Telugu govt jobs   »   PM Modi Participates in Virtual India-EU...

PM Modi Participates in Virtual India-EU Leaders’ Meeting | ఇండియా – EU నాయకుల మధ్య జరిగిన వర్చువల్ సమావేశంలో పాల్గొన్న ప్రధాని మోదీ

ఇండియా – EU నాయకుల మధ్య జరిగిన వర్చువల్ సమావేశంలో పాల్గొన్న ప్రధాని మోదీ

PM Modi Participates in Virtual India-EU Leaders' Meeting | ఇండియా – EU నాయకుల మధ్య జరిగిన వర్చువల్ సమావేశంలో పాల్గొన్న ప్రధాని మోదీ_2.1

  • హైబ్రిడ్ విధానం లో జరిగిన ఇండియా-EU నాయకుల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఇండియా-యూరోపియన్ యూనియన్ లీడర్స్ సమావేశాన్ని పోర్చుగల్ నిర్వహిస్తుంది. పోర్చుగల్ ప్రస్తుతం గ్రూపింగ్ స్థానాన్ని కలిగి ఉంది. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు చార్లెస్ మిచెల్ ఆహ్వానం మేరకు పిఎం మోడీ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
  • ఈ సమావేశంలో మొత్తం 27 EU సభ్య దేశాల నాయకులతో పాటు యూరోపియన్ కమిషన్ మరియు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు పాల్గొన్నారు. EU + 27 విధానం లో భారతదేశంతో EU సమావేశాన్ని నిర్వహించడం ఇదే మొదటిసారి.

సమావేశంలో భారతదేశం యొక్క ముఖ్యమైన అంశాలు

  • ప్రజాస్వామ్యం, ప్రాథమిక స్వేచ్ఛలు, చట్ట పాలన మరియు బహుపాక్షికతపై భాగస్వామ్య నిబద్ధత ఆధారంగా భారతదేశం-EU వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రతిపాదించబడింది.
  • సమతుల్య మరియు సమగ్ర స్వేచ్ఛా వాణిజ్యం (FTA) మరియు పెట్టుబడి ఒప్పందాల కోసం చర్చలను తిరిగి ప్రారంభించాలని నాయకులు నిర్ణయించారు.

చర్చ యొక్క మూడు ముఖ్య అంశాలు

  1. విదేశాంగ విధానం మరియు భద్రత
  2. కోవిడ్-19, వాతావరణం మరియు పర్యావరణం; మరియు
  3. వాణిజ్యం, కనెక్టివిటీ మరియు టెక్నాలజీ.
  • డిజిటల్, రవాణా మరియు ప్రజల మధ్య అనుసంధానాన్ని పెంపొందించడం పై దృష్టి సారించి భారతదేశం-EU మధ్య ఒక ప్రతిష్టాత్మకమైన మరియు సమగ్రమైన ‘కనెక్టివిటీ పార్ట్‌నర్‌షిప్’ను ప్రారంభించబడింది.
  • పూణే మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ మరియు యూరోపియన్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ 150 మిలియన్ యూరోల ఆర్థిక ఒప్పందంపై సంతకం చేశాయి.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • యూరోపియన్ కౌన్సిల్ స్థాపించబడింది: 9 డిసెంబర్ 1974;
  • యూరోపియన్ యూనియన్ ప్రధాన కార్యాలయం : బ్రస్సెల్స్, బెల్జియం;
  • యూరోపియన్ యూనియన్ స్థాపించబడింది: 1 నవంబర్ 1993.

ఆన్లైన్ లైవ్ క్లాసుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

8 May 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

8 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ క్విజ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

 

 

 

Sharing is caring!