ఆరోగ్య సంరక్షణ సేవలను పెంపొందించే దిశగా ఒక ముఖ్యమైన దశలో, ఆంధ్రప్రదేశ్ వైద్య మరియు ఆరోగ్య శాఖ జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) కింద 343 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ (CASS) పోస్టులను భర్తీ చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ స్థానాలు 13 విభిన్న వైద్య స్పెషాలిటీలలో ఉన్నాయి, రాష్ట్ర ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలలో కీలకమైన అభివృద్ధిని సూచిస్తాయి. రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను AP మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ నిర్వహిస్తుంది, అంకితమైన వైద్య నిపుణులను రంగంలోకి తీసుకురావడమే దీని లక్ష్యం.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ ఖాళీలకు సంబంధించి రాష్ట్ర మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 343 ఖాళీలకు సంబంధించిన అధికారిక ప్రకటన తన అధికారిక వెబ్ సైటు లో http://hmfw.ap.gov.in/ విడుదల చేసింది. ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ రిక్రూట్మెంట్ నియామకానికి సంభందించిన అన్నీ వివరాలు ఈ కధనంలో తెలియజేశాము.
APPSC/TSPSC Sure shot Selection Group
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో పని చెయ్యాలి అని అనుకున్న ఆశవహులకోశం ఈ నియామక ప్రక్రియ ఒక సువర్ణ అవకాశం. రాష్ట్ర వ్యాప్తం గా 343 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి వాటికి ఇంటర్వ్యూ ప్రాతిపదికన నియామక ప్రక్రియ జరుగుతుంది, అర్హతలు ఉన్న ఆశావహులు ఈ నియామక ప్రక్రియకి ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకోండి.
రిక్రూట్‌మెంట్ అవలోకనం:
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ జిల్లాలలో ఖాళీగా ఉన్న వివిధ విభాగలకి చెందిన స్పెషలిస్ట్ నియమకాలకి ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. రిక్రూట్‌మెంట్ ప్రక్రియ వాక్-ఇన్ ఇంటర్వ్యూల ద్వారా నిర్వహించబడుతుంది అని పత్రికా ప్రకటన లో తెలియజేసింది. ఇది ఔత్సాహిక వైద్య నిపుణులకు వారి నైపుణ్యాలను మరియు ప్రజారోగ్య సంరక్షణ పట్ల నిబద్ధతను ప్రదర్శించడానికి అవకాశం కల్పిస్తుంది.
సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ అధికారిక నోటిఫికేషన్
ఇంటర్వ్యూ ప్రదేశం, తేదీలు
వివిధ జిల్లాలలో ఖాళీగా ఉన్న 13 విభాగలకి చెందిన సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ (CASS) పోస్టులను ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ పద్దతిలో నియమించనుంది. రెగ్యులర్ లేదా కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ నియామక ప్రక్రియ జరుగుతుంది అని పత్రికా ప్రకటనలో తెలియజేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ, గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాలలో ఉన్న ఖాళీలకు ఈ నియామక ప్రక్రియ జరుగుతోంది. మొత్తం 343 ఖాళీలకు ఇంటర్వ్యూ పద్దతిలో నియామకం ఉంటుంది. ఈ ఇంటర్వ్యూలు సెప్టెంబర్ 15 వరకు జరగనున్నాయి. ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం మరియు తేదీల గురించి తెలుసుకోండి.
- ఇంటర్వ్యూ ప్రదేశం: ఎన్టీఆర్ జిల్లా డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కార్యాలయం
- ఇంటర్వ్యూ తేదీలు: సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 15 వరకు
సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ (CASS) జీతం
నియామక ప్రక్రియ పూర్తయిన తర్వాత అభ్యర్ధుల తుది ఎంపిక జరుగుతుంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఎంపిక చేసిన అభ్యర్ధులకు నెలకు 1.10 లక్షల నుంచి 2.50 లక్షల వరకూ జీతం ఉంటుంది. జీతం ప్రాంతాన్ని బట్టి మారుతుంది. ఆకర్షణీయమైన జీతం తో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ లు పనిచేయనున్నారు. గ్రామీణ, పట్టణ, మరియు గిరిజన ప్రాంతాలలో జీతం వివరాలు దిగువన తెలియజేశాము:
- గిరిజన ప్రాంతంలో: 2.50 లక్షలు
- గ్రామీణ ప్రాంతంలో: 2.00 లక్షలు
- పట్టణ ప్రాంతంలో: 1.30 లక్షలు
- జిల్లా ఆస్పత్రుల్లో: 1.10 లక్షలు
- ఎన్హెచ్ఎంలోని డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ మైదాన ప్రాంతంలో: 1.10 లక్షలు
- ఎన్హెచ్ఎంలోని డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ గిరిజన ప్రాంతంలో: 1.40 లక్షలు
పూర్తి వివరాలకు అభ్యర్థులు వెబ్సైట్ http://hmfw.ap.gov.in/, లేదా 6301138782 నెంబర్ పై సంప్రదించాలి అని అధికారులు సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వివిధ ఖాళీలను ఈ నియామక ప్రక్రియ ద్వారా భర్తీ చేస్తునారు ఇది వైద్య వృత్తిలో ఉన్న వారికి ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడం లో ఒక ముఖ్య పాత్ర అందిస్తుంది.
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |