AP CM Launched 12 Electric Substation, and Laid stone to 16 | 12 విద్యుత్ సబ్ స్టేషన్లను ప్రారంభించి, 16 శంకుస్థాపన చేసిన ఏపీ సీఎం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం 12 ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్లను మరియు 16 వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (APTransco) చరిత్రలో ఒకేసారి 28 సబ్‌స్టేషన్‌లను ప్రారంభించడం చారిత్రాత్మకం. ప్రారంభించిన సబ్ స్టేషన్ల తో పాటు కడపలో 750 మెగా వాట్లు అనంతపురంలో 1000 మెగా వాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. APSPCL మరియు HPCL మధ్య 10,000 కోట్లతో విలువైన ప్రాజెక్టు కి MOU కుదిరింది. రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ సవ్యంగా జరిగేలా చూసేందుకు ఈ ప్రాజెక్టులు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.
- రాష్ట్రంలో ఉన్న 19 జిల్లాల్లో 630 కోట్లతో 12 సబ్ స్టేషన్లను నిర్మిస్తున్నారు, మరియు 2,479కోట్లతో 16 సబ్ స్టేషన్లకు శంకుస్థాపన చేశారు. సుమారు 3100 కోట్లతో ఈ పనుల నిర్మాణం జరుగుతోంది.
- 850 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులకు 3,400 కోట్లతో పనులు ప్రారంభిస్తున్నారు.
- నెల్లూరు జిల్లాలో 402 కోట్లతో ఏర్పాటయ్యే ఎడిబుల్ ఆయిల్ రిఫైనరీ ప్లాంట్, విజయనగరం జిల్లాలో ఏర్పాటయ్యే నువ్వుల ప్రొసెసింగ్ యూనిట్, మచిలీపట్నం లో 670 కోట్ల విలువైన ప్రాజెక్టులు మొదలైన సంస్థలను కూడా ప్రారంభించనున్నారు.

Sharing is caring!