Telugu govt jobs   »   Telugu Current Affairs   »   Telangana State to launch Y-Hub Incubator

వై–హబ్‌ ఇంక్యుబేటర్‌ను ప్రారంభించనున్న తెలంగాణ రాష్ట్రం

Telangana State to launch Y-Hub Incubator

ప్రభుత్వ పాఠశాలతోపాటు ప్రైవేటు బడ్జెట్‌ స్కూళ్లకు చెందిన 6–10వ తరగతి విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ స్కూల్‌ ఇన్నోవేషన్‌ చాలెంజ్‌–2021 ఫినాలే ఏప్రిల్‌ 4న హైదరాబాద్‌ గోల్కొండలోని తారామతి–బారాదరిలో జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.

కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు, టీచర్లు తమ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలన్నారు. పిల్లల్లో సృజనాత్మకతకు పదును పెట్టేందుకు దేశంలోనే తొలిసారిగా పిల్లలు, యువత కోసం ‘వై–హబ్‌’ఇంక్యుబేటర్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో అందుబాటులోకి రానున్న టీ–హబ్‌ 2.0 భవనంలో 10 వేల చ.అ. విస్తీర్ణంలో వై–హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

 

తెలంగాణకు సంబంధించిన తెలుగు కరెంట్ అఫైర్స్ గురించి మరింత చదవండి:  

 

తెలంగాణాలో 6,916 ఎకరాల్లో ప్రత్యామ్నాయ అటవీ పెంపకం    మిల్కెన్‌ ఇన్‌స్టిట్యూట్‌ వార్షిక సదస్సులో ప్రసగించనున్న మంత్రి కెటిఆర్

 

*******************************************************************************

Current Affairs MCQS Questions And Answers in Telugu,11 March 2022,For APPSC Group-4 And APPSC Endowment Officer
                                                                                            Download Adda247 App

Sharing is caring!