Telugu govt jobs   »   Latest Job Alert   »   AP పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ AEE

AP పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (APPCB) అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్(AEE) నోటిఫికేషన్ 2023, 21 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది

AP పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ AEE నోటిఫికేషన్ 2023:

APPSC AP పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్(APPCB) అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ నోటిఫికేషన్ 2023: APPSC 2023 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నందు గల 21 అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ ను 26 డిసెంబర్ 2023 న విడుదల చేసినది. ఈ పోస్టులకు గాను 30 జనవరి 2024 నుండి 19 ఫిబ్రవరి 2024 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. 21 అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఆన్లైన్ ప్రక్రియ 30 జనవరి 2024 నుండి ప్రారంభం కానున్నది. ఈ పోస్టులకు సంబంధించి, విద్యార్హతలు, వయో పరిమితి, దరఖాస్తు విధానం వంటి పూర్తి వివరాలు మీకు ఈ కధనంలో అందుబాటులో ఉంటాయి.

AP పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ AEE నోటిఫికేషన్ 2023 అవలోకనం

ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కాలుష్య నియంత్రణ మండలిలో వివిధ అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పోస్టుల భర్తీ కోసం అభ్యర్థులను నియమించుకోవడానికి  రాత పరీక్షను నిర్వహించనున్నది.  మొత్తం పరీక్షను 450 మార్కులకు 3 పేపర్లలో నిర్వహిస్తారు. నోటిఫికేషన్ కు సంబంధించిన సంక్షిప్త సమాచారం క్రింది పట్టికలో పొందండి.

AP పొల్యూషన్ కంట్రోల్ బోర్డు AEE నోటిఫికేషన్ 2023
సంస్థ ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్(APPSC)
పోస్ట్ పేరు AP పొల్యూషన్ కంట్రోల్ బోర్డు AEE
ఖాళీలు 21
కేటగిరీ ప్రభుత్వ ఉద్యోగాలు
దరఖాస్తు ప్రారంభ తేదీ 30 జనవరి 2024
దరఖాస్తు చివరి తేదీ 19 ఫిబ్రవరి 2024
ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష-450 మార్కులకు
ఉద్యోగ స్థానం ఆంధ్ర ప్రదేశ్
అధికారిక వెబ్ సైటు https://psc.ap.gov.in

APPSC Group 2 Notification 2022

APPSC/TSPSC Sure shot Selection Group

AP పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ AEE నోటిఫికేషన్ 2023 PDF

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) తన అధికారిక వెబ్‌సైట్ @psc.ap.gov.inలో AP పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ AEE నోటిఫికేషన్ 2023 రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అధికారిక APPSC AP పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ AEE నోటిఫికేషన్ PDF ఎంపిక ప్రక్రియ, ఖాళీ, దరఖాస్తు ప్రక్రియ, సిలబస్, పరీక్షా విధానం మొదలైన వాటికి సంబంధించిన వివరాలను కలిగి ఉంది. AP పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ AEE నోటిఫికేషన్ PDF డౌన్‌లోడ్ చేసుకోవడానికి లింక్ క్రింద ఇవ్వబడింది.

APPCB AEE Assistant Environmental Engineer Notification 2023 PDF

AP పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ AEE విద్యార్హతలు:

ప్రాథమికంగా  సివిల్/మెకానికల్/కెమికల్/ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ విభాగాలలో భారతదేశంలో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ పొంది ఉండాలి.

వయో పరిమితి

AP పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ AEE కింద ఉన్న వివిధ పోస్ట్‌లకు నిర్దిష్ట వయో పరిమితి వర్తిస్తుంది.  AP పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ AEE వయో పరిమితి క్రింద ఇవ్వబడిన వివిధ పోస్ట్‌ల ఆధారంగా విభిన్నంగా ఉంటుంది. AP పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ AEE  అన్నీ పోస్ట్ లకు 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.

