Telugu govt jobs   »   Article   »   How to crack APPSC Group-I Exam...

How to crack APPSC Group-I Exam in First Attempt | మొదటి ప్రయత్నంలోనే APPSC గ్రూప్-I పరీక్ష ని ఎలా సాధించాలి

APPSC గ్రూప్ 1 పరీక్షకు ఎలా సిద్ధం కావాలి? APPSC గ్రూప్ -1 సర్వీసెస్ పరీక్ష ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత సవాలు మరియు ప్రతిష్టాత్మక పరీక్ష. గ్రూప్ -1 లో డిప్యూటీ కలెక్టర్ (RDO), డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP), ప్రాంతీయ రవాణా అధికారి (RTO), కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ (CTO), మునిసిపల్ కమిషనర్, జిల్లా రిజిస్ట్రార్ మొదలైన పోస్టులు గ్రూప్-1 ఎంట్రీ లెవల్ ఉద్యోగాలు ఉంటాయి మొదటి ప్రయత్నంలోనే APPSC గ్రూప్-I పరీక్ష ని ఎలా సాధించాలి అనే విషయాన్ని తెలుసుకుని మీరు కూడా విజయం వైపు అడుగులు వేయండి.

How to Prepare for APPSC Group-1 Exam

APPSC గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష 240 మార్కులకు ఉంటుంది. ఇందులో 240 ప్రశ్నలు ఉంటాయి. APPSC Group-1 ప్రిలిమ్స్ పరీక్షలో నెగెటివ్ మార్కింగ్‌ ఉంది మరియు తప్పుగా సమాధానం ఇచ్చిన ప్రతి ప్రశ్నకు మూడవ వంతు మార్కు కోత ఉంటుంది. గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి అవి పేపర్-1 మరియు పేపర్-2. పేపర్-1 లో నాలుగు భాగాలు ఉన్నాయి అవి హిస్టరీ & కల్చర్, పొలిటీ, ఇండియా మరియు ఎపి ఎకానమీ, జియోగ్రఫీ, ఒక్కో విభాగం నుంచి 30 మొత్తంగా 120 ప్రశ్నలు ఉంటాయి కావున ప్రతీ విభాగాన్ని ప్రణాళిక వేసుకుని ప్రిపేర్ అవ్వాలి. APPSC సిలబస్ UPSC సివిల్ సర్వీసెస్ మాదిరిగానే ఉంది మరియు పేపర్ క్లిష్టత స్థాయికూడా అలాగే ఉంటుంది అని అభ్యర్ధులు తదనుగుణంగా ప్రిపేర్ అవ్వాలి.

పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ కారణంగా, మీరు సమాధానం గురించి ఖచ్చితంగా తెలిస్తే మాత్రమే మీరు ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. అధిక పోటీ కారణంగా పరీక్షలో ప్రతి ఒక్క మార్కు ముఖ్యం కాబట్టి గుడ్డిగా ఊహించడం మానుకోవాలి. ప్రతీ తప్పు సమాధానము మన ఉద్యోగం నుంచి మనల్ని దూరం చేస్తుంది.

గ్రూప్ -1 ప్రిలిమ్స్ సిలబస్ చాలా విస్తృతమైనది మరియు సమగ్రమైనది. ఇది ప్రాచీన భారతీయ చరిత్ర నుండి ఆధునిక కాలపు శాస్త్రీయ పరిణామాల వరకు దాదాపు అన్ని విషయాలను  కలిగి ఉంటుంది. అందువల్ల, పరీక్షలో విజయం సాధించడానికి, అభ్యర్థికి అన్నీ సబ్జెక్టులపై అవగాహన ఉండాలి. ప్రశ్నా శైలి మరియు క్లిష్టత కూడా UPSC తరహాలో ఉంటుంది అని విశ్లేషకులు అంటున్నారు.

APPSC Group-1 Exam Syllabus: సిలబస్

APPSC గ్రూప్-1 ప్రిలిమ్స్ సిలబస్ లో ప్రధానంగా రెండు పేపర్లలో ఈ విధంగా ఉంటాయి:

పేపర్- I జనరల్ స్టడీస్

  •      a) చరిత్ర మరియు సంస్కృతి:
  •       b) రాజ్యాంగం, పరిపాలన, సామాజిక న్యాయం & అంతర్జాతీయ సంబంధాలు
  •       c) భారతదేశం & ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ మరియు ప్రణాళిక
  • ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం:2014
  •        d) భూగోళ శాస్త్రము:

పేపర్-2 : జనరల్ ఆప్టిట్యూడ్ సిలబస్

  • సాధారణ మానసిక సామర్థ్యం, ​​పరిపాలనా మరియు సామర్థ్యాలు
  • శాస్త్రీయ మరియు సాంకేతిక విజ్ఞానాలు
  • ప్రాంతీయ, దేశ, అంతర్జాతీయ ప్రాముఖ్యత సంబంధించిన సమకాలీన అంశాలు

APPSC గ్రూప్ 1 మెయిన్స్ సిలబస్

APPSC గ్రూప్ 1 -పేపర్ – I: డిస్క్రిప్టివ్ పరీక్ష (వ్యాసం)

APPSC గ్రూప్ 1 పేపర్ – II: చరిత్ర మరియు సంస్కృతి మరియు భూగోళ శాస్త్రము

  • A. భారతదేశ చరిత్ర మరియు సంస్కృతి మరియు సంప్రదాయం
  • B. ఆంధ్రప్రదేశ్ చరిత్ర మరియు సంస్కృతి
  • C. భూగోళ శాస్త్రం: భారతదేశం మరియు ఆంధ్ర ప్రదేశ్

APPSC గ్రూప్ 1 పేపర్ – III: రాజకీయాలు, పరిరక్షణ, చట్టం & నీతి, పాలన

  • (A) భారత పరిపాలనా మరియు రాజ్యాంగం
  • (B) పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నెన్స్
  • (C). ప్రజా సేవలో నీతి మరియు న్యాయ పరిజ్ఞానం

APPSC గ్రూప్ 1 పేపర్ – IV: ఆర్థిక వ్యవస్థ, భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి

APPSC గ్రూప్ 1 పేపర్ – V: సైన్స్ & టెక్నాలజీ, పర్యావరణ సమస్యలు

కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్ (CPT)

APPSC గ్రూప్ 1 సిలబస్ పై పూర్తి అవగాహనతో సరైన ప్రణాళికని రచించుకోవాలి, ప్రణాళికాబద్దంగా పరీక్షకి సన్నదమైతే ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించవచ్చు. సిలబస్ అధికంగా ఉండటంతో అభ్యర్ధులు కొన్ని అంశాలపై అశ్రద్ద చూపవచ్చు కానీ సరైన ప్రణాళికతో అన్నీ అంశాలను అర్ధం చేసుకుని చదివితే పరీక్షలో ప్రశ్నలు ఎలా వచ్చినా సమాధానం చేయవచ్చు. మీ స్టడీ మెటీరీయల్ పరీక్షా శైలి కి ఎంత దగ్గరగా ఉంటే అంత మంచిది కావున నాణ్యమైన మరియు సిలబస్ కు అనుగుణంగా ఉండేది ఎంచుకోండి.

