Telugu govt jobs   »   Daily Quizzes   »   Telangana State GK MCQs Questions And...

Telangana State GK MCQs Questions And Answers in Telugu,25 August 2022, For TSPSC Groups and Telangana Police and Singareni JA Grade- II

Telangana State GK MCQs Questions And Answers in Telugu : Practice General awareness Quiz Questions and Answers in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. Current Affairs Questions,  Static Awareness forms a part and parcel of General Awareness/ General Knowledge. Most of the questions asked in the general awareness sections are based on current affairs.

Telangana State GK MCQs Questions And Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే SSC, సింగరేణి , రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Telangana State GK MCQs Questions And Answers in Telugu,20 August 2022, For TSPSC Groups and Telangana Police and Singareni JA Grade- II |_60.1APPSC/TSPSC Sure shot Selection Group

 

Telangana State GK MCQs Questions And Answers in Telugu

Q1. లలిత్ కుమార్ కమిటీ తరువాత నివేదికపై చర్యలను కాకుండా మిగులు నిధుల పై వేసిన రెండవ కమిటీ ఏది?

  1. ఎస్ ఎన్ చారి కమిటీ
  2. తెలంగాణా రక్షణల సంఘం
  3. భార్గవ కమిటీ
  4. పైవేవీ కాదు

Q2. పంచసూత్ర పథకాన్ని వ్యతిరేకించిన తెలంగాణ ప్రాంత ఎం.పి.లు ఎవరు?

  1. మల్లిఖార్జున్
  2. రామకృష్ణారెడ్డి
  3. గంగారెడ్డి
  4. జి.యస్. మేల్కోటే

(a) 1, 2 మరియు 3 మాత్రమే

(b) 2, 3 మరియు 4 మాత్రమే

(c) 1, 3 మరియు 4మాత్రమే

(d) పైనపెర్కొన్నవని 

Q3. తెలంగాణ వాదులు వివిధ జిల్లాలలో, వివిధ పేర్లతో ఉద్యమ వేదికలను ఏర్పాటు చేశారు.

వేదికలకు సంబందించి కింది వాటిని జతపరుచుము.

జాబితా – I జాబితా – II 

  1. తెలంగాణ చైతన్యవేదిక 1. నల్గొండ
  2. తెలంగాణ ఉద్యమవేదిక 2. రంగారెడ్డి
  3. తెలంగాణ పోరాట వేదిక 3. మెదక్
  4. తెలంగాణ ప్రజావేదిక 4. మహబూబ్ నగర్

(a) A – 2, B – 1, C – 4, D – 3

(b) A – 4, B – 3, C – 1, D – 2

(c) A – 3, B – 4, C – 1, D – 2

(d) A – 4, B – 3, C – 2, D – 1

Q4. ‘గంగోపాధ్యాయ కమిటీ’ కి సంబంధించి కింది వాటిలో ఏది సరైంది?

  1. ప్రభుత్వవ్యయమును తగ్గించడానికి తగిన సూచనలు చేయమని గంగోపాధ్యాయ కమిటీని ప్రభుత్వం నియమించింది.
  2. కమిటీ, ప్రభుత్వ సిబ్బందిలో అదనంగా ఉన్నవారిని తొలగించి, అనుమతి లేకుండా కొత్త ఉద్యోగాలను భర్తీ చేయకూడదని పేర్కొంది.
  3. ప్రభుత్వం పేదలకిస్తున్న రెండు రూపాయలకు కిలో బియ్యంను మూడున్నర రూపాయలకు పెంచడం జరిగింది. బియ్యం ధరను పెంచడంతో పాటు కుటుంబానికి ఇస్తున్నటువంటి కోటాను కూడా 25% తగ్గించాడు

(a) 1 మరియు 3

(b) 2 మరియు

(c) 1 మరియు 2

(d) 1, 2, 3

Q5.  సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ కి సంబంధించి కింది వాటిలో ఏది సరైంది?

  1. రాష్ట్రంలోని సినిమా, వార్తాపత్రికలు, ఇతర మీడియా సంస్థలు తెలంగాణేతరుల చేతులలో ఉండడం వలన వారు తెలంగాణ పట్ల కొంత వ్యతిరేకంగా ప్రవర్తించారు.
  2. ప్రయత్నాలలో భాగంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1997లో సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ ను స్థాపించారు
  1. 1 మాత్రమే
  2. 2 మాత్రమే
  3. 1 మరియు 2 రెండూ
  4. 1, 2 కాదు

Q6. CPI(ML) పార్టీ సిద్ధాంతం: `మార్క్సిజం -లెనినిజం–మావోయిజం’. ఈ పదాల పూర్తి విఅవరంకు సంబందించిన ఏది సరైంది?

  1. మార్క్సిజంకమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతకర్త అయిన కారల్ మార్క్స్ విధానం.
  2. లెనినిజంసోవియట్ రష్యాలో అమలవుతున్న విధానం
  3. మావోయిజంచైనాలో మావో అమలు చేసిన కమ్యూనిస్టు విధానం.

