DPIIT తొమ్మిది మంది సభ్యుల ప్యానెల్‌ను ప్రారంభించింది
- డిజిటల్ గుత్తాధిపత్యాలను అరికట్టడానికి రూపొందించిన ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC) అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం తొమ్మిది మంది సభ్యుల ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. ఈ ONDC ప్రాజెక్టును వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని Department of Promotion of Industry and Internal Trade (DPIIT) ప్రారంభించింది మరియు దీనిని క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (QCI) అమలు చేయనుంది.
- డిజిటలైజేషన్, కార్యకలాపాలను ప్రామాణీకరించడానికి, సరఫరాదారులను చేర్చడాన్ని ప్రోత్సహించడానికి, లాజిస్టిక్స్లో సామర్థ్యాలను పొందటానికి మరియు వినియోగదారులకై అవసరమైన చర్యలపై ONDC యొక్క తొమ్మిది మంది సభ్యుల కమిటీ భారత ప్రభుత్వానికి సలహా ఇస్తుంది.
ఆన్లైన్ లైవ్ క్లాస్సుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ప్యానెల్ సభ్యులు:
- నందన్ నీలేకని, నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఇన్ఫోసిస్;
- ఆర్.ఎస్ శర్మ, నేషనల్ హెల్త్ అథారిటీ యొక్క CEO;
- ఆదిల్ జైనుల్‌భాయ్, క్యూసిఐ చైర్మన్;
- అంజలి బన్సాల్, అవానా క్యాపిటల్ వ్యవస్థాపకుడు మరియు చైర్‌పర్సన్;
- అరవింద్ గుప్తా, డిజిటల్ ఇండియా ఫౌండేషన్ సహ వ్యవస్థాపకుడు మరియు అధిపతి;
- దిలీప్ అస్బే, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క MD & CEO;
- సురేష్ సేథి, NSDL ఇ-గవర్నెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ యొక్క MD మరియు CEO;
- ప్రవీణ్ ఖండేల్వాల్, ఆల్ ఇండియా ట్రేడర్స్ సమాఖ్య ప్రధాన కార్యదర్శి;
- కుమార్ రాజగోపాలన్, రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా యొక్క CEO
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి