Telugu govt jobs   »   Daily Quizzes   »   Telangana Movement MCQs Questions And Answers...

Telangana Movement MCQs Questions And Answers In Telugu, 18th September 2023 For TSPSC Group 2 & TSPSC Group 3

Telangana Movement MCQS Questions And Answers in Telugu: Telangana Movement is an important topic in every competitive exam. here we are giving the Telangana Movement Section which provides you with the best compilation of Telangana Movement. Telangana Movement is a major part of the exams like TSPSC Group 2 &  TSPSC Group 3.  Many aspirants for government exams have benefited from our website now it’s your turn.

This is the best site to find recent updates on Telangana Movement not only for competitive exams but also for interviews.

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే SSC, రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Adda247 Telugu
APPSC/TSPSC Sure shot Selection Group

Telangana Movement MCQs Questions And Answers in Telugu (తెలుగులో)

Q1. తెలంగాణ ప్రజా సమితిని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసారు?

  1. 1968
  2. 1969
  3. 1967
  4. 1970

Q2. ఎవరి మార్గదర్శకత్వంలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ( కేసీఆర్)తెలంగాణ రాష్ట్ర సమితిపార్టీని స్థాపించారు.?

  1. కే. అచ్చుత రెడ్డి
  2. ఘంట చక్రపాణి
  3. ఆచార్య జయశంకర్
  4. పైవన్నీ

Q3. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం విద్యార్థులందరూ కలిసి ఐక్య కార్యాచరణ సమితిగా ఏర్పడిన తేది?

  1. 1969 జనవరి 13
  2. 1968 జనవరి 13
  3. 1970 జనవరి 15
  4. పైన పెర్కునవేవి కావు

Q4. ప్రత్యేక తెలంగాణ సమస్యను పరిష్కరించడం లో భాగంగా కేంద్ర ప్రభుత్వం శ్రీ కృష్ణ కమిటీని ఏర్పాటు చేసిన తేది?

  1. 2010 ఫిబ్రవరి 3
  2. 2011 ఫిబ్రవరి 3
  3. 2010 ఫిబ్రవరి 5
  4. పైవేవి కావు

Q5. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి 2013 ఆగష్టు 6 న కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ?

  1. శ్రీ కృష్ణ కమిటీ
  2. ఆంటోని కమిటీ
  3. టిజెఏసీ కమిటీ
  4. పైవేవి కాదు 

Q6. తెలంగాణ ప్రాంతంలో ముల్కీ ఉద్యమం ప్రారంభమైన తేదీ?

  1. 1952 ఆగష్టు 5
  2. 1969 ఆగష్టు 5
  3. 1953 ఆగష్టు 10
  4. పైవేవి కాదు 

Q7. 1974 మే 3న ఆరు సూత్రాల పథకం లో భాగంగా 32వ రాజ్యాంగ సవరణ ద్వారా కొత్తగా చేర్చిన అధికరణలు ఏవి?

  1. 371 (డి)
  2. 371 (ఈ)
  3. a మరియు b
  4. పైవేవి కాదు 

Q8. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కు ఉద్దేశించిన బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపిన రోజు?

  1. జూన్ 2, 2014
  2. డిసెంబర్ 5, 2013
  3. ఫిబ్రవరి 18, 2014
  4.  డిసెంబర్ 13, 2013

Q9. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం?

  1.  2014 మార్చి 2
  2. 2014 జూలై 30
  3. 2014 ఫిబ్రవరి 18
  4. 2014 జూన్ 2

Q10. 610 జీవో ను పరిశీలించడానికి ఎన్. టి. రామారావు హయాంలో రాష్ట్ర ప్రభుత్వం ఎవరి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది?

  1. ప్రణభ్ ముఖర్జీ
  2. సుందరేశన్
  3. రామ్ విలాస్
  4. పైవేవి కాదు 

Solutions: 

S1.ANS.(B)

Sol. 1969, ఫిబ్రవరి 28న తెలంగాణ ప్రజా సమితి పార్టీ స్థాపించబడింది. అనంతుల మదన్ మోహన్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నాడు.[4] మొదటి కార్యక్రమంగా మార్చి 3 న తెలంగాణ బందును జరిపింది. 1971లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలోని 11 స్థానాలలో 10 స్థానాలను తెలంగాణ ప్రజా సమితి పార్టీ గెలుచుకుంది. 1971, సెప్టెంబరు టిపిఎస్ పార్టీ కాంగ్రెస్‌ పార్టీలో విలీనమైంది. దాంతో ప్రత్యేక తెలంగాణ ఆందోళనలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. పివి నర్సింహారావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు

S2.ANS (c)

Sol. ఆచార్య జయశంకర్ మార్గదర్శకత్వంలో తెలంగాణ సమాజానికి జరుగుతున్న అన్యాయాలను ఎదిరించడానికి 2001లో కల్వకుంట్ల చంద్రశేకర్రావు ( కేసీఆర్) తెలుగు దేశం పార్టీ నుంచి బయటకు వచ్చితెలంగాణ రాష్ట్ర సమితిపార్టీని స్థాపించారు.

S3.ANS.(A)

Sol. 1969 జనవరి 13 తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం విద్యార్థులందరూ కలిసి ఐక్య కార్యాచరణ సమితిగా ఏర్పడినారు.

S4.ANS. (A)

Sol. ప్రత్యేక తెలంగాణ సమస్యను పరిష్కరించడం లో భాగంగా కేంద్ర ప్రభుత్వం శ్రీ కృష్ణ కమిటీని 2010 ఫిబ్రవరి 3   ఏర్పాటు చేశారు. శ్రీ కృష్ణ కమిటీ తన నివేదికను కేంద్ర హోం శాఖకు సమర్పించిన తేది 2010 డిసెంబర్ 30.

S5.ANS.(B)

Sol. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి 2013 ఆగష్టు 6 న కేంద్ర ప్రభుత్వం ఆంటోని కమిటీని ఏర్పాటు చేసినది.

S6.ANS.(a)

Sol. తెలంగాణ ప్రాంతంలో 1952 ఆగష్టు 5 న ముల్కీ ఉద్యమం ప్రారంభమైనది. వరంగల్‌లో మూకుమ్మడిగా జరిగిన ఉపాధ్యాయ బదిలీలకు వ్యతిరేకంగా ప్రారంభమైన ముల్కీ ఉద్యమం హైదరాబాద్ రాష్ట్రంలోని అన్ని పట్టణాలకు వ్యాపించడం, మూడు వారాలకు పైగా విద్యార్థులు ఆందోళన చేయడం, తరగతులు బహిష్కరించి ప్రదర్శనలు నిర్వహించడం, నాన్ ముల్కీలకు వ్యతిరేకంగా ఇచ్చిన నినాదాలు, అక్కడక్కడ (వరంగల్, నల్లగొండ, జంటనగరాలు) నాన్ ముల్కీలకు విద్యార్థులకు మధ్య జరిగిన ఘర్షణలు, బెదిరింపు చర్యలు, వ్యక్తిగత దాడులు హైదరాబాద్‌లో సెప్టెంబర్ 3,4 తేదిల్లో సిటీ కాలేజీ, అప్జల్‌గంజ్ ప్రాంతాలలో ఎవరు పిలవకున్నా సుమారు 30 వేల నుంచి 40 వేల మంది ప్రజలు, విద్యార్థులు పాల్గొన్న మహోద్యమం.

S7.ANS.(c)

Sol. 1974 మే 3న ఆరు సూత్రాల పథకం లో భాగంగా 32వ రాజ్యాంగ సవరణ ద్వారా 371(డి) , 371(ఈ) అధికరణలను కొత్తగా చేర్చారు.

S8.ANS.(C)

Sol. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కు ఉద్దేశించిన బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపిన రోజు 2014 ఫిబ్రవరి 18.

S9.ANS.(d)

Sol. 2014 జూన్ 2 న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకుంటారు.

S10.ANS.(b)

Sol. 610 జీవో ను పరిశీలించడానికి ఎన్. టి. రామారావు హయాంలో రాష్ట్ర ప్రభుత్వం సుందరేశన్ అధ్యక్షతన ఒక  కమిటీని ఏర్పాటు చేసింది.

SSC Complete Preparation Kit | Live Classes | Test Series | eBooks | Printed Books | By Adda247

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

where can i found daily quizzes?

You can found different quizzes at adda 247 Telugu website