Telugu govt jobs   »   APPSC గ్రూప్ 1 నోటిఫికేషన్   »   APPSC గ్రూప్ 1 పరీక్ష విధానం 2024

APPSC గ్రూప్ 1 పరీక్షా విధానం 2024, ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్షా సరళిని తనిఖీ చేయండి

APPSC గ్రూప్ 1 పరీక్షా సరళి 2024: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) 27 డిసెంబర్ 2023 న APPSC గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసింది. APPSC గ్రూప్ 1 నోటిఫికేషన్ లో 81 పోస్టులను విడుదల చేసింది. APPSC ఇప్పుడు గ్రూప్ 1 కి సంబంధించి పరీక్షా విధానాన్ని విడుదల చేసింది. APPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలో ఒక పేపర్ మాత్రమే ఉంటుంది. APPSC గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలో మొత్తం ఏడూ పేపర్స్ ఉంటాయి. ప్రతి పేపర్‌కి 150 మార్కులు ఉంటాయి. ఒక్కో పేపరుకు 180నిమిషాల సమయం కేటాయిస్తారు. APPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్షా విధానం 2024 వివరాలు ఇక్కడ అందించాము. APPSC గ్రూప్ 1 పరీక్షా విధానం కి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఈ కధనాన్ని తనిఖీ చేయండి.

Important Instructions for APPSC Group 1 Candidates

APPSC గ్రూప్ 1 ఎంపిక ప్రక్రియ:

APPSC గ్రూప్ 1 పరీక్షలో మూడు దశలలో ఎంపిక ప్రక్రియ ఉంటుంది – స్క్రీనింగ్ టెస్ట్ (ప్రిలిమ్స్) మరియు మెయిన్ పరీక్ష.మరియు ఇంటర్వ్యూ. ప్రిలిమినరీ పరీక్ష ఆబ్జెక్టివ్‌గా ఉంటుంది, ఇది అర్హత సాధించిన అభ్యర్ధులకు మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు మెయిన్స్ డిస్క్రిప్టివ్‌గా విధానంలో ఉంటుంది. పై రెండు దశలు  అర్హత సాధించిన అభ్యర్ధులు ఇంటర్వ్యూ కి హాజరవుతారు ఇంటర్వ్యూ 75 మార్కులకు ఉంటుంది.

  • ప్రిలిమినరీ పరీక్ష (ఆబ్జెక్టివ్ విధానం)
  • మెయిన్స్ (రాత పరీక్ష)
  • ఇంటర్వ్యూ (మౌఖిక పరీక్ష)

APPSC గ్రూప్ 1 సిలబస్ 2024, ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ సిలబస్, డౌన్‌లోడ్ PDF_30.1

Adda247 APP

APPSC గ్రూప్ 1 పరీక్షా సరళి 2024 అవలోకనం

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్ 1 కి సంబంధించి పరీక్షా విధానాన్ని విడుదల చేసింది. APPSC గ్రూప్ 1 పరీక్షా విధానం అవలోకనం దిగువ పట్టికలో అందించాము

APPSC గ్రూప్ 1 పరీక్షా విధానం 2024 అవలోకనం

పరీక్ష పేరు APPSC గ్రూప్ 1
నిర్వహించే సంస్థ APPSC
APPSC గ్రూప్ 1 అధికారిక వెబ్‌సైట్ psc.ap.gov.in
APPSC గ్రూప్ 1 ఖాళీలు 81
APPSC గ్రూప్ 1 ఎంపిక ప్రక్రియ ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ
APPSC గ్రూప్ 1 దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్
నెగెటివ్ మార్కింగ్ 1/3వ వంతు

APPSC గ్రూప్ 1 పరీక్షా విధానం

APPSC గ్రూప్ 1 పరీక్షా విధానం 2024: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం APPSC గ్రూప్ 1 పరీక్షను నిర్వహిస్తుంది. ప్రిపరేషన్ ప్రారంభించే ముందు అభ్యర్థులు ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ రెండింటికీ APPSC గ్రూప్ 1 పరీక్షా సరళి 2024 తెలుసుకోవాలి. ఇక్కడ మేము APPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్షా సరళి 2024ని వివరంగా అందిస్తున్నాము.

APPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష విధానం 2024

  • మొత్తం 240 మార్కులకుగాను 240  ప్రశ్నలకు స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తారు.
  • పరీక్షలో రెండు పేపర్స్ ఉంటాయి ప్రతి పేపర్‌లో 120 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక్క మార్కు ఉంటుంది. ఒక్కో పేపరుకు 120నిమిషాల సమయం కేటాయిస్తారు.
  • ప్రిలిమినరీలో రెండు ఆబ్జెక్టివ్ ప్రశ్నపత్రాలు ఉంటాయి. వీటిలో పేపర్-1 జనరల్ స్టడీస్ నుండి మరియు పేపర్-2 జనరల్ ఆప్టిట్యూడ్ నుండి ప్రశ్నలు అడుగుతారు.
  • పేపర్-1లో నాలుగు సెక్షన్లు, పేపర్-2లో మూడు సెక్షన్ల నుండి ప్రశ్నలు ఉంటాయి.
  • APPSC గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షలో నెగెటివ్  మార్కింగ్ కోసం ఒక నిబంధన ఉంది. ప్రతి తప్పు సమాధానంకి 1/3 మార్కులతో కోత విధించబడుతుంది.
విభాగాలు ప్రశ్నలు సమయం మార్కులు
పేపర్-I: ఆబ్జెక్టివ్ విధానం లో జరిగే ఈ  ప్రిలిమ్స్ పరీక్షలో నాలుగు భాగాలు ఉంటాయి ఒక్కో విభాగానికి 30మార్కులు ఉంటాయి

A. History and Culture.

B. Constitution polity, Social Justice and International relations.

C. Indian and Andhra Pradesh Economy And Planning.

D. Geography.

 

 

 

 

 

120 Questions

 

 

 

 

 

120 Minutes

 

 

 

 

 

120 Marks

పేపర్ -II

Screening Test (Objective Type) Paper -II General Aptitude

This paper consists of 2 parts i.e., A and B each part carries 60 Marks (Part-A – 60 Marks, Part -B లో B(i) – 30 Marks & B (ii) – 30 Marks).

A. General Mental Ability, Administrative and Psychological Abilities.

B. (i) Science and Technology, (ii) Current events of Regional, National and International importance

 

 

 

 

 

 

120 Questions

 

 

 

 

 

 

120 Minutes

 

 

 

 

 

 

120 Marks

గమనిక :ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కుల నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.

APPSC Group 1 Previous Year Cut off

APPSC గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష విధానం

  • APPSC గ్రూప్ 1మెయిన్స్ పరీక్ష అనేది APPSC గ్రూప్ 1 పరీక్షలో చాలా ముఖ్యమైన దశ, ఎందుకంటే ఈ పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కులు తుది ఫలితం కోసం పరిగణించబడతాయి.
  • ప్రధాన పరీక్ష డిస్క్రిప్టివ్ టైప్ పరీక్ష మరియు అభ్యర్థులు అడిగిన ప్రశ్నలకు వ్యాసంలో సమాధానాలను వ్రాయాలి.
  • APPSC గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలో మొత్తం ఏడూ పేపర్స్ ఉంటాయి. ప్రతి పేపర్‌కి 150 మార్కులు ఉంటాయి. ఒక్కో పేపరుకు 180నిమిషాల సమయం కేటాయిస్తారు.
పేపర్ ప్రశ్నలు మార్కులు సమయం
తెలుగు పేపర్ అర్హత సాధిస్తే సరిపోతుంది. 150 మార్కులు 180 నిమిషాలు
ఆంగ్లం పేపర్ అర్హత సాధిస్తే సరిపోతుంది. 150 మార్కులు 180 నిమిషాలు
మెయిన్స్ పరీక్ష పేపర్ 1: జనరల్ ఎస్సే

Section-I: (i) సమకాలీన అంశాలు
Section-II: (ii) సామాజిక – రాజకీయ సమస్యలు
(iii) సామాజిక – ఆర్థిక సమస్యలు
(iv) సామాజిక – పర్యావరణ సమస్యలు
Section-III: (v) సాంస్కృతిక మరియు చారిత్రక అంశాలు.
(vi) పౌర చైతన్యానికి సంబంధించిన సమస్యలు
(vii) పరావర్తన అంశాలు

150 మార్కులు 180 నిమిషాలు
పేపర్ 2: భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ చరిత్ర మరియు సాంస్కృతిక మరియు భౌగోళిక శాస్త్రం 150 మార్కులు 180 నిమిషాలు
పేపర్ 3: రాజకీయాలు, రాజ్యాంగం, పాలన, చట్టం మరియు నీతి 150 మార్కులు 180 నిమిషాలు
పేపర్ 4: భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మరియు అభివృద్ధి 150 మార్కులు 180 నిమిషాలు
పేపర్ 5: శాస్త్రీయ మరియు సాంకేతిక విజ్ఞానాలు మరియు పర్యావరణ సమస్యలు 150 మార్కులు 180 నిమిషాలు
ఇంటర్వ్యూ 75 మార్కులు
మొత్తం మార్కులు 825 మార్కులు

 

APPSC Group 1 Prelims 2024 | Online Test Series (Telugu & English) By Adda247 Telugu

 

Sharing is caring!

FAQs

APPSC గ్రూప్ 1కి వయోపరిమితి ఎంత?

జనరల్ కేటగిరీ అభ్యర్థులకు APPSC గ్రూప్ 1 వయోపరిమితి 18 నుండి 42 సంవత్సరాలు.

APPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షా ఎన్ని మార్కులకు ఉంటుంది?

APPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షా 150 మార్కులకు ఉంటుంది

APPSC గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షా లో ఎన్ని పేపర్లు ఉంటాయి?

APPSC గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షా లో 7 పేపర్లు ఉంటాయి

APPSC గ్రూప్ 1 పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ (కటాఫ్) విధించబడిందా?

ప్రతి తప్పు సమాధానానికి 1/3 తీసివేయబడుతుంది.