(a) 1 మరియు 3

(b) 2 మరియు

(c) 1 మరియు 2

(d) 1, 2, 3

Q7. తెలంగాణ హిస్టరీ సొసైటీ ప్రచురించిన పుస్తకాలు ఏవి?

  1. తెలంగాణ చరిత్ర పునర్నిర్మాణం
  2. 17 సెప్టెంబర్ 1948 భిన్న దృక్కోణాలు
  3. 1857 పోరాట తిరుగుబాటు
  4. ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఏర్పాటు విద్రోహ చరిత్ర

(a) 1, 2 మరియు 3 మాత్రమే

(b) 2, 3 మరియు 4 మాత్రమే

(c) 1, 3 మరియు 4మాత్రమే

(d) పైనపెర్కొన్నవని 

Q8. తెలంగాణ చరిత్రను వెలుగులోకి తేవాలనే ఉద్దేశ్యంతో 2006 జూన్లో హైదరాబాద్ లోని ఫతేమైదాన్ క్లబ్లో సమావేశం జరిగింది. ఈ సదస్సులోనే టి. వివేక్ కన్వీనర్ గా ఏర్పడిన సంస్థ ?

  1. తెలంగాణ హిస్టరీ సొసైటీ
  2. తెలంగాణ విద్యావంతుల వేదిక
  3. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం
  4. పీపుల్స్ తెలంగాణ ఫౌండేషన్

Q9. 1969 జూన్ 17న తెలంగాణ మహిళాదినం ను జరిపారు. ఈ మహిళాదినం సందర్భంగా మహిళలు పెద్దసంఖ్యలో సత్యాగ్రహంలో పాల్గొన్నారు. ఈ సత్యాగ్రహంలకు సంబందించి కింది వాటిని జతపరుచుము.

జాబితా – I జాబితా – II 

  1. సచివాలయం వద్ద 1. లక్ష్మీరెడ్డి
  2. మోజంజాహి మార్కెట్ వద్ద 2. కుముదినీ నాయక్
  3. చార్మినార్ క్రాస్లెడ్ వద్ద 3. శ్రీమతి సదాలక్ష్మి
  4. ఆబిడ్స్ లోని నెహ్రూ విగ్రహం వద్ద 4. ఈశ్వరీబాయి

 (a) A – 2, B – 1, C – 4, D – 3

(b) A – 4, B – 3, C – 1, D – 2

(c) A – 3, B – 4, C – 1, D – 2

(d) A – 4, B – 3, C – 2, D – 1

Q10. తెలంగాణ ప్రగతి వేదిక కి సంబంధించి కింది వాటిలో ఏది సరైంది కాదు?

  1. తెలంగాణ సమస్యలపై చర్చించడానికి 1995 జూలెలో రెండు రోజుల సదస్సు రాపోలు ఆనందభాస్కర్ నేతృత్వంలో హైదరాబాద్లో జరిగింది.
  2. సదస్సు అనంతరం రాపోలు ఆనందభాస్కర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రగతి వేదిక 1997 జూలై 13 ఏర్పడింది.
  3. వేదిక బతకమ్మ పండుగ కాలాన్ని తెలంగాణ సంస్కృతి పరిరక్షణ దినోత్సవాలుగా ప్రకటించి పలుచోట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది.

(a) 1 మాత్రమే

(b) 2 మరియు

(c) 1 మరియు 2

(d) 1, 2, 3

Solutions:

S1. Ans.(c)

Sol: లలిత్ కుమార్ కమిటీ పరిశిలించిన అంశాలపై 1969, ఏప్రిల్22 మిగులు నిధుల పై భార్గవ కమిటీ వేశారు.

S2. Ans(d)

Sol: పంచసూత్ర పథకాన్ని వ్యతిరేకించిన తెలంగాణ ప్రాంత ఎం.పి.లు 

  • జి.యస్. మేల్కోటే
  • మల్లిఖార్జున్
  • రామకృష్ణారెడ్డి
  • గంగారెడ్డి

పంచసూత్ర పథకంపై గౌతులచ్చన్న స్పందిస్తూమహారాజుకి మనవి చేసుకుంటే మరి రెండు దెబ్బలు వేయమన్నసామెతకు సరిపోయినట్లుగా పంచసూత్ర పథకం ఉంది అని పేర్కొన్నాడు.

1972 డిశంబర్ 7 ఆంధ్ర ఉద్యోగులు నిరవధిక సమ్మెను ప్రారంభించారు. తరువాతి కాలంలో 1973 మార్చి 25 108 రోజుల సమ్మెను విరమించారు)

S3. Ans(c)

Sol: తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేయాలనే ఉద్దేశ్యంతో పలువురు తెలంగాణ వాదులు వివిధ జిల్లాలలో, వివిధ పేర్లతో ఉద్యమ వేదికలను ఏర్పాటు చేశారు.

