Telugu govt jobs   »   Current Affairs   »   Telangana State Current Affairs In Telugu...

Telangana State Current Affairs In Telugu June 2022 | తెలంగాణ రాష్ట్ర కరెంట్ అఫైర్స్ జూన్2022 తెలుగులో

Telangana State Current affairs In Telugu  June 2022, తెలంగాణ రాష్ట్ర కరెంట్ అఫైర్స్ జూన్ 2022 తెలుగులో

Telangana state current affairs plays crucial role in GROUP-1, GROUP-2, Panchayat Secretary, GROUP-4 , Assistant Engineer(AE), Sub-Inspector and Constable, Junior Lecturers etc., exams.. Telangana Government releases notification for Various posts through TSPSC like GROUP-1, GROUP-2, Panchayat Secretary, GROUP-4 , Assistant Engineer(AE), Sub-Inspector and Constable, Junior Lecturers, Degree Lecturers and various executive and non-executive posts under various departments of Telangana. Current affairs play a very important role in the competitive examinations and hence, aspirants have to give undivided attention to it while doing preparation for the government examinations.To complement your preparation, we are providing you the Telangana State Current affairs In Telugu June 2022 .

తెలంగాణ రాష్ట్ర కరెంట్ అఫైర్స్ GROUP-1, GROUP-2, పంచాయితీ సెక్రటరీ, GROUP-4, అసిస్టెంట్ ఇంజనీర్(AE), సబ్-ఇన్‌స్పెక్టర్ మరియు కానిస్టేబుల్, జూనియర్ లెక్చరర్స్ మొదలైన పరీక్షలలో కీలక పాత్ర పోషిస్తుంది.. తెలంగాణ ప్రభుత్వం వివిధ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. TSPSC ద్వారా GROUP-1, GROUP-2, పంచాయితీ సెక్రటరీ, GROUP-4, అసిస్టెంట్ ఇంజనీర్ (AE), సబ్-ఇన్‌స్పెక్టర్ మరియు కానిస్టేబుల్, జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్లు మరియు వివిధ ఎగ్జిక్యూటివ్ మరియు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు తెలంగాణలోని వివిధ విభాగాల క్రింద. కరెంట్ అఫైర్స్ పోటీ పరీక్షల్లో చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. కాబట్టి, ప్రభుత్వ పరీక్షలకు ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు అభ్యర్థులు దానిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ ప్రిపరేషన్‌ను పూర్తి చేయడానికి, మేము మీకు తెలంగాణ రాష్ట్ర కరెంట్ అఫైర్స్‌ను తెలుగులో అందిస్తున్నాము.

Telangana State Current Affairs In Telugu June 2022_3.1

APPSC/TSPSC Sure shot Selection Group

Telangana State Current affairs In Telugu, తెలంగాణ రాష్ట్ర కరెంట్ అఫైర్స్ తెలుగులో

1. వినూత్న వాహనాల తయారీకి ఐక్యాట్‌తో ఐఐటీహెచ్‌(IITH) ఒప్పందం

IT - CAT
IT – CAT

 

డ్రైవర్‌ లేకుండానే దూసుకుపోయే వాహనాలను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ఐఐటీ హైదరాబాద్‌ వడివడిగా అడుగులేస్తోంది. ఆ దిశగా పరిశోధనలను ముమ్మరం చేసే ప్రణాళికలు అమలు చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఆటోమోటివ్‌ టెక్నాలజీ (ఐక్యాట్‌) సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. స్వతంత్రంగా నడిచే వాహనాలను అభివృద్ధి చేసేందుకు వీలుగా దేశంలోనే తొలిసారిగా ఐఐటీలో టెక్నాలజీ ఇన్నోవేషన్‌ హబ్‌ (టీహాన్‌)ను నెలకొల్పారు. ఈ హబ్‌ ద్వారా టెస్టింగ్‌ ట్రాక్‌తో పాటు పరిశోధనలకు అవసరమైన అన్ని వ్యవస్థలను ఇక్కడ అందుబాటులోకి తెచ్చారు. రానున్న రోజుల్లో డ్రైవర్‌ లేకుండానే నేలపై, ఆకాశంలో నడిచే వాహనాలను సిద్ధం చేయాలనేది దీని ఏర్పాటు లక్ష్యం. ‘ఐక్యాట్‌తో కుదుర్చుకున్న ఈ ఒప్పందం కీలకమైన ముందడుగు. ఇకపై రెండు సంస్థలు పరిశోధనా, నైపుణ్యాభివృద్ధి, ఆవిష్కరణ అంశాల్లో పరస్పరం సహకరించుకుంటూ ముందుకు సాగుతాయని’ ఐఐటీ హైదరాబాద్‌ డైరెక్టర్‌ ఆచార్య బీఎస్‌మూర్తి అన్నారు.

2. కాలుష్యరహిత స్టవ్‌లు, స్టీమ్‌ యంత్రాల తయారీకి ఒప్పందం

తెలంగాణలో కాలుష్యరహిత వంట స్టవ్‌లు, మొబైల్‌ స్టీమ్‌ యంత్రాల తయారీకి తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ టీ వర్క్స్, సామాజిక సేవా సంస్థ కేర్‌ ఇండియా ఒప్పందం కుదుర్చుకున్నాయి. టీవర్క్స్‌ సీఈవో సుజయ్‌ కారంపురి, కేర్‌ ఇండియా సీఈవో మనోజ్‌ గోపాలకృష్ణలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.

3. అడ్వాన్స్‌ ఆటో పార్ట్స్‌ గ్లోబల్‌ కేపెబిలిటీ సెంటర్‌ ప్రారంభం

 

వాహన రంగంలో తెలంగాణకు అద్భుత భవిష్యత్తు ఉందని, హైదరాబాద్‌ నగరం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో తొలి ‘ఫార్ములా ఈ’ (విద్యుత్‌ వాహనాల) రేసుకు ఆతిథ్యమివ్వనుందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ తెలిపారు. విద్యుత్‌ వాహన తయారీ రంగంపై చర్చించేందుకు శిఖరాగ్ర సదస్సు (ఈవీ సమ్మిట్‌)నూ నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రముఖ వాహన రంగ సంస్థ అడ్వాన్స్‌ ఆటో పార్ట్స్‌ ప్రపంచస్థాయి సామర్థ్య కేంద్రం (గ్లోబల్‌ కేపెబిలిటీ సెంటర్‌)ను కేటీఆర్‌ హైదరాబాద్‌లోని కోకాపేట జీఏఆర్‌ ఇన్‌ఫోబాన్‌ ఐటీ భవనంలో ప్రారంభించారు.

4. జాన్సన్‌ కంట్రోల్స్‌ కంపెనీ ‘ఓపెన్‌ బ్లూ ఇన్నోవేషన్‌ సెంటర్‌’ ప్రారంభం

OPEN Blue Inovation
OPEN Blue Inovation

 

భారతదేశంలో పెట్టుబడులకు ముఖద్వారం తెలంగాణ రాష్ట్రమని ఐటీ, పరిశ్రమల, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు అభివర్ణించారు. మాదాపూర్‌లో జాన్సన్‌ కంట్రోల్స్‌ కంపెనీకి చెందిన ‘ఓపెన్‌ బ్లూ ఇన్నోవేషన్‌ సెంటర్‌’ను ఆయన ప్రారంభించారు. పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఉత్తమ పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తోంది. జాన్సన్‌ కంట్రోల్స్‌ వంటి కంపెనీలు వ్యాపారాన్ని విస్తరించేందుకు ఇక్కడ అపార అవకాశాలు ఉన్నాయి. టీ హబ్, టీ వర్క్స్, ఐమేజ్‌ టవర్స్, పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ భవనం, సచివాలయం వంటి భవనాలను ప్రభుత్వం చేపట్టిందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

5. తెలంగాణలో తొలిసారిగా వరంగల్, సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో జనపనార పరిశ్రమల ఏర్పాటు  

Jute Mill
Jute Mill

 

పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్న తెలంగాణలో ఇప్పటివరకూ జనపనార (జూట్‌) పరిశ్రమలు లేవు. మరోవైపు ధాన్యం సేకరణ, నిల్వ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా 30 కోట్లకు పైగా జనపనార గోనె సంచులను ఏపీ, ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తోంది. ఒక్కోసారి సంచుల కొరతతో ధాన్యం సేకరణకు సమస్యలూ ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలోనే గోనె సంచుల ఉత్పత్తిని ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో మూడు సంస్థలు జూట్‌ మిల్లుల ఏర్పాటుకు ముందుకురాగా, వాటితో ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలో తొలిసారిగా గ్లోస్టర్‌ లిమిటెడ్‌ సంస్థ వరంగల్‌లో, కాళేశ్వరం ఆగ్రో లిమిటెడ్‌ రాజన్న సిరిసిల్ల జిల్లాలో, ఎంబీజీ కమాడిటీస్‌ లిమిటెడ్‌ కామారెడ్డిలో ఈ మిల్లులను ఏర్పాటు చేయనున్నాయని పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌ తెలిపారు.

6. దేశంలోనే తొలిసారిగా బస్సుల్లో ఐ-టిమ్‌ (ఇంటెలిజెంట్‌ టికెట్‌ ఇష్యూ మిషన్‌)ల ఏర్పాటు

I - TEAM
I – TEAM

 

ప్రయాణికులకు మెరుగైన సేవలందించడానికి టీఎస్‌ఆర్టీసీ సరికొత్త సాంకేతికతను అందిపుచ్చుకుంటోంది. టికెట్ల జారీని మరింత సులభతరం చేసేందుకు ఇప్పటికే టిమ్‌ (టికెట్‌ ఇష్యూ మిషన్‌) సేవలను అందిస్తోంది. ఇపుడు మరింత ఆధునికంగా దేశంలోనే తొలిసారిగా బస్సుల్లో ఐ-టిమ్‌ (ఇంటెలిజెంట్‌ టికెట్‌ ఇష్యూ మిషన్‌)లను అందుబాటులోకి తెచ్చింది.

7. తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ 2021 – 22 వార్షిక నివేదిక విడుదల

తెలంగాణలో పారిశ్రామిక అనుమతులు, స్వీయధ్రువీకరణ విధానం (టీఎస్‌ఐపాస్‌) ద్వారా ఇప్పటివరకు రూ.2,32,311 కోట్ల పెట్టుబడులతో 19,454 భారీ పరిశ్రమలకు అనుమతులిచ్చామని, వీటి ద్వారా 16.48 లక్షల మందికి ఉపాధి లభించిందని 2021 – 22 రాష్ట్ర పరిశ్రమల వార్షిక నివేదిక వెల్లడించింది. ఒక్క సంవత్సరంలోనే రూ.17,867 కోట్ల పెట్టుబడులు, 96,863 మందికి ఉపాధి కల్పన కోసం 3,938 పరిశ్రమలు అనుమతి పొందాయని వెల్లడించింది. నీతి ఆయోగ్‌ నివేదిక ప్రకారం.. దేశంలో తెలంగాణ అత్యుత్తమ వాణిజ్య వాతావరణ నగరంగా వంద మార్కులను సాధించిందని, ఎగుమతుల్లో దేశంలో అయిదో ర్యాంకు, గుడ్‌ గవర్నెన్స్‌ ఇండెక్స్‌లో వాణిజ్య, పారిశ్రామిక ర్యాంకుల్లో మొదటి స్థానంలో, సృజనాత్మకత, ఆవిష్కరణ, మేధో సంపత్తి హక్కుల్లో అగ్రస్థానంలో నిలిచిందని నివేదిక వెల్లడించింది. ఈ వార్షిక నివేదికను మంత్రి కేటీఆర్‌ విడుదల చేశారు.

నివేదికలోని ముఖ్యాంశాలు.

  • తెలంగాణ జీఎస్‌డీపీ 2021 – 22లో 19.1% వృద్ధి రేటుతో రూ.11.54 లక్షల కోట్లు. 2014 – 15 నుంచి 2021 – 22 వరకు జీఎస్‌డీపీ 128.3 శాతం వృద్ధి చెందింది. జాతీయ జీడీపీలో తెలంగాణ వాటా 5 శాతం.
  • 2021 – 22లో రాష్ట్రంలో 13 కొత్త పారిశ్రామిక పార్కుల అభివృద్ధి.

8. ఐఐసీటీ కొత్త డైరెక్టర్‌గా డాక్టర్ డి శ్రీనివాస రెడ్డి బాధ్యతలు స్వీకరించారు

IICT - Srinivas-Reddy
IICT – Srinivas-Reddy

 

హైదరాబాద్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసిటి) డైరెక్టర్‌గా డాక్టర్ డి శ్రీనివాస రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అతను డిసెంబర్ 2021 నుండి డైరెక్టర్ అదనపు ఛార్జీగా వ్యవహరిస్తున్న నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (NGRI) డైరెక్టర్ డాక్టర్ VM తివారీ నుండి బాధ్యతలు స్వీకరించారు.

 

9. తెలంగాణలో ఫాక్స్‌కాన్‌ యూనిట్‌ ఏర్పాటు

FOXCONN - TS
FOXCONN – TS

 

ఎలక్ట్రానిక్స్‌ రంగ దిగ్గజం, తైవాన్‌కు చెందిన హాన్‌ హై టెక్నాలజీ గ్రూప్‌ (ఫాక్స్‌కాన్‌)యూనిట్‌ను తెలంగాణలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ఫాక్స్‌కాన్‌ ఛైర్మన్‌ యంగ్‌ లియును కోరారు.  ఢిల్లీలో లియుని కలిసిన కేటీఆర్‌ దేశంలో కంపెనీ విస్తరణ ప్రణాళి కలను చర్చించారు. తెలంగాణలో ఎలక్ట్రానిక్స్‌ తయారీని ప్రోత్సహించడానికి మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ఆయనకు వివరించారు.

10. హైదరాబాద్‌లో టర్కీ ఫుడ్‌ ఫెస్టివల్‌ ప్రారంభం

Turkey Food Festival
Turkey Food Festival

 

బంజారాహిల్స్‌లోని హయత్‌ ప్లేస్‌ వేదికగా  జులై 3వ తేదీ వరకు ఫ్లేవర్స్‌ ఆఫ్‌ టర్కీ పేరుతో టర్కీష్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌ను నిర్వహించనున్నారు. ఈ ఫుడ్‌ ఫెస్టివల్‌ ప్రారంభ కార్యక్రమాన్ని  హయత్‌ ప్లేస్‌లో ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా టర్కీ కాన్సులేట్‌ జనరల్‌ ఒర్హాన్‌ ఎల్మాన్‌ ఒకన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌ నగరవాసులకు తమ ఆహారం, సంస్కృతిని మరింత దగ్గర చేయాలనే ఉద్దేశ్యంతో ఈ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశామని అన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా టాప్‌ టెన్‌లో టర్కిష్‌ ఫుడ్‌ వెరైటీస్‌ ఉంటాయని తెలిపారు. హైదరాబాదీ ఫుడ్‌కు, టర్కీ ఫుడ్‌కు సారూప్యత ఉంటుందన్నారు.  ఈ ఫుడ్‌ ఫెస్టివల్‌లో పాల్గొనే వారు లక్కీ డ్రాలో భాగంగా టర్కీలో ఉచితంగా బస చేసే బహుమతిని పొందవచ్చని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌రంజన్‌ తదితరులు పాల్గొన్నారు.

11. సజయకు కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు

sahitya award
sahitya award

 

రచయిత్రి, సామాజిక ఉద్యమకారిణి కాకర్ల సజయకు 2021 సంవత్సరానికి సంబంధించి అనువాద విభాగంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం దక్కింది. ప్రముఖ రచయిత్రి భాషాసింగ్‌ రచించిన అదృశ్య భారత్‌(నాన్‌ ఫిక్షన్‌) హిందీ పుస్తకాన్ని సజయ ‘అశుద్ధ భారత్‌’పేరిట తెలుగులోకి అనువదించారు. అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ కాంబర్‌ నేతృత్వంలోని కార్యనిర్వాహక బోర్డు  సమావేశమై 22 పుస్తకాలను సాహిత్య అకాడమీ అనువాద అవార్డులకు ఎంపిక చేసింది.

జనవరి 1, 2015 నుంచి డిసెంబరు 2019 మధ్య ప్రచురితమైన పుస్తకాల నుంచి అవార్డు గ్రహీతలను ఎంపిక చేసినట్లు తెలిపారు. జ్యూరీ సభ్యులుగా ఎస్‌.శేషారత్నం, వై.ముకుంద రామారావు, గుమ్మ సాంబశివరావు వ్యవహరించారు. దేశంలోని పారిశుధ్య కార్మికుల వాస్తవ జీవన చిత్రాన్ని అశుద్ధ భారత్‌ పుస్తకం ఆవిష్కరించింది. త్వరలో నిర్వహించే కార్యక్రమంలో అవార్డు గ్రహీతలకు రూ.50 వేల నగదు, తామ్రపత్రం అందజేయనున్నారు.

