Telugu govt jobs   »   TREIRB TS Gurukulam Notification 2023   »   Instructions For TRIERB TS Gurukulam exam

Instructions and Last Minute Tips For TRIERB TS Gurukulam 2023 Exam | TRIERB TS గురుకుల పరీక్ష కోసం సూచనలు మరియు చివరి నిమిషం చిట్కాలు

తెలంగాణలోని గురుకులాల్లో 9,210 పోస్టుల భర్తీకి ఆగస్టు 1 నుంచి ఆగస్టు 23 వరకు మూడు షిఫ్ట్ లలో కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు జరగనున్నాయి. TRIERB TS గురుకుల హాల్ టికెట్ https://treirb.telangana.gov.in/ లో విడుదల అయ్యింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 104 కేంద్రాల్లో జరగబోయే  TRIERB TS గురుకుల పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. 9,210 TRIERB TS గురుకుల పోస్టులకు మొత్తం 2.66 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా..ఇందుకోసం 17 జిల్లాల్లో 106 చోట్ల పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలు 19 రోజుల పాటు, రోజుకు మూడు షిఫ్టుల్లో జరుగుతాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ పరీక్ష నిర్వహించేందుకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. మేము ఈ కథనంలో తెలంగాణ గురుకుల పరీక్ష 2023 కోసం సూచనలు మరియు కఠిన నిబంధనలు అందించాము.

 TREIRB TS Gurukulam exam schedule 

పరీక్ష కేంద్రాలలో మార్పు

వరదల కారణంగా ఖమ్మంలోని పెద్దతండా దగ్గర ఉన్న ప్రియదర్శిని ఇంజనీరింగ్‌ కాలేజీ సెంటర్‌లో ఆగస్టు 1, 3, 4 తేదీల్లో జరిగే పరీక్షలను అక్కడికి దగ్గర్లోనే ఉన్న స్వర్ణభారతి, దరిపల్లి అనంతరాములు ఇంజనీరింగ్‌ కాలేజీలకు మార్చారు. అయితే ఈ రెండు సెంటర్లు కేవలం 1, 3, 4 తేదీల వరకు మాత్రమేనని మళ్లీ 5వ తేదీ నుంచి జరిగే పరీక్షలను యథావిధిగా ప్రియదర్శిని కాలేజీలోనే నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సెంటర్‌ మార్పు విషయాన్ని అభ్యర్థులకు ఫోన్‌, మెయిల్‌ ద్వారా తెలియపర్చారు, హాల్‌టికెట్లు కూడా రీజనరేట్‌ చేసామని అధికారులు వెల్లడించారు.

 TREIRB TS Gurukulam the Online Test Series

TRIERB TS గురుకుల పరీక్ష కోసం సూచనలు

ఈ నేపథ్యంలో పరీక్ష రాసే అభ్యర్థులకు అధికారులు చేసిన కొన్ని కీలక సూచనలివే…

  • ప్రతి అభ్యర్థి బయోమెట్రిక్, ఫొటో తీసుకుంటారు. అభ్యర్థులందరూ తమకు సూచించిన సమయంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. ప్రతి షిఫ్టు పరీక్షకు 15 నిమిషాల ముందు గేట్లు మూసివేస్తాం. ఆ తరువాత ఎట్టిపరిస్థితుల్లోనూ అభ్యర్థులను పరీక్ష గదుల్లోకి అనుమతించరు.
  • TRIERB TS గురుకుల పరీక్షలు మొత్తం 19 రోజులపాటు రోజుకు మూడు షిఫ్టుల్లో జరుగుతాయి. ప్రతి పరీక్ష సమయం రెండు గంటలు. ఉదయం షిఫ్ట్ 8.30 నుంచి 10.30, మధ్యాహ్నం షిఫ్ట్ 12.30 నుంచి 2.30, సాయంత్రం షిఫ్ట్ 4.30 నుంచి 6.30 గంటల వరకు జరుగుతుంది.
  • కాగితాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, నిషేధిత వస్తువులను తీసుకెళ్లకూడదు. అభ్యర్థులు చెప్పులు మాత్రమే ధరించాలి. బూట్లతో పరీక్ష గదిలోకి అనుమతించరు.
  • పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించిన తరువాత పరీక్ష ముగిసేవరకు బయటకు వెళ్లేందుకు అనుమతి లేదు.
  • హాల్ టికెట్, గుర్తింపు కార్డు, నామినల్ రోల్లలో ఫొటోలు వేర్వేరుగా ఉన్నా.. అభ్యర్థి వ్యక్తిగత ధ్రువీకరణలో లోపాలు గుర్తించినా.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. నియామక ప్రక్రియ పూర్తయ్యేవరకు అభ్యర్థులు హాల్ టికెట్ భద్రంగా ఉంచుకోవాలి.
  • పరీక్షలు పూర్తయిన తరువాత కూడా అభ్యర్ధులు హాల్‌టికెట్లను నియామక ప్రక్రియ వరకు భద్రంగా ఉంచుకోవాలని, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ సమయంలో హాల్‌టికెట్‌ను కూడా పరిశీలిస్తారని అభ్యర్థులు ఈ అంశాలన్నింటిని దృష్టిలో పెట్టుకొని పరీక్షకు హాజరవ్వాలని అధికారులు తెలిపారు.
  • TRIERB TS గురుకుల పరీక్ష పేపర్-1, 2, 3లో తప్పుగా రాసిన ప్రతి సమాధానానికి పావు(0.25) మార్కు కోత ఉంటుంది.
  • పరీక్ష ప్రారంభానికి 10 నిమిషాల ముందు పాస్ వర్డ్ చెబుతారు. కంప్యూటర్ లో దీన్ని నమోదు చేశాక అభ్యర్థులు పాటించాల్సిన సూచనలు వస్తాయి. పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి స్క్రీన్ పై ప్రశ్నలు ప్రత్యక్షమవుతాయి. గడువు ముగిసిన తరువాత స్క్రీన్ అదృశ్యమవుతుంది. ఏవైనా సాంకేతిక ఇబ్బందులు తలెత్తితే కంప్యూటర్ ఆటోమేటెడ్గా అదనపు సమయం ఇస్తుంది. పరీక్ష సమయంలో కంప్యూటర్‌ మొరాయిస్తే పరీక్ష ఆగిపోయిన సమయం నుంచే మళ్లీ మొదలవుతుంది.

TSPSC గ్రూప్ 4 పరీక్ష 2023 కోసం సూచనలు మరియు కఠిన నిబంధనలు_40.1

APPSC/TSPSC Sure shot Selection Group

TRIERB TS గురుకుల 2023 పరీక్షా కేంద్రానికి ఏం తీసుకెళ్లాలి?

TRIERB TS గురుకుల 2023 పరీక్షా కేంద్రానికి తీసుకోవలసిన ముఖ్యమైన డాక్యుమెంట్లను అభ్యర్థులు తప్పనిసరిగా గమనించాలి.

  • ఫోటోగ్రాఫ్: అభ్యర్థులు తప్పనిసరిగా రెండు పాస్‌పోర్ట్ సైజు ఛాయాచిత్రాలను తీసుకోవాలి.
  • అడ్మిట్ కార్డ్: TRIERB TS గురుకుల అడ్మిట్ కార్డ్ 2023 అనేది పరీక్ష సమయంలో తప్పనిసరిగా తీసుకువెళ్ళాల్సిన డాక్యుమెంట్.
  • ఇతర డాక్యుమెంట్ల: హాల్ టిక్కెట్‌తో పాటు, అభ్యర్థులు తప్పనిసరిగా ప్రభుత్వం జారీ చేసిన ఒక అసలైన చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు కార్డును కలిగి ఉండాలి, అంటే పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ID, ఆధార్ కార్డ్, ప్రభుత్వ ఉద్యోగి ID లేదా డ్రైవింగ్ లైసెన్స్ మొదలైనవి.
  • హాల్ టికెట్ ఫోటో లేకుండా లేదా సంతకం లేకుండా ఉంటే, అతను/ఆమె 3 పాస్‌పోర్ట్ సైజు ఫోటోలను గెజిటెడ్ అధికారి చేత ధృవీకరించబడిన ఒక హామీతో పాటు తీసుకురావాలి మరియు పరీక్ష హాల్‌లోని ఇన్విజిలేటర్‌కు అందజేయాలి, లేని పక్షంలో అభ్యర్థిని పరీక్ష హాలులోకి అనుమతించరు.

TREIRB TS Gurukulam Hall Ticket 2023

TREIRB Telangana Gurukul Paper-1(General Studies and General Ability) Online Test Series for Telangana TGT, PGT, JL, DL, Principal, Librarian and PET in English and Telugu 2023-24 By Adda247

 Adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు క్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

 

Sharing is caring!

FAQs

TREIRB TS గురుకుల పరీక్ష తేదీలు ఏమిటి?

TREIRB TS గురుకుల పరీక్ష 01 ఆగస్టు 2023 నుండి 23 ఆగస్టు 2023 వరకు నిర్వహించబడుతుంది.