Telugu govt jobs   »   Weekly Current Affairs   »   AP and Telangana State October Weekly...

AP and Telangana States October Weekly Current Affairs Part 2 , ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అక్టోబర్ వారాంతపు కరెంట్ అఫైర్స్ పార్ట్ 2

AP and Telangana State Weekly Current Affairs, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వారాంతపు కరెంట్ అఫైర్స్

Current affairs play a very important role in the competitive examinations and hence, aspirants have to give undivided attention to it while doing preparation for the government examinations. The banking or state govt examinations comprise a section of “General Awareness” to evaluate how much the aspirant is aware of the daily happenings taking place around the world. To complement your preparation, we are providing you with a compilation of the  Current affairs of October 3rd and 4th Week.

 

AP and Telangana State Weekly Current Affairs, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వారాంతపు కరెంట్ అఫైర్స్

Weekly current Affairs PDF in Telugu : APPSC, TSPSC గ్రూప్స్ , SI మరియు కానిస్టేబుల్ పరీక్షలలో  జనరల్ అవేర్‌నెస్ చాలా ముఖ్యమైన విభాగాలలో ఒకటి మరియు మీరు మీ సమయాన్ని హృదయపూర్వకంగా కేటాయించినట్లయితే ఈ అంశం నుండి చాలా మంచి మార్కులు సాధించగలరు. పరీక్షల  ముందు అప్పటికప్పుడు  ఈ అంశాన్ని చదువుకొని వెళ్ళడం ద్వారా ఎక్కువ మార్కులు సాధించడం అసాధ్యం.  GA మీరు 10-15 రోజుల్లో పూర్తి  చేయగల విభాగం కాదు. మీరు జనరల్ అవేర్నెస్ పై పట్టు సాధించడానికి  ఉత్తమ మార్గం రోజూ వార్తాపత్రికలను చదవడం లేదా వారపు వార్తల ద్వారా వెళ్ళడం.

దీని ద్వారా   నెలవారీ లేదా 6 నెలల వార్తల ద్వారా తెలుసుకొనే సమాచారం కంటే ఎక్కువ సమాచారం తెలుసుకోవచ్చు. ఇక్కడ మేము మీకు అన్ని వార్తాపత్రికల నుండి సమకాలీన అంశాల సారాంశాన్ని అందిస్తున్నాము, ఇది మీ సమయాన్ని ఆదా చేస్తుంది మరియు మీరు ఆ సమయాన్ని వారాంతపు సమకాలీన అంశాలు 2022 అధ్యయనం కోసం కేటాయించవచ్చు.

AP and Telangana State October Weekly Current Affairs part 2_40.1APPSC/TSPSC Sure shot Selection Group

 

Telangana State Weekly Current Affairs

1. సిద్దిపేటలో ప్రభుత్వ వృద్ధాశ్రమం

AP and Telangana State October Weekly Current Affairs part 2_50.1
old age home

వృద్ధాప్యంలో తోడూనీడా లేకుండా ఒక భరోసా కోసం ఎదురుచూసే వారికి, అభాగ్యులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం సిద్దిపేట జిల్లా కేంద్రంలో వృద్ధాశ్రమం ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో సుమారు కోటి రూపాయల నిధులతో రాష్ట్రంలో ఒక మోడల్‌గా ఈ వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. సిద్దిపేట పరిధిలోని మిట్టపల్లి గ్రామ శివార్లలో సుమారు ఎకరం స్థలంలో దీన్ని నిర్మించేందుకు స్థల పరిశీలన పూర్తి చేశారు. త్వరలో మంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నారు.

 2. హైదరాబాద్‌కి 10 విద్యుత్‌ డబుల్‌ డెక్కర్‌లు

AP and Telangana State October Weekly Current Affairs part 2_60.1
Electric Double Deckers

ముంబై తరహాలో హైదరాబాద్‌ రోడ్లపైనా త్వరలోనే ఎలక్ట్రిక్‌ డబుల్‌ డెక్కర్‌ బస్సులు పరుగులు పెట్టనున్నాయి. నగరంలోని పలు రూట్లలో 10 విద్యుత్‌ డబుల్‌ డెక్కర్‌ బస్సులను తిప్పాలని టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది.