12. అవయవ మార్పిడి నోడల్‌ సెంటర్‌గా గాంధీ ఆస్పత్రి

Gandhi_Hospital
Gandhi_Hospital

 

సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి మరో అరుదైన ఘనతను సొంతం చేసుకోనుంది. అవయవాల మార్పిడి సర్జరీల నోడల్‌ సెంటర్‌గా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ రూపొందించి అమలు చేయనున్నారు. అత్యాధునిక మాడ్యులర్‌ ఆపరేషన్‌ థియేటర్లు ఏర్పాటుకు రూ. 30 కోట్ల నిధులు కేటాయించగా, తెలంగాణ వైద్యవిద్య మౌళిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) ఆధ్వర్యంలో త్వరలోనే నిర్మాణ పనులు చేపట్టనున్నారు. దీనికి సంబంధించి డిటెల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్టు (డీపీఆర్‌)కు వైద్యశాఖ మంత్రి హరీష్‌రావు ఇటీవలే ఓకే చెప్పారని ఆస్పత్రికి చెందిన ఓ అధికారి తెలిపారు.

ప్రభుత్వ సెక్టార్‌లో ఉస్మానియా, నిమ్స్‌ ఆస్పత్రుల్లో అవయవాల మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలో ఒకటి రెండు అవయవమార్పిడి సర్జరీలు విజయవంతంగా చేపట్టినప్పటికీ అవసరమైన ఆధునిక ఆపరేషన్‌ థియేటర్లు అందుబాటులో లేకపోవడంతో అవయవ మార్పిడిపై పెద్దగా ఆసక్తి చూపించలేదు.

13. కాలుష్య సమస్యలతో హైదరాబాద్‌లో పరిశ్రమలకు అత్యల్ప సంఖ్యలో అనుమతులు

TS-Ipass
TS-Ipass

 

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కాలుష్య సమస్య కారణంగా కొత్త పరిశ్రమలకు ప్రభుత్వం అనుమతులు నిరాకరిస్తోంది. గత ఎనిమిదేళ్ల కాలంలో మొత్తంగా కేవలం 32 పరిశ్రమలు మాత్రమే హైదరాబాద్‌కు వచ్చాయి. ఇవి కాలుష్య సమస్య లేని ఐటీ పరిశ్రమలు. మేడ్చల్‌ – మల్కాజిగిరి జిల్లాలో అత్యధిక అనుమతులిచ్చారు. అక్కడ ఎనిమిదేళ్లలో 3,805 ( 22.2 శాతం) ఏర్పాటయ్యాయి. ఆ తర్వాత స్థానాల్లో సంగారెడ్డి 1,410 (8.25 శాతం),  కరీంనగర్‌ 1,223 (7.4 శాతం) నిలిచాయి. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన తెలంగాణ పారిశ్రామిక అనుమతులు, స్వీయ ధ్రువీకరణ విధానం (టీఎస్‌ఐపాస్‌) నివేదిక ఈ అంశాలను వెల్లడించింది.

14. ఫ్లిప్‌కార్ట్‌తో తెలంగాణ సెర్ప్‌ రూ.500 కోట్ల ఒప్పందం

Telangana State Current Affairs In Telugu June 2022_14.1
Flipkart

 

మహిళా సంఘాల ఉత్పత్తులను దేశ విదేశాల్లో మార్కెటింగ్‌ చేసేందుకు ఫ్లిప్‌కార్ట్‌తో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) కుదుర్చుకొన్న ఒప్పందం చరిత్రాత్మకమని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ఈ సంస్థతో కలిసి స్వయం సహాయక బృందాలు ఈ ఏడాదికి రూ.500 కోట్ల వ్యాపార లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయని పేర్కొన్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో మంత్రి సమక్షంలో సెర్ప్‌ సీఈవో సందీప్‌కుమార్‌ సుల్తానియా, ఫ్లిప్‌కార్ట్‌ గ్రోసరీ వైస్‌ ప్రెసిడెంట్‌ స్మృతి రవిచంద్రన్‌లు మార్కెటింగ్‌ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.

 

 

Telangana State Current Affairs In Telugu June 2022_15.1

 

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  క్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

 

Sharing is caring!