Telugu govt jobs   »   Current Affairs   »   Telangana State Current affairs In Telugu...

Telangana State Current Affairs In Telugu August 2022 | తెలంగాణ రాష్ట్ర కరెంట్ అఫైర్స్ ఆగస్టు 2022 తెలుగులో 

Telangana State Current affairs In Telugu August 2022, తెలంగాణ రాష్ట్ర కరెంట్ అఫైర్స్ ఆగస్టు 2022 తెలుగులో

Telangana state current affairs plays crucial role in GROUP-1, GROUP-2, Panchayat Secretary, GROUP-4 , Assistant Engineer(AE), Sub-Inspector and Constable, Junior Lecturers etc., exams.. Telangana Government releases notification for Various posts through TSPSC like GROUP-1, GROUP-2, Panchayat Secretary, GROUP-4 , Assistant Engineer(AE), Sub-Inspector and Constable, Junior Lecturers, Degree Lecturers and various executive and non-executive posts under various departments of Telangana. Current affairs play a very important role in the competitive examinations and hence, aspirants have to give undivided attention to it while doing preparation for the government examinations.To complement your preparation, we are providing you the Telangana State Current affairs In Telugu August 2022 .

తెలంగాణ రాష్ట్ర కరెంట్ అఫైర్స్ GROUP-1, GROUP-2, పంచాయితీ సెక్రటరీ, GROUP-4, అసిస్టెంట్ ఇంజనీర్(AE), సబ్-ఇన్‌స్పెక్టర్ మరియు కానిస్టేబుల్, జూనియర్ లెక్చరర్స్ మొదలైన పరీక్షలలో కీలక పాత్ర పోషిస్తుంది.. తెలంగాణ ప్రభుత్వం వివిధ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. TSPSC ద్వారా GROUP-1, GROUP-2, పంచాయితీ సెక్రటరీ, GROUP-4, అసిస్టెంట్ ఇంజనీర్ (AE), సబ్-ఇన్‌స్పెక్టర్ మరియు కానిస్టేబుల్, జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్లు మరియు వివిధ ఎగ్జిక్యూటివ్ మరియు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు తెలంగాణలోని వివిధ విభాగాల క్రింద. కరెంట్ అఫైర్స్ పోటీ పరీక్షల్లో చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. కాబట్టి, ప్రభుత్వ పరీక్షలకు ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు అభ్యర్థులు దానిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ ప్రిపరేషన్‌ను పూర్తి చేయడానికి, మేము మీకు తెలంగాణ రాష్ట్ర కరెంట్ అఫైర్స్‌ను తెలుగులో అందిస్తున్నాము.

Telangana State Current Affairs In Telugu July 2022 |_40.1

APPSC/TSPSC Sure shot Selection Group

Telangana State Current affairs In Telugu, తెలంగాణ రాష్ట్ర కరెంట్ అఫైర్స్ తెలుగులో

1. ఒకే చోట నుంచి రాష్ట్రమంతా వీక్షణ.. పోలీస్టవర్స్ప్రత్యేకలివే

Police Tower
Police Tower

రాష్ట్రానికే తలమానికంగా దేశానికే ఆదర్శంగా నగరంలో ఏర్పాటైన తెలంగాణ స్టేట్ఇంటిగ్రేటెడ్‌ కమాండ్అండ్కంట్రోల్సెంటర్‌ (టీఎస్ఐసీసీసీ) ఆధునిక సాంకేతికతకు కేరాఫ్అడ్రస్గా మారనుంది. అత్యాధునిక సాంకేతికతను జోడిస్తూ దీన్ని నిర్మించారు నేపథ్యంలోనే వీటి కోసం నగర పోలీసు విభాగానికి చెందిన 25 మంది అధికారులను నియమించారు. ఆద్యంతం పర్యవేక్షించే బాధ్యతల్ని అదనపు సీపీ (శాంతిభద్రతలు) డీఎస్చౌహాన్కు అప్పగించారు. ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటు పదవీ విరమణ చేసిన ఐఏఎస్, ఐపీఎస్అధికారులను ఆహ్వానిస్తున్నారు.

నగర కమిషనరేట్పరిధిలోని శాంతిభద్రతలు, సీసీఎస్, టాస్క్ఫోర్స్, స్పెషల్బ్రాంచ్‌.. ఇలా అన్ని విభాగాలనూ ఒకే గొడుకు కిందికి తీసుకువస్తున్నారు. వీటిలో విభాగానికి సంబంధించిన పని కోసమైనా ప్రజలు వివిధ చోట్లకు తిరగాల్సిన అవసరం లేకుండా సింగిల్విండో విధానం అమలుకానుంది.

