Telugu govt jobs   »   AP SI మెయిన్స్ 2023 పరీక్ష కి...   »   AP SI మెయిన్స్ 2023 పరీక్ష కి...

AP SI మెయిన్స్ 2023 పరీక్ష కి ఎలా సన్నద్ధమవ్వాలి

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో SI ప్రిలిమినరీ పరీక్ష పూర్తయింది కావున మెయిన్స్ పరీక్షకి ప్రణాళికా బద్దంగా ప్రిపేర్ అయితే ఉద్యోగం సాధించడం పెద్ద కష్టం కాదు. కానీ చాలా మంది విధ్యార్ధులు వారి ప్రిపరేషన్ ను తొందరగా పూర్తి చేసుకోవాలి అనే కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు. AP SI మెయిన్స్ కి ప్రిపరే అయ్యే విధ్యార్ధులకి ఈ కధనం లో ఎలా ప్రిపరే అయితే మంచి మార్కులు సాధించగలరో, ప్రిపరేషన్ లో ఏ తప్పులు చేసే అవకాశం ఉందో తెలియజేస్తాము. AP SI 2023 మెయిన్స్ పరీక్ష కి సన్నద్దమయ్యే విధ్యార్ధులు అందరూ తప్పక ఈ కధనాన్ని చదవండి.

పోటీ పరీక్షలు మన దేహదారుఢ్యం తో పాటు మన ఆలోచన, స్వాతంత్ర్య నిర్ణయం, సరైన మరియు వేగవంతమైన పరిష్కారాలను కనుక్కోవడం పరీక్షిస్తాయి. దానిని అందుకునేందుకు తగినట్టుగా మన ప్రణాళికా సిద్దం చేసుకుంటే AP SI MAINS 2023 పరీక్ష లో విజయం సాధించగలరు.

Reasoning MCQs Questions And Answers in Telugu 12 September 2022 |_70.1APPSC/TSPSC Sure shot Selection Group

ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి కాబట్టి అందరూ AP SI మెయిన్స్ 2023 కి సన్నద్దమవుతారు కొన్ని మెళకువలు మరియు ప్రణాళికను సరిగ్గా పాటిస్తే ఉద్యోగం మీ సొంతం అవుతుంది.

 

1. సిలబస్ ని అవగాహన చేసుకోవడం:

మెయిన్స్ పరీక్ష కి ప్రిలిమినరీ పరీక్ష కి సిలబస్ మరియు పరీక్షా సమయాలలో కొంత వ్యత్యాసం ఉంటుంది కావున ప్రిలిమినరీ పరీక్షకి సన్నద్దమైనట్టు అవుదాము అని అనుకుంటే పొరపాటే. మీరు అధికారిక వెబ్‌సైట్‌లో లేదా adda247. te లో అందించిన అధికారిక సిలబస్ మరియు పరీక్షా సరళిని పూర్తిగా సమీక్షించిన తర్వాత మీ ప్రణాళికను ప్రారంభించండి ఇది మీ సమయాన్ని ఆదా చేస్తుంది. ప్రణాళికలో అంశాలను రెండు వర్గాలుగా విభజించుకోండి: ప్రధాన అంశాలు మరియు వెనుకబడిన అంశాలు. ప్రధాన అంశాలలో మునుపటి ప్రశ్న పత్రాలు లేదా వెయిటేజ్ ఉన్న అంశాలను పొందుపరచుకోండి వీటిపై దృష్టి కేంద్రీకరించండి. నిర్దిష్ట సమయ వ్యవధిలో సిలబస్‌ను పూర్తి చేయడానికి స్పష్టమైన లక్ష్యాలను పెట్టుకోండి. మీ పురోగతిని ట్రాక్ చేయడానికి రెగ్యులర్గా స్వీయపరిశీలన చేసుకోండి. ఇక వెనుకబడిన విభాగం లో మీరు వెనుకబడిన అంశాలను లేదా సబ్జెక్టులను పొందుపరచి వాటిని మీ ప్రిపరేషన్ లో ఎక్కువ సమయం కేటాయించేలా చూసుకోండి.

2. నిపుణుల సలహా తీసుకోండి:

ఆన్‌లైన్ వనరులు, కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు లేదా పరిజ్ఞానం ఉన్న నిపుణులతో చర్చల ద్వారా విషయాన్ని అవగాహన చేసుకోండి. మంచి మార్గదర్శకత్వం పొందడానికి ఒక మెంటర్ లేదా ఆన్లైన్ క్లాస్/ ఒక మంచి గ్రూప్ లో చేరండి. ఇంటర్నెట్‌ను ఉపయోగించుకుని మంచి వనరులు లేదా చర్చా వేదికల్లో చేరండి.  మీ సందేహాలను నివృత్తి చేసుకోడానికి, విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోడానికి మరియు ఆలోచనలను మార్పిడి చేసుకోవడానికి బాగా ఉపయోగపడతాయి.

AP పోలీస్ SI సిలబస్ మరియు పరీక్షా సరళి 2023, డౌన్‌లోడ్ PDF

3. రెగ్యులర్ ప్రాక్టీస్ మరియు రివిజన్:

మీ రోజువారీ అధ్యయన షెడ్యూల్ తర్వాత, రివిజన్ కోసం సమయాన్ని కేటాయించండి. రివైజ్ చేస్తున్నప్పుడు, త్వరిత రివిజన్ కోసం కీలక పాయింట్లు మరియు అంశాలను హైలైట్ చేసుకోండి. రెగ్యులర్ ప్రాక్టీస్ చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఇది అంశాలపై మీ అవగాహనను బలోపేతం చేస్తుంది. కనీసం వారంతర లేదా నెలకి ఒకసారి రెవిజన్ అయ్యేలా ప్రణాళికా చేసుకోండి. లేదా రోజువారీ అభ్యాసం లో రివిజన్ కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించండి ముందు రోజు చదివిన అంశాలను ఆఅ తర్వాత రోజు ఉదయాన్నే లేద ఏ రోజు చదివిన అంశాలను ఆ రోజు రాత్రి అభ్యసించేలా ప్రణాళికా చేసుకోండి.

4. మాక్ టెస్ట్‌లు మరియు ప్రాక్టీస్ పేపర్లు:

కొన్ని సరళి మనం ఎంత బాగా చదివినా పరీక్ష సమయం లో ఏదో తెలియని భయం ఉంటుంది లేదా చదివినవి సరైన సమయానికి గుర్తు రాకపోవచ్చు వీటిని అధిగమించేందుకు పరీక్షా శైలి లో ఉండే మాక్ టెస్ట్లు లేదా ప్రాక్టీస్ పాపర్లు చేయండి. పరీక్షా సరళిపై మాత్రమే కాకుండా మునుపటి సంవత్సరాల ప్రశ్న పత్రాలు మరియు మాక్ టెస్ట్‌లను తరచూ ప్రాక్టీస్ చేయండి. ఈ చర్య వలన విధానం మీరు పరీక్ష ఆకృతి మరియు సమయ పరిమితులకు అలవాటు పడటానికి సహాయపడుతుంది, చివరికి మీ పరీక్ష పనితీరును మెరుగుపరుస్తుంది.

5. సమయ నిర్వహణ

పోటీ పరీక్షలకి ప్రిపరే అయ్యేవారికి ముఖ్యంగా సమయ నిర్వహణ చాలా అవసరం. ఏ పోటీ పరీక్ష చూసిన విజేతల రహస్యం వారి ప్రిపరేషన్ ను ఎలా సమయానుకూలం చేసుకున్నారు అనేది అంతర్లీనంగా కనిపిస్తుంది. కావున మీరు కూడా ఉదయాన్నే నిద్ర లేవడం దగ్గర్నుంచి అన్నీ పనులలో సమయాన్ని వృధాగా పోనీకుండా చూసుకుని దానిని సరైన చోట వినియోగిస్తే విజయం సాధించవచ్చు. మాక్ టెస్ట్లు చేయడం, టైమ్ పెట్టుకుని సిలబస్ పూర్తి చేయడం, సమయం కేటాయించి రివిజన్ చేయడం ముఖ్యం.

6. మోటివేషన్

ప్రిపరేషన్ సమయం లో అందరూ తరచుగా చెప్పే మాట మోటివేషన్. మోటివేషన్ లేదు, చదవాలి అని అనిపించడం లేదు, ఇంటరెస్ట్ రావడం లేదు, మొదలైనవి అన్నీ మనకు సరైన మోటివేషన్ లేక లేదా మనం వెళ్ళే దారిలో మనల్ని ప్రోత్సహించేది ఏమి లేనప్పుడు కలిగే భావనలు. మీ స్నేహితులతో, మీ మెంటార్ తో, కుటుంభ సభ్యులతో లేదా మీరు ఇష్ట పడే వారితో ఎవరితో నైనా సరే మాట్లాడండి వారినుండి  కొంత ప్రేరణ లేదా మోటివేషన్ను పొందండి. సినిమాలు చూడటం, ఆటలు ఆడటం, నచ్చిన పని చేయడం వంటివి కూడా మీకు ప్రేరణని ఇస్తాయి. ఎప్పటి కప్పుడు మీ ప్రిపరేషన్ ముందుకి సాగాలి అంటే మిమ్మల్ని వెన్ను తట్టి ప్రోత్సహించే వ్యక్తుల మధ్య ఉండండి వారితో సమయం గడపండి. యోగా, మెడిటేషన్ లేదా ఎక్సర్సైస్ లు చేయండి.

అదనపు తయారీ చిట్కాలు:

  • శారీరక దృఢత్వంపై దృష్టి పెట్టండి: క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా మీ శారీరక దృఢత్వాన్ని కాపాడుకోండి. దేహ దారుఢ్యం ముఖ్యం, ముఖ్యంగా పరీక్షలో శారీరక పరీక్షలకు కూడా ఇది ఉపయోగ పడుతుంది.
  • స్థిరత్వం కీలకం: మీ రోజువారీ అధ్యయనానికి కట్టుబడి ఉండండి మరియు అనవసరమైన పరధ్యానాలను నివారించండి. మీ ప్రిపరేషన్‌లో క్రమశిక్షణతో కూడిన విధానాన్ని అలవాటు చేసుకోండి.
  • సమాచారంతో అప్డేట్ గా ఉండండి: సాధారణ కరెంట్ అఫైర్స్‌తో పాటు, AP పోలీస్ SI పరీక్షకు సంబంధించిన ఏదైనా నిర్దిష్ట అప్‌డేట్‌లు లేదా మార్పుల గురించి తెలుసుకోండి.
  • స్వీయ-అంచనా: మీ సంసిద్ధత స్థాయిని అంచనా వేయడానికి ప్రాక్టీస్ పరీక్షలు మరియు క్విజ్‌లను క్రమం తప్పకుండా ప్రయత్నించండి. ఇది మరింత శ్రద్ధ అవసరమయ్యే ప్రాంతాలను గుర్తించడంలో మీకు సహాయపడుతుంది.
  • ఒత్తిడి నిర్వహణ: మీ ప్రిపరేషన్ సమయంలో ప్రశాంతంగా మరియు ఏకాగ్రతతో ఉండటానికి ఒత్తిడి-ఉపశమన పద్ధతులను అమలు చేయండి. సాధించగల లక్ష్యాలను నిర్దేశించడం మరియు మీ పురోగతిని ట్రాక్ చేయడం కూడా ఒత్తిడిని తగ్గించగలదు.
  • మీ ప్రణాళికను తయారుచేసుకొండి: మీ బలాలు మరియు బలహీనతలకు అనుగుణంగా మీ తయారీ వ్యూహాన్ని రూపొందించండి. మీకు అభివృద్ధి అవసరమైన ప్రాంతాలను పరిష్కరించడానికి మీ అధ్యయన ప్రణాళికను అవసరమైన విధంగా మార్పులు చేసుకోండి.
  • కటాఫ్ మార్కులు: గత సంవత్సర కటాఫ్ మార్కుల గురించి తెలుసుకోండి తద్వారా ప్రస్తుత మీ ప్రిపరేషన్ ను మెరుగుపరచుకోండి,

ఈ సమగ్రమైన ప్రిపరేషన్ స్ట్రాటజీలను కలుపుకోవడం, దృష్టి మరియు క్రమశిక్షణతో కూడిన విధానంతో పాటు, AP పోలీస్ SI పరీక్షకు మీ సంసిద్ధతను బాగా పెంచుతుంది. విజయానికి స్థిరమైన ప్రయత్నం మరియు సానుకూల మనస్తత్వం అవసరమని గుర్తుంచుకోండి.

AP and Telangana Test Mate | Unlock Unlimited Tests for APPSC | TSPSC | GROUPs | AP & Telangana Police & Others 2023-2024 | Complete Online Test Series By Adda247

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు  క్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!