Telugu govt jobs   »   Daily Quizzes   »   Telangana State GK MCQs Questions And...

Telangana State GK MCQs Questions And Answers in Telugu 09 February 2023, For TSPSC Groups, TS Police, TS High Court & TS District Court

Telangana State GK MCQs Questions And Answers in Telugu : Practice General awareness Quiz Questions and Answers in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. Current Affairs Questions,  Static Awareness forms a part and parcel of General Awareness/ General Knowledge. Most of the questions asked in the general awareness sections are based on current affairs.

Telangana State GK MCQs Questions And Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే SSC, సింగరేణి , రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Telangana State GK MCQs Questions And Answers in Telugu |_70.1

APPSC/TSPSC Sure shot Selection Group

Telangana State GK MCQs Questions And Answers in Telugu

Telangana State GK – ప్రశ్నలు

Q1. ఉద్యోగ సంఘాల నాయకుడు అశోక్ బాబు నేతృత్వంలో ఎల్.బి.స్టేడియం, హైదరాబాద్ లో2013 సెప్టెంబర్ 21 న నిర్వహించిన సమైక్యాంధ్ర సభ పేరు?
(a) సేవ్ తెలంగాణ
(b) తెలంగాణ ఫోరం
(c) మిలియన్ మార్చ్
(d) సేవ్ ఆంధ్రప్రదేశ్

Q2. “సంస్థానాన్ని విడగొట్టండి, రాచరికపు జాడలను రూపుమాపండి” అనేది ప్రబలమైన నినాదం చేసింది ఎవరు?
(a) బూర్గుల రామక్రిష్ణా రావు
(b) స్వామి దయానంద సరస్వతి
(c) ఫజల్ ఆలీ
(d) రావి నారాయణ రెడ్డి

Q3. అంబేద్కర్ కంటే ముందే భారతదేశ దళితుల అభ్యున్నతి కోసం పోరాడిన వ్యక్తి ఎవరు?
(a) ఉన్నవ లక్ష్మీనారాయణ
(b) వామాన్ నాయక్
(c) భాగ్యరెడ్డి వర్మ
(d) పాపన్న

Q4. హైదరాబాద్ లోని కేశవమెమోరియల్ హైస్కూల్ ను ఆర్యసమాజ్ ఎప్పుడు స్థాపించింది.
(a) 1940
(b) 1934
(c) 1939
(d) 1942

Q5. కింది వాటిని జతపరుచుము.
జాబితా – I                                               జాబితా – II
A. అమరవీరుల దినోత్సవం                1. జూలై 12
B. తెలంగాణా విమోచన దినం            2. జూలై 10
C. తెలంగాణా జెండా దినం                  3. మే 17
D. తెలంగాణా పరిరక్షక దినం             4. జూలై 5
(a) A – 2, B – 1, C – 4, D – 3
(b) A – 4, B – 3, C – 1, D – 2
(c) A – 3, B – 4, C – 1, D – 2
(d) A – 4, B – 3, C – 2, D – 1

Q6. జల్(నీరు) జంగల్(అడవి), జమీన్ (భూమి) నినాదాన్ని ఇచ్చింది ఎవరు?
(a) భాగ్యరెడ్డి వర్మ
(b) రాంజీ గోండు
(c) అంబేద్కర్
(d) కొమరం భీం

Q7. ప్రతిపాదన (A): హైదరాబాద్ సంస్థానంలోని ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని తెలంగాణ నిరుద్యోగ యువత 1910 నుంచి 1918 వరకు పెద్ద ఎత్తున ఉద్యమించారు.
కారణము (R) : పూర్వం నిజాం రాజ్యంలో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారిని 20వ శతాబ్దం మొదటి భాగంలో ఎక్కువగా నియమించేవారు. దీనితో స్థానికులకు ఉద్యోగాలు దక్కకుండా పోయాయి.
సమాధానం :
(a) (A) మరియు (R) నిజం (R), (A) కు సరియైన వివరణ
(b) (A) మరియు (R) రెండూ నిజం కాని (R), (A) కు సరియైన వివరణ కాదు.
(c) (A) నిజం (R) తప్పు
(d) (A) తప్పు కాని (R) నిజం

Q8. మార్చి 25 నాడు తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ పేరును తెలంగాణ ప్రజా సమితిగా మార్చి ఎవరి అధ్యక్షతన 25 మంది సభ్యులతో కమిటీని నియమించారు ?
(a) శ్రీ రావాడ సత్యనారాయణ
(b) శ్రీ మదన్ మోహన్
(c) శ్రీమతి సదాలక్ష్మి
(d) కె. అచ్యుతరెడ్డి

Q9. “మీజాన్” పత్రికకు సంబందించి కింది వాటిలో ఏది సరైంది?
1. ఇంగ్లీషు ఎడిషన్ నిజాం ప్రభుత్వాన్ని సమర్ధించేది.
2. తెలుగు ఎడిషన్ నిజాం వ్యతిరేక పోరాటాలను సమర్దించేది.
3. ఉర్దూ ఎడిషన్ రజాకార్ల ను సమర్దించేది.
(a) 1, 2, 3
(b) 2 మరియు 3 మాత్రమే
(c) 3 మాత్రమే
(d) 1 మరియు 3

Q10. తెలంగాణ అమరవీరుల స్థూపం (గన్ పార్క్) సంబంధించి కింది ప్రకటనలలో సరి కానిది ఏది?
1. 1969 తెలంగాణ ఉద్యమంలో అమరులయిన వారి స్మృత్యర్థం నిర్మించిందే గన్ పార్క్ అమరవీరుల స్థూపం.
2. ఈ స్థూపం తెలంగాణ అస్తిత్వానికి, ఉద్యమానికి సాంస్కృతిక ప్రతీకగా నిలిచింది. ఈ స్థూపాన్ని చెక్కిన శిల్పి “ఎక్కా యాదగిరి రావు”.
3. ఈ స్థూపానికి అప్పటి మున్సిపల్ మేయర్ లక్ష్మీనారాయణ 1975, ఫిబ్రవరి 23న నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 1980లో స్థూపం నిర్మాణం పూర్తయింది.
(a) 1 మాత్రమే
(b) 2 మాత్రమే
(c) 3 మాత్రమే
(d) పైవన్నీ

Solutions:

S1. Ans (d)
Sol: ఉద్యోగ సంఘాల నాయకుడు అశోక్ బాబు నేతృత్వంలో ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ పేరుతో 2013 సెప్టెంబర్ 21 న సమైక్యాంధ్ర సభను ఎల్.బి.స్టేడియం, హైదరాబాద్ లో నిర్వహించారు.

S2. Ans (b)
Sol: హైదరాబాదు రాష్ట్ర రాజకీయాలలో తెలంగాణా, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలతో సంబంధమును ప్రజలమధ్య ప్రాంతీయ, భాషా విభేదాలు మొదటి నుంచి ఉన్నవే. సంయుక్త మహారాష్ట్ర, ఐక్యకర్నాటక, విశాలాంధ్ర పేర్లతో ఆయా ప్రాంతాలలో ఆందోళనలు కొనసాగుతుండేవి. వాటికి స్వామీరామానంద తీర్థ నిరంతరం మద్దతు ఇస్తుండేవారు. హైదరాబాదు రాష్ట్రాన్ని వెంటనే విభజించి తెలుగు మాట్లాడే జిల్లాలను మద్రాసులోను, మిగిలిన భాషలు మాట్లాడే ప్రజలను బొంబాయి రాష్ట్రంలో కలపాలని నిజామాబాద్ లో జరిగిన స్టేట్ కాంగ్రెస్ సమావేశంలో స్వామిజీ ప్రతిపాదించగా దాన్ని కార్యవర్గం బలపరచింది. “సంస్థానాన్ని విడగొట్టండి, రాచరికపు జాడలను రూపుమాపండి” అనేది స్వామిజీ ప్రబలమైన నినాదం.

S3. Ans (c)
Sol: భారతదేశ దళిత ఉద్యమకారులలో భాగ్యరెడ్డి వర్మ ముఖ్యమైన వారు. తెలంగాణ తొలితరం దళిత ఉద్యమకారుల్లో అగ్రగణ్యుడు. అంబేద్కర్ కంటే ముందే భారతదేశ దళితుల అభ్యున్నతి కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ.