2. ఆసియాలోనే పెద్ద మార్కెట్

Asia-Biggest-market
Asia-Biggest-market

ఆసియాలోనే అత్యంత పెద్దదిగా కోహెడ మార్కెట్నిర్మాణం చేపడుతున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి వెల్లడించారు. అందుకోసం రూ. 400 కోట్లకు పైగా ఖర్చు చేస్తామని ఆయన తెలిపారు. మేరకు మంత్రుల నివాస సముదాయంలో  నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 178 ఎకరాల్లో కోహెడ మార్కెట్ను నిర్మించాలని నిర్ణయించామన్నారు. 41.57 ఎకరాల్లో షెడ్ల నిర్మాణం, 39.70 ఎకరాల్లో 681 కమీషన్ఏజెంట్ల దుకాణాలు, 19.71 ఎకరాల్లో కోల్డ్స్టోరేజీల నిర్మాణం, 45 ఎకరాల్లో రహదారుల నిర్మాణం, 24.44 ఎకరాల్లో పార్కింగ్సౌకర్యం ఏర్పాటు చేస్తామన్నారు. మాస్టర్లే ఔట్, ఇంజనీరింగ్డిజైన్స్ఎస్టిమేట్లకు వయాంట్స్సొల్యూషన్స్ప్రైవేట్లిమిటెడ్‌ (గుర్గావ్‌)కు టెండర్అప్పగించామన్నారు.

3. పోలీస్కమాండ్కంట్రోల్సెంటర్ను ప్రారంభించిన సీఎం కేసీఆర్

Police-command-control
Police-command-control

హైదరాబాద్నగర సిగలో మరో కలికితురాయి వచ్చి చేరింది. ఇంటిగ్రేటెడ్పోలీస్కమాండ్కంట్రోల్సెంటర్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. కార్యక్రమానికి రాష్ట్ర హోం మంత్రి మహమూద్అలీమంత్రులు, ఎమ్మెల్యేలు, పోలీస్ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇప్పటికే తన ఛాంబర్లో సీపీ సీవీ ఆనంద్దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ప్రారంభోత్సవం  సందర్భంగా కమాండ్కంట్రోల్సెంటర్ను(సీసీసీసర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. మరోవైపు సీసీసీ వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం అయిదు గంటల వరకు ట్రాఫిక్ఆంక్షలు అమల్లో ఉన్నాయి.

18వ ఫ్లోర్‌లో సీపీ ఆఫీస్

అత్యాధునిక సాంకేతికతను జోడిస్తూ, ఒకేచోటా నుంచి నగరమంతా వీక్షించేలా పోలీస్కమాండ్కంట్రోల్సెంటర్ను నిర్మించారు. దేశంలోని అన్ని శాఖలను ఇంటిగ్రేట్చేస్తూ రూ. 600 కోట్లతో 18 అంతస్తుల్లో దీన్ని నిర్మించారు. 7 ఎకరాలు, 6.42 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం జరిగింది. భవనం ఎత్తు 83.5 మీటర్లు. టవర్ లోని 18 ఫ్లోర్లో హైదరాబాద్సిటీ పోలీస్కమిషనర్కార్యాలయం ఉంది. 14, 15 ఫ్లోర్లో మ్యూజియం, గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఏడో అంతస్తులో ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా కీలక విభాగాల అధిపతులకు ఛాంబర్లు ఉంటాయి. టవర్బి మొత్తాన్ని టెక్నాలజీ వింగ్కు కేటాయించారు.

4. రామగుండంలో అతిపెద్ద ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్‌ 

Floating Solar
Floating Solar

దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్‌(నీటిపై తేలియాడే) సోలార్‌ ప్లాంట్‌ను ప్రధాని నరేంద్రమోదీ  వర్చువల్‌ విధానం ద్వారా ప్రారంభించారు. 100 మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంగా పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలోని 500 ఎకరాల్లో రూ.423 కోట్లతో ఈ ప్లాంట్‌ను నెలకొల్పారు. అనంతరం జాతికి అంకితం చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. ఈ సందర్భంగా అధికారులు రామగుండం ఎన్టీపీసీ పర్మనెంట్‌ టౌన్‌షిప్‌లోని కాకతీయ ఫంక్షన్‌హాల్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.