అయితే ఒక్కో ఎలక్ట్రిక్‌ డబుల్‌ డెక్కర్‌ ఖరీదు రూ. 2.25 కోట్ల వరకు ఉండటం, అంత ఖర్చును భరించే ఆర్థిక పరిస్థితి సంస్థకు లేకపోవడంతో అద్దె ప్రాతిపదికన వాటిని ఆర్టీసీ ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం 4–5 రోజుల్లో టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. క్రాస్‌ కాస్ట్‌ విధానంలో ఈ బస్సులు నడిపేందుకు ఆసక్తి ఉన్న కంపెనీలు ముందుకు రావాలని టెండర్‌ నోటిఫికేషన్‌లో కోరనుంది. అద్దె పద్ధతిలో బస్సులు నిర్వహించే సంస్థతో టెండర్‌ దక్కించుకున్న సంస్థ ఒప్పందం కుదుర్చుకొని ఆర్టీసీకి బస్సులు సరఫరా చేయాల్సి ఉంటుంది. ప్రతి కిలోమీటర్‌ చొప్పున నిర్ధారిత అద్దెను ఆర్టీసీ ఆ సంస్థకు చెల్లించనుంది.

3. హైదరాబాద్‌ నగరంలో ఈ-మొబిలిటీ వారోత్సవాలు

AP and Telangana State October Weekly Current Affairs part 2_70.1
E-Mobility week

దేశంలోనే తొలిసారిగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 10,11 తేదీల్లో హైదరాబాద్‌లో జరగనున్న ఫార్ములా ఈ-రేస్‌(ఫార్ములా ఈ-ప్రిక్స్‌)కు ప్రచారం కల్పించేందుకు 2023 ఫిబ్రవరి 6 నుంచి 11 వరకు హైదరాబాద్‌ఈ-మొబిలిటీ వారోత్సవాలను నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు వెల్లడించారు. విద్యుత్‌తో నడిచే సింగిల్‌ సీటర్‌ కార్ల పోటీకి సన్నాహకాల్లో భాగంగా ఫిబ్రవరి 6న హైదరాబాద్‌ ఈవీ సమిట్, ఫిబ్రవరి 7న ర్యాలీ, 8, 9 తేదీల్లో హైదరాబాద్‌ ఈ-మోటార్‌ షోను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

4. నందిపేటలో పురాతన రాతి చిత్రాల గుర్తింపు

AP and Telangana State October Weekly Current Affairs part 2_80.1
Ancient rock paintings

తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లా మూసాపేట్‌ మండలం నందిపేట సమీపంలోని గజ్జెలగుట్టపై తామ్రయుగం(క్రీ.పూ.4 వేల ఏళ్లు) నాటి రెండు రాతి చిత్రాలను గుర్తించినట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం తెలిపింది. సొరంగం తరహా మార్గం నుంచి గుహలోకి చేతుల మీద పాకుతూ వెళ్లాలి. చివరి గుహలో 10-12 మంది నివసించేంత ఖాళీ స్థలం ఉంది. ఆ గుహ ఆదిమానవుల ఆవాసమై ఉండొచ్చని చరిత్రకారులు భావిస్తున్నారు.

5. రూ.100 కోట్లతో హైదరాబాద్‌లో రోష్‌ 

AP and Telangana State October Weekly Current Affairs part 2_90.1
Rosh in Hyderabad

స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రసిద్ధ ఔషధ, రోగ నిర్ధారణ యంత్రాల తయారీ సంస్థ రోష్‌ తెలంగాణలో ప్రపంచ స్థాయి అత్యాధునిక విశ్లేషణ, సాంకేతిక ప్రతిభా కేంద్రాన్ని రూ.100 కోట్లతో ఏర్పాటు చేసినట్లు తెలిపింది. దీని ద్వారా వంద మంది నిపుణులకు ఉపాధి కల్పిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. రోష్‌ ఎండీ, సీఈవో సింప్సన్‌ ఇమ్మాన్యుయేల్‌ తమ ప్రతినిధి బృందంతో హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ కార్యాలయంలో మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. సమావేశంలో తెలంగాణ పరిశ్రమల ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్, జీవశాస్త్రాల సంచాలకుడు శక్తి నాగప్పన్‌ పాల్గొన్నారు. ఈ కొత్త కేంద్రం మెషిన్‌ లెర్నింగ్, కృత్రిమ మేధల సాయంతో డేటా విశ్లేషణలు చేస్తుందని, రోగులకు ఆధునిక సేవలందించడంతో పాటు మెరుగైన ఫలితాలను అందించేందుకు ఉపయోగపడుతుంది.

