Telugu govt jobs   »   Current Affairs   »   James Dyson Award (India)-2023 was won...

James Dyson Award (India)-2023 was won by Telugu youth Praveen Kumar | జేమ్స్ డైసన్ అవార్డు (ఇండియా)-2023ను తెలుగు యువకుడైన ప్రవీణ్ కుమార్ గెలుచుకున్నారు

James Dyson Award (India)-2023 was won by Telugu youth Praveen Kumar | జేమ్స్ డైసన్ అవార్డు (ఇండియా)-2023ను తెలుగు యువకుడైన ప్రవీణ్ కుమార్ గెలుచుకున్నారు

తెలుగు యువకుడు, ప్రవీణ్ కుమార్, గౌరవనీయమైన జేమ్స్ డైసన్ అవార్డు (ఇండియా)-2023 సాధించారు. ఆవిష్కరణ మరియు సంచలనాత్మక ఉత్పత్తులను తయారు చేయడంలో అతని అసాధారణ ప్రతిభను నిర్వాహక కమిటీ అధికారికంగా గుర్తించింది. అతని విజయాలకు రూ.5 లక్షల బహుమతిని అందజేసింది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి ప్రాంతానికి చెందిన ప్రవీణ్ ఐఐటీ మద్రాస్ రీసెర్చ్ పార్క్ ఇంక్యుబేటర్ కేంద్రంగా మౌస్వేర్ అనే అంకుర సంస్థను నిర్వహిస్తున్నారు. సాంకేతికత, ఇతర డిజిటల్ పరికరాలు సైతం వాడలేని స్థితిలో ఉన్న దివ్యాంగుల కోసం ఈ సంస్థ ప్రత్యేక పరికరాలను రూపొందిస్తుంది.

‘డెక్స్ వేర్ డివైజెస్’ అని పిలిచే ఈ పరికరాలు తల కదలికల ద్వారా సెన్సర్లు సేకరించే సమాచారాన్ని స్వీకరించి అందుకు ఆనుగుణంగా పనిచేస్తాయి. తాను రూపొందించిన ఈ పరికరాలు దివ్యాంగులందరికీ చేరేలా చేయడాన్నే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రవీణ్ తెలిపారు. జేమ్స్ డైసన్ అవార్డు యజమాన్యం ప్రపంచవ్యాప్తంగా 28 దేశాల్లో పోటీలు నిర్వహిస్తోంది. దివ్యాంగుల సమస్యలకు ఇంజినీరింగ్ ద్వారా సులువైన పరిష్కారాలు ఆవిష్కరించే యువతను ప్రోత్సహిస్తోంది. జేమ్స్ డైసన్ అవార్డుకు సంబంధించి భారత్ విజేతగా నిలిచిన ప్రవీణ్ ప్రపంచస్థాయి పోటీలకు అర్హత సాధించారు. అంతర్జాతీయ పోటీల్లో టాప్-20 విజేతల జాబితాను అక్టోబరు 18న, ప్రపంచ విజేతను నవంబరు 15న ప్రకటిస్తారని ప్రవీణ్ తెలిపారు.

SSC Complete Preparation Kit | Live Classes | Test Series | eBooks | Printed Books | By Adda247

మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

జేమ్స్ డైసన్ అవార్డు అంటే ఏమిటి?

జేమ్స్ డైసన్ అవార్డు వర్ధమాన ఆవిష్కర్తల కొత్త, సమస్య-పరిష్కార ఆలోచనలను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది మరియు జరుపుకుంటుంది - మరియు వాటిని ప్రారంభించడానికి ఒక వేదికను అందిస్తుంది. ఇది ఏటా నడుస్తుంది మరియు ప్రస్తుత మరియు ఇటీవల గ్రాడ్యుయేట్ డిజైన్ లేదా ఇంజనీరింగ్ విశ్వవిద్యాలయ విద్యార్థులకు అందుబాటులో ఉంటుంది.