Table of Contents
Andhra Pradesh Geography -Soil types of Andhra Pradesh (ఆంధ్ర ప్రదేశ్ భూగోళశాస్త్రం) : స్టడీ మెటీరియల్ PDF ఆంధ్ర ప్రదేశ్ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు APPSC గ్రూప్-1,2,3 ,4 , పోలీస్ , రెవెన్యూ మొదలైన పరీక్షలకు చాలా మంది ఆశావహులు, ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర, భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఈ APPSC గ్రూప్-1,2,3 ,4 , పోలీస్ , రెవెన్యూ మొదలైన పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థుల కొరకు Adda247 Telugu, ఈ అంశాలలో ఒకటైన Andhra Pradesh Geography (ఆంధ్ర ప్రదేశ్ భూగోళశాస్త్రం) కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలను PDF రూపంలో అందిస్తుంది.
Andhra Pradesh Geography PDF In Telugu (ఆంధ్ర ప్రదేశ్ భూగోళశాస్త్రం PDF తెలుగులో)
APPSC గ్రూప్స్, పోలీస్ ,రెవెన్యూ , వంటి అన్ని పరీక్షలలో అడిగే ప్రశ్నల సరళిని అనుసరించి అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా సమగ్రమైన సిలబస్ తో కూడిన సమాచారం ఈ క్రింద ఇవ్వడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ నేలలు – స్వభావం
ఆంధ్రప్రదేశ్‌లో నేలలను 5 రకాలుగా వర్గీకరించవచ్చు. అవి
1) ఎర్ర నేలలు
2) నల్లరేగడి నేలలు
3. ఒండ్రుమట్టి నేలలు
4) లాటరైట్ నేలలు
5) తీరప్రాంత ఇసుక నేలలు
1) ఎర్ర నేలలు
రాష్ట్రంలో ఎక్కువగా విస్తరించి ఉన్న నేలలు.
- ఇవి చిత్తూరు, ప్రకాశం, అనంతపురం, నెల్లూరు, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఎక్కువగా;తూర్పుగోదావరి, కడప, కర్నూలు, శ్రీకాకుళం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అతి తక్కువగా విస్తరించి ఉన్నాయి.
- ఇవి గ్రానైట్ రాళ్ల నుంచి రూపాంతరం చెంది ఎర్ర నేలలుగా ఏర్పడ్డాయి.
- ఇవి తేలికైన నేలలు. తక్కువ బంకమన్నుతో ఉండి నీటిని గ్రహించే శక్తికి కలిగి ఉంటాయి.
- నీటిలో కరిగే లవణాలు 0.26% మించవు. వృక్ష జంతు సంబంధిత పదార్థాలు లోపించి ఉంటాయి (హ్యూమస్).
- వేరుశనగ, ఉలవలు లాంటి మెట్ట పైర్లకు ప్రసిద్ది.
- తరచుగా వర్షాలు, నీటి వనరులు ఉన్నవచోట్ల పత్తి, పొగాకు, వివిధ ఫల జాతులకు కూడా ఈ నేలలు అనువైనవి. ఎర్ర నేలల్లో జొన్న సజ్జ, వరి, చెరకు కూడా పండుతాయి.
2) నల్లరేగడి నేలలు
ఇవి కర్నూలు, కడప, అనంతపురం, గుంటూరు జిల్లాల్లో ఎక్కువగా; తూర్పుగోదావరి, కృష్ణా, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో అతి తక్కువగా ఉన్నాయి.
- ఇనుప ఆక్సైడ్స్ నేలలో కరిగి ఉండటం వల్ల ఈ నేలలు నల్లగా ఉంటాయి.
- ఈ నేలల్లో పత్తి ఎక్కువగా పండటంతో వీటిని పత్తి నేలలు అని కూడా పిలుస్తారు.
- వేసవిలో పెద్ద నెర్రలు పడి గట్టిగా ఉండే ఈ నేలలు వర్షం పడగానే మెత్తగా జిగటగా మారతాయి. దీనివల్ల దున్నడం కష్టమవుతుంది. అందుకే వీటిని తమను తామే దున్నుకునే నేలలు (Self Ploughing) అని అంటారు.
ఈ నేలల్లో ముఖ్యంగా పండే పంటలు: పత్తి, పొగాకు, మిరప, చెరకు, పసుపు, జొన్న, సజ్జ.