APPSC Group-1 Complete Syllabus

How to prepare for Current Affairs for APPSC Group-1 Exam:

కరెంట్ అఫైర్స్ విభాగం లో జనరల్ ఎస్సే మరియు ప్రశ్నలు కూడా వస్తాయి కావున కరెంట్ అఫ్ఫైర్స్ విభాగం లో ఎక్కువ మార్కులు సాధించడానికి మీకు అవకాశం ఉంది. మొదటి సారి ప్రిపేర్ అయ్యే అభ్యర్ధులు దీని పై అధిక సమయం కేటాయిస్తే 50-70 మార్కులు దీనినుంచి సాధించవచ్చు. ప్రాంతీయ కరెంట్ అఫ్ఫైర్స్ ను కూడా ఏక కాలంలో పరిపారే అవ్వాలి దానికోసం అడ్డా 247 లో అందించే రోజువారీ లేదా వారాంతపు, నెలవారి కరెంట్ అఫ్ఫైర్స్ సంకలనాలు మరియు addapedia ను క్రమం తప్పకుండా చదవండి. ఇవి మీకు వివిధ వార్తా పత్రికలను చదివే పని మరియు విలువైన సమయాన్ని ఆదా చేస్తుంది. ఇంకా ఈ అంశంలోని ప్రశ్నలు జనరల్ సైన్స్, ఎకనామిక్స్ మరియు పాలిటీ వంటి ఇతర అంశాలు కూడా కవర్ అవుతాయి. ఇది గ్రూప్ -1 ప్రిలిమ్స్ మరియు రాత పరీక్షకు అత్యంత ముఖ్యమైన అంశం.

  • ప్రతిరోజూ  తప్పనిసరిగా వార్తాపత్రికలలోని రాష్ట్ర అంశాలు మరియు ముఖ్య అంశాలు చదవాలి. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ కోసం తెలుగు వార్తాపత్రికలు మరియు జాతీయ మరియు అంతర్జాతీయ కరెంట్ అఫైర్‌లను మీరు addapedia మరియు డైలీ కరెంట్ అఫ్ఫైర్స్ తో సులభంగా చదువుకోవచ్చు.
  • addapedia మరియు డైలీ కరెంట్ అఫ్ఫైర్స్ లోని అంశాలు ప్రముఖ తెలుగు మరియు ఇంగ్షీషు వార్తాపత్రికలనుంచి హిందూ, సాక్షి, ఈనాడు, వంటి వాటి నుండి అందిస్తాము.

How to Prepare for General Science for APPSC Group-1: జనరల్ సైన్సు

అభ్యర్థులు 6 నుండి 10 వ తరగతి వరకు జనరల్ సైన్స్, బయాలజీ, ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీపై ఆంధ్రప్రదేశ్ APSCERT లేదా NCERT పాఠ్యపుస్తకాలను తప్పక చదవాలి. జనరల్ సైన్స్ సబ్జెక్ట్ ఆధారిత ప్రశ్నలకు అవి సరిపోతాయి. లేదా నాణ్యమైన స్టడీ మెటీరీయల్ నుండి పాఠ్యాంశాలను చదవాలి. మొదటి సారి APSCERT పుస్తకాలను చదివి నోట్స్ రాసుకోవడం కొంచం కష్టమైన మరియు సమయం కూడా వృధా అవుతుంది అందుకని నాణ్యమైన మరియు ప్రముఖ స్టడీ నోట్స్ లను ఎంచుకుంటే సమయం తో పాటు రివిజన్ కి కూడా సమయం ఎక్కువ కేటాయించవచ్చు.

  • అయితే, వర్తమాన వ్యవహారాలకు సంబంధించిన సాధారణ సైన్స్ ప్రశ్నల కోసం, అభ్యర్థులు ఇస్రో శాటిలైట్ లాంచీలు, రక్షణ రంగ వార్తలు, క్షిపణి ప్రయోగాలు, యుద్ద విన్యాసాలు మొదలైన కరెంట్ అఫైర్‌లకు సిద్ధమవుతూనే వార్తల్లోని శాస్త్రీయ పరిణామాలపై దృష్టి పెట్టాలి.
  • వీటితోపాటు విటమిన్స, హార్మోన్స, మూలకాలు, పోషణ లాంటి అంశాలపై విస్తృత అవగాహన ఉండాలి. జెనెటిక్ ఇంజనీరింగ్, డీఎన్ఏ టెక్నాలజీ, టిష్యూకల్చర్, సూపర్ ఒవ్యులేషన్, సంకరణం, టెస్ట్యూబ్ బేబి, క్లోనింగ్, సరోగసి తదితర ఆధునిక పద్ధతుల గురించి క్షుణ్నంగా అధ్యయనం చేయాలి.
  • తాజాగా సైన్స్ రంగంలో జరుగుతున్న మార్పులను, కొత్త ఆవిష్కరణలు అవార్డులు లేదా ప్రముఖ ఆవిష్కరణల పై పూర్తి అవగాహన ఉండాలి. మూల సిద్ధాంతాలను, చరిత్ర గతిని మార్చిన గొప్ప ఆవిష్కరణలు – శాస్త్రవేత్తల గురించి తెలుసుకోండి ఇలా చేస్తే జీవ శాస్త్రంలో అత్యధిక మార్కులు సాధించొచ్చు.

How to Prepare for Indian History for APPSC Group-1: భారతీయ చరిత్ర 

భారతీయ చరిత్రలో, మూడు ఉపవిభాగాలు ఉన్నాయి, అవి ప్రాచీన, మధ్యయుగ మరియు ఆధునిక భారతీయ చరిత్ర. భారతీయ చరిత్ర కోసం సిద్ధమవుతున్నప్పుడు, అభ్యర్థులు చరిత్రలో రాజకీయ, ఆర్థిక, సామాజిక, కళ, సాహిత్యం, సాంస్కృతిక మరియు నిర్మాణ అంశాలపై దృష్టి పెట్టాలి. చరిత్రపై పాత NCERT పాఠ్యపుస్తకాలు భారతీయ చరిత్రకు సరిపోతాయి. అయితే, మీరు కొత్త ఎన్‌సిఇఆర్‌టి చరిత్ర పుస్తకాలను కూడా సులభంగా అర్థం చేసుకోవచ్చు.

  • తాజా సిలబస్ ప్రకారం NCERT లేదా SCERT పుస్తకాలలోంచి అంశాల పై దృష్టి సాధించండి మూస పద్దతిలో చదివే అలవాటు మానుకోండి అంశాలను విశ్లేషించి మీకు అనువైన పద్దతిలో గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి.
  • ఆధునిక భారతీయ చరిత్రలో, భారతీయ జాతీయ ఉద్యమంపై ఎక్కువ దృష్టి పెట్టండి. భారతీయ చరిత్రలోని ఇతర భాగాలతో పోలిస్తే ఈ అంశం నుండి మరిన్ని ప్రశ్నలు ప్రిలిమ్స్ పరీక్షలో అడగవచ్చు. మరియు ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం, విభజన చట్టం, వంటి అంశాలను క్షుణ్ణంగా తెలుసుకోండి.
  • ప్రశ్నలు జవాబులు శైలి లో ఆంధ్రప్రదేశ్ చరిత్రని ప్రాక్టీస్ చేయండి ఇది మైన్స్ లో రాత పరీక్షకి బాగా ఉపయోగపడుతుంది మరియు మీ ఆలోచనా శైలి కూడా మెరుగవుతుంది.

How to crack APPSC Group-2 in First Attempt

How to Prepare for Geography for APPSC Group-1: భూగోళ శాస్త్రం

ఈ అంశంలో మూడు భాగాలు ఉన్నాయి, అవి ప్రపంచం, భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ భౌగోళికం. భూగోళశాస్త్రంపై NCERT, SCERT పుస్తకాలను చదవడం వల్ల ప్రపంచం మరియు భారతీయ భూగోళశాస్త్రం రెండూ అంశాల పై పట్టు సాధించవచ్చు.

  • పాత మరియు కొత్త NCERT భౌగోళిక పాఠ్యపుస్తకాలు రెండింటిలో నిర్ధిష్ట అంశాలను చదవాలి. లేదా ప్రముఖ ప్రచురణల పుస్తకాలు స్టడీ మెట్ వంటి ప్రామాణిక నోట్స్ లు చదవండి. ఇంకా, జిసి లియోంగ్ యొక్క భౌతిక భౌగోళికం ప్రపంచ భూగోళశాస్త్రం పుస్తకాలని సందేహాలను నివృత్తి చేసుకోడానికి పక్కన ఉంచుకోండి.
  • ఆంధ్రప్రదేశ్ భూగోళశాస్త్రం కోసం, సామాజిక అధ్యయనాలపై AP SCERT టెక్స్ట్ పుస్తకాలను చదవడం వలన ఆంధ్రప్రదేశ్ లోని భౌగోళికంలోని అన్ని ప్రాథమిక అంశాలు .
  • ప్రపంచ జాగ్రఫీకి సంబంధించి విశ్వం, సౌర కుంబం, గ్రహాలు, ఉపగ్రహాల గురించి తెలుసుకోవాలి. భూమికి సంబంధించి భూభ్రమణం, భూపరిభ్రమణం. భూమి అంతర్నిర్మాణం-పొరలు, పీఠభూములు, మైదానాలు, భూ స్వరూపాలు, అంతర్జాతీయ దినరేఖ, వంటి ముఖ్య నిర్వచనాలు తెల్సుకోవాలి.
  • ప్రధాన పంటలు, అధిక దిగుబడి పంటలు, దేశాలు, వ్యవసాయ రీతులు, వ్యవసాయ ఉత్పత్తులు; అటవీ విస్తరణ, అంతరించిపోతున్న జీవజాతుల గురించి కూడా ప్రశ్నలు అడుగుతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అంశాలు కూడా తప్పనిసరిగా చదవాలి.

APPSC Group 2 Free Notes PDF Download (Adda247 Studymate Notes)

How to Prepare for Indian Economy for APPSC Group-1: భారతీయ ఆర్ధిక వ్యవస్థ

ఈ అంశం భారతీయ ఆర్థిక వ్యవస్థలో ప్రణాళిక, ఆర్థిక సమస్యలు మరియు ఆర్థిక సంస్కరణలు వంటి అంశాలను కలిగి ఉంటుంది. భారతీయ ఆర్థిక వ్యవస్థలో ప్రశ్నలు ప్రాథమిక స్వభావం కలిగి ఉంటాయి. ఎకనామిక్స్‌పై ఎన్‌సిఇఆర్‌టి పుస్తకాలు సబ్జెక్ట్-ఆధారిత ప్రశ్నలకు సమాధానమివ్వడంలో సరిపోతాయి.

  • అయితే, ఈ అంశంలో కరెంట్ అఫైర్స్ సంబంధిత ప్రశ్నలకు ఎక్కువ అవకాశం ఉంది. అందువల్ల, అభ్యర్థులు కరెంట్ అఫైర్స్ కోసం సిద్ధమవుతూనే భారతీయ ఆర్థిక సమస్యలు మరియు ఈవెంట్‌లకు సిద్ధం కావాలి. అంతేకాకుండా, అభ్యర్థి తప్పనిసరిగా పేదరికం, నిరుద్యోగం, వృద్ధి రేటు, 2011 జనాభా లెక్కలు సంబంధిత అంశాలైన లింగ నిష్పత్తి, స్త్రీ నిష్పత్తి, నిరక్షరాస్యత వంటి వివిధ అంశాలపై తాజా గణాంకాలను సిద్ధం చేయాలి, ఎందుకంటే ఈ అంశాల నుండి ప్రత్యక్ష ప్రశ్నలు పరీక్షలో వస్తాయి.
  • జాతీయ ఆదాయం, జిడిపి, టోకు ధరల సూచీ, వృద్ధి, వంటి వివిధ భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన కీలక అంశాలు తప్పనిసరిగా తెలుసుకోండి. జాతీయ ఉత్పత్తి, దేశీయ ఉత్పత్తి, స్థూల ఉత్పత్తి, సమీకరణాలతో సహా నికర ఉత్పత్తి వంటి అంశాలను అర్థం చేసుకోండి.
  • భారతదేశం పంచవర్ష ప్రణాళికలు, లక్ష్యాలు, వ్యూహాలు మరియు విజయాల తో పాటు నీతి ఆయోగ్ వంటి సంస్థలను అధ్యయనం చేయాలి. సుస్థిర అభివృద్ది లక్ష్యాలు, సమ్మిళిత వృద్ధిని ఎలా సాధించవచ్చు? సమ్మిళిత వృద్ధి అంటే ఏమిటి? వంటి కీలక అంశాలు విశ్లేషించాలి.  ‘నీతి ఆయోగ్’ నిర్మాణం – లక్ష్యాలు, విధులు సాధించిన ప్రగతి తదితరాలను చదవాలి.
  •  పేదరికం మరియు నిరుద్యోగం అంటే ఏమిటి? పేదరికం, నిరుద్యోగంపై చేపట్టిన నివారణ చర్యలు, కార్యక్రమాలు, పధకాలు మరియు వీటిలో స్వయం ఉపాధి పథకాలు, వేతన ఉపాధి పథకాల అధ్యయనం  చేయాలి.
  • మైన్స్ లో ప్రశ్నలకు సమాధానాలు రాసేలా ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా విశ్లేషించి సమాధానాన్ని సమగ్రంగా రాయగలిగేలా అభ్యాసం చేయండి.

Economy Complete study material in telugu 

How to prepare for Indian polity for APPSC Group-1: ఇండియన్ పాలిటి

ఈ విభాగంలో దేశంలో ప్రాథమిక పరిపాలన, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు మొదలైన అంశాలు ఉన్నాయి. రాజ్యాంగ సమస్యలు మరియు పబ్లిక్ పాలసీ వంటి అంశాల పై పట్టు ఉండాలి. అందువల్ల, అభ్యర్థులు సబ్జెక్టుపై ప్రాథమిక అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అభ్యర్థులు తప్పనిసరిగా భారత రాజ్యాంగం, ప్రభుత్వ కార్యక్రమాలు మరియు విధానాల యొక్క ముఖ్యమైన లక్షణాలను పై సిద్ధంకావాలి. అభ్యర్థులు ముఖ్యమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యక్రమాలు మరియు విధానాల కోసం కూడా సిద్ధం కావాలి.

  • పాలిటీపై NCERT పాఠ్యపుస్తకాలను చదవడం వల్ల భారతీయ రాజకీయాలపై విస్తృత అవగాహన లభిస్తుంది.
  • తెలుగు మీడియం అభ్యర్థుల కోసం APPSC గ్రూప్ -1, గ్రూప్ -2 మరియు గ్రూప్ -3 పరీక్షలకు అవసరమైన పూర్తి ఇండియన్ పాలిటీ మెటీరియల్‌ను మేము సిద్ధం చేశాము. మీరు ఈ మెటీరియల్‌ను ఇక్కడ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు: ఇండియన్ పాలిటీ తెలుగు మెటీరియల్
  • భారత రాజ్యాంగంలో అతిముఖ్యమైన అంశాలు: భారత రాజ్యాంగం-పరిణామ క్రమం, ప్రాథమిక హక్కులు, విధులు, న్యాయ వ్యవస్థ, సమాఖ్య వ్యవస్థ, ప్రభుత్వ వ్యవస్థ, పార్లియమెంటరీ వ్యవస్థ, అధికారాలు, నియామకాలు, విచక్షణా అధికారాలు వంటి అంశాల పై పట్టు ఉండాలి.

