Telugu govt jobs   »   Current Affairs   »   AP ranks 12th in terms of...

AP ranks 12th in terms of drug use | మాదకద్రవ్యాల వినియోగంలో ఏపీ 12వ స్థానంలో ఉంది

AP ranks 12th in terms of drug use | మాదకద్రవ్యాల వినియోగంలో ఏపీ 12వ స్థానంలో ఉంది

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదకద్రవ్యాల వినియోగం వేగంగా పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఆశ్చర్యకరంగా, కొంతమంది పిల్లలు పదేళ్ల వయస్సులోనే మాదకద్రవ్యాల బారిన పడుతున్నారు. ఏకంగా 3.17 లక్షల మంది బాలలు ఈ మత్తు వలలో చిక్కుకున్నారు. రాష్ట్రంలో 20.19 లక్షల మంది మాదకద్రవ్యాల వ్యసనపరులు ఉండగా వారిలో 15.70 శాతం మంది బాలలే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఓపియం, హెరాయిన్, గంజాయి వంటి వాటికి వారు బానిసలవుతుండటం కలవరం రేపుతోంది.

పిల్లల్లో అత్యధికంగా గంజాయి వినియోగిస్తున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ 12వ స్థానంలో ఉంది, ఓపియ్స్కు సంబంధిత పదార్థాల వాడకంలో 10వ స్థానంలో మరియు మైనర్లలో మత్తుమందుల వినియోగంలో 8వ స్థానంలో ఉంది. కేంద్ర సామాజిక న్యాయ, సాధికారిత మంత్రిత్వ శాఖ స్థాయీ సంఘం తాజాగా పార్లమెంట్ లో ఓ నివేదిక సమర్పించింది. దేశంలో మత్తు పదార్థాల బారిన పడి తీవ్రంగా ప్రభావితమవుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటని ఆ నివేదిక వెల్లడించింది.

ప్రధానంగా బాలల్లో వీటి వినియోగం ఇక్కడ ఎక్కువగా ఉందని పేర్కొంది. మాదకద్రవ్యాల మైకం రాష్ట్రాన్ని ఎంత తీవ్రంగా కమ్మేసిందో చెప్పటానికి ఈ గణాంకాలే సాక్ష్యాలు.

గంజాయి వ్యసనంతో పోరాడుతున్న వారిలో పిల్లలు కూడా ఉన్నారు. రాష్ట్రంలో గంజాయికి బానిసలుగా మారిన వారు 4.64 లక్షల మంది ఉన్నారు. వారిలో 21 వేల మంది బాలలే (10-17 ఏళ్ల లోపు వారు) మొత్తంగా మాదకద్రవ్యాలు వినియోగిస్తున్న 20.19 లక్షల మందిలో 22.98 శాతం మంది గంజాయి తీసుకుంటున్నారు.

10 నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న 3.17 లక్షల మంది మాదకద్రవ్యాల బారిన పడుతుండగా, వారిలో 21 వేల మంది గంజాయి వాడే వారు కావడాన్ని పరిశీలిస్తే పరిస్థితి తీవ్రత స్పష్టంగా కనిపిస్తోంది. 18 నుంచి 75 ఏళ్ల మధ్య వయసున్న వారిలో అత్యధికంగా గంజాయి వాడుతున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ 11వ స్థానంలో ఉంది.

గతంలో మన రాష్ట్రంలో గంజాయి సాగు ప్రధానంగా ఉండేది. అయితే, గత నాలుగు సంవత్సరాలుగా, దాని లభ్యత మరియు వినియోగం విపరీతంగా పెరిగింది, ఇది సమాజంలోని అన్ని మూలలను విస్తరించింది. విక్రేతలు మరియు సరఫరాదారుల గురించి అవగాహన ఉన్నప్పటికీ, చట్టాన్ని అమలు చేయడంలో సడలింపు ఉంటుంది, ఈ సమస్య తనిఖీ లేకుండా కొనసాగుతుంది.

ఓపియెడ్స్, ఇన్ హెలెంట్స్, సెడిటివ్స్కు సంబంధించిన మాదకద్రవ్యాల వినియోగం కూడా ఎక్కువగానే ఉంది. రాష్ట్రంలో అత్యధికంగా 9.86 లక్షల మంది ఓపియెడ్స్కు బానిసలుగా మారారు.

దేశవ్యాప్తంగా 272 జిల్లాల్లో మాదకద్రవ్యాల వినియోగం, ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు కేంద్రం గుర్తించింది. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో  (ఎన్సీబీ) సహకారంతో ఈ జిల్లాలను గుర్తించాయి. ఆ జాబితాలో ఉమ్మడి విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలు ఉన్నాయి. వీటిలో విశాఖ మన్యం గంజాయి సాగు, సరఫరాకు కేంద్రంగా ఉంది. మిగతా జిల్లాలు మీదుగా గంజాయి అక్రమ రవాణా సాగుతోంది.

రాష్ట్రంలో మద్యం వినియోగం చాలా తీవ్రంగా ఉంది. దేశంలో 3.86 కోట్ల మందితో ఉత్తరప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉండగా 65.09 లక్షల మందితో ఏపీ ఏడో స్థానంలో ఉంది. పొరుగున ఉన్న తెలంగాణలో మద్యానికి అలవాటు పడ్డ వారు ఏపీ కంటే తక్కువగానే ఉన్నారు. అక్కడ 50.40 లక్షల మంది ఉన్నారు.

మాదకద్రవ్యాలకు బానిసలుగా మారిన వారిని దాన్నుంచి విముక్తి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ యాక్షన్ -ప్లాన్ ఫర్ డ్రగ్ డిమాండ్ రిడక్షన్ (NAPDDR) కార్యక్రమం అమలు చేస్తోంది. దీని కింద ఏపీలో 2018-19లో 1,752 మంది లబ్ది పొందగా 2020-21 నాటికి వారి సంఖ్య ఏకంగా 6,878కు పెరిగింది. కేవలం రెండేళ్ల వ్యవధిలో 292.57 శాతం మంది లబ్ధిదారులు పెరిగారు. 2019-20తో పోలిస్తే కూడా 2020-21లో ఏకంగా 233.39 శాతం మంది లబ్ధిదారులు పెరిగారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల వినియోగం, వాటి బారిన పడుతున్న వారి సంఖ్య ఎంత వేగంగా పెరుగుతుందో ఈ గణాంకాలే చెబుతున్నాయి.

SSC Complete Preparation Kit | Live Classes | Test Series | eBooks | Printed Books | By Adda247

మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు క్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

భారతదేశం యొక్క డ్రగ్ లార్డ్ ఎవరు?

దావూద్ ఇబ్రహీం (/ɪbrəˈhiːm/ (వినండి)) (జననం 26 డిసెంబర్ 1955) ఒక భారతీయ మాబ్ బాస్, డ్రగ్ లార్డ్ మరియు ముంబైలోని డోంగ్రీకి చెందిన ఉగ్రవాది, ఇతను భారత ప్రభుత్వం కోరుతోంది. అతను 1970లలో ముంబైలో స్థాపించిన ఇండియన్ ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ D-కంపెనీకి అధిపతిగా ఉన్నాడు.