౩) ఒండ్రు నేలలు
ఈ నేలలు ముఖ్యంగా నదీ పరివాహక ప్రాంతంలో ఉంటాయి. నదులు తీసుకువచ్చిన ఒండ్రు మట్టి నిక్షేపితమవడం వల్ల ఈ ఒండ్రు నేలలు ఎర్పడ్డాయి.
- ఈ నేలలు ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లోనూ; కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఎక్కువగా విస్తరించి ఉన్నాయి
- ఒండ్రు నేలల్లో పొటాషియం, సున్నపురాయి, భాస్వరం అధికంగా; నత్రజని, హ్యామస్‌లు స్వల్పంగా ఉంటాయి. కాబట్టి నత్రజని ఎరువులను ఎక్కువ మోతాదులో వాడాల్సి వస్తుంది.
- ఈ నేలల్లో వరి, చెరకు, పత్తి, పొగాకు, మొక్కజొన్న, పసుపు, అల్లం, మిరప, మామిడి, కొబ్బరి, సపోటా లాంటి అన్నిరకాల పంటలు పండుతాయి.
Also check: RRB NTPC ఫలితాలు మరియు పరీక్ష తేదీలు విడుదల
4) లాటరైట్ నేలలు
సాధారణంగా కొండలకు ఇరువైపులా అత్యధిక వర్షం ఉన్నచోట వర్షం లెని పర్వతాల వెనుక భాగాల్లో ఈ నేలలు ఏర్పడ్డాయి.
- అధిక వర్షపాతం, ఉష్ణోగ్రత ఉన్న ఆర్ద్ర , అనార్ద్ర శీతోష్ణస్టితిలో, అధికంగా సున్నం, సిలికా లాంటి మూలకాలు విక్షలాన చెందడం వల్ల ఈ నేలలు ఏర్పడతాయి.
- ఉభయ గోదావరి; కృష్ణా జిల్లాల్లో మాత్రమే ఈ నేలలు ఉన్నాయి.
- ఈ నేలల్లో రబ్బరు, కొబ్బరి, మామిడి, జీడిమామిడిలాంటి తోట పంటలు పండుతాయి.
- లాటరైట్ నేలలకు మరొక పేరు జేగురు నేలలు
- ఈ నేలలు ఎరుపు, గోధుమ రంగులో ఉంటాయి.
- లాటరైట్ నేలల్లో నత్రజని అధికంగా కారాలు తక్కువగా ఉంటాయి.
- ఈ మట్టిని భవనాల పెంకులు, ఇటుకల తయారీకి ఉపయోగిస్తారు.
5) తీర ప్రాంత ఇసుక నేలలు
శ్రీకాకుళం, విశాఖ, నెల్లూరు, గుంటూరు, కృష్ణా, విజయనగరం జిల్లాల్లో ఎక్కువగా; చిత్తూరు జిల్లాలో అతి తక్కువగా ఉన్నాయి.
- ఈ నేలల్లో కొబ్బరి, రాగులు, సజ్జలు, మామిడి, జీడిమామిడి లాంటి పంటలు పండుతాయి.
- మృత్తికా క్రమక్షయం (Soil Erosion): మృత్తికల సారవంతమైన పైపొర గాలులు, వర్షాల వల్ల కొట్టుకుపోవడాన్ని మృత్తికాక్రమక్షయం అంటారు.
- మృత్తికా క్రమక్షయం వల్ల భూసారం తగ్గడం, నీటిపారుదల కాలువలు, నదీమార్గాలు
పూడుకుపోవడం; వరదలు వచ్చి పంటలు, ఆస్తి నష్టం లాంటివి సంభవిస్తాయి.
క్రమక్షయ నివారణ పద్దతులు:
- Contour Bunding (వాలు కట్టలు) నిర్మించాలి.
- సోపాన వ్యవసాయం చేయడం వల్ల క్రమక్షయాన్ని నివారించవచ్చు.
- కొండ వాలుల వద్ద మొక్కలు పెంచడం
- గడ్డిని పెంచడం
- చెట్లను నాటి అడవులను అభివృద్ధి చేయడం వల్ల క్రమక్షయాన్ని నివారించవచ్చు.
Download AP-Geography (ఆంధ్రప్రదేశ్ నేలలు – స్వభావం) PDF
Download Now:
ఆంధ్రప్రదేశ్-భూగోళ శాస్త్రం PDF తెలుగులో- Download
తెలంగాణా చరిత్ర PDF తెలుగులో–Download
*******************************************************************************************