Telugu govt jobs   »   Daily Quizzes   »   Telangana State GK MCQs Questions And...

Telangana State GK MCQs Questions And Answers in Telugu 15 November 2022, For TSPSC Groups and Other Exams

Telangana State GK MCQs Questions And Answers in Telugu : Practice General awareness Quiz Questions and Answers in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. Current Affairs Questions,  Static Awareness forms a part and parcel of General Awareness/ General Knowledge. Most of the questions asked in the general awareness sections are based on current affairs.

Telangana State GK MCQs Questions And Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే SSC, సింగరేణి , రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Telangana State GK MCQs Questions And Answers in Telugu 8 November 2022 |_70.1

APPSC/TSPSC Sure shot Selection Group

 

Telangana State GK MCQs Questions And Answers in Telugu

Telangana State GK – ప్రశ్నలు

Q1. GST కౌన్సిల్ కి సంబంధించి క్రింది వాటిలో సరైన సమాధానాన్ని ఎంచుకోండి.

  1. GST కౌన్సిల్ అనేది కేంద్రం, రాష్ట్రాల ఉమ్మడి వేదిక. రాజ్యాంగంలోని ఆర్టికల్ 279(a)(1) ప్రకారం దీనిని రాష్ట్రపతి ఏర్పాటు చేశారు.
  2. GSTకి సంబంధించి ముఖ్యమైన విషయాలపై GST కౌన్సిల్ రాష్ట్రాలకు సిఫారసు చేస్తుంది.
  3. రాజ్యాంగంలోని ఆర్టికల్ 246a ప్రకారం GST చట్టం పై శాసనాలు చేయడానికి పార్లమెంట్ తో పాటు రాష్ట్ర శాసనసభలకు కూడా అధికారం ఉంటుందని సుప్రీమ్ కోర్టు ఇటీవల స్పష్టం చేసింది.
  4. GST కౌన్సిల్ సంవత్సరానికి ఒకసారి మాత్రమే రేట్లను సర్దుబాటు చేయగలదు.

సరైన సమాధానాన్ని ఎంచుకోండి

  1. 1, 2,3 సరైనవి
  2. 1,2 సరైనవి
  3. 1,2,4 సరైనవి
  4. 1,2,3,4 సరైనవి

Q2. తెలంగాణ ఎలక్ట్రికల్ వెహికల్ & ఎనర్జీ స్టోరేజ్ పాలసీకి సంబంధించి దిగువ ప్రకటనలను పరిగణనలోకి తీసుకోండి.

  1. తెలంగాణ ఎలక్ట్రిక్ వెహికల్ & ఎనర్జీ స్టోరేజ్ పాలసీ కాలపరిమితి 2020-2030.
  2. FAME-2 పథకం పై ‘తెలంగాణ ఎలక్ట్రిక్ వెహికల్ & ఎనర్జీ స్టోరేజ్ పాలసీ’ రూపొందింది.

పైన ఇచ్చిన ప్రకటనల్లో ఏవి సరైనవి?

  1. 1 మాత్రమే
  2. 2 మాత్రమే
  3. 1,2 సరైనవి
  4. ఏదీ కాదు

Q3. టెక్నాలజీ హబ్ (T-హబ్) కి సంబంధించి క్రింది ప్రకటనలలో సరికానిది ఏది?

  1. ఇది 2015లో IIIT హైదరాబాద్ లో స్థాపించబడిన ఒక ఆవిష్కరణ కేంద్రం.
  2. ఇది పబ్లిక్ ప్రైవేట్ – భాగస్వామ్య పద్ధతిలో స్థాపించబడింది.
  3. రాష్ట్ర ప్రభుత్వం మరియు మూడు విద్యాసంస్థల మధ్య పెట్టుబడి పంచబడుతుంది.
  4. T-హబ్ 2.0 ఇటీవలే 2022లో హైదరాబాద్లోని మాదాపూర్లో ప్రారంభించబడింది.

Q4. క్రింద ఇవ్వబడిన ప్రకటనలలో సరైనవి ఏది/ఏవి?

  1. ప్రాథమిక స్థాయిలో ఉన్న స్టార్టప్ల ఆవిష్కరణలకు ఊతమిచ్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ పథకాన్ని ప్రవేశపెట్టింది.
  2. తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక సంస్థ ‘టి – హబ్’ కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ‘స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్’ పథకానికి ఎంపికయ్యింది.
  3. a మాత్రమే సరైనది
  4. a,b సరైనవి

Q5. తెలంగాణలోని కింది  జిల్లాలవారిగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలను (MSME) వాటి సంఖ్య ఆధారంగా అవరోహణ క్రమంలో అమర్చండి.

  1. రంగారెడ్డి
  2. నల్గొండ
  3. మేడ్చల్ –మల్కాజ్ గిరి
  4. హైదరాబాద్
  5. కరీంనగర్

సరైన సమాధానాన్ని ఎంచుకోండి.

  1. 1,2,3,4,5
  2. 1,4,3,2,5
  3. 3,4,5,1,2
  4. 4,1,3,2,5

Q6. ఎమ్.ఎస్. ఎమ్.ఇ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జూన్ 1 వ తేది 2020 సంవత్సరం ప్రకారం సవరించబడిన ఎమ్.ఎస్. ఎమ్.ఇ ల నిర్వచనాల ప్రకారం చిన్న తరహ సంస్థ అనగా?

  1. ప్లాంట్, యంత్రాలు, పరికరాలపై పెట్టుబడి రూ.1 కోటి కన్నా తక్కువగా ఉండి, టర్నోవర్ రూ. 5 ఐదు కోట్లు మించని సంస్థ.
  2. ప్లాంట్, యంత్రాలు, పరికరాలపై పెట్టుబడి రూ.5 కోట్ల కన్నా తక్కువగా ఉండి, టర్నోవర్ రూ. 50 కోట్లు మించని సంస్థ.
  3. ప్లాంట్, యంత్రాలు, పరికరాలపై పెట్టుబడి రూ.10 కోట్ల కన్నా తక్కువగా ఉండి, టర్నోవర్ రూ. 100 కోట్లు మించని సంస్థ.
  4. ప్లాంట్, యంత్రాలు, పరికరాలపై పెట్టుబడి రూ.50 కోట్ల కన్నా తక్కువగా ఉండి, టర్నోవర్ రూ. 250 కోట్లు మించని సంస్థ.

Q7. తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ 2021-2022 వార్షిక నివేదికను మంత్రి KTR 2022, జూన్ 6న విడుదల చేసారు. ఈ నివేదిక ప్రకారం తెలంగాణలో ఎన్ని కొత్త పారిశ్రామిక పార్కులు ఏర్పడ్డాయి?

  1. 5
  2. 8
  3. 10
  4. 13

Q8. రైతు వేదికలకి సంబంధించి కింది వ్యాఖ్యలను పరిశీలించండి.

  1. 2021, అక్టోబర్ 31న జనగామ జిల్లా, కొడకండ్ల మండల కేంద్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ రైతు వేదికలను ప్రారంభించారు.
  2. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3000 రైతు వేదికలను నిర్మించనున్నారు. ఇప్పటివరకు 2595 రైతు వేదికలు నిర్మించబడ్డాయి.
  3. రైతులు పరస్పరం చర్చించుకునేందుకు  రైతు వేదికలను ప్రవేశపెట్టారు.
  4. 2018-19 లో వ్యవసాయ శాఖ రైతు వేదికలను నిర్మించడం ప్రారంభించింది.

సరైన సమాధానాన్ని ఎంచుకోండి.

  1. 1,2 మాత్రమే సరైనవి
  2. 3,4 మాత్రమే సరైనవి
  3. 2,3,4 సరైనవి
  4. 1,2,3,4 సరైనవి

Q9. జాతీయ ఆహార భద్రత చట్టం రాష్ట్రాల ర్యాంకింగ్ లను కేంద్ర ఆహార, ప్రజా పంపిణి మంత్రి పీయూష్ గోయల్ జూలై 5న విడుదల చేసారు. ఇందులో తెలంగాణ రాష్ట్ర స్థానం ఎంత?

  1. 3వ స్థానం
  2. 5వ స్థానం
  3. 8వ స్థానం
  4. 12వ స్థానం

Q10. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకాలను అవి అమలు చేసిన తేదీలతో జతపరచండి.

  1. నేతన్నకు భీమా 2022, ఆగష్టు7
  2. రైతు భీమా 2018, ఆగష్టు 15
  3. నేతన్నకు చేయూత 2017, జూన్ 24
  4. రైతు బంధు 2018, మే 10

సరైన సమాధానాన్ని ఎంచుకోండి.

