర, ల, వ, ళ.
S14. Ans (d)
Sol. ఉభయాక్షరాలు ‘3’ – సున్న[0], విసర్గ [:], అరసున్న [ఁ]
S15. Ans (b)
Sol. రూపకాలంకారం: ఉపమాన ధర్మాన్ని ఉపమేయులో ఆరోపించి, వీటి రెండింటికి అభేదాన్ని (భేదం లేదని) చెప్పడమే రూపకాలంకారం.
S16. Ans (c)
Sol. శయ్య = సెజ్జ
S17 . Ans (d)
Sol. కేయూరం.
కేయూరం =పావురం
జిహ్వ = రసన, నాలుక, కకుత్తు
S18. Ans (d)
Sol. వప్రము = కోట గోడ (Fort wall)
S19. Ans (a)
Sol. శుద్ధ వాక్యము :- వాక్యము లో యోగ్యత, ఆకాంక్ష, ఆసక్తి కలిగి ఉండి పూర్తి అర్థాన్ని ఇవ్వగలిగే వాక్యం.
S20. Ans (b)
Sol. ఖరము = గాడిద, ఐచ్ఛికము = ధనం
Q2I. Ans (C)
Sol. అరణ్యం = విపినం, అటవి, అడవి, వనం.
Q22. Ans (a)
Sol. సుంత = ఇంచుక, ఇసుమంత, కొంచెం.
Q23. Ans (b)
Sol. సంఘం = సమూహం, బృందం, గుంపు.
Q24. Ans (d)
Sol. కైరవం = కలువ, కల్హారం, కుముదం, ఇందీవరం.
Q25. Ans (d)
Sol. చాడ్పు = విధం, భంగి, రీతి, తీరు.
Q26. Ans (a)
ధరణి = భూమి, ధరిత్రి, పృధ్వి
Q27. Ans (a)
కుసుమం = పుష్పం, పూవు, విరి.
Q28.Ans (d)
నరుడు = మానవుడు, మనిషి, మర్త్యుడు.
Q29. Ans(C)
భాగీరథి = గంగానది, జాహ్నవి, పావని.
Q30. Ans (a)
అన్నం = బువ్వ, కూడు, బోనం.
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
********************************************************************************************