Unlock Success with Adda’s STUDYMATE: Your Ultimate Companion for APPSC GROUP-2 Prelims 2024

How to Prepare for quantitative aptitude and reasoning for APPSC Group-1

పేపర్‌లో ముఖ్యంగా మ్యాథ్స్ మరియు కామర్స్ బ్యాక్‌గ్రౌండ్ స్టూడెంట్‌లకు ఈ విభాగంలో అత్యధిక మార్కులు వచ్చే అంశం. అయితే, మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్ లేని అభ్యర్ధులు ఈ విభాగానికి అధిక సమయం కేటాయించాలి ప్రతీ అంశాన్ని సమగ్రంగా తెలుసుకోవాలి. ఇందులో డేటా ఇంటర్‌ప్రెటేషన్, లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ మొదలైనవి ఉన్నాయి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ & డేటా ఇంటర్‌ప్రెటేషన్, లాజికల్ రీజనింగ్, వెర్బల్ మరియు నాన్ వెర్బల్ రీజనింగ్ లో ప్రశ్నలకి రోజువారీ మరియు విభాగం వారీగా మాక్ టెస్ట్లు లేదా ప్రాక్టీస్ బిట్లు తరచూ సాధన చేయడం వలన మార్కులు కోల్పోకుండా కాపాడుకోవచ్చు.

సమయస్పూర్తి స్వీయ ఆలోచనతో డెసిషన్ మేకింగ్ ప్రశ్నలను తరచూ సాధన చెయ్యాలి. వాస్తవంగా జరుగుతున్న సమస్యలను పరిష్కరించే విధంగా ఆలోచనను పెంచుకుంటే ఇటువంటి ప్రశ్నలను సులువుగా సమాధానం చేయవచ్చు. సిలబస్ లో ఇచ్చిన ప్రతీ అంశాన్ని తపకుండా సాధన చేయడం వలన ప్రశ్నలు క్లిష్టంగా ఉన్న తగిన సమయం కేటాయించి సమాధానం చేయగలరు

How to Prepare for AP-Bifurcation Act-2014: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం

అభ్యర్థులు తప్పనిసరిగా AP పునర్వ్యవస్థీకరణ చట్టం, విభజన బిల్లులు, రాష్ట్రాల ఏర్పాటు యొక్క ముఖ్యమైన అంశాలను చదవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలోని అంశాలు చట్టాల పై ప్రశ్నలు అధిక క్లిష్టత స్థాయి ప్రశ్నలు సాధన  చేయడం వలన పరీక్షలో అడిగే ప్రశ్నలను సులువుగా సమాధానం చేయవచ్చు.

 

Practice Previous year Question papers 

గ్రూప్ -1 ప్రిలిమ్స్ మునుపటి పేపర్లను ప్రాక్టీస్ చేయడం అనేది ప్రిపరేషన్ ప్రక్రియలో మరో ముఖ్యమైన దశ. అనేక సార్లు, మునుపటి సంవత్సరాల ప్రశ్నాపత్రాల మాదిరి ప్రశ్నలు పరీక్షలలో తరచూ వస్తాయి. అంతేకాకుండా, వాటిని సాధన చేయడం వలన అభ్యర్థులు పరీక్షలో ఒక అంశం గురించి ఏ రకమైన ప్రశ్నలు అడుగుతున్నారో అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది తదనుగుణంగా ప్రిపరేషన్ ప్రణాళికలో సమయానుకూలంగా మార్పులు చేసుకుంటూ రివిజన్ కి మాక్ టెస్ట్లని చేయండి.

మరిన్ని కధనాలు చదవండి:

List of APPSC Group 2 Exam Books (New Syllabus) Decoding APPSC Group-II 2023, Download PDF
Unlock Success with Adda’s APPSC GROUP-2 STUDYMATE APPSC Group 1, 2023 Decoding PDF
How to prepare for APPSC Group-I & Group-II simultaneously Adda’s Study Mate APPSC Group 2 Prelims
APPSC Group 1 previous year papers 2023
 

pdpCourseImg

 మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు APP ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు Youtube Official Channel ఇక్కడ క్లిక్ చేయండి

 

Sharing is caring!