Telugu govt jobs   »   Daily Quizzes   »   Telangana Movement MCQs Questions And Answers...

Telangana Movement MCQs Questions And Answers In Telugu, 30th September 2023 For TSPSC GROUP 2 & TSPSC GROUP 3

Telangana Movement MCQS Questions And Answers in Telugu: Telangana Movement is an important topic in every competitive exam. here we are giving the Telangana Movement Section which provides you with the best compilation of Telangana Movement. Telangana Movement is a major part of the exams like TSPSC Group 2 &  TSPSC Group 3.  Many aspirants for government exams have benefited from our website now it’s your turn.

This is the best site to find recent updates on Telangana Movement not only for competitive exams but also for interviews.

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే SSC, రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Adda247 Telugu
APPSC/TSPSC Sure shot Selection Group

Telangana Movement MCQs Questions And Answers in Telugu (తెలుగులో)

Q1. జి.వో 610పై హౌస్ కమిటీ కి సంబంధించి కింది ప్రకటనలో ఏది సరైంది కాదు?

  1. జూన్ 15, 2001న 6 సూత్రాల పథకం అమలు పైన 5, 6 జోన్లలో జీవో నెం. 610 అమలు పైన ఒక అఖిలపక్ష సమావేశం జరిగింది.
  2. తెలంగాణ శాసన సభ్యులు డిసెంబర్ 29, 2001న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉద్యోగ నియామకాలలో స్థానికులకు జరిగిన అన్యాయాల గురించి ప్రశ్నించారు. దీనితో శాసనసభ హౌస్ కమిటీ నియమించబడింది.
  3. ఈ కమిటీ చైర్మన్ – ఉత్తమ్ కుమార్‌ రెడ్డి

(a) 1 మరియు 3

(b) 2 మరియు 3 మాత్రమే

(c) 3 మాత్రమే

(d) 1, 2, 3

Q2. పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న గిరిజనులకు మద్దతు తెలపడానికి టి.ఆర్.ఎస్ పార్టీ పోలవరం గర్జన పేరుతో ఎక్కడ బహిరంగ సభను నిర్వహించింది. ఈ సభకు కేంద్రమంత్రి శిబుసోరెన్ హాజరయ్యారు.

(a) ఖమ్మం

(b) పాలేరు

(c) కొత్తగూడెం

(d) భద్రాచలం

Q3. తెలంగాణ ప్రాంతంలోని సంస్కృతి, కళారూపాల, జానపదులు, సాహిత్యం, తెలంగాణ ప్రాంతం మాండలికం మొదలైనవి పరిరకించడానికి తెలంగాణ జాగృతి సాంఘిక-సాంస్కృతిక సంస్థగా  2008 జూన్ లో ఏర్పడింది. దీనిని ఏర్పాటు చేసింది ఎవరు?

  1. కల్వకుంట్ల కవిత
  2. గోరటి వెంకన్న
  3. విమలక్క గూడ అంజయ్య
  4. కల్వకుంట్ల తారక రామారావు

Q4. నాన్ ముల్కీలందరిని వెనక్కుపంపి ఆ స్థానాలలో స్థానికులను నియమించాలని విశాలాంధ్ర దినపత్రికలో పేర్కొన్న నాయకులు ఎవరు?

(a) వి.డి.దేశ్ పాండ్ 

(b) రాజ్ బహద్దూర్ గౌడ్ 

(c) వి.కె.ధాగే

(d) పై వారందరూ

Q5. కింది వాటిని జతపరుచుము.

                     జాబితా –                I జాబితా – II

  1. ఇమ్రోజ్                              1. రంగూన్ వాలా
  2. గోల్కొండ పత్రిక                 2. ప్రకాశం పంతులు
  3. మిజాన్ (ఇంగ్లీషు, ఉర్దూ)    3. సురవరం ప్రతాపరెడ్డి
  4. స్వరాజ్య                              4. షోయబ్ ఉల్లా ఖాన్

(a) A – 2, B – 1, C – 4, D – 3

(b) A – 4, B – 3, C – 1, D – 2

(c) A – 3, B – 4, C – 1, D – 2

(d) A – 4, B – 3, C – 2, D – 1

Q6. 2018 మార్చి 3న తెలంగాణ మహిళా జె.ఎ.సి ధూం-ధాం కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని ఏ ఏ సంఘాలు సంయుక్తంగా నిర్వహించాయి?

  1. అరుణోదయ సాంస్కృతిక సమైక్య 
  2. పి.ఓ. డబ్ల్యూ
  3. స్త్రీ విముక్తి
  4. తెలంగాణ మహిళా జె.ఎ.సి

(a) 1, 2 మరియు 3 మాత్రమే

(b) 2, 3 మరియు 4 మాత్రమే

(c) 1, 3 మరియు 4మాత్రమే

(d) 1, 2, 3 & 4

Q7. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన ‘మిలియన్ మార్చ్’ నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన తేది?

  1. 2011 మార్చి 10
  2. 2010 మార్చి 3
  3. 2010 ఫిబ్రవరి 5
  4. పైవేవి కావు 

Q8. హైదరాబాద్ రాజధాని తో కూడిన ఎన్ని జిల్లాల తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని 2013 జూలై 30 కాంగ్రెస్ వర్కిగ్ కమిటీ (సీడబ్ల్యు సీ) ప్రకటించింది?

  1. 10 
  2. 29
  3. 15
  4. 28

Q9. మలిదశ తెలంగాణ ఉద్యమం లో రాయల తెలంగాణ అనే కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చిన నాయకులు ఎవరు?

  1. జె. సి. దివాకర్ రెడ్డి
  2. టి. జి. వెంకటేష్
  3. a మరియు b
  4. పై వేవీ కావు

Q10. ‘ ప్రజల మనిషి’ నవల రచయిత ఎవరు?

  1. పుచ్చలపల్లి సుందరయ్య
  2. దొడ్డి నర్సయ్య
  3. వట్టికోట ఆళ్వారుస్వామి
  4. పైన పెర్కునవేవి కావు

Solutions:

S1. Ans (c)

Sol: జి.వో 610పై హౌస్ కమిటీ:

  • జూన్ 15, 2001న 6 సూత్రాల పథకం అమలు పైన 5, 6 జోన్లలో జీవో నెం. 610 అమలు పైన ఒక అఖిలపక్ష సమావేశం జరిగింది.
  • తెలంగాణ శాసన సభ్యులు. డిసెంబర్ 29, 2001న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉద్యోగ నియామకాలలో స్థానికులకు జరిగిన అన్యాయాల గురించి ప్రశ్నించారు. దీనితో శాసనసభ హౌస్ కమిటీ నియమించబడింది.
  • ఈ కమిటీ చైర్మన్ – రేవూరి ప్రకాశ్ (టీడీపీ ఎమ్మెల్యే)

S2. Ans (d)

Sol: 

  • తెలంగాణ భావాజాలాన్ని వ్యాప్తి చేయాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ జాగరణ సేన అను పేరుతో లక్ష మంది కార్యకర్తలకు శిక్షణ ఇప్పించాలని నిర్ణయించింది. 
  • పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న గిరిజనులకు మద్దతు తెలపడానికి టి.ఆర్.ఎస్ పార్టీ పోలవరం గర్జన పేరుతో 2006 ఫిబ్రవరి 12న భద్రాచలంలో బహిరంగ సభను నిర్వహించింది.
  • ఈ సభకు కేంద్రమంత్రి శిబుసోరెన్ హాజరయ్యారు.

S3. Ans (a)

Sol: 

  • తెలంగాణ ప్రాంతంలోని సంస్కృతి, కళారూపాల, జానపదులు, సాహిత్యం, తెలంగాణ ప్రాంతం మాండలికం మొదలైనవి పరిరకించడానికి తెలంగాణ జాగృతి సాంఘిక-సాంస్కృతిక సంస్థగా  2008 జూన్ లో ఏర్పడింది.
  • దీనిని కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేసింది.
  • పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించడానికి తెలంగాణ జాగృతి బతుకమ్మ పండుగ ఉత్సవాలను ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది.
  • తెలంగాణ ప్రాంతంలో అన్ని జిల్లాల్లో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించి, వాటికి విశిష్ఠ ముగింపుగా హైదరాబాద్ నగరంలోని ట్యాంక్ బండ్ పై లక్షలాది మంది ప్రజలతో బతుకమ్మ పండుగ జరిగి సాంస్కృతిక కవాతు నిర్వహిస్తుంది.

S4. Ans (d)

Sol: ముల్కి ఉద్యమ అనంతరం :

  • నాన్ ముల్కీలందరిని వెనక్కుపంపి ఆ స్థానాలలో స్థానికులను నియమించాలని విశాలాంధ్ర దినపత్రికలో పేర్కొన్న నాయకులు :  వి.డి.దేశ్ పాండ్ , రాజ్ బహద్దూర్ గౌడ్ ,వి.కె.ధాగే
  • సెప్టెంబర్ 13న ప్రివెంటివ్ డిటెన్షన్ కింద అరెస్ట్ కాబడ్డ శాసన సభ్యుడు -సయ్యద్ అక్తర్ హుస్సేన్.
  • ‘సయ్యద్ అక్తర్ హుస్సేన్’ ఆవాద్ అనే ఉర్దూ పత్రిక సంపాదకుడు.
  • ఇతనితో పాటు అరెస్టు కాబడ్డ మరో పాత్రికేయురాలు – బేగం సాదిక్ జహన్.

S5. Ans(b)

Sol: 1956 కంటే ముందు తెలంగాణలో ఉన్న పత్రికలు:

  • ఇమ్రోజ్ (యజమాని : షోయబ్ ఉల్లా ఖాన్)
  • మిజాన్-తెలుగు (ఎడిటర్: అడవి బాపిరాజు), ఇంగ్లీషు, ఉర్దూ (యజమాని:రంగూన్ వాలా
  • రయ్యత్ – ఉర్దూ
  • గోల్కొండ పత్రిక (సురవరం ప్రతాపరెడ్డి), 1925.
  • కృష్ణాపత్రిక (ముట్నూరి కృష్ణారావు, రాజమండ్రి), 1930
  • స్వరాజ్య (ప్రకాశం పంతులు), మద్రాసు 1930
  • ఆంధ్రభూమి (రాజగోపాల్, నందగోపాల్) ఎడిటర్: గోరా శాస్త్రి.

S6. Ans (d)

Sol: 2010 జనవరి 31న రాష్ట్రస్థాయి మహిళల సదస్సు హైద్రాబాద్ లో జరిగింది. ఈ సమావేశానికి పెద్దమొత్తంలో మహిళలు హాజరయ్యారు. 2018 మార్చి 3న హైదరాబాద్ లోని ధర్నాచౌక్ (చిందుఎల్లమ్మ వేదిక) లో తెలంగాణ మహిళా జె.ఎ.సి ధూం-ధాం కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని అరుణోదయ సాంస్కృతిక సమైక్య, పి.ఓ. డబ్ల్యూ, స్త్రీ విముక్తి, తెలంగాణ మహిళా జె.ఎ.సి లు సంయుక్తంగా నిర్వహించాయి.

S7. Ans.(a)

Sol: మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన ‘మిలియన్ మార్చ్’ నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన తేది 2011 మార్చి10.

S8. Ans (a)

Sol: హైదరాబాద్ రాజధాని తో కూడిన పది జిల్లాల తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని 2013 జూలై 30 కాంగ్రెస్ వర్కిగ్ కమిటీ (సీడబ్ల్యు సీ) ప్రకటించింది.

S9. Ans.(c)

Sol: మలిదశ తెలంగాణ ఉద్యమం లో రాయల తెలంగాణ అనే కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చిన నాయకులు – జె. సి. దివాకర్ రెడ్డి, టి. జి. వెంకటేష్.

S10. Ans.(c)

Sol: రైతులు, కౌలుదార్ల కష్టాన్ని కబళించిన విధానం, వెట్టి చాకిరీ దయనీయ స్థితి పై వట్టికోట ఆళ్వారుస్వామి ‘ ప్రజల మనిషి’ నవలలో వివరంగా ఉంది. ఇది తెలగాణ లోని తొలి నవలగా ప్రసిద్ధి చెందింది.

SSC Complete Preparation Kit | Live Classes | Test Series | eBooks | Printed Books | By Adda247

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

where can i found daily quizzes?

You can found different quizzes at adda 247 Telugu website