S4. Ans ( c)
Sol: ఆర్యసమాజ్ ఆధ్యాత్మిక, సంఘసంస్కరణ – కార్యక్రమాలు, స్వాతంత్రోద్యమంతోపాటు విద్యావ్యాప్తి కోసం కూడా విరివిగా పనిచేసింది. హైదరాబాద్ లోని 1939లో కేశవమెమోరియల్ హైస్కూల్ను స్థాపించింది.

S5. Ans (c)
Sol:
• అమరవీరుల దినోత్సవం – మే 17
• తెలంగాణా విమోచన దినం – జూలై 5
• తెలంగాణా జెండా దినం – జూలై 12
• తెలంగాణా పరిరక్షక దినం – జూలై 10

S6. Ans (d)
Sol: నిజాం పెత్తందారుల కింద తన జాతి నలిగిపోవటాన్ని చూసి భీమ్ సహించలేక తిరుగుబాటు ప్రారంభించాడు. జల్(నీరు) జంగల్(అడవి), జమీన్ (భూమి) నినాదాన్ని ఇచ్చాడు. ఆదివాసీ గూడేల ప్రజల్లో చైతన్యం చ్చాడు. నిజాం అధికారులు, స్థానిక దొరలు, పెత్తందార్లకు వ్యతిరేకంగా కొమరం భీం వ్యక్తిగా కాకుండా సమిష్టిగా పోరాటం కొనసాగించాలి అని నిర్ణయించాడు

S7. Ans (a)
Sol: పూర్వం నిజాం రాజ్యంలో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారిని 20వ శతాబ్దం మొదటి భాగంలో ఎక్కువగా నియమించేవారు. దీనితో స్థానికులకు ఉద్యోగాలు దక్కకుండా పోయాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సంస్థానంలోని ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని తెలంగాణ నిరుద్యోగ యువత 1910 నుంచి 1918 వరకు పెద్ద ఎత్తున ఉద్యమించారు.

S8. Ans (b)
Sol: ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ముందుకు నడిపించాలని నిర్ణయమైన తరువాత ఉద్యమ నిర్వహణకు ఒక సంస్థను నిర్మించుకోవలసిన అవసరం ఏర్పడింది. కొంతమంది పెద్దలు సమావేశమై 18 ఫిబ్రవరి, 1969 నాడు శ్రీ ఎ.మదన్ మోహన్ కన్వీనర్గా తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ అనే సంస్థను ఏర్పరచినారు. మార్చి 25 నాడు తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ పేరును తెలంగాణ ప్రజా సమితిగా మార్చి శ్రీ మదన్ మోహన్ అధ్యక్షులుగా 25 మంది సభ్యులతో కమిటీని నియమించారు.

S9. Ans (a)
Sol: “మీజాన్” పత్రికకు సంబందించి :
• ఇంగ్లీషు ఎడిషన్ నిజాం ప్రభుత్వాన్ని సమర్ధించేది.
• తెలుగు ఎడిషన్ నిజాం వ్యతిరేక పోరాటాలను సమర్దించేది.
• ఉర్దూ ఎడిషన్ రజాకార్ల ను సమర్దించేది

S10. Ans (c)
Sol: తెలంగాణ అమరవీరుల స్థూపం (గన్ పార్క్):
• 1969 తెలంగాణ ఉద్యమంలో అమరులయిన వారి స్మృత్యర్థం నిర్మించిందే గన్ పార్క్ అమరవీరుల స్థూపం.
• ఈ స్థూపం తెలంగాణ అస్తిత్వానికి, ఉద్యమానికి సాంస్కృతిక ప్రతీకగా నిలిచింది. ఈ స్థూపాన్ని చెక్కిన శిల్పి “ఎక్కా యాదగిరి రావు”.
• ఈ స్థూపానికి అప్పటి మున్సిపల్ మేయర్ లక్ష్మీనారాయణ 1970, ఫిబ్రవరి 23న నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 1975లో స్థూపం నిర్మాణం పూర్తయింది

TSPSC Group-4 Complete Batch 3.O | Telugu | Online Live Classes By Adda247

మరింత చదవండి:

తాజా ఉద్యోగ ప్రకటనలు క్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

Telangana State GK MCQs Questions And Answers in Telugu_5.1

FAQs

where can I found Daily Telangana State GK Quiz?

You can found Daily Telangana State GK Quiz at adda 247 website