6. ప్రపంచ ఆరోగ్య సంరక్షణలో తెలంగాణ కీలకం

AP and Telangana State October Weekly Current Affairs part 2_100.1
Telangana is key to global health care

జీవశాస్త్రాల రంగంలో 8.20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించాలనే లక్ష్యాన్ని తెలంగాణ 2030 కంటే ముందుగానే చేరుకుంటుందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు. ఆయన జీనోమ్‌ వ్యాలీలో పలు ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆర్‌ఎక్స్‌ ప్రొఫెల్లంట్‌ రూ.900 కోట్ల పెట్టుబడితో 9 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన పరిశోధనశాలను, విమ్టాల్యాబ్‌ రూ.70 కోట్లతో నిర్మించిన ప్రయోగశాలను ఆయన ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ రంగ టీఎస్‌ఐఐసీ, కేంద్ర బయోటెక్నాలజీ శాఖ నిర్మిస్తున్న బయోహబ్, జీవీ1 ల్యాబ్‌లకు ఆయన శంకుస్థాపన చేశారు. జీవీపీఆర్‌ సంస్థ రూ.40 కోట్లతో 28 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన పరిశోధన కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన యాపాన్‌ ల్యాబ్‌కు శంకుస్థాపన చేశారు.

7. ఇంధన సంరక్షణపై ఆస్కీతో రెడ్కో ఒప్పందం

AP and Telangana State October Weekly Current Affairs part 2_110.1
REDCO AGREEMENT WITH ASKIE ON ENERGY CONSERVATION

ఇంధన సంరక్షణ కార్యక్రమాలపై కలిసి పనిచేసేందుకు ‘అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజీ ఆఫ్‌ ఇండియా’ (ఆస్కీ)తో తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ రెడ్కో) అవగాహనా ఒప్పందం చేసుకుంది. రాబోయే అయిదేళ్ల పాటు రెండు సంస్థలూ ఇంధన సంరక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తామని ఆస్కీ తెలిపింది. ఇంధన సంరక్షణ చట్టం – 2001ని తెలంగాణలో పటిష్ఠంగా అమలు చేయడానికి సలహాలు, సూచనలను ఆస్కీ ఇవ్వనుంది.

AP and Telangana State October Weekly Current Affairs part 2_120.1

Andhra Pradesh State Weekly Current Affairs

1. 30 మందికి వైఎస్‌ఆర్‌ జీవిత సాఫల్య, సాఫల్య పురస్కారాలు 

AP and Telangana State October Weekly Current Affairs part 2_130.1
YSR Lifetime Achievement Awards

సామాన్యుల్లో ఉన్న అసామాన్యులను సత్కరించాలన్న లక్ష్యంతో వైఎస్‌ఆర్‌ జీవిత సాఫల్య, సాఫల్య పురస్కారాలను ప్రభుత్వం అందిస్తోందని సమాచార సలహాదారు జీవీడీ కృష్ణమోహన్‌ తెలిపారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నవంబరు 1వ తేదీన 8 రంగాల్లో విశిష్ట సేవలు అందించిన 30 మందికి పురస్కారాలను అందించనున్నట్లు ప్రకటించారు. (మొత్తం 20 మందికి జీవిత సాఫల్య పురస్కారాలు, 10 మందికి సాఫల్య పురస్కారాలు). వివిధ రంగాల్లో సేవలు అందించిన వ్యక్తులు, సంస్థల నుంచి అందిన 428 ప్రతిపాదనలను కమిటీ పరిశీలించి పారదర్శకంగా ఎంపిక చేసినట్లు తెలిపారు. వైఎస్‌ఆర్‌ జీవిత సాఫల్య పురస్కారం కింద రూ.10 లక్షలు, సాఫల్య పురస్కారం కింద రూ.5 లక్షల నగదు పురస్కారాలు అందిస్తారు.

2. నింగిలోకి నూతన లాంచ్‌వెహికల్‌ఎం3–ఎం2 రాకెట్‌

AP and Telangana State October Weekly Current Affairs part 2_140.1
New launch vehicle M3-M2 rocket

శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌(ఎస్‌డీఎస్‌సీ) ప్రయోగవేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లిన నూతన లాంచ్‌వెహికల్‌ఎం3–ఎం2 రాకెట్‌ విజయవంతంగా 36 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టడంతో ఇస్రో ఒక చరిత్రాత్మక వాణిజ్య ఘట్టానికి శ్రీకారం చుట్టింది. ఈ రకం రాకెట్‌ను వాణిజ్యపరమైన ప్రయోగాలకు వాడటం ఇదే తొలిసారి. తొలి యత్నంలోనే ఇస్రో గ‘ఘన’ విజయం సొంతం చేసుకుంది.

శనివారం అర్థరాత్రి 12 గంటల 7 నిమిషాల 40 సెకన్లకు స్పేస్‌సెంటర్‌ రెండో ప్రయోగవేదికగా ఈ రాకెట్‌ను ప్రయోగించారు. ఒకేసారి 36 బ్రాడ్‌బ్యాండ్‌ కమ్యూనికేషన్‌ శాటిలైట్లను పోలార్‌ లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌(ఎల్‌ఈఓ)లో ప్రవేశపెట్టారు. ఇస్రోకు చెందిన వాణిజ్యవిభాగం న్యూస్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ చేస్తున్న తొలి వాణిజ్యపర ప్రాజెక్ట్‌ ఇది. బ్రిటన్‌కు చెందిన నెట్‌వర్క్‌ యాక్సెస్‌ అసోసియేటెడ్‌ లిమిటెడ్, భారతి ఎంటర్‌ప్రైజెస్‌ భాగస్వాములుగా వన్‌వెబ్‌ ఇండియా లిమిటెడ్‌ను ఏర్పాటు చేశారు.

వన్‌వెబ్‌ ఇండియా–1 పేరిట 36 ఉప్రగ్రహాలను కక్ష్యలో పంపేందుకు వన్‌వెబ్‌తో న్యూస్పేస్‌ ఇండియా ఒప్పందం చేసుకుంది. వన్‌వెబ్‌ లిమిటెడ్‌ అనేది వివిధ దేశాల ప్రభుత్వ, వ్యాపార సంస్థలకు అంతరిక్ష, ఇంటర్నెట్‌ సేవలు అందించే గ్లోబల్‌ కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌ సంస్థ. ఇది ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 648 శాటిలైట్లను నిర్వహిస్తోంది.

రాకెట్‌ పేరు మార్చారు 

జీఎల్‌ఎల్‌వీ–ఎంకే3గా ఇన్నాళ్లు పిలవబడిన రాకెట్‌నే కాస్త ఆధునీకరించి కొత్తగా లాంచ్‌వెహికల్‌ ఎం3–ఎం2గా నామకరణం చేయడం గమనార్హం. జియోసింక్రోనస్‌ ట్రాన్స్‌ఫర్‌ కక్ష్య(జీటీవో)లోకి శాటిలైట్లను పంపే రాకెట్లకే జీఎస్‌ఎల్‌వీగా పిలుస్తున్నారు. శనివారం నాటి రాకెట్‌ జీటీవోకి పంపట్లేదు. ఎల్‌ఈఓలోకి పంపుతోంది. అందుకే దీనిని వేరే పేరుపెట్టారు. జియోసింక్రోనస్‌ ట్రాన్స్‌ఫర్‌ కక్ష్య(జీటీఓ)లోకి 4,000 కేజీల బరువును, ఎల్‌ఈఓలోకి దాదాపు 8,000 కేజీల బరువును తీసుకెళ్లే సత్తా లాంచ్‌వెహికల్‌ ఎం3–ఎం2 రాకెట్‌ సొంతం.

3. ఆదర్శ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌

AP and Telangana State October Weekly Current Affairs part 2_150.1
AP as an ideal state

గృహ నిర్మాణ కార్యకలాపాల్లో అత్యుత్తమ పనితీరు కనబరుస్తూ, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఇందుకు సంబంధించిన అవార్డును ఏపీ తరఫున కేంద్ర గృహనిర్మాణ శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ చేతుల మీదుగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్‌ అందుకున్నారు. గృహాల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని కేంద్రమంత్రి అభినందించారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో మూడ్రోజుల పాటు జరిగే జాతీయ పట్టణ గృహ నిర్మాణ సమ్మేళనం శుక్రవారం ప్రారంభమైంది. ఏపీలో జగనన్న కాలనీల పేరిట నిర్మిస్తున్న ఇళ్లలో విద్యుత్‌ ఆదాకు చేపడుతున్న చర్యలను ఈ సమ్మేళనంలో అజయ్‌జైన్‌ వివరించారు.

