పంచాయతీల (షెడ్యూల్డ్ ప్రాంతాలకు పొడిగింపు) చట్టం, 1996 (PESA) గిరిజన వర్గాల సాధికారత కోసం ఒక ముఖ్యమైన మరియు కీలకమైన చట్టం. రాజ్యాంగంలోని 9వ విభాగంలో పేర్కొనబడిన అంశాలు 5వ షెడ్యూల్లోని ప్రాంతాలకు వర్తించవు. కాని పార్లమెంట్ ఈ అంశాలను కొద్ది సవరణలతో 5వ షెడ్యూల్లో పేర్కొన్న ప్రాంతాలకు వర్తింపచేయవచ్చు. ఈ నిబంధనను 73వ రాజ్యాంగ సవరణ చట్టంలో పొందుపరచబడింది. ఈ నిబంధన ప్రకారం పార్లమెంట్ ప్రొవిజన్స్ ఆఫ్ ది పంచాయాత్స్, 1996ను రూపొందించి. ఈ చట్టాన్నే PESA గా పేర్కొన్నారు. PESA చట్టాన్ని “రాజ్యాంగం లో రాజ్యాంగం” అనికూడా అంటారు. షెడ్యూల్ 5 ప్రాంతాల్లోని పంచాయతీలు/గ్రామసభలకు పాలనను పంచి గిరిజనుల అభివృద్ధిని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడమే ఈ చట్టం లక్ష్యం.
2013 నాటికి దేశం మొత్తం మీద 9 రాష్ట్రాల్లో మాత్రమే 5వ షెడ్యూల్డ్ లో ఉన్నాయి ఇవి; ఆంధ్రప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, హిమాచలప్రదేశ్, గుజరాత్, మరియు రాజస్థాన్. తెలంగాణ లో అమలు కావాల్సి ఉన్న ఇంకా అమలు కాలేదు. ఈ 9 రాష్ట్రాలకి PESA చట్టానికి అనుగుణంగా ఆయా రాష్ట్రాలలో పంచాయతీరాజ్ చట్ట సవరణ చేశారు.
Adda247 APP
PESA చట్టం యొక్క ఉద్దేశాలు
PESA చట్టం యొక్క ముఖ్య ఉద్దేశాలు:
- రాజ్యాంగంలోని 9వ భాగంలో పంచాయతీలకు సంబంధించి పొందుపరిచిన అంశాలను షెడ్యూల్ ప్రాంతాలకు వారి అవసరాలకి అనుగుణంగా వర్తింపచేయడం.
- షెడ్యూల్డ్ తెగల జనాభా కూటమికి స్వయం పాలన అవకాశాలు కల్పించడం.
- భాగస్వామ్య ప్రజాస్వామిక విధానం ద్వారా గ్రామ పరిపాలనను కొనసాగేలా చూడడం మరియు గ్రామసభను అన్ని కార్యక్రమాలకు కేంద్రంగా చేయడం.
- షెడ్యూల్డ్ తెగల వారి సాంప్రదాయ ఆచారాలకు అనుగుణంగా ఉండే పాలనా కార్యచట్టాన్ని రూపొందించడం.
- షెడ్యూల్డ్ తెగల సమాజం యొక్క సాంప్రదాయాలను, ఆచారాలను పరిరక్షించడం.
- వివిధ స్థాయిలలోని పంచాయతీరాజ్ వ్యవస్థలకు షెడ్యూల్డ్ తెగల అవసరాలకు అనుకూలమైన విధంగా వ్యవహరించటానికి అధికారాలను కల్పించడం.
- పై స్థాయిలోని పంచాయతీరాజ్ వ్యవస్థలు క్రింది స్థాయిలలోని వ్యవస్థలు ముఖ్యంగా గ్రామ సభల అధికారాలను చేజిక్కించుకోకుండా నిరోధించడం.
