Telugu govt jobs   »   Telugu Current Affairs   »   Alternative afforestation on 6,916 acres in...

తెలంగాణాలో 6,916 ఎకరాల్లో ప్రత్యామ్నాయ అటవీ పెంపకం ,Alternative afforestation on 6,916 acres in Telangana

రాష్ట్రంలో ఈ ఏడాది 6,916 ఎకరాల సాధారణ భూముల్లో ప్రత్యామ్నాయ అటవీ పెంపకం చేపట్టనున్నారు. ఇందుకోసం ప్రత్యామ్నాయ అటవీకరణ(కంపా) నిధులు రూ.600 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ నిధులతో అటవీ ప్రాంతాల సరిహద్దుల పరిరక్షణ, అగ్ని ప్రమాదాల నివారణ, అటవీభూముల రక్షణకు కందకాల తవ్వకం, భూమి-తేమ పరిరక్షణ, అడవుల్లో వన్యప్రాణులకు గడ్డి, నీటి ఏర్పాట్లు, ఆవాసాలు మెరుగుపరచడం వంటివి కూడా చేపడతారు. 2022-23 వార్షిక ప్రణాళికకు రాష్ట్ర స్థాయి కమిటీ ఆమోదం తెలపగా తుది అనుమతులు జాతీయస్థాయి కంపా కమిటీ నుంచి రావాల్సి ఉంది. మొక్కలు నాటిన 42,213 ఎకరాల్లో పచ్చదనం నిర్వహణ కోసం ఈ ఏడాది ఖర్చు చేయనున్నట్లు వార్షిక ప్రణాళికలో అటవీశాఖ పేర్కొంది. ముఖ్యమంత్రి ఇచ్చిన ‘జంగల్‌ బచావో..జంగల్‌ బడావో’ నినాదం స్ఫూర్తిగా దీన్ని చేపడతారు.

 

,Alternative afforestation on 6,916 acres in Telangana

 

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

********************************************************************************************

,Alternative afforestation on 6,916 acres in Telangana

Sharing is caring!