Telugu govt jobs   »   Latest Job Alert   »   APPSC రిక్రూట్మెంట్ 2024

APPSC has released 6 notifications for filling up Various Vacancies in AP | APలో వివిధ ఖాళీల భర్తీకి APPSC 6 నోటిఫికేషన్‌లను విడుదల చేసింది

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. ఈ నోటిఫికేషన్ ల విడుదల క్రమంలో9 ఫిబ్రవరి 2024 న APPSC కొత్తగా వేర్వేరు కేటగిరీల్లో 33 ఉద్యోగాల భర్తీకి 6 నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఇందులో  కాలుష్య నియంత్రణ మండలిలో అనలిస్ట్‌ గ్రేడ్‌-2 లో 18 ఖాళీలు, టౌన్‌ కంట్రీ ప్లానింగ్‌ సర్వీస్‌లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ లో 07 ఖాళీలు, మెడికల్‌ ఎడ్యుకేషన్‌ సర్వీస్‌లో లైబ్రేరియన్‌ -04 ఖాళీలు, ట్రైబల్‌ వెల్ఫేర్‌ సర్వీస్‌లో అసిస్టెంట్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ లో 01 ఖాళీలు,  వెల్ఫేర్‌ ఆఫ్‌ డిఫరెంట్లీ ఎబుల్డ్‌ ట్రాన్స్‌జెండర్‌,  సీనియర్‌ సిటిజన్‌ సర్వీస్‌లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌  లో 02 ఖాళీలు, భూగర్భ నీటిపారుదల శాఖలో అసిస్టెంట్‌ కెమిస్ట్‌ కింద  01 ఖాళీల చొప్పున మొత్తం 33 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది.

APPSC 6 నోటిఫికేషన్‌లకు ముఖ్యమైన తేదీలు

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) వేర్వేరు కేటగిరీల్లో 33 ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ psc.ap.gov.inలో 33 ఖాళీలకు దరఖాస్తు చేసుకోగలరు.  ఒక్కో పోస్ట్ కి ఒక్కో దరఖాస్తు తేదీలు ఉన్నాయి. పోస్టుల వారీగా ముఖ్యమైన తేదీలను కింది పట్టికలో చూడండి.

APPSC 6 నోటిఫికేషన్‌లకు ముఖ్యమైన తేదీలు
పోస్టులు  దరఖాస్తు ప్రారంభ తేదీ చివరి తేదీ
కాలుష్య నియంత్రణ మండలిలో అనలిస్ట్‌ గ్రేడ్‌-2 19 మార్చి 2024 08 ఏప్రిల్ 2024
A.P. టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ సర్వీస్‌లో అసిస్టెంట్ డైరెక్టర్ 21 మార్చి 2024 10 ఏప్రిల్ 2024
మెడికల్‌ ఎడ్యుకేషన్‌ సర్వీస్‌లో లైబ్రేరియన్‌ 27 మార్చి 2024 16 ఏప్రిల్ 2024
ట్రైబల్‌ వెల్ఫేర్‌ సర్వీస్‌లో అసిస్టెంట్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ 27 మార్చి 2024 16 ఏప్రిల్ 2024
వెల్ఫేర్‌ ఆఫ్‌ డిఫరెంట్లీ ఎబుల్డ్‌ ట్రాన్స్‌జెండర్‌,  సీనియర్‌ సిటిజన్‌ సర్వీస్‌లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ 01 ఏప్రిల్ 2024 21 ఏప్రిల్ 2024
భూగర్భ నీటిపారుదల శాఖలో అసిస్టెంట్‌ కెమిస్ట్‌ 01 ఏప్రిల్ 2024 21 ఏప్రిల్ 2024

APలో వివిధ ఖాళీల భర్తీకి APPSC 6 నోటిఫికేషన్‌ల PDF

APPSC రిక్రూట్మెంట్ 2024 నోటిఫికేషన్‌ PDF
కాలుష్య నియంత్రణ మండలిలో అనలిస్ట్‌ గ్రేడ్‌-2 నోటిఫికేషన్‌ PDF
A.P. టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ సర్వీస్‌లో అసిస్టెంట్ డైరెక్టర్ నోటిఫికేషన్‌ PDF
మెడికల్‌ ఎడ్యుకేషన్‌ సర్వీస్‌లో లైబ్రేరియన్‌ నోటిఫికేషన్‌ PDF
ట్రైబల్‌ వెల్ఫేర్‌ సర్వీస్‌లో అసిస్టెంట్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ నోటిఫికేషన్‌ PDF
వెల్ఫేర్‌ ఆఫ్‌ డిఫరెంట్లీ ఎబుల్డ్‌ ట్రాన్స్‌జెండర్‌,  సీనియర్‌ సిటిజన్‌ సర్వీస్‌లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నోటిఫికేషన్‌ PDF
భూగర్భ నీటిపారుదల శాఖలో అసిస్టెంట్‌ కెమిస్ట్‌ నోటిఫికేషన్‌ PDF