పెద్ద డిజిటల్‌ డిస్‌ప్లే ఏర్పాటు చేశారు. ప్రధాని ప్రారంభించిన అనంతరం ఎన్టీపీసీ సీజీఎం సునీల్‌ మాట్లాడుతూ ఈ ప్లాంట్‌ను దశలవారీగా విస్తరించనున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలో భాగంగా ఎన్టీపీసీ ఆవరణలో నిర్మిస్తున్న తెలంగాణ సూపర్‌ థర్మల్‌ ప్రాజెక్టు స్టేజీ–1లో రెండు యూనిట్ల పనులు చివరి దశలో ఉన్నాయన్నారు. సెప్టెంబర్‌ రెండోవారంలో ట్రయల్‌కు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు.

5. వైల్డ్‌లైఫ్‌ ఎవిడెన్స్‌ కలెక్షన్‌ కిట్‌ ఆవిష్కరణ

Evidance-kit
Evidance-kit

వన్యప్రాణుల సంరక్షణ, వాటి డేటాను భద్రపర్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా  అరణ్యభవన్‌లో ‘వైల్డ్‌ లైఫ్‌ కన్జర్వేషన్‌ సొసైటీ’రూపొందించిన వైల్డ్‌లైఫ్‌ ఎవిడెన్స్‌ కలెక్షన్‌ కిట్‌ను మంత్రి ఆవిష్కరించారు. కిట్‌ పని తీరు, శాంపిల్స్‌ సేకరణ, వైల్డ్‌లైఫ్‌ డీఎన్‌ఏ పరీక్షల విశ్లేషణ తదితర అంశాలను సొసైటీ ప్రతినిధులు వివరించారు.

వన్యప్రాణుల వధ జరిగినపుడు నేర పరిశోధనలో భాగంగా ఆ ప్రాంతం నుంచి ఆధారాలను సేకరించడం, అవి సహజ మరణం పొందినప్పుడు వాటి పాదముద్రలు, గోళ్లు, వెంట్రుకలు, పెంట, మాంసాహార అవశేషాలను సేకరించి వాటి డీఎన్‌ఏ పరీక్షల విశ్లేషణ కోసం పంపుతామన్నారు. విచారణ సమయంలో న్యాయస్థానాలకు ఈ పరీక్షల రిపోర్టును సమర్పిస్తే, వాటి ఆధారంగా వేటగాళ్ళకు శిక్ష పడే అవకాశం ఉంటుందని చెప్పారు.

Telangana State Current affairs In Telugu August 2022_9.1
TSPSC GS

6. జాతీయ చేనేత పురస్కారాల ప్రదానం

Telangana State Current affairs In Telugu August 2022_10.1

చేనేత కళను నమ్ముకుని కొన్ని దశాబ్దాలుగా జీవనం సాగిస్తున్న యాదాద్రి భువనగిరి జిల్లా పుట్టపాక చేనేత కళాకారులు కొలను పెద్దవెంకయ్య, ఆయన కుమారుడు రవీందర్‌లు జాతీయ హస్తకళల పురస్కారాన్ని అందుకున్నారు. దిల్లీలో జరిగిన జాతీయ చేనేత దినోత్సవంలో కేంద్ర జౌళి శాఖ మంత్రి పీయూష్‌ గోయల్, జౌళి శాఖ సహాయ మంత్రి దర్శనావిక్రమ్‌ జర్దోష్‌ల చేతుల మీదుగా స్వీకరించారు. వీరిద్దరూ కలిసి పది నెలల పాటు శ్రమించి మగ్గంపై నేసిన ‘తేలియా రుమాల్‌ డబుల్‌ ఇక్కత్‌ చీర’ను చేనేత, జౌళి మంత్రిత్వ శాఖ జాతీయ స్థాయిలో 2018 సంవత్సరానికి చేనేత కళాకారుల విభాగంలో పురస్కారానికి ఎంపిక చేసింది.

‘మార్కెటింగ్‌ విభాగం’లో పుట్టపాకకు చెందిన చేనేత వస్త్ర వ్యాపారి గజం భగవాన్‌ పీయూష్‌ గోయల్, దర్శనా జర్దోష్‌ నుంచి జాతీయ పురస్కారాన్ని స్వీకరించారు. మార్కెటింగ్‌ విభాగంలో ప్రవేశపెట్టిన పురస్కారానికి 2018 సంవత్సరానికి ఎంపికైన భగవాన్‌ ‘నీహారిక సిల్క్‌ శారీస్‌’ పేరుతో హైదరాబాద్‌లో చేనేత వస్త్రాల వ్యాపారం నిర్వహిస్తున్నారు.

7. నేతన్న బీమా ఆగస్టు 7 నుంచి ప్రారంభం

Nethanna Bheema
Nethanna Bheema

రైతు బీమా తరహాలో 60 ఏళ్లలోపు వయసున్న నేత కార్మికులకు ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు. ఈ పథకం ద్వారా తెలంగాణలో 80 వేల మంది చేనేత కార్మికులకు లబ్ధి కలుగుతుందన్నారు. చేనేత, మరమగ్గాలపై ఆధారపడిన కార్మికుల కుటుంబాలకు ఆర్థికంగా భరోసా ఇచ్చేందుకు బీమా పథకాన్ని అమలు చేయబోతున్నామని, లబ్ధిదారులు ఏదైనా కారణంతో మరణిస్తే 10 రోజుల్లో వారి కుటుంబ సభ్యుల ఖాతాలో రూ. 5 లక్షలు జమ చేస్తామన్నారు. చేనేత, జౌళి విభాగంఈ పథకం అమల్లో నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తుందని, ఈ పథకం అమలు కోసం ఎల్‌ఐసీతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నట్లు కేటీఆర్‌ వెల్లడించారు. బీమా వార్షిక ప్రీమియంను రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా చెల్లిస్తుందని, నేత కార్మికులు ఎలాంటి వాటా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఈ పథకం అమలు కోసం సుమారు రూ. 50 కోట్లు కేటాయించగా ఇప్పటికే రూ. 25 కోట్లు విడుదల చేశామన్నారు. అర్హులైన చేనేత, మరమగ్గాల కార్మికులకు ప్రయోజనం కలిగేలా ఈ పథకాన్ని సమర్థంగా అమలు చేసేందుకు జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలు ఏర్పాటు చేసినట్లు కేటీఆర్‌ చెప్పారు.

8. ఈటెండర్స్థానంలో ఆక్షన్‌ 

e-auction
e-auction

రాబడికి సంబంధించిన కాంట్రాక్టుల కేటాయింపుల కోసం దక్షిణ మధ్య రైల్వే కొత్తగా ఈ–ఆక్షన్‌ విధానాన్ని ప్రవేశ పెట్టింది. ఎన్నో ఏళ్లుగా అనుసరిస్తున్న ఈ–టెండర్ల విధానం స్థానంలో ప్రవేశపెట్టిన ఈ–ఆక్షన్‌ విధానానికి నెల రోజుల్లోనే సానుకూల స్పందన లభిస్తోంది. పూర్తి పారదర్శకతతో సత్వరం కాంట్రాక్టులు కేటాయించేందుకు వీలుగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ–టెండర్ల విధానంలో ఎవరు ఎంతకు బిడ్‌ చేస్తున్నారనే విషయం అందరికీ తెలిసే అవకాశం లేదు.

దాంతో కొన్ని అవకతవకలకు ఆస్కారం ఉండేది. ఇక బిడ్లు తెరవడం, ఖరారు మొదలైన వాటికి ఎక్కువ సమయం పట్టేది. దీనికి పరిష్కారంగా ఈ–టెండర్ల స్థానంలో ఈ–ఆక్షన్‌ విధానానికి రైల్వే బోర్డు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వేలో తొలుత సికింద్రాబాద్‌ డివిజన్‌ ఈ–ఆక్షన్‌ విధానాన్ని ప్రవేశ పెట్టింది. ఇటీవల విజయవాడ డివిజన్‌లోనూ ఈ విధానాన్ని అమలులోకి తెచ్చింది. ఇందుకోసం ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులో ఉంచింది.

9. ఎకనామిక్టైమ్స్పురస్కారానికి ఎంపికైన తెలంగాణ

సరళతర వ్యాపార నిర్వహణ (ఈవోడీబీ)లో తెలంగాణ రాష్ట్రం ఎకనామిక్‌ టైమ్స్‌ పురస్కారానికి ఎంపికైంది. ఆగస్టు 25న దిల్లీలో నీతి ఆయోగ్, కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్‌శాఖలతో పాటు ఇజ్రాయెల్, స్వీడన్‌ రాయబార కార్యాలయాలు సంయుక్తంగా నిర్వహించే ‘ది డిజీ టెక్‌ కాన్‌క్లేవ్‌- 2022’లో ఈ పురస్కారం అందజేయనున్నారు.

కేంద్ర ప్రభుత్వ శాఖలు విడుదల చేసే నివేదికలతో పాటు క్షేత్రస్థాయిలో పరిశోధన, అధ్యయనం తరువాతే తాము తెలంగాణ రాష్ట్రాన్ని ఎంపిక చేసినట్లు ఎకనామిక్‌ టైమ్స్‌ ఎడిటర్‌ టి.రాధాకృష్ణ చెప్పారు. సరళతర వ్యాపార నిర్వహణ, సంస్కరణల కోసం అమలుచేస్తున్న కార్యాచరణతో పాటు మీసేవ పోర్టల్‌తో ప్రజలకు అందిస్తున్న మెరుగైన డిజిటల్‌ సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం అందజేస్తున్నట్లు తెలిపారు.

TSPSC Group 2 & 3
TSPSC Group 2 & 3

10. తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్‌ అధ్యక్షుడిగా సంజయ్‌రెడ్డి

TS- Pharmacy- SANJAY-REDDY
TS- Pharmacy- SANJAY-REDDY

 

తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్‌ (టీఎస్‌పీసీ) అధ్యక్షుడిగా ఆకుల సంజయ్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ నుంచి ఆయన పదవీబాధ్యతలు స్వీకరించారు. ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో కౌన్సిల్‌ సభ్యులు సంజయ్‌రెడ్డిని అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.

 11. కృత్రిమ మేధస్సు, వన్యప్రాణులకు ఆయుష్షు

wild- life-protectioin
wild- life-protectioin

 

వన్యప్రాణుల సంరక్షణ, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగేసింది. టీ అటల్‌ ఇన్నొవేషన్‌ మిషన్‌ (ఎయిమ్‌) ఆధ్వర్యంలో కార్యాచరణకు పూనుకుంటోంది.  వన్యప్రాణుల అభివృద్ధి, కదలికలు, సంతతి అంశాల క్రోడీకరణకు సాంకేతికత రూపొందించడం, కృత్రిమ మేధస్సు(ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) ద్వారా వివరాలు సేకరించడానికి రాష్ట్రంలో పైలట్‌ ప్రాజెక్టు కింద మంచిర్యాల జిల్లా కవ్వాల్‌ టైగర్‌ జోన్‌లోని జన్నారం అటవీ డివిజన్‌ను ఎంపిక చేసింది.

వన్యప్రాణుల అభివృద్ధి, కదలికలు, సంతతి అంశాల క్రోడీకరణకు సాంకేతికత రూపొందించడం, కృత్రిమ మేధస్సు(ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) ద్వారా వివరాలు సేకరించడానికి రాష్ట్రంలో పైలట్‌ ప్రాజెక్టు కింద మంచిర్యాల జిల్లా కవ్వాల్‌ టైగర్‌ జోన్‌లోని జన్నారం అటవీ డివిజన్‌ను ఎంపిక చేసింది.

12. ఆహార భద్రత కార్డుదారులకూ ఆరోగ్యశ్రీ

AAROGY-SREE
AAROGY-SREE

 

ఆరోగ్యశ్రీ– ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద అందించే ఉచిత వైద్య చికిత్సలు ఆహారభద్రత కార్డుపై కూడా చెల్లుబాటయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ ఆరోగ్యశ్రీ ట్రస్టు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో తెల్లరేషన్‌ కార్డు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ పథకం కింద కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్యశ్రీ కార్డులను అందజేశారు. అయితే తెలంగాణ ఏర్పాటయ్యాక రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌ కోసం తెల్లకార్డుల స్థానంలో 10లక్షల ఆహార భద్రత కార్డులను పంపిణీ చేసింది.

వాటిని కేవలం రేషన్‌ సరుకుల కోసం మాత్రమే పరిమితం చేసింది. ఆరోగ్యశ్రీ–ఆయుష్మాన్‌ భారత్‌ కింద చికిత్సలు పొందాలంటే సంబంధిత కార్డుగానీ, లేదా తెల్ల రేషన్‌ కార్డుగానీ ఉండాలనే నిబంధన ఉంది. దీనివల్ల ఆహార భద్రత కార్డుదారులు ఆరోగ్యశ్రీ సేవలను పొందలేకపోతున్నారు. దీనిపై ప్రజల నుంచి వినతులు రావడంతో.. ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. ఆహార భద్రత కార్డుదారులకు కూడా ఇక నుంచి ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద ఉచిత సేవలు లభిస్తాయి.