AP పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ AEE ఖాళీల వివరాలు:

ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణా మండలి 2023 సంవత్సరానికి 21 అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినది. విభాగాల వారీగా పోస్టుల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

కేటగిరి పోస్టుల సంఖ్య
OC 10
EWS 03
BC-A 02
BC-B 01
BC-C 02
BC-D 01
SC 03
Total 21

Adda’s Study Mate APPSC Group 2 Prelims 2024 by Adda247 Telugu

AP పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ AEE ఎంపిక ప్రక్రియ

APPSC AP పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ AEE రిక్రూట్మెంట్  ద్వారా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణా మండలిలో AEE అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ క్రింది దశలలో ఉంటుంది. దశల వారీగా AP పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ AEE రిక్రూట్‌మెంట్ 2023 ఎంపిక ప్రక్రియను తనిఖీ చేయండి.

  • దశ 1- ప్రిలిమినరీ పరీక్ష
  • దశ 2- కంప్యూటర్ ప్రావీణ్యత పరీక్ష
  • దశ 3- డాక్యుమెంట్ వెరిఫికేషన్

AP పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ AEE పరీక్షా విధానం:

AP పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ AEE రాత పరీక్షను కేవలం ఒకే దశలో నిర్వహించనున్నారు. మొత్తం పరీక్షను 3 పేపర్లలో నిర్వహించనున్నారు. మొత్తం 450 మార్కులకు గాను ఈ పరీక్ష ఉండనున్నది.

పేపర్  సబ్జెక్టు ప్రశ్నలు  మార్కులు  సమయం
Paper-1 General Studies & Mental Ability 150 150 150 నిమిషాలు
Paper-2 Civil OR Mechanical OR Chemical OR
Environmental Engineering
150 150 150 నిమిషాలు
Paper-3 Environmental Science &Technology
(Common for all branches)
150 150 150 నిమిషాలు

గమనిక: ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు కోత విధించబడుతుంది.

APPSC group 2 Prelims Free Live Batch | Online Live Classes by Adda 247

AP పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ AEE దరఖాస్తు రుసుము

AP పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ AEE దరఖాస్తు రుసుము : AP పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ AEE దరఖాస్తు ఫీజు అన్ని వర్గాల వారికి రూ. 250/-లుగా నిర్దేశించడం జరిగింది. మరియు దరఖాస్తు ప్రాసెసింగ్ రుసుముగా రూ.80/- వసూలు చేయడం జరుగుతుంది. కాని SC/ST/ BC/PWD/Ex-serv వర్గానికి చెందిన వారు  దరఖాస్తు ప్రాసెసింగ్ రుసుము చెల్లించవలసిన అవసరం లేదు.

కేటగిరి రుసుము
జనరల్ రూ. 250/- + 80/-(Processing fee)
మిగిలిన అభ్యర్ధులు రూ. 250/-

AP పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ AEE అప్లికేషన్ లింక్

అభ్యర్ధులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఆన్లైన్ అప్లికేషన్ లింక్ 31 జనవరి 2024 నుండి 19 ఫిబ్రవరి 2024 వరకు అందుబాటులో ఉంటుంది.

  • అభ్యర్ధులు ముందుగా APPSC అధికారిక వెబ్ సైట్ psc.ap.gov.in  ను సందర్శించాలి.
  • తరువాత వెబ్ సైట్ లోని ముందుగా OTPR(One Time Profile Registration) రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
  • NEW OTPR కొరకు Home లోని Modify OTPR ID మీద క్లిక్ చేసి New Registration మీద క్లిక్ చేసి వివరాలు సమరించిన తరువాత మీకు కొత్త OTPR ID మరియు password ఇవ్వబడతాయి. వీటిని భవిష్యత్ అవసరాల కోసం భద్రం చేసుకోవాలి.
  • ఇదివరకే OTPR రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీ వివరాలు సరి చూసుకొన్న తరువాత వెబ్ సైట్ లోని Home మీద క్లిక్ చేసి తరువాత Announcements లో Online Application submission for APPSC AP Pollution Control Board Assistant Environmental Engineer మీద క్లిక్ చేయాలి.
  • తరువాత మీ kkయొక్క USER ID మరియు Mobile Number నమోదు చెయ్యడం ద్వారా మీ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పేజి లోనికి వెళ్ళడం ద్వారా, మీ వివరాలు నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకొనవచ్చు.

How To Recover OTPR ID

  • అభ్యర్దులు ఇది వరకే OTPR నమోదు చేసుకొని ఉంటే, మరలా దానిని పొందడానికి Home లోని Modify OTPR ID మీద క్లిక్ చెయ్యాలి.
  • అప్పడు విండో లో Direct recruitment లో Modify Registration మీద క్లిక్ చేయండి.
  • అప్పుడు మీకు ఒక POP UP విండో కనిపిస్తుంది. అందులో Existing User మీద క్లిక్ చేయండి.
  • ఇప్పుడు మరొక విండో కనిపిస్తుంది. దానిలో Recover OTPR మీద క్లిక్ చేసి, మీ DOB, Phone number, Registration ID నమోదు చెయ్యడం ద్వారా ఇది వరకు మీరు నమోదు చేసుకున్న Phone number కి OTP వస్తుంది.
  • దానిని నమోదు చెయ్యడం ద్వార మీరు మరలా  కొత్త Password ని పొందవచ్చు.

APPSC Group 2 Free Notes PDF Download (Adda247 STUDYMATE NOTES)

APPSC Group 2 (Pre + Mains) Selection Kit Batch | Online Live Classes by Adda 247

APPSC గ్రూప్ 2 కి సంబంధించిన ఆర్టికల్స్ 
APPSC గ్రూప్ 2 ఆన్‌లైన్ అప్లికేషన్ 2023 APPSC గ్రూప్ 2 జీతం
APPSC గ్రూప్ 2 మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలు
APPSC గ్రూప్ 2 సిలబస్
APPSC గ్రూప్ 2 పరీక్షా సరళి
APPSC గ్రూప్ 2 ఉద్యోగ వివరాలు
APPSC గ్రూప్ 2 అర్హత ప్రమాణాలు APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ కోసం ఇండియన్ సొసైటీకి ఎలా ప్రిపేర్ అవ్వాలి?
APPSC గ్రూప్ 2 మరియు ఇతర పరీక్షలకు భౌగోళిక శాస్త్రం ఎలా ప్రిపేర్ అవ్వాలి? APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్షలకు నోట్స్ ఎలా సిద్ధం చేసుకోవాలి?
కొత్త సిలబస్‌తో APPSC గ్రూప్ 2 పరీక్షకు ఎలా సిద్ధం కావాలి? APPSC గ్రూప్ 2 పరీక్ష పుస్తకాల జాబితా (కొత్త సిలబస్)
APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ కోసం చరిత్రను ఎలా ప్రిపేర్ అవ్వాలి? APPSC గ్రూప్ 2 మునుపటి సంవత్సరం కట్ ఆఫ్
APPSC గ్రూప్ 2 ఖాళీలు 2023 APPSC గ్రూప్ 2 అప్లికేషన్ నింపే విధానం
Adda’s Study Mate APPSC Group 2 Prelims Adda’s Study Mate APPSC Group 2 Prelims 2024 by Adda247 Telugu
APPSC గ్రూప్ 2 పరీక్ష తేదీ APPSC గ్రూప్ 2 పరీక్ష కోసం క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ కోసం ఎలా సిద్ధం చేయాలి?

Sharing is caring!

FAQs

APPSC AP పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్(APPCB) అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ నోటిఫికేషన్ 2023 విడుదల అయ్యిందా ?

అవును, APPSC AP పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్(APPCB) అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ నోటిఫికేషన్ 2023 26 డిసెంబర్ 2023 విడుదల అయ్యింది

APPSC AP పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్(APPCB) అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ నోటిఫికేషన్ 2023లో ఎన్ని ఖాళీలు విడుదల అయ్యాయి?

21 ఖాళీలకు APPSC AP పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్(APPCB) అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ నోటిఫికేషన్ 2023 విడుదల అయ్యాయి

APPSC AP పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్(APPCB) అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ కోసం దరఖాస్తు ప్రారంభ తేదీ ఏమిటి?

AP పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్(APPCB) అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ కోసం దరఖాస్తు ప్రారంభ తేదీ 30 జనవరి 2023