PESA చట్టం యొక్క లక్షణాలు
PESA చట్టం యొక్క ముఖ్య లక్షణాలు:
- షెడ్యూల్డ్ ప్రాంతాలలోని పంచాయతీరాజ్ కోసం రూపొందించే రాష్ట్ర శాసనాలు, సాంప్రదాయిక చట్టాలు, సామాజిక మరియు మతపరమైన అలవాట్లు సాంప్రదాయక నిర్వహణ మరియు సామాజిక వనరులు మొదలైన వాటికి అనుగుణంగా ఉండాలి.
- ప్రతీ గ్రామం ఆ గ్రామపంచాయతీ ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకొన్న ఓటర్లందరితో కూడిన ఒక గ్రామ సభను కల్గి ఉండాలి.
- ప్రతీ గ్రామసభ ప్రజల గ్రామ సాంప్రదాయాలను, ఆచారాలను, సాంస్కృతిక గుర్తింపును సమాజ వనరులను పరిరక్షించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి.
- గ్రామ పంచాయతీలో సామాజిక ఆర్ధిక ప్రణాళికలు, పథకాలు వాటి రూపకల్పన మరియు అమలుకు సంబంధించిన విషయాలలో సమ్మతిని తెలియజేయాలి.
- గ్రామస్థాయిలో ప్రతి పంచాయతీ ప్రణాళికలు, పథకాలు, నిధుల వినియోగం కొరకు గ్రామసభ సమ్మతిని పొందాలి.
- షెడ్యూల్డ్ ప్రాంతాలలో భూమి ఆక్రమణను నిరోధించాలి మరియు జనాభా నిష్పత్తి ప్రకారం స్థానాలను రిజర్వు చేయాలి. అంతేగాక అన్ని స్థాయిలలోని పంచా యతీరాజ్ వ్యవస్థల అధ్యక్ష స్థానాన్ని షెడ్యూల్డ్ తెగల వారికి రిజర్వు చేయాలి.
- ఒకవేళ బ్లాక్ /సమితి లేదా జిల్లా స్థాయి వ్యవస్థలలో షెడ్యూల్డ్ తెగలు లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారిని నామినేట్ చేయవచ్చు.
- షెడ్యూల్డ్ ప్రాంతాలలో అభివృద్ధి పథకాల కోసం భూమిని స్వాధీనం చేసుకునే ముందు సంబంధిత పంచాయతీని సంప్రదించాలి. సర్వోన్నత న్యాయ స్థానం చాలా తీర్పులలో దీనిని వెల్లడించింది.
- షెడ్యూల్డ్ ప్రాంతాలలోని చిన్న నీటి వనరుల బాధ్యత పంచాయతీరాజ్ వ్యవస్థలకు అప్పగించాలి.
- షెడ్యూల్డ్ ప్రాంతాలలోని గనులను, ఖనిజ వనరులను అద్దెకు ఇచ్చే ముందు తగిన స్థాయి పంచాయతీ లేదా గ్రామ సభ సిఫారసులు తప్పనిసరి.
- అల్ప ప్రాధాన్యత కల్గిన గనులు లేదా ఖనిజాల తవ్వకానికి రాయితీలను వేలం ద్వారా మంజూరు చేయుటకు ముందస్తుగా గ్రామసభ లేదా తగిన స్థాయి పంచాయితీల సిఫారసులు తప్పనిసరిగా ఉండాలి.
- షెడ్యూల్డ్ ప్రాంతాలలోని పంచాయతీరాజ్ వ్యవస్థలకు స్థానిక ప్రభుత్వాలుగా అవి వాటి విధులను నిర్వహించటానికి అవసరమైన అధికారాలు ఉన్నాయి.
మరింత చదవండి
Panchayath Raj System in Andhra Pradesh | Medieval History of Andhra |
APPSC Group 2 Mains Previous Year Question Papers | తెలుగు భాషా సాహిత్యం మరియు అభివృద్ది |
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |