Telugu govt jobs   »   Weekly Current Affairs   »   AP and Telangana State October Weekly...

AP and Telangana States October Weekly Current Affairs , ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అక్టోబర్ వారాంతపు కరెంట్ అఫైర్స్

AP and Telangana State Weekly Current Affairs, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వారాంతపు కరెంట్ అఫైర్స్

Current affairs play a very important role in the competitive examinations and hence, aspirants have to give undivided attention to it while doing preparation for the government examinations. The banking or state govt examinations comprise a section of “General Awareness” to evaluate how much the aspirant is aware of the daily happenings taking place around the world. To complement your preparation, we are providing you with a compilation of the  Current affairs of October 1st nd 2nd week.

 

AP and Telangana State Weekly Current Affairs, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వారాంతపు కరెంట్ అఫైర్స్

Weekly current Affairs PDF in Telugu : APPSC, TSPSC గ్రూప్స్ , SI మరియు కానిస్టేబుల్ పరీక్షలలో  జనరల్ అవేర్‌నెస్ చాలా ముఖ్యమైన విభాగాలలో ఒకటి మరియు మీరు మీ సమయాన్ని హృదయపూర్వకంగా కేటాయించినట్లయితే ఈ అంశం నుండి చాలా మంచి మార్కులు సాధించగలరు. పరీక్షల  ముందు అప్పటికప్పుడు  ఈ అంశాన్ని చదువుకొని వెళ్ళడం ద్వారా ఎక్కువ మార్కులు సాధించడం అసాధ్యం.  GA మీరు 10-15 రోజుల్లో పూర్తి  చేయగల విభాగం కాదు. మీరు జనరల్ అవేర్నెస్ పై పట్టు సాధించడానికి  ఉత్తమ మార్గం రోజూ వార్తాపత్రికలను చదవడం లేదా వారపు వార్తల ద్వారా వెళ్ళడం.

దీని ద్వారా   నెలవారీ లేదా 6 నెలల వార్తల ద్వారా తెలుసుకొనే సమాచారం కంటే ఎక్కువ సమాచారం తెలుసుకోవచ్చు. ఇక్కడ మేము మీకు అన్ని వార్తాపత్రికల నుండి సమకాలీన అంశాల సారాంశాన్ని అందిస్తున్నాము, ఇది మీ సమయాన్ని ఆదా చేస్తుంది మరియు మీరు ఆ సమయాన్ని వారాంతపు సమకాలీన అంశాలు 2022 అధ్యయనం కోసం కేటాయించవచ్చు.

AP and Telangana State September Weekly Current Affairs |_70.1APPSC/TSPSC Sure shot Selection Group

 

Telangana State Weekly Current Affairs

1. హైదరాబాద్‌లో House of France

House of France
House of France

తెలంగాణ, ఫ్రాన్స్‌ నడుమ వాణిజ్య సంబంధాలు, రాకపోకలు పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ‘హౌస్‌ ఆఫ్‌ ఫ్రాన్స్‌’ పేరిట కొత్త కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు ఫ్రాన్స్‌ ప్రభుత్వం ప్రకటించడాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ స్వాగతించారు.

2023 అర్ధభాగంలో కొత్త ఫ్రెంచ్‌ బ్యూరో పనిచేయడం ప్రారంభిస్తుందని, ఇది వాణిజ్య కార్యకలాపాల కేంద్రంగా పనిచేయడంతోపాటు కాన్సులార్, వీసా సేవలను కూడా అందిస్తుందన్నారు. తద్వారా తెలంగాణ విద్యార్థులు, బిజినెస్‌ వర్గాలకు ఫ్రాన్స్‌తో సన్నిహిత సంబంధాలు ఏర్పడుతాయన్నారు. ఫ్రెంచ్‌ బిజినెస్‌ మిషన్‌  బృందం హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌తో భేటీ అయింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రగతిశీల విధానాలు, పారిశ్రామిక విధానాలు, సాధించిన విజయాలు, పెట్టుబడి అవకాశాలపై కేటీఆర్‌ ఆ బృందానికి వివరించారు. ఈ భేటీలో ఫ్రెంచ్‌ బృందం ప్రతినిధులు పాల్‌ హెర్మెలిన్, గెరార్డ్‌ వోల్ఫ్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి ఇ. విష్ణువర్దన్‌రెడ్డి పాల్గొన్నారు.

2. తెలంగాణలో schneider రెండో ప్లాంట్‌ ఏర్పాటు

Schneider in Telangana
Schneider in Telangana

విద్యుత్‌ పరికరాల తయారీ, ఆటోమేషన్‌ రంగంలో ఉన్న ష్నైడర్‌ ఎలక్ట్రిక్‌ తెలంగాణలో మరో ప్లాంట్‌ ఏర్పాటు చేస్తోంది. శంషాబాద్‌ వద్ద 18 ఎకరాల్లో ఇది రానుంది. రూ. 300 కోట్ల వ్యయంతో చేపడుతున్న తొలి దశ 2023 సెప్టెంబర్‌కు సిద్ధం అవుతుంది. ఉత్పత్తుల తయారీకి స్మార్ట్‌ యంత్రాలు, ఉపకరణాలను ఉపయోగించనున్నట్లు కంపెనీ సెప్టెంబర్ 30న ప్రకటించింది. కొన్ని ఉత్పత్తులను దేశంలో తొలిసారిగా శంషాబాద్‌ కేంద్రంలో ఉత్పత్తి చేయనున్నట్లు వెల్లడించింది. 30కిపైగా దేశాలకు ఇక్కడ తయారైన సరుకు ఎగుమతి చేస్తారు. భారత్‌లో సంస్థకు ఇది 31వ కేంద్రం కాగా తెలంగాణలో రెండవది. స్మార్ట్‌ ఫ్యాక్టరీలపరంగా కంపెనీకి దేశంలో ఇది ఎనిమిదవది కానుంది.

వర్చువల్ గా శంకుస్థాపన

భారత్‌లో ఫ్రాన్స్‌ రాయబారి ఎమాన్యుయల్‌ లెనిన్‌తో కలిసి రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు ష్నైడర్‌ ప్రతిపాదిత నూతన కేంద్రానికి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. కొత్త ప్లాంటు మూడు దశలు పూర్తి అయితే 3,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి తెలిపారు. భారత్‌లో కంపెనీకి ఇది అతిపెద్ద, అత్యంత స్మార్ట్‌ ఫ్యాక్టరీ అవుతుందని చెప్పారు. 75 శాతం ఉత్పత్తులు ఇక్కడి నుంచి ఎగుమతి అవుతాయని వివరించారు. స్మార్ట్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌లో యువతకు శిక్షణ ఇచ్చేందుకు ముందుకు రావాల్సిందిగా కంపెనీ ప్రతినిధులను ఆయన కోరారు.

3. తెలంగాణ గిరిజనులకు 10% రిజర్వేషన్ కోటా, ఉత్తర్వులు జారీ

Telangana Reservation
Telangana Reservation

తెలంగాణ గిరిజనులకు శుభవార్త. రాష్ట్రంలో విద్యా, ఉద్యోగ రంగాల్లో గిరిజన రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్‌ చొంగ్తూ ఉత్తర్వులు (జీవో నం.33) జారీ చేశారు. రిజర్వేషన్లు తక్షణమే అమల్లోకి వచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

4. ‘గొల్లభామ’కు UNESCO గుర్తింపు

UNESCO recognition of 'Grasshopper'
UNESCO recognition of ‘Grasshopper’

చేనేత కార్మికుల వృత్తి కళా నైపుణ్యానికి ప్రతీకగా నిలిచే సిద్దిపేట బ్రాండ్‌ అంబాసిడర్‌ గొల్లభామ చీరకు యునెస్కో గుర్తింపు దక్కడంపై మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు.

పదేళ్ల క్రితమే భౌగోళిక (జియోగ్రాఫికల్‌) గుర్తింపు లభించగా తాజాగా యునెస్కో గుర్తింపు రావడంతో మంత్రి హరీశ్‌రావు ట్విట్టర్‌ వేదికగా నేతన్నలను అభినందించారు. చీర ప్రత్యేకత, చరిత్ర గూర్చి వివరిస్తూ, వాటికి సంబంధించిన ఫొటోలను ట్యాగ్‌ చేశారు. ఇటీవల భారతీయ సంప్రదాయక వస్త్రాల సంరక్షణపై యునెస్కో విడుదల చేసిన నివేదికలో సిద్దిపేట గొల్లభామ చీరకు చోటు లభించింది. తలమీద చల్ల కుండ పెట్టుకుని, కుడి చేతిలో గురిగి(చిన్న మట్టి పాత్ర) పట్టుకొని, కాళ్లకు గజ్జెలు, కొప్పులో పువ్వులతో నడియాడే గొల్లభామ ప్రతిమలతో ఈ చీరను రూపొందిస్తారు.

5. టీఆర్‌ఎస్‌ పేరు ఇక బీఆర్‌ఎస్‌,పేరు మారుస్తూ పార్టీ ఏకగ్రీవ తీర్మానం

The name of TRS is now BRS
The name of TRS is now BRS

తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్‌ రాష్ట్ర సమితిగా మారుస్తూ టీఆర్‌ఎస్‌ పార్టీ ఏకగ్రీవంగా తీర్మానించింది.
ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన అక్టోబర్ 5న తెలంగాణ భవన్‌లో జరిగిన పార్టీ జనరల్‌ బాడీ సమావేశంలో ఈ తీర్మానాన్ని ప్రతిపాదించారు. ‘అక్టోబర్‌ 5న టీఆర్‌ఎస్‌ కేంద్ర కార్యాలయంలో జరిగిన జనరల్‌ బాడీ సమావేశం తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్‌ రాష్ట్ర సమితిగా మారుస్తూ ఏకగ్రీవంగా తీర్మానం అమోదించింది. పార్టీ కార్యకలాపాలను జాతీయ స్థాయిలో విస్తరించడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ మేరకు పార్టీ నియమావళిలో మార్పులు చేశాం..’ అంటూ కేసీఆర్‌ చేసిన ప్రకటనకు జనరల్‌ బాడీ సభ్యులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఆమోదం తెలిపారు. కాగా పార్టీ నిర్ణయాన్ని తెలియచేస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి కేసీఆర్‌ లేఖ రాశారు. ‘టీఆర్‌ఎస్‌ పేరును భారత్‌ రాష్ట్ర సమితిగా మారుస్తూ పార్టీ రాజ్యాంగంలో చేసిన సవరణలకు జనరల్‌ బాడీ సమావేశం ఆమోదం తెలిపింది. వీటికి సంబంధించిన తీర్మానాలు, పార్టీ రాజ్యాంగ సవరణ అంశాలను సమర్పిస్తున్నాం..’ అని లేఖలో పేర్కొన్నారు.

adda247

 

Andhra Pradesh State Weekly Current Affairs

1. AP: ప్రపంచ వారసత్వ కట్టడంగా ‘ధవళేశ్వరం’

Dhavaleswaram is a World Heritage Site.
Dhavaleswaram is a World Heritage Site.

గోదావరి డెల్టాను 160 ఏళ్లుగా సస్యశ్యామలం చేస్తూ భారతదేశపు ధాన్యాగారంగా నిలిపిన ధవళేశ్వరం బ్యారేజ్‌ (సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ ఆనకట్ట) మణిహారంలో మరో కలికితురాయి చేరింది. ప్రపంచ సాగునీటి వారసత్వ కట్టడంగా బ్యారేజ్‌ను ఐసీఐడీ(ఇంటర్నేషనల్‌ కమిషన్‌ ఆన్‌ ఇరిగేషన్‌ అండ్‌ డ్రైనేజ్‌) గుర్తించింది. ఇందుకు సంబంధించిన గుర్తింపు పత్రాన్ని ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో జరుగుతున్న ఐసీఐడీ 24వ కాంగ్రెస్‌లో అక్టోబర్ 6న ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డిలకు ఆ సంస్థ చైర్మన్‌ ప్రొ.ఆర్‌. రగబ్‌ రగబ్‌ అందజేశారు.

పక్కన గోదావరి ప్రవహిస్తున్నా సాగు, తాగునీటికి తల్లడిల్లే గోదావరి డెల్టాను సస్యశ్యామలం చేయడం.. కాకినాడ నుంచి పుదుచ్చేరికి జలరవాణా మార్గానికి కేంద్ర బిందువుగా చేసేందుకు 1857లో బ్రిటిష్‌ సర్కార్‌ ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణాన్ని ప్రారంభించి 1862లో పూర్తిచేసి కాలువల వ్యవస్థను అభివృద్ధి చేసింది. కాకినాడ కెనాల్‌ మీదుగా ధవళేశ్వరం బ్యారేజ్‌కు చేరి.. అక్కడి నుంచి ఏలూరు కెనాల్‌ మీదుగా ప్రకాశం బ్యారేజ్‌కు చేరి అక్కడి నుంచి కొమ్మమూరు, బకింగ్‌హాం కెనాల్‌ ద్వారా బంగాళాఖాతంలోకి చేరుకుని అక్కడి నుంచి చెన్నై, పుదుచ్చేరికి వెళ్లేలా అప్పట్లోనే జలరవాణా మార్గాన్ని అభివృద్ధి చేశారు.

దేశంలో నాలుగు కట్టడాలకు గుర్తింపు

పురాతన కాలం నుంచి ఆయకట్టుకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందిస్తున్న కట్టడాలను ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడాలుగా ఐసీఐడీ గుర్తిస్తోంది. ఈసారి అడిలైడ్‌లో జరుగుతున్న 24వ కాంగ్రెస్‌లో ప్రపంచవ్యాప్తంగా 22 ప్రాజెక్టులను గుర్తించగా.. ఇందులో దేశంలోని నాలుగు ప్రాజెక్టులకు స్థానం దక్కింది. వీటిలో ఏపీలోని ధవళేశ్వరం బ్యారేజ్, తమిళనాడులోని లోయర్‌ ఆనకట్ట, ఒడిశాలోని బైతరణి, రుషికుల్య ప్రాజెక్టులున్నాయి.

2.  కృష్ణా నదిపై రెండంతస్తుల కేబుల్‌ బ్రిడ్జి

A double-storied cable-stayed bridge
A double-storied cable-stayed bridge

దేశంలోనే తొలిసారి రెండు అంతస్తుల కేబుల్‌ వంతెన రాష్ట్రంలో నిర్మాణం కాబోతోంది. కృష్ణానదిపై సోమశిల వద్ద ప్రతిపాదించిన భారీ బ్రిడ్జికి కేంద్ర రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ అధీనంలోని స్టాండింగ్‌ ఫైనాన్స్‌ కమిటీ ఆమోదముద్ర వేసింది.  అక్టోబర్ 7న ఢిల్లీలో ఈ కమిటీ భేటీ అయ్యింది. నిర్మాణ సంస్థకు వర్క్‌ ఆర్డర్‌ ఇచ్చిన రెండేళ్ల కాలంలో ఇది సిద్ధం కానుంది. తెలంగాణ–ఆంధ్రప్రదేశ్‌లను కలుపుతూ కృష్ణా నదిపై నిర్మించే ఈ వంతెనలో పైన వాహనాలు వెళ్లే ప్రధాన క్యారేజ్‌ వే ఉంటుంది. దాని దిగువన పర్యాటకులు నడుచుకుంటూ సోమశిల ప్రకృతి సౌందర్యం, కృష్ణా నదీ పరవళ్లను తిలకించేందుకు వీలుగా గాజు వంతెన (పెడస్ట్రియన్‌ డెక్‌) ఉంటుంది.

తెలంగాణ నుంచి ఏపీలోని నంద్యాల వైపు రోడ్డు మార్గాన వెళ్లేవారికి దూరాభారాన్ని తగ్గించే క్రమంలో కొత్త జాతీయ రహదారిని ప్రతిపాదించారు. నంద్యాల, తిరుపతి వెళ్లాలంటే కర్నూలు మీదుగా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. అదే కొల్లాపూర్‌ మీదుగా కృష్ణా నదిని దాటేలా వంతెన నిర్మిస్తే ఆ దూరం దాదాపు 90 కి.మీ మేర తగ్గిపోతుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌–శ్రీశైలం రహదారి మీద ఉన్న కోట్రా జంక్షన్‌ నుంచి మల్లేశ్వరం, అక్కడి నుంచి నంద్యాల వరకు 173.73 కి.మీ మేర రహదారిని (హైవే 167 కే) నాలుగు వరసలుగా నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకు కృష్ణానదిపై వంతెన అవసరమైంది. అయితే దీన్ని సాదాసీదాగా నిర్మించకుండా, పర్యాటకులను ఆకట్టుకునేలా ఐకానిక్‌ వంతెనగా నిర్మిస్తే బాగుంటుందని అధికారులు ప్రతిపాదించారు. పాపికొండలు తరహాలో ఈ ప్రాంతం అత్యంత రమణీయంగా ఉన్నందున ఇక్కడికి నిత్యం వేలల్లో పర్యాటకులు వస్తారు. గాజు నడక వంతెన నిర్మిస్తే వారు నదీ పరవళ్లను తిలకిస్తూ ప్రత్యేక అనుభూతిని పొందేందుకు అవకాశం ఉంటుందని భావించారు. వాహనాల వంతెన దిగువన గాజు డెక్‌ ఉండేలా రెండంతస్తులుగా డిజైన్‌ చేశారు.

3. దివ్యాంగులకు రిజర్వేషన్‌ పెంపు

Enhancement of reservation for disabled persons
Enhancement of reservation for disabled persons

దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకనుంచి ప్రభుత్వ ఉద్యోగాలు, పదోన్నతుల్లో దివ్యాంగులకు నాలుగు శాతం రిజర్వేషన్‌ అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం మూడుశాతం ఉన్న రిజర్వేషన్‌ను నాలుగు శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన  కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌శర్మ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. నిర్ధారిత వైకల్యాలున్న వారికి నాలుగు శాతం రిజర్వేషన్‌ వర్తిస్తుందని పేర్కొన్నారు.

ఏశాఖలోనైనా రిజర్వేషన్ల నుంచి మినహాయింపు అవసరమైతే అందుకు తగిన కారణాల సమర్థనతోపాటు ఇంటర్‌ డిపార్ట్‌మెంటల్‌ కమిటీ అనుమతి తీసుకోవాలని తెలిపారు. ఈ రిజర్వేషన్‌ పెంపునకు అనుగుణంగా ఏపీ స్టేట్‌ సబార్డినేట్‌ సర్వీస్‌ రూల్స్‌–1996లో సవరణలు చేయనున్నట్లు పేర్కొన్నారు.

వికలాంగుల హక్కుల చట్టం–2016లోని సెక్షన్‌–34 ప్రకారం ప్రభుత్వ నియామకాలు, పదోన్నతుల్లో నిర్ధారిత వైకల్యాల వ్యక్తులకు నాలుగుశాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ 2020 ఫిబ్రవరి 19వ తేదీన మహిళా శిశు సంక్షేమ, వికలాంగుల సంక్షేమశాఖ ఉత్తర్వులు జారీచేసింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలు, పదోన్నతుల్లో దివ్యాంగులకు నాలుగు శాతం రిజర్వేషన్‌ కల్పించింది.

4. 21న జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–3 ప్రయోగం

GSLV Mark-3
GSLV Mark-3

న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్పేస్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీ అర్ధరాత్రి 12.02 నిమిషాలకు తిరుపతి జిల్లా సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి జియో శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికల్‌ (జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–3, ఎం–2) ఉపగ్రహ వాహకనౌకను ప్రయోగించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు.

యునైటెడ్‌ కింగ్‌డం(యూకే)కు చెందిన నెట్‌వర్క్‌ యాక్సెస్‌ అసోసియేషన్‌ లిమిటెడ్‌(వన్‌ వెబ్‌ కంపెనీ)తో ఇస్రో, న్యూ స్పేస్‌ ఇండియా, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్పేస్‌ సంస్థలు ఈ ప్రయోగాన్ని నిర్వహించేందుకు ఇటీవల ఒప్పందం చేసుకున్నాయి. ఇందులో భాగంగానే వన్‌ వెబ్‌ కంపెనీకి చెందిన 36 ఉపగ్రహాలను ఒకేసారి లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌ (లియో అర్బిట్‌) రోదశీలోకి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కో ఉపగ్రహం బరువు 137 కిలోలు ఉంటుందని, 36 ఉపగ్రహాలు కలిపితే 4,932 కిలోల బరువుగా ఇస్రో పేర్కొంది.

5. AP: ఈ–గవర్నెన్స్‌లోనూ అదుర్స్‌

E-Governance
E-Governance

గత ఆర్థిక సంవత్సరం (2021–22)లో దేశవ్యాప్తంగా ఈ–గవర్నెన్స్‌ అమలులో ఆంధ్రప్రదేశ్‌ నాలుగో స్థానంలో నిలిచింది. టాప్‌–10 రాష్ట్రాలకు తొలి మూడు స్థానాల్లో పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు వరుసగా నిలిచాయి. పశ్చిమ బెంగాల్‌ అత్యధికంగా 136.07 కోట్ల ఎలక్ట్రానిక్‌ లావాదేవీలతో తొలి స్థానంలో నిలవగా ఆ తర్వాత ఉత్తరప్రదేశ్‌ 109.27 కోట్లతో రెండో స్థానంలోనూ.. 84.23 కోట్లతో తమిళనాడు మూడో స్థానంలో నిలిచినట్లు నివేదిక వెల్లడించింది. అదే ఏపీలో 52.90కోట్ల ఎలక్ట్రానిక్‌ లావాదేవీలు జరిగినట్లు కేంద్ర గణాంకాలు, కార్యకమాల అమలు మంత్రిత్వ శాఖ నివేదిక వెల్లడించింది.

ఇక ఎలక్ట్రానిక్‌ సేవల లావాదేవీలను ఆరు కేటగిరీలుగా నివేదిక వర్గీకరించింది. చట్టబద్ధమైన, చట్టబద్ధతలేని సేవలు, బిజినెస్‌ సిటిజన్‌ సేవలు, సమాచార సేవలు, మొబైల్‌ గవర్నెన్స్, యుటిలిటీ బిల్లుల చెల్లింపులు, సామాజిక ప్రయోజనాలుగా వర్గీకరించింది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్‌ 52.90 కోట్ల ఎలక్ట్రానిక్‌ సేవల లావాదేవీలను నిