జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ జగ్మోహన్ మల్హోత్రా కన్నుమూశారు. జగ్మోహన్ జమ్మూ కాశ్మీర్ గవర్నర్ గా రెండు సార్లు, ఒకసారి 1984 నుండి 1989 వరకు, ఆ పై జనవరి 1990 నుండి మే 1990 వరకు పనిచేశారు. ఢిల్లీ, గోవా మరియు డామన్ & డియు లెఫ్టినెంట్ గవర్నర్‌గా కూడా పనిచేశారు.
జగ్మోహన్ 1996 లో మొదటిసారి లోక్సభకు ఎన్నికయ్యారు మరియు 1998 లో అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో కేంద్ర పట్టణాభివృద్ధి మరియు పర్యాటక మంత్రిగా పనిచేశారు. ఇవే కాకుండా 1971 లో పద్మశ్రీ, 1977లో పద్మభూషణ్, 2016లో పద్మవిభూషణ్ లతో సత్కరించారు.