13. ఆయిల్‌ ఫెడ్‌ చైర్మన్‌గా కంచర్ల రామకృష్ణారెడ్డి 

Oil-feed
Oil-feed

 

తెలంగాణ రాష్ట్ర ఆయిల్‌ ఫెడ్‌ సంస్థ చైర్మన్‌గా కంచర్ల రామకృష్ణారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మరో రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నది. తాజా ఉత్తర్వులతో ఆయిల్‌ ఫెడ్‌ సంస్థకు వరుసగా నాలుగోసారి కూడా కంచర్ల చైర్మన్‌గా నియమితుల య్యారు.

మొదట 2018లో 2020 వరకు అవకాశం ఇవ్వగా, తరువాత 2020 నుంచి 2021 వరకు, అనంతరం 2021 నుంచి 2022 జూలై వరకు చైర్మన్‌గా కొనసాగారు. ప్రస్తుత ఉత్తర్వులతో 2024 జూలై వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. నాలుగోసారి కూడా తనకే చైర్మన్‌గా అవకాశమివ్వడంతో సీఎం కేసీఆర్‌కు రామకృష్ణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

 

AP and Telangana states August Weekly Current affairs |_170.1

14. తెలంగాణలోనూ ‘ఆర్బీకే’ తరహా సేవలు

Telangana State Current affairs In Telugu August 2022_19.1
RBKs

రైతు భరోసా కేంద్రాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సేవలను పరిశీలించేందుకు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందం  ఏపీలో పర్యటించబోతోంది. తెలంగాణ వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి నేతృత్వంలోని ఈ బృందం గుంటూరు జిల్లాలోని ఆర్బీకే, ఇంటిగ్రేటెడ్‌ అగ్రి ల్యాబ్, మినుము ప్రాసెసింగ్‌ యూనిట్, అరటి వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించనుంది. మంత్రి నిరంజన్‌రెడ్డి గతంలో కూడా ఏపీలోని పలుప్రాంతాల్లో పర్యటించి ఆర్బీకేల ద్వారా గ్రామ స్థాయిలో రైతులకు అందిస్తోన్న సేవలను పరిశీలించారు.

తెలంగాణలో కూడా ఇంటిగ్రేటెడ్‌ కాల్‌ సెంటర్‌తో పాటు ఆర్బీకే చానల్‌ తరహాలో ఓ అగ్రి చానల్‌ను ప్రారంభిస్తామని నిరంజన్‌రెడ్డి అప్పట్లో ప్రకటించారు. అలాగే ఆర్బీకేల్లోని కియోస్క్‌లను తెలంగాణలోని రైతు వేదికల్లో కూడా అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. వాటిని ఏర్పాటు చేసేందుకు ప్రస్తుతం కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి నిరంజన్‌రెడ్డి గురువారం మధ్యాహ్నం 3 గంటలకు గుంటూరు జిల్లా కొల్లిపర మండలం వల్లభాపురం చేరుకొని.. అరటి వ్యవసాయక్షేత్రాన్ని సందర్శించి రైతు లతో మాట్లాడుతారు. అనంతరం తెనాలిలో  వైఎస్సార్‌ ఇంటిగ్రేటెడ్‌ అగ్రికల్చర్‌ ల్యాబ్‌ను సందర్శిస్తారు. తర్వాత అంగలకుదురులోని ఆర్బీకేను పరిశీలించి రైతులతో సమావేశమవుతారు. ఏటుకూరు సమీపంలోని బొంత పాడు రోడ్‌లో ఉన్న మినుము సీడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను  పరిశీలిస్తారు.

15. ఫిబ్రవరిలో బయో ఏషియా సదస్సు

Telangana State Current affairs In Telugu August 2022_20.1
bio asia summit

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘‘బయో ఏషియా’’ సదస్సు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్నట్లు మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రకటించారు.  2023 సంవత్సరానికి గాను ఫిబ్రవరి 24 –26వ తేదీల్లో 20వ బయో ఏషియా సదస్సు నిర్వహించనున్నారు. ‘అడ్వాన్సింగ్‌ ఫర్‌ వన్‌: షేపింగ్‌ ద నెక్స్‌ట్‌ జనరేషన్‌ ఆఫ్‌ హ్యూమనైజ్డ్‌ హెల్త్‌ కేర్‌’ ఇతివృత్తంగా సాగుతుందని మంత్రి తెలిపారు.

శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్, బయో ఏషియా సీఈఓ శక్తి నాగప్పన్‌లతో కలిసి ఆయన సదస్సు లోగోను ఆవిష్కరించారు. భవిష్యత్‌ తరాల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వాలు, విద్య, పరిశోధన, నియంత్రణ సంస్థలు కలిసికట్టుగా పని చేయాల్సిన అవసరాన్ని కోవిడ్‌ మహమ్మారి మానవాళికి తెలిపిందని, అందుకే అదే ఇతివృత్తంగా సదస్సు నిర్వహిస్తున్నట్లు కేటీఆర్‌ తెలిపారు.

16. టీఆర్‌ఈఎఫ్‌ రాష్ట్ర కన్వీనర్‌గా దామెర శ్రీనివాస్‌

TREF Convenor Damera Srinivas
TREF Convenor Damera Srinivas

తెలంగాణ రజక ఉద్యోగ సమాఖ్య రాష్ట్ర కన్వీన ర్‌గా దామెర శ్రీనివాస్‌ ఎన్నికయ్యారు.  సూర్యా పేటలో జరిగిన భేటీలో రాష్ట్ర అడ్‌హక్‌ కమిటీని ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా ఎ.పున్నయ్య వ్యవహరించారు. కో కన్వీ నర్లుగా పిల్లుట్ల శ్రీహరి, మీసాల కోటయ్య ఎన్నికయ్యారు.

17. హైదరాబాద్ లో ఎలక్ట్రిక్‌ డబుల్‌ డెక్కర్‌లు

Electric Double Decker
Electric Double Decker

భాగ్యనగర రోడ్లపై ఎలక్ట్రిక్‌ డబుల్‌ డెక్కర్‌ బస్సులను నడిపేందుకు టీఎస్‌ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. దేశంలోనే తొలిసారి ముంబైలో ఎలక్ట్రిక్‌ డబుల్‌ డెక్కర్‌లు రోడ్డెక్కిన నేప థ్యంలో వాటిని రూపొందించిన అశోక్‌ లేలాండ్‌ అను బంధ సంస్థ స్విచ్‌ మొబిలిటీతోపాటు మరో 2 కంపె నీలతో ఆర్టీసీ యాజమాన్యం చర్చలు జరుపుతోంది. ఇందులో ఓ కంపెనీతో చర్చలు దాదాపు కొలిక్కి వస్తు న్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. హైదరాబాద్‌లో 20–25 ఎలక్ట్రిక్‌ డబుల్‌ డెక్కర్‌ బస్సులు తిప్పాలని నిర్ణయించిన ఆర్టీసీ ధర విషయంలో స్పష్టత రాగానే ఆర్డర్‌ ఇవ్వనున్నట్లు సమాచారం.

హైదరాబాద్‌లో డబుల్‌ డెక్కర్‌ బస్సులను పునః­ప్రారంభించే విషయమై మంత్రి కేటీఆర్‌ చేసిన సూచ­నకు రవాణాశాఖ మంత్రి పువ్వా­డ అజయ్‌కుమార్‌ సానుకూలంగా స్పందించడంతో కొత్త డబుల్‌ డెక్కర్‌ బస్సులు కొనాలని గతేడాది నిర్ణయించారు. ఈ మేరకు టెండర్లు కూడా పిలిచారు. కానీ కొత్త బస్సులు కొనేందుకు నిధుల్లేకపోవడంతో ఆర్టీసీ చేతులెత్తేసింది.అయితే ఇది కేటీఆర్‌ ప్రతిపాదన కావడంతో పురపాలక శాఖ ఆర్థిక సాయం చేస్తుందన్న అంశం తెరపైకి వచ్చినా అది సాకారం కాలేదు.

18. అగ్రశ్రేణి కంపెనీలకు గమ్యస్థానంగా తెలంగాణ 

Telangana is a destination for top companies
Telangana is a destination for top companies

పెట్టుబడిదారులకు స్నేహపూర్వక వాతావరణం, పారదర్శకమైన ప్రభుత్వ పాలసీలతోపాటు దేశంలోనే అత్యుత్తమ వాతావరణం తెలంగాణ సొంతమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. వ్యవసాయం, పారిశ్రామిక, సేవారంగాల్లో గత ఎనిమిదేళ్లుగా నమోదైన ప్రగతితో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ భారీగా వృద్ధి చెందిందన్నారు. తెలంగాణ ప్రభుత్వ విప్లవాత్మక విధానాలు, ప్రోత్సాహకాలతో ఐటీ, లైఫ్‌ సైన్సెస్, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగాలకు చెందిన ప్రపంచంలోని అగ్రశ్రేణి కంపెనీలు తెలంగాణను గమ్యస్థానంగా ఎంచుకున్నాయన్నారు.

