Telugu govt jobs   »   APPSC GROUP-III Exam Pattern & Syllabus...

APPSC GROUP-III Exam Pattern & Syllabus in Telugu | APPSC గ్రూప్-3 పరీక్షా విధానం మరియు సిలబస్

APPSC GROUP-III Syllabus & Exam Pattern : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ APPSC GROUP-III భర్తీ చేసే అంత్యంత ప్రతిష్టాత్మక ఉద్యోగాలలో APPSC GROUP-III (పంచాయతి సెక్రటేరియట్-గ్రేడ్-IV) ఉద్యోగాలు ఒకటి. రాష్ట్రంలోని వివిధ పంచాయతీలలో ఉన్న ఖాళీల ఆధారంగా APPSC GROUP-III భర్తీ చేయడం జరుగుతుంది. సచివాలయం పోస్టుల మాదిరి కాకుండా వీటి కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్-APPSC నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఇటీవల కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలోని వివిధ శాఖలలో ఉన్న ఖాళీలపై నివేదిక సమర్పించమని అధికారులను ఆదేశించిన విషయం విదితమే. ఈ నేపధ్యంలో APPSC GROUP-III పరీక్ష యొక్క విధానం మరియు సిలబస్ పై పూర్తి విశ్లేషణతో కూడిన వ్యాసం మీకోసం.

APPSC GROUP-III Syllabus & Exam Pattern – గ్రూప్-3 పరీక్షా విధానం

ఈ పరీక్ష రెండు దశలో జరుగుతుంది.

  1. ప్రిలిమ్స్
  2. మెయిన్స్

 

గ్రూప్-3 పరీక్షా విధానం – ప్రిలిమ్స్ 

ప్రిలిమ్స్ కేవలం అర్హత పరీక్ష మాత్రమే ఈ మార్కులు తుది ఎంపికకు పరిగణించబడవు.

రాతపరీక్ష (బహులైచ్చిక విధానం) మార్కులు సమయం అత్యధిక మార్కులు
పార్ట్-A : జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ 75 75  

150

పార్ట్-B : గ్రామీణ అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి గ్రామీనాభివృద్ది సమస్యలు 75 75
ఋణాత్మక మార్కులు: ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు కోత విధించబడుతుంది

 

గ్రూప్-3 పరీక్షా విధానం – మెయిన్స్ 

దీనిలో వచ్చిన మార్కుల ఆదరంగా అభ్యర్ధులను తుది ఎంపిక చేస్తారు.

రాతపరీక్ష (బహులైచ్చిక విధానం) మార్కులు సమయం అత్యధిక మార్కులు
Paper-1 : జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ 150 150  

300

Paper-2: గ్రామీణ అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి గ్రామీనాభివృద్ది సమస్యలు 150 150
ఋణాత్మక మార్కులు: ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు కోత విధించబడుతుంది

 

 

APPSC GROUP-III Syllabus & Exam Pattern- గ్రూప్-3(పంచాయతి సెక్రటరి గ్రేడ్-iv) సిలబస్ 

గ్రూప్-3 ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ యొక్క సిలబస్ ఒక్కటే ఇవ్వడం జరిగింది. క్రింది సిలబస్ ను పరిశీలించగలరు.

పార్ట్-A (జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటి)(75 ప్రశ్నలు)(75 మార్కులు )

  1. జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన సంఘటనలు.
  2. అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ వర్తమాన అంశాలు.
  3. జనరల్ సైన్స్, శాస్త్ర సాంకేతిక రంగాలు, సమాచార సాంకేతీకతలో సమకాలీన అభివృద్ధి, దైనందిన జీవితంలో అనువర్తనాలు.
  4. భారత జాతీయోద్యమంపై ప్రత్యేక దృష్టితో భారతదేశంలో సామాజిక, ఆర్ధిక, రాజకీయ చరిత్ర.
  5. భారత రాజకీయ వ్యవస్థ పాలనసమస్యలు, రాజ్యాంగ ప్రభుత్వ విధానాలు, సంస్కరణలు.
  6. స్వతంత్రం అనంతరం భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి.
  7. భారతదేశం భూగోళ శాస్త్రం, భౌతిక, సాంస్కృతిక, జనాభా, ఆర్థిక, సాంఘిక మరియు మౌలిక అంశాల దృష్ట్యా,ఆంధ్రప్రదేశ్ భూగోళ శాస్త్రం.
  8. విపత్తు నిర్వహణ ప్రాంతాలు, సంభవించే విపత్తులు, నష్ట నివారణ, ఉపశమన చర్యలు, రిమోట్ సెన్సింగ్, జి.ఐ.ఎస్ సహాయంతో విపత్తు అంచనా.
  9. సుస్థిరమైన అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ.
  10. తార్కిక వివరణ,విశ్లేషణాత్మక సామర్ధ్యాలు,తార్కిక అన్వయం.
  11. దత్తాంశ విశదీకరణరూపం టేబుల్ దత్తాంశానికి, దత్తాంశ ధ్రువీకరణ, అన్వయం, ప్రాథమిక విశ్లేషణ అంకగణితం, మధ్యగతం బహుళకం.
  12. ఆంధ్రప్రదేశ్ విభజన,పరిపాలన, ఆర్ధిక, సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ, చట్టపరమైన సమస్యలు.

