APPSC (ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) 899 గ్రూప్ 2 ఎగ్జిక్యూటివ్ మరియు నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం APPSC గ్రూప్ 2 నోటిఫికేషన్ 2023ని విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 21 డిసెంబర్ 2023 నుండి www.psc.ap.gov.inలో అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు తమ వివరాలను మార్చుకునేందుకు లేదా తప్పులను సవరించుకునేందుకు APPSC సవరణ లింకు ని అందుబాటులోకి తెచ్చింది. ఈ కధనం లో APPSC గ్రూప్ 2 దరఖాస్తు సవరణ లింకు పూర్తి వివరాలు అందించాము.
APPSC/TSPSC Sure shot Selection Group
APPSC గ్రూప్ 2 ఎంపిక ప్రక్రియ
APPSC గ్రూప్ 2 ఎంపిక ప్రక్రియలో 3 దశలు ఉన్నాయి. మొదటి దశ ప్రిలిమ్స్, రెండవ దశ మెయిన్స్ మరియు మూడవ దశ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. మొత్తం రెండు దశలు కలిపి 450 మార్కులకు రాతపరీక్షల ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ప్రిలిమ్స్ (స్క్రీనింగ్) పరీక్ష 150 మార్కులకు ఉంటుంది. రెండో దశలో 300 మార్కులకు మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హుత సాధించిన అభ్యర్ధులు మాత్రమే మెయిన్స్ పరీక్ష రాయడానికి అర్హులు అవుతారు. పోస్టుకు ఎంపిక కావడానికి అభ్యర్థులు ఈ దశలన్నింటిలో ఉత్తీర్ణులు కావాలి.
- స్క్రీనింగ్ టెస్ట్ (ప్రిలిమ్స్)
- మెయిన్స్ పరీక్ష
- కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (CPT)
APPSC గ్రూప్ 2 సవరణ లింకు
APPSC గ్రూప్-2 ఉద్యోగాలకు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ దరఖాస్తు లో అందించిన వివరాలను సవరించుకునేందుకు లేదా ఎడిట్ చేసుకొనేందుకు APPSC గ్రూప్2 యొక్క సవరణ లింకుని అందుబాటులోకి తెచ్చింది. APPSC వెబ్‌సైట్‌లో గ్రూప్ 2 అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్‌ను ఆక్టివేట్ చేసింది. వివరాలు తప్పుగా నమోదు చేసిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తప్పులు సరి చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ కింద అందించిన సవరణ లింకు ద్వారా అభ్యర్ధులు లాగిన్ అయ్యి వివరాలు సవరించుకోవచ్చు.
APPSC గ్రూప్ 2 దరఖాస్తు సవరణ లింకు
APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష తేదీ 2023
APPSC గ్రూప్ II 2023 ప్రిలిమ్స్ పరీక్షను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫిబ్రవరి 25, 2024న నిర్వహించనుంది. అన్ని పోస్టులకు APPSC గ్రూప్ 2 సిలబస్, స్క్రీనింగ్ టెస్ట్ మరియు మెయిన్స్ ఎగ్జామినేషన్ రెండింటికీ సమానంగా ఉంటుంది. కొన్ని పోస్టులకు మాత్రమే కంప్యూటర్ ప్రావీణ్యత పరీక్ష నిర్వహిస్తారు.
Adda’s Study Mate APPSC Group 2 Prelims 2024
APPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష తేదీ 2023
APPSC గ్రూప్ II స్క్రీనింగ్ టెస్ట్ /ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాదించిన అభ్యర్ధులు మెయిన్స్ రాయడానికి ఎంపిక చేయబడతారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఇంకా మెయిన్స్ పరీక్ష తేదీ ని విడుదల చేయలేదు. APPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష తేదీ 2023 విడుదల అయిన వెంటనే మేము ఇక్కడ అప్డేట్ చేస్తాము.