  • తెలంగాణ చైతన్యవేదికమెదక్
  • తెలంగాణ ఉద్యమవేదికమహబూబ్ నగర్
  • తెలంగాణ పోరాట వేదికనల్గొండ
  • తెలంగాణ ప్రజావేదికరంగారెడ్డి

S4. Ans (d)

Sol: ‘గంగోపాధ్యాయ కమిటీ‘:

  • ప్రభుత్వవ్యయమును తగ్గించడానికి తగిన సూచనలు చేయమని గంగోపాధ్యాయ కమిటీని ప్రభుత్వం నియమించింది.
  • కమిటీ, ప్రభుత్వ సిబ్బందిలో అదనంగా ఉన్నవారిని తొలగించి, అనుమతి లేకుండా కొత్త ఉద్యోగాలను భర్తీ చేయకూడదని పేర్కొంది.
  • ప్రభుత్వం పేదలకిస్తున్న రెండు రూపాయలకు కిలో బియ్యంను మూడున్నర రూపాయలకు పెంచడం జరిగింది.
  • బియ్యం ధరను పెంచడంతో పాటు కుటుంబానికి ఇస్తున్నటువంటి కోటాను కూడా 25% తగ్గించాడు

S5. Ans (c)

Sol:  సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్

  • రాష్ట్రంలోని సినిమా, వార్తాపత్రికలు, ఇతర మీడియా సంస్థలు తెలంగాణేతరుల చేతులలో ఉండడం వలన వారు తెలంగాణ పట్ల కొంత వ్యతిరేకంగా ప్రవర్తించారు.
  • నేపథ్యంలో తెలంగాణ ప్రజలను చైతన్యపరిచి ప్రపంచ దృష్టికి వాస్తవాలను అందించడానికి ప్రజాసంఘాల నాయకులు ప్రయత్నించారు.
  • ప్రయత్నాలలో భాగంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1997లో సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ ను స్థాపించారు

S6. Ans (d)

Sol: CPI(ML) పార్టీ సిద్ధాంతం: ‘ మార్క్సిజంలెనినిజంమావోయిజం

  • మార్క్సిజంకమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతకర్త అయిన కారల్ మార్క్స్ విధానం.
  • లెనినిజంసోవియట్ రష్యాలో అమలవుతున్న విధానం
  • మావోయిజంచైనాలో మావో అమలు చేసిన కమ్యూనిస్టు విధానం.

S7. Ans(d)

Sol: తెలంగాణ హిస్టరీ సొసైటీ ప్రచురించిన పుస్తకాలు:

  • తెలంగాణ చరిత్ర పునర్నిర్మాణం
  • 17 సెప్టెంబర్ 1948 భిన్న దృక్కోణాలు
  • 1857 పోరాట తిరుగుబాటు
  • ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఏర్పాటు విద్రోహ చరిత్ర

S8 Ans(a)

Sol: తెలంగాణ హిస్టరీ సొసైటీ:

తెలంగాణ చరిత్రను వెలుగులోకి తేవాలనే ఉద్దేశ్యంతో 2006 జూన్లో హైదరాబాద్ లోని ఫతేమైదాన్ క్లబ్లో సమావేశం జరిగింది. సదస్సులోనే టి. వివేక్ కన్వీనర్గా తెలంగాణ హిస్టరీ సొసైటీ ఆవిర్భవించింది.

లక్ష్యాలు:

  • తెలంగాణ రాష్ట్ర సాధనకు కృషి
  • తెలంగాణ చరిత్ర, సంస్కృతిని పరిరక్షించడం
  • తెలంగాణ ప్రాంతంలోని స్థానిక చరిత్రను లిఖితం చేయటం

S9. Ans(b)

Sol: 1969 జూన్ 17 తెలంగాణ మహిళాదినం ను జరిపారు. మహిళాదినం సందర్భంగా మహిళలు పెద్దసంఖ్యలో సత్యాగ్రహంలో పాల్గొన్నారు

  • సచివాలయం వద్దఈశ్వరీబాయి (రిపబ్లికన్ పార్టీ ఎమ్మెల్యే)
  • మోజంజాహి మార్కెట్ వద్దశ్రీమతి సదాలక్ష్మి
  • చార్మినార్ క్రాస్లెడ్ వద్దలక్ష్మీరెడ్డి
  • సుల్తాన్ బజార్ వద్దచెన్నారెడ్డి కుటుంబ మహిళలు
  • ఆబిడ్స్ లోని నెహ్రూ విగ్రహం వద్దకుముదినీ నాయక్

S10. Ans(a)

Sol: తెలంగాణ ప్రగతి వేదిక :

  • తెలంగాణ సమస్యలపై చర్చించడానికి 1997 జూలెలో రెండు రోజుల సదస్సు రాపోలు ఆనందభాస్కర్ నేతృత్వంలో హైదరాబాద్లో జరిగింది.
  • సదస్సు అనంతరం రాపోలు ఆనందభాస్కర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రగతి వేదిక 1997 జూలై 13 ఏర్పడింది.
  • వేదిక బతకమ్మ పండుగ కాలాన్ని తెలంగాణ సంస్కృతి పరిరక్షణ దినోత్సవాలుగా ప్రకటించి పలుచోట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది.

 

adda247

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  క్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

 

Sharing is caring!