Adda247 Telugu

APPSC/TSPSC Sure shot Selection Group

విభాగాల వారీగా ఖాళీల వివరాలివే

పోస్టులు ఖాళీలు
కాలుష్య నియంత్రణ మండలిలో అనలిస్ట్‌ గ్రేడ్‌-2 18
A.P. టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ సర్వీస్‌లో అసిస్టెంట్ డైరెక్టర్ 07
మెడికల్‌ ఎడ్యుకేషన్‌ సర్వీస్‌లో లైబ్రేరియన్‌ 04
ట్రైబల్‌ వెల్ఫేర్‌ సర్వీస్‌లో అసిస్టెంట్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ 01
వెల్ఫేర్‌ ఆఫ్‌ డిఫరెంట్లీ ఎబుల్డ్‌ ట్రాన్స్‌జెండర్‌,  సీనియర్‌ సిటిజన్‌ సర్వీస్‌లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ 02
భూగర్భ నీటిపారుదల శాఖలో అసిస్టెంట్‌ కెమిస్ట్‌ 01
మొత్తం 33

APPSC రిక్రూట్మెంట్ 2024 అర్హత ప్రమాణాలు

వయోపరిమితి

అభ్యర్థులు జూలై 1, 2024 నాటికి 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.

విద్యార్హతలు

పోస్టుల వారీగా విద్యార్హతలు
పోస్టులు విద్యార్హతలు
కాలుష్య నియంత్రణ మండలిలో అనలిస్ట్‌ గ్రేడ్‌-2 భారతదేశంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీలో కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, బయాలజీ లేదా ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్‌లో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి.
A.P. టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ సర్వీస్‌లో అసిస్టెంట్ డైరెక్టర్ B.Arch., లేదా B.E (సివిల్) లేదా B.Planning / B.Tech., (ప్లానింగ్) లేదా MA (జియోగ్రఫీ) యొక్క కనీస విద్యార్హత మరియు భారతదేశంలోని విశ్వవిద్యాలయం నుండి టౌన్ ప్లానింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిప్లొమా కలిగి ఉండాలి.
మెడికల్‌ ఎడ్యుకేషన్‌ సర్వీస్‌లో లైబ్రేరియన్‌ కేంద్ర/రాష్ట్ర చట్టం కింద స్థాపించబడిన లేదా విలీనం చేయబడిన లేదా యుజిసి ద్వారా గుర్తింపు పొందిన ఒక విశ్వవిద్యాలయం యొక్క M.A/M.Sc/M.Com M.Li.Sc ఉత్తీర్ణత.
ట్రైబల్‌ వెల్ఫేర్‌ సర్వీస్‌లో అసిస్టెంట్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ప్రావిన్షియల్ యాక్ట్, సెంట్రల్ యాక్ట్, స్టేట్ యాక్ట్ లేదా యూనివర్శిటీ గ్రాంట్స్ కమీషన్ ద్వారా గుర్తించబడిన సంస్థ ద్వారా స్థాపించబడిన లేదా విలీనం చేయబడిన భారతదేశంలోని విశ్వవిద్యాలయం యొక్క బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి
వెల్ఫేర్‌ ఆఫ్‌ డిఫరెంట్లీ ఎబుల్డ్‌ ట్రాన్స్‌జెండర్‌,  సీనియర్‌ సిటిజన్‌ సర్వీస్‌లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సెంట్రల్ యాక్ట్ లేదా స్టేట్ యాక్ట్ లేదా ప్రొవిన్షియల్ యాక్ట్ లేదా యూనివర్శిటీ గ్రాంట్స్ కమీషన్ ద్వారా గుర్తించబడిన ఏదైనా ఇతర సమానమైన అర్హతతో స్థాపించబడిన లేదా విలీనం చేయబడిన భారతదేశంలోని ఏదైనా విశ్వవిద్యాలయం నుండి సోషియాలజీ లేదా సోషల్ సైన్స్ లేదా సోషల్ వర్క్ లేదా సైకాలజీలో మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉండాలి.
భూగర్భ నీటిపారుదల శాఖలో అసిస్టెంట్‌ కెమిస్ట్‌ కెమిస్ట్రీ లేదా అప్లైడ్ కెమిస్ట్రీలో M.Sc డిగ్రీ లేదా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ద్వారా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుండి కెమికల్ ఇంజనీరింగ్, కెమికల్ టెక్నాలజీలో డిగ్రీ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి

APPSC రిక్రూట్మెంట్ 2024 జీతం

APPSC రిక్రూట్మెంట్ 2024 జీతం
పోస్టులు జీతం
కాలుష్య నియంత్రణ మండలిలో అనలిస్ట్‌ గ్రేడ్‌-2  రూ.48,440-1,37,220
A.P. టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ సర్వీస్‌లో అసిస్టెంట్ డైరెక్టర్ రూ.61960-1,51,370
మెడికల్‌ ఎడ్యుకేషన్‌ సర్వీస్‌లో లైబ్రేరియన్‌ రూ.61960-1,51,370
ట్రైబల్‌ వెల్ఫేర్‌ సర్వీస్‌లో అసిస్టెంట్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌  రూ.48,440-1,37,220
వెల్ఫేర్‌ ఆఫ్‌ డిఫరెంట్లీ ఎబుల్డ్‌ ట్రాన్స్‌జెండర్‌,  సీనియర్‌ సిటిజన్‌ సర్వీస్‌లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ రూ.57,100-1,47,760
భూగర్భ నీటిపారుదల శాఖలో అసిస్టెంట్‌ కెమిస్ట్‌  రూ.48,440-1,37,220

APPSC Group 2 Prelims Weekly Revision Mini Mock Tests in Telugu and English by Adda247

మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు క్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

APPSC has released 6 notifications for filling up Various Vacancies in AP_5.1