తెలంగాణకు భారీ పెట్టుబడులను రప్పించడం లక్ష్యంగా మంత్రి కేటీ ఆర్‌  ‘డిప్లొమాట్‌ ఔట్‌రీచ్‌ ప్రోగ్రామ్‌’ను నిర్వహించారు. టీ–హబ్‌ 2.0లో జరిగిన ఈ సమావేశానికి సుమారు 50 దేశాలకు చెందిన రాయబారు లు, ప్రతినిధులు, కాన్సుల్‌ జనరల్స్, గౌరవ కాన్సు ల్‌ జనరల్స్, హైకమిషనర్లు, ట్రేడ్‌ కమిషనర్లు హాజరయ్యారు. తెలంగాణలోని పెట్టుబడి అవకాశాలు, పెట్టుబడిదారులకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంపై కేటీఆర్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ప్రభుత్వ పారిశ్రామిక విధానాన్ని వివరించారు.

19. 12 జిల్లాల్లో సెంట్రల్‌ మెడిసిన్‌ స్టోర్లు

Central Medicine Stores
Central Medicine Stores

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుప త్రులకు వచ్చే రోగులకు అవసరమైన మందులు అన్నింటినీ ఉచితంగా ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు చాలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్‌ మందులు రాశాక రోగులకు నిర్దేశిత రోజులకు అవసరమైనన్ని మందులు కాకుండా తక్కువ రోజులకు ఇస్తున్న పరిస్థితి ఉంది.  ఈ నేపథ్యంలో రోగులకు అవసరమై నన్ని మందులను ఉచితంగానే ఇవ్వాలని ప్రభు త్వం నిర్ణయించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) మొదలు ఏరియా, సామాజిక, జిల్లా, బోధనాసుపత్రుల వరకు అన్ని చోట్లా దీన్ని అమలు చేస్తారు. వైద్యులు అక్కడుండే మందులనే రాసి రోగులు బయట కొనే పరిస్థితి లేకుండా చూడాల్సి ఉంటుంది. ఇన్‌పేషెంట్లు, ఔట్‌ పేషెంట్లు అందరికీ నిర్ణీత కోర్సు మేరకు మందులు ఇస్తారు. ప్రభుత్వం మందుల కోసం ఈ ఏడాది బడ్జెట్లో రూ. 500 కోట్లు కేటాయించింది.

20. దేశంలోనే తొలిసారిగా.. జడ్జీల కోసం రిక్రియేషన్‌ సెంటర్‌

Recreation Center
Recreation Center

న్యాయమూర్తుల కోసం గెస్ట్‌హౌస్‌లు ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఉన్నాయని కానీ, దేశంలోనే తొలిసారిగా హైకోర్టు జడ్జీల కోసం రిక్రియేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేయనుండటం ఆనందదాయకమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ పేర్కొన్నారు.

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ రోడ్‌ నెం 7లోని వికార్‌ మంజిల్‌లో హైకోర్టు న్యాయమూర్తులకు సంబంధించిన కల్చరల్‌ సెంటర్, గెస్ట్‌హౌస్‌ నిర్మాణానికి ఆగస్టు 19వ తేదీన (శుక్రవారం) ఆయన భూమి పూజ చేశారు. అనంతరం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. సుదీర్ఘకాలంగా న్యాయమూర్తుల గెస్ట్‌హౌస్‌ అంశం పెండింగ్‌లో ఉందన్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన హైకోర్టు న్యాయమూర్తులు, వారి కుటుంబసభ్యులు పలు అవసరాల కోసం వస్తే వసతి కల్పనకు ప్రభుత్వంపై ఆధారపడాల్సి వస్తోందని అన్నారు. దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చే న్యాయమూర్తులకు వసతి కల్సించేందుకు ఈ గెస్ట్‌హౌస్‌ ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. ఇప్పటివరకు సుప్రీంకోర్టులో మాత్రమే జిమ్, స్విమ్మింగ్‌ పూల్‌ వంటివి ఉన్నాయని, ఇప్పుడు హైకోర్టుల్లో ఆ తరహా వసతుల కల్పన చేయబోయేది తెలంగాణ హైకోర్టేనని చెప్పారు.

TSPSC Group 1
TSPSC Group 1

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  క్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!