వరుసగా 3వసారి పశ్చిమ బెంగాల్ CM గా ప్రమాణ స్వీకారం చేసిన మమతా బెనర్జీ
- రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన కోవిడ్ సమయంలో మరియు ఎన్నికల అనంతర హింస తరువాత మమతా బెనర్జీ మూడవసారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
- రాజ్ భవన్ లోని “థ్రోన్ రూమ్” వద్ద కోవిడ్ ప్రోటోకాల్స్ తో ప్రమాణ స్వీకారం జరిగింది. రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా మే 9 న మిగతా కేబినెట్, మంత్రుల మండలి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
- మమతా బెనర్జీ బెంగాల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి వరుసగా మూడోసారి విజయం సాధించారు. తృణమూల్ 292 సీట్లలో 213 గెలుచుకోగా, దాని బలమైన ప్రత్యర్థి బిజెపి 77 సీట్లతో రెండవ స్థానంలో నిలిచింది. మమతా బెనర్జీ తన కార్యాలయం అయిన నబన్నాకు వెళతారు.
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
పశ్చిమ బెంగాల్ గవర్నర్: జగ్దీప్ ధంఖర్.