  1. 1-a,2-b,3-c,4-d
  2. 1-c,2-d,3-b,4-a
  3. 1-b,2-c,3-d,4-a
  4. 1-c,2-a,3-d,4-b

 

Solutions:

S1. ans(d)

Sol: ఇటీవల కేంద్ర ఆర్థికమంత్రి అధ్యక్షతన GST కౌన్సిల్  47వ సమావేశం జరిగింది. GST కౌన్సిల్ అనేది కేంద్రం, రాష్ట్రాల ఉమ్మడి వేదిక. రాజ్యాంగంలోని ఆర్టికల్ 279(a)(1) ప్రకారం దీనిని రాష్ట్రపతి ఏర్పాటు చేశారు.

కేంద్రప్రభుత్వం తరుపున కేంద్ర ఆర్థికమంత్రి, కేంద్ర ఆర్థికశాఖ  సహాయమంత్రి దీనిలో సభ్యులు.రాష్ట్రాలు తమ రాష్ట్ర ఆర్థిక లేదా పన్నుల ఇన్ఛార్జ్ మంత్రిని లేదా ఏ ఇతర మంత్రినైన సభ్యుడిగా పంపవచ్చు.

GSTకి సంబంధించి ముఖ్యమైన విషయాలపై GST కౌన్సిల్ రాష్ట్రాలకు సిఫారసు చేస్తుంది.

ఇటీవల, GST కౌన్సిల్  చేసే సిఫార్సులకు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదంటూ 2022 మే నెలలో సుప్రీం కోర్టు చెప్పింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 246a ప్రకారం GST చట్టం పై శాసనాలు చేయడానికి పార్లమెంట్ తో పాటు రాష్ట్ర శాసనసభలకు కూడా అధికారం ఉంటుందని సుప్రీమ్ కోర్టు స్పష్టం చేసింది.

GST కౌన్సిల్ సంవత్సరానికి ఒకసారి మాత్రమే రేట్లను సర్దుబాటు చేయగలదు.కేంద్రం ఏదైనా సెస్ ని ప్రవేశపెట్టి GST చట్టాన్ని అతిక్రమించకూడదు.

S2. ans(c)

Sol: ‘తెలంగాణ ఎలక్ట్రికల్ వెహికల్ & ఎనర్జీ స్టోరేజ్ పాలసీ 2020-2030’  భారత ప్రభుత్వ భారీ పరిశ్రమల శాఖ  ఏప్రిల్ 2019 నుండి అమలుచేస్తున్న FAME II పథకంపై ఆధారపడి ఉంటుంది. ఎలక్ట్రిక్ వెహికల్ ల స్వీకరణను, వినియోగాన్ని మరింత మెరుగుపరచడానికి ఆర్థిక మరియు ఆర్థికేతర ప్రోత్సాహకాలను అందించాలని రాష్ట్రాలకు సూచించింది. వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి, హైదరాబాద్ ను ‘గ్రీన్ సిటీ’ గా మార్చడానికి FAME (ఫాస్ట్ అడాప్షన్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ) పథకం కింద 40 ఎలక్ట్రిక్ వాహనాలను TSRTC ప్రవేశపెట్టింది.

S3. ans(c)

Sol: ఆలోచనలతో రండి అవిష్కరనలతో వెళ్ళండి అనే నినాదంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చేపట్టిన టీ-హబ్ రెండో దశను  ముఖ్యమంత్రి కెసిఆర్  2022, జూన్ 28న ప్రారంభించారు. రూ. 400కోట్ల వ్యయంతో హైదరాబాద్లోని మాదాపూర్- రాయదుర్గం నాలెడ్జే సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ సెంటర్ గా ఈ టీ-హబ్ 2.0 ని నిర్మించారు. ఇన్నోవేషన్ ఎంటర్ ప్రెన్యూర్షిప్ ను పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం మొదటిసారి 2015లో టీ-హబ్ ని ఏర్పాటు చేసింది.

S4. ans(c)

Sol: ప్రాథమిక స్థాయిలో ఉన్న స్టార్టప్ల ఆవిష్కరణలకు ఊతమిచ్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ పథకాన్ని ప్రవేశపెట్టింది.తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక సంస్థ ‘టి – హబ్’ కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ‘స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్’ పథకానికి ఎంపికయ్యింది.

S5. ans(d)

Sol: తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం -2022 ప్రకారం, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చాల్ – మల్కాజ్గిరి, నల్గొండ, కరీంనగర్ జిల్లాలలో ఎమ్.ఎస్. ఎమ్.ఇ (MSME) లు అధిక సంఖ్యలో కేంద్రీకరించబడ్డాయి. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 48,224 ఎమ్.ఎస్. ఎమ్.ఇ (MSME) లు కలవు. జిల్లాల వారీగా పరిశీలిస్తే పెట్టుబడి, ఉద్యోగ కల్పనలలో మేడ్చల్-మల్కాజ్ గిరి ప్రథమ స్థానంలో ఉంది. రంగారెడ్డి జిల్లా అధిక పెట్టుబడి వాటాలోను, సంగారెడ్డి జిల్లా ఉద్యోగకల్పనలో అధిక వాటాతో ద్వితీయ స్థానంలో ఉన్నాయి.

S6. ans(b)

Sol: ఎమ్.ఎస్. ఎమ్.ఇ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జూన్ 1 వ తేది 2020 సంవత్సరం ప్రకారం సవరించబడిన ఎమ్.ఎస్. ఎమ్.ఇ ల నిర్వచనాలు ఈ క్రింది విధంగా ఉన్నవి.

సూక్ష్మ సంస్థ : ప్లాంట్, యంత్రాలు, పరికరాలపై పెట్టుబడి రూ.1 కోటి కన్నా తక్కువగా ఉండి, టర్నోవర్ రూ. 5 ఐదు కోట్లు మించని సంస్థ.

చిన్న తరహ సంస్థ: ప్లాంట్, యంత్రాలు, పరికరాలపై పెట్టుబడి రూ.5 కోట్ల కన్నా తక్కువగా ఉండి, టర్నోవర్ రూ. 50 కోట్లు మించని సంస్థ.

మధ్యతరహ సంస్థ: ప్లాంట్, యంత్రాలు, పరికరాలపై పెట్టుబడి రూ.50 కోట్ల కన్నా తక్కువగా ఉండి, టర్నోవర్ రూ. 250 కోట్లు మించని సంస్థ.

S7. ans(d)

Sol: తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ 2021-2022 వార్షిక నివేదికను మంత్రి KTR 2022, జూన్ 6న విడుదల చేసారు. ఈ నివేదికలోని ముఖ్యాంశాలు :

తెలంగాణ జిఎస్డిపి (GSDP) లో 19.1% వృద్ధి రేటుతో రూ. 11.54 లక్షల కోట్లు. 2014-15 నుంచి 2021-22 వరకు జీఎస్ డిపి 128.3% వృద్ధి చెందింది. 2021-22లో రాష్ట్రంలో 13 కొత్త పారిశ్రామిక పార్కుల అభివృద్ధి జరిగింది.

S8. ans(b)

Sol: 2020, అక్టోబర్ 31న జనగామ జిల్లా, కొడకండ్ల మండల కేంద్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ రైతు వేదికలను ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2601 రైతు వేదికలను నిర్మించనున్నారు. ఇప్పటివరకు 2595 రైతు వేదికలు నిర్మించబడ్డాయి.  రైతులు పరస్పరం చర్చించుకునేందుకు  రైతు వేదికలను ప్రవేశపెట్టారు. రైతు వేదిక నిర్మాణానికి అయ్యే ఖర్చు 22 లక్షలు కాగా, ఇందులో 12 లక్షలు వ్యవసాయ శాఖ, 10 లక్షలు MNREGA నిధుల నుండి ఇస్తారు.

S9. ans(d)

Sol: జాతీయ ఆహార భద్రత చట్టం రాష్ట్రాల ర్యాంకింగ్ ఇండెక్స్ ను కేంద్ర ఆహార, ప్రజాపంపిణి మంత్రి పీయూష్ గోయల్ జూలై 5న విడుదల చేశారు. 0.836 స్కోరుతో తొలిస్థానంలో ఒడిషా, 0.797 స్కోరుతో ఉత్తరప్రదేశ్ రెండవ స్థానంలో, 0.794 స్కోరుతో ఆంధ్రప్రదేశ్ మూడవ స్థానంలో ఉన్నాయి.  0.743 స్కోరుతో తెలంగాణ 12వ స్థానంలో నిలిచాయి.

S10. ans(a)

Sol: నేతన్నకు భీమా – 2022, ఆగష్టు7

రైతు భీమా  – 2018, ఆగష్టు 15

నేతన్నకు చేయూత- 2017, జూన్ 24

రైతు బంధు – 2018, మే 10

 

 

adda247

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  క్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!