 

పార్ట్-B: (గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ అభివృద్ధి మరియు సమస్యలు, ఆంధ్రప్రదేశ్ కు  ప్రత్యేక సూచనలు)

  1. రాజ్యాంగ సవరణలు మరియు వివిధ కమిటీల పునరావాసాలతో సహా భారతదేశంలో పంచాయతీ రాజ్ వ్యవస్థ యొక్క పరిణామం.
  2. ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ రాజ్ వ్యవస్థ పరిణామం.
  3. పంచాయతీ కార్యదర్శి, విధులు, బాధ్యతలు.
  4. గ్రామీణ సమాజం, గ్రామీణ పేదల అభివృద్ధి కొరకు ప్రవేశపెట్టిన పథకాలు చరిత్ర మరియు పరిణామక్రమం.
  5. కేంద్ర రాష్ట్ర గ్రామీణాభివృధి శాఖలు, ప్రధాన గ్రామీణాభివృధి పథకాలు.
  6. పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య పథకాలు.
  7. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ – వ్యవసాయం, చిన్న తరహా పరిశ్రమలు.
  8. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పరపతి విధానం (Rural క్రెడిట్ Scenario)- బ్యాంకులు, సహకార సంఘాలు సూక్ష్మ విత్త సంస్థల పాత్ర.
  9. సమాజ ఆధారిత సంస్థలు మరియు సంక్షేమ పథకాల కేంద్రీకరణ.
  10. స్వయం సహాయక బృందాల ద్వారా మహిళా సాధికారత మరియు ఆర్ధికాభివృధి.
  11. స్థానిక సంస్థల ఆదాయ మరియు వ్యయాల నిర్వహణ.
  12. వివిధ పథకాల నిధులు, గ్రాంట్ల నిర్వహణ.

 

APPSC GROUP-III Syllabus & Exam Pattern – Conclusion

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ APPSC GROUP-III భర్తీ చేసే అంత్యంత ప్రతిష్టాత్మక ఉద్యోగాలలో APPSC GROUP-III (పంచాయతి సెక్రటేరియట్-గ్రేడ్-IV) ఉద్యోగాలు ఒకటి,ఈ APPSC GROUP-III పరీక్షలో రాణించాలంటే APPSC GROUP-III పరిక్ష విధానం మరియు సిలబస్ పై పూర్తి అవగాహనను కలిగి ఉండాలి,కాబట్టి APPSC GROUP-III పరిక్ష విధానం మరియు సిలబస్ Adda247 ద్వారా అందించబడినది.

 

APPSC GROUP-III Syllabus & Exam Pattern – FAQs

Q1.APPSC GROUP-III లో ఇంటర్వ్యూ ఉంటుందా?

: APPSC GROUP-III పరిక్ష లో ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ మాత్రమే ఉంటుంది.దీనిలో వచ్చిన మార్కుల ఆదరంగా అభ్యర్ధులను తుది ఎంపిక చేస్తారు.

Q2.APPSC GROUP-III పరిక్షలో నెగటివ్ మార్కింగ్(కోత) విధించబడుతుందా?

: ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు కోత విధించబడుతుంది.

Q3.APPSC GROUP-III పరీక్ష లో చదవాల్సిన ముఖ్యమైన సబ్జెక్టు లు ఏమిటి ?

: APPSC GROUP-III పరీక్ష లో చదవాల్సిన ముఖ్యమైన సబ్జెక్టు లు జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీ,చరిత్ర, పాలిటీ మరియు సొసైటీ,ఎకానమీ అండ్ డెవలప్ మెంట్,సమకాలిన అంశాలు(కరెంటు అఫైర్స్).

Q4.. Adda247 కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో అందిస్తుందా?

:అవును, Adda247  తెలుగు భాషలలో కూడా వారం,నెలవారీ కరెంట్ అఫైర్స్ PDFలను అందిస్తుంది.తాజా  సమకాలీన అంశాలను కవర్ చేయడానికి ఉత్తమ మార్గం రోజువారీ వార్తాపత్రికను చదవడం మరియు కొన్ని విశ్వసనీయ వెబ్‌సైట్‌లను అనుసరించడం. రోజువారీ సమకాలీన అంశాలు Adda247  ఉత్తమ వెబ్‌సైట్-adda247/te లో అందించబడుతుంది. ఇది adda247/te వెబ్‌సైట్‌ తో పాటు యప్ లో కూడా అందుబాటులో ఉంటుంది.

Q5. తెలుగులో Adda247 యప్ ను తెలుగు లో వీక్షించడం ఎలా?

జ: యప్ డౌన్లోడ్ చేసుకొని,స్టేట్ ఎగ్జామ్స్ ఎంచుకొని,ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ పై క్లిక్  చేసి బాష ను తెలుగు లోకి మార్చడం ద్వారా వీక్షించగలరు.

 

జనరల్ స్టడీస్-పాలిటి నోట్స్ PDF తెలుగు లో

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో మే నెల వారి కరెంట్ అఫైర్స్ PDF  తెలుగులో
జూలై 3వ వారం కరెంట్ అఫైర్స్ PDF  ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF
తెలంగాణా స్టేట్ GK PDF తెలుగు లో Static, Banking, Computer Awareness PDF

 

 

Sharing is caring!