Telugu govt jobs   »   Article   »   STUDYMATE Free Sample Notes for Geography...

STUDYMATE Free Sample Notes for Geography Download PDF

APPSC గ్రూప్స్ పరీక్షలకి తయారయ్యే అభ్యర్ధులు వారి విజయవకాశాలు మెరుగుపరచుకుని నచ్చిన ఉద్యోగం సాధించాలి అనే కోరిక మదిలో ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది అది వారి చేత ఒక అలుపెరగని పయనాన్ని చేయిస్తుంది. పరీక్షా నోటిఫికేషన్ కూడా విడుదలైన దగ్గరనుంచి వారి పరీక్ష కోసం చేసే ప్రయత్నాలు మరియు అంకితభావం వారిని విజయం వైపు నడిపిస్తాయి. స్టడీ మెటీరీయల్ లేదా స్టడీ నోట్స్ అనేది పరీక్షలో మన విజయాన్ని అంచనావేస్తుంది. ఒకరు ప్రిపరేషన్ ప్రారంభించే ముందు  సబ్జెక్ట్‌లు, టాపిక్‌లు, పరీక్షా సరళి మరియు సంబంధిత పరీక్షల ఎంపిక ప్రక్రియ గురించి బాగా తెలుసుకోవడం ముఖ్యం, కాబట్టి అన్ని సబ్జెక్టులకు సమాన సమయాన్ని కేటాయించే టైమ్ టేబుల్‌ను వ్యూహ రచన చేయండి. ఒక ప్రామాణికమైన స్టడీ మెటీరీయల్ ఎప్పుడు మనకి పరీక్షా స్థాయిలో ఉంటూ క్లిష్టమైన వాటిని కూడా సులువుగా అర్ధం చేసుకునే విధంగా ఉండాలి. ఇక్కడ మీకు APPSC గ్రూప్ 2 పరీక్షలో జియోగ్రఫీ సిలబస్ కి ఉపయోగపడే STUDYMATE స్టడీ నోట్స్ ఉచితంగా అందిస్తున్నాము డౌన్లోడ్ చేసుకుని మీ ప్రిపరేషన్ ప్రణాళికలో ADDA’S STUDYMATE ని భాగస్వామ్యం చేసుకోండి.

Adda’s Study Mate APPSC Group 2 Prelims Special

APPSC గ్రూప్2 సిలబస్

APPSC గ్రూప్2 ప్రిలిమ్స్ పరీక్షలో భౌతిక శాస్త్రం 30 మార్కులకు ప్రశ్నలు ఆడగనున్నారు జియోగ్రఫీ లో ఉన్న అంశాలను పరిశీలిస్తే తద్వారా ప్రిపరేషన్ లో తగిన సమయం కేటాయించడానికి వీలుంటుంది. సిలబస్ లోని కొన్ని అంశాలపై అధిక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది అవి ఆంధ్రప్రదేశ్ నైసర్గిక స్వరూపం, సహజ వనరులు, ప్రత్యేకలు వంటివి ఉన్నాయి వీటినుంచి ప్రశ్నలు అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరియు జాతీయ స్థాయిలో కరెంట్ అఫ్ఫైర్స్ లో ఉన్న వివిధ సున్నితమైన ప్రాంతాలు జమ్ము కశ్మీర్ వంటివాటితో పాటు ప్రపంచ స్థాయిలో రష్యా ఉక్రైన్ మధ్య యుద్దం వంటి అంశాలలో ఉన్న భూభాగం వంటి అంశాలపై కూడా పట్టు సాధించాలి. ఇక్కడ తెలిపిన గ్రూప్ 2 సిలబస్ ని పరిశీలించి తద్వారా మీరు ఎక్కువ సమయం కేటాయించాల్సిన అంశాలకు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. APPSC గ్రూప్2 సిలబస్ లోని అంశాలు:

సాధారణ మరియు భౌతిక భౌగోళిక శాస్త్రం: మన సౌర వ్యవస్థలో భూమి – భూమి లోపలి భాగం – ప్రధాన భూభాగం మరియు వాటి లక్షణాలు – వాతావరణం: వాతావరణం యొక్క నిర్మాణం మరియు కూర్పు – సముద్రపు నీరు: అలలు, అలలు, ప్రవాహాలు – భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్: ప్రధాన భౌతిక లక్షణాలు, వాతావరణం , డ్రైనేజీ వ్యవస్థ, నేలలు మరియు వృక్షసంపద – సహజ ప్రమాదాలు మరియు విపత్తులు మరియు వాటి నిర్వహణ.

భారతదేశం మరియు AP ఆర్థిక భౌగోళిక శాస్త్రం: సహజ వనరులు మరియు వాటి పంపిణీ – వ్యవసాయం మరియు వ్యవసాయ ఆధారిత కార్యకలాపాలు – ప్రధాన పరిశ్రమలు మరియు ప్రధాన పారిశ్రామిక ప్రాంతాల పంపిణీ. రవాణా, కమ్యూనికేషన్, పర్యాటకం మరియు వాణిజ్యం.

భారతదేశం మరియు AP యొక్క మానవ భౌగోళిక శాస్త్రం: మానవ అభివృద్ధి – జనాభా – పట్టణీకరణ మరియు వలసలు – జాతి, గిరిజన, మత మరియు భాషా సమూహాలు.

బట్టీపట్టడం కంటే, ఆర్థిక భావనలపై లోతైన అవగాహనను ఏర్పరచుకోవడం ముఖ్యం. ఈ విధానం మీకు పరీక్ష ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి సహాయపడటమే కాకుండా సబ్జెక్టుపై సమగ్ర అవగాహనను అందిస్తుంది. సంక్లిష్టమైన అంశాలను సులభంగా అర్ధం చేసుకునేందుకు ప్రయత్నం చేయండి, అవసరమైన వివరణ తెలుసుకోండి మరియు మెరుగైన నిలుపుదల కోసం భావనలను నిజ జీవిత సంఘటనలకి పోల్చుకుని గుర్తుపెట్టుకోండి.

APPSC Group 2 Free History Notes PDF Download (Adda247 Studymate Notes)

APPSC గ్రూప్2 ఫ్రీ నోట్స్ డౌన్లోడ్ PDF

APPSC గ్రూప్2 ఫ్రీ నోట్స్ వలన STUDYMATE లో పేర్కొన్న అంశాలతో పాటు వాటి వివరణాత్మక విధానం మరియు నోట్స్ యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది. STUDYMATEని మీ ప్రిపరేషన్ ప్రణాళిక లో పొందుపరచుకోవడం వలన మీరు ప్రతి అంశాన్ని కూలంకషంగా అర్ధం చేసుకోగలరు. అడ్డా యొక్క స్టడీమేట్ నోట్స్ భౌగోళిక శాస్త్రంలో అన్నీ అంశాలను కవర్ చేస్తాయి, వీటిలో:

  • భౌతిక భౌగోళిక శాస్త్రం: ఆంధ్రప్రదేశ్ యొక్క నైసర్గిక స్వరూపాలు, వాతావరణం మరియు సహజ వనరుల గురించి సమగ్ర సమాచారం.
  • ఆర్థిక భౌగోళిక శాస్త్రం: రాష్ట్ర భౌగోళిక శాస్త్రం యొక్క వ్యవసాయ, పారిశ్రామిక మరియు వాణిజ్య అంశాలను గురించి పూర్తి సమాచారం.
  • సామాజిక భౌగోళిక శాస్త్రం: ఆంధ్రప్రదేశ్‌లోని జనాభా, జనాభా పంపిణీ మరియు సాంస్కృతిక వైవిధ్యం వంటి ముఖ్య అంశాలు ఉన్నాయి.

ప్రతీ అంశము కూడా నిర్మాణాత్మకంగా మరియు వ్యవస్థీకృత పద్ధతిలో అందిస్తుంది. అంశంలో ఉన్న వివిధ విభాగగలు కూడా పొందుపరిచాము, మీకు ఆసక్తి ఉన్న నిర్దిష్ట విభాగం పై పట్టు సాధించడం మరియు అధ్యయనం చేయడం సులభం అవుతుంది. ఈ ఫార్మాట్ సమర్థవంతమైన రివిజన్ మరియు లక్ష్య అభ్యాసంలో సహాయపడుతుంది.

ఇక్కడ మీకోసం స్టూడిమాటే నోట్స్ లో సోలార్ సిస్టమ్ గురించిన పూర్తి సమాచారం అందిస్తున్నాము. ADDA అందించే ఈ STUDYNOTES ని డౌన్లోడ్ చేసుకుని అందులోని అంశాలతో మీ ప్రిపరేషన్ ని మరింతగా ముందుకు తీసుకుని వెళ్ళండి.

STUDYMATE NOTES: The Earth in our Solar System

 

APPSC గ్రూప్2 స్టడీ మెట్ ఫ్రీ నోట్స్ ఎలా ఉపయోగపడుతుంది

APPSC గ్రూప్2 పరీక్షకి అడ్డా అందించే స్టడీ మెట్ ఫ్రీ నోట్స్ యొక్క ఉపయోగాలు తెలుసుకుని మీ ప్రిపరేషన్ లో STUDYMATE నోట్స్ ని ఉంచుకోండి.

స్పష్టత మరియు సంక్షిప్తత
అడ్డా యొక్క స్టడీమేట్ నోట్స్ వాటి స్పష్టత మరియు సంక్షిప్తతకు అధిక ప్రాధాన్యం ఇస్తాయి ఎందుకంటే ఇవి మా నిపుణులైన అధ్యపకులచే రూపొందించబడినవి, మీరు ఇతర పాఠ్య పుస్తకాల కోసం వెచ్చించే సమయం తగ్గుతుంది. సంక్లిష్టమైన భౌగోళిక భావనలు సరళమైన మరియు అర్ధమయ్యే భాషలో వివరించబడ్డాయి, మీరు కంటెంట్‌ను అప్రయత్నంగా గ్రహించగలరని నిర్ధారిస్తుంది. మీ ప్రాదేశిక అవగాహన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది

యాక్సెసిబిలిటీ
ఈ నోట్ల యొక్క అతిపెద్ద ప్రయోజనాల్లో ఒకటి వాటి ప్రాప్యత. మీరు వాటిని ఆన్‌లైన్‌లో, ఎప్పుడైనా మరియు ఎక్కడి నుండైనా యాక్సెస్ చేయవచ్చు. బిజీ షెడ్యూల్‌లు ఉన్న అభ్యర్థులకు లేదా వారి స్వంతంగా చదువుకోవడానికి ఇష్టపడే వారికి ఈ సౌలభ్యత అమూల్యమైనది. మరియు ఇది వారి ప్రిపరేషన్ను వేగవంతం చేసి పరీక్షలో విజయానికి దగ్గర చేస్తుంది.

ప్రిపరేషన్ ను సంపూర్ణం చేసుకోండి

ADDA STUDYMATE యొక్క స్టడీ నోట్స్ సమాచారం అభ్యర్ధులకు ఒక నిధి అయితే, దానిని మీ పరీక్షకి సన్నద్దమవ్వడానికి ఎలా ప్యూహ్యంగా మలచుకోవాలి అనేది మీ ప్రణాళిక పై ఆధార పడి ఉంటుంది. మీ ప్రిపరేషన్ కి ఇతర పాఠ్యపుస్తకాలు, రిఫరెన్స్ మెటీరియల్‌లు కు కేటాయించే సమయం ప్రాక్టీస్ పేపర్‌లపై కేటాయించి విజయం సాధించడానికి వీలవుతుంది.

తాజా సమాచారం
భౌగోళిక సమాచారం కాలక్రమేణా మారవచ్చు మరియు తాజా పరిస్థితులపై అవగాహన తప్పనిసరిగా ఉండాలి ఉదా ఆర్టికల్ 370, రష్యా-ఉక్రైన్ యుద్దం హమాస్ యుద్దం వంటి యుద్ధ సంఘటనలు వివిధ దేశాల స్థితిగతులు అంశాలు ఎంతో ప్రాధాన్యతనిస్తాయి. Adda’s STUDYMATE ఎప్పటికప్పుడు తాజా పరిణామాలు మరియు గణాంకాలను అందిస్తుంది దాని నోట్స్‌లో తాజా సమాచారం మీకు అందుబాటులో ఉంటుంది.

చిత్రాలు మరియు వివరణలు

అభ్యర్ధులకు ముఖ్యమైన అంశాలను అవసరమైన చిత్రాలు మరియు వాటి వివరణతో సులువుగా అర్ధం చేసుకునేందుకు వీలుగా పాఠ్యాంశాలు అందిస్తుంది. క్లిష్టమైన అంశాలు చిత్రాల సహాయంతో చదవడం వలన తొందరగా మరియు ఎక్కువ కాలం పాటు అంశాలు గుర్తు ఉంచుకునేందుకు సహాయ పడుతుంది. పాత మూసపద్దతిలో కాకుండా అంశాలను నూతన విధానం లో చదివితే సమయంతో పాటు శ్రమ కూడా ఆదా అవుతుంది తద్వారా క్లిష్టమైన అంశాల పై కేటాయించేందుకు అధిక సమయం దొరుకుతుంది.

 

Adda’s Study Mate APPSC Group 2 Prelims 2024 by Adda247 Telugu

APPSC గ్రూప్ 2 కి సంబంధించిన ఆర్టికల్స్
APPSC గ్రూప్ 2 నోటిఫికేషన్ 2023 APPSC గ్రూప్ 2 జీతం
APPSC గ్రూప్ 2 మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలు APPSC గ్రూప్ 2 సిలబస్
APPSC గ్రూప్ 2 పరీక్షా సరళి APPSC గ్రూప్ 2 అర్హత ప్రమాణాలు
APPSC గ్రూప్ 2 ఉద్యోగ వివరాలు APPSC గ్రూప్ 2 మునుపటి సంవత్సరం కట్ ఆఫ్
APPSC గ్రూప్ 2 పరీక్ష పుస్తకాల జాబితా (కొత్త సిలబస్) APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ కోసం చరిత్రను ఎలా ప్రిపేర్ అవ్వాలి?
APPSC గ్రూప్ 2 పరీక్ష తేదీ APPSC గ్రూప్ 2 ఖాళీలు 2023

Sharing is caring!