తొలిదశలో 15.6 లక్షల ఇళ్లకు ఏపీ ఇంధన సామర్థ్య అభివృద్ధి సంస్థ (ఏపీసీడ్కో), ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఈఈఎస్‌ఎల్‌) సాయంతో ఒక్కో ఇంటికీ నాలుగు ఎల్‌ఈడీ బల్బులు, రెండు ఎల్‌ఈడీ ట్యూబ్‌లైట్లు, రెండు ఫ్యాన్లను అందజేయనున్నట్లు తెలిపారు. వీటి ద్వారా ఒక్కో ఇంటికి ఏడాదికి 734 యూనిట్ల విద్యుత్‌ చొప్పున మొత్తం 1,145 మిలియన్‌ యూనిట్ల కరెంటు ఆదా అవుతుందని చెప్పారు. నిర్మాణంలో ఇండో–స్విస్‌ బిల్డింగ్‌ టెక్నాలజీతో పాటు రీఇన్ఫోర్డ్స్‌ కాంక్రీట్‌ (ఆర్సీసీ) ప్రీకాస్ట్‌ టెక్నాలజీ, షియర్‌వాల్‌ టెక్నాలజీ, ఈపీఎస్‌ టెక్నాలజీ వంటి అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఈ టెక్నాలజీవల్ల ఇంటి లోపల కనీసం రెండు డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గడంతోపాటు 20 శాతం విద్యుత్‌ ఆదా అవుతుందని అజయ్‌జైన్‌ వివరించారు.

4. కర్నూలులో రాష్ట్ర జ్యుడిషియల్‌ అకాడమీ

AP and Telangana State October Weekly Current Affairs part 2_160.1
State Judicial Academy at Kurnool

రాష్ట్రంలోని న్యాయాధికారులకు శిక్షణ ఇచ్చే రాష్ట్ర జ్యుడిషియల్‌ అకాడమీని శాశ్వత ప్రాతిపదికన కర్నూలులో ఏర్పాటు చేసేందుకు అనుమతి మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అకాడమీని ప్రస్తుతానికి మంగళగిరిలో అద్దె భవనంలో ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చింది. రాష్ట్ర విభజన తరువాత ఇప్పటివరకు రాష్ట్రంలో జ్యుడిషియల్‌ అకాడమీ లేదు. దీంతో రాష్ట్రంలో జ్యుడిషియల్‌ అకాడమీ ఏర్పాటుకు హైకోర్టు న్యాయమూర్తుల కమిటీ సిఫారసులు పంపింది.

ఈ సిఫారసులను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం కర్నూలులో అకాడమీ ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి జి.సత్యప్రభాకర్‌ పేరు మీద జీవో జారీ అయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ జ్యుడిషియల్‌ అకాడమీలో ఉన్న సిబ్బందిలో 58.32 శాతం మించకుండా సిబ్బందిని మంజూరు చేస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. సిబ్బంది మంజూరు, మౌలిక సదుపాయాల కల్పన వివరాలతో తగిన ఉత్తర్వులను వేరుగా జారీ చేస్తామంది.

5. ఉద్యోగులకు చైల్డ్‌కేర్‌ లీవ్స్‌ పెంపు

AP and Telangana State October Weekly Current Affairs part 2_170.1
Increase in childcare leaves for employees

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులకు పిల్లల సంరక్షణ సెలవులను పొడిగించింది ప్రభుత్వం. ప్రస్తుతం అరవై రోజులు ఉన్న చైల్డ్‌ కేర్‌ లీవ్స్‌ను కాస్త 180 రోజులకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సెలవులను పది విడతల్లో ఉపయోగించుకోవాలని తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

AP and Telangana State October Weekly Current Affairs Part 1

AP and Telangana State October Weekly Current Affairs part 2_180.1

మరింత చదవండి:

తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

 

Sharing is caring!

Download your free content now!

Congratulations!

AP and Telangana State October Weekly Current Affairs part 2_200.1

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Download your free content now!

We have already received your details!

AP and Telangana State October Weekly Current Affairs part 2_210.1

Please click download to receive Adda247's premium content on your email ID

Incorrect details? Fill the form again here

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Thank You, Your details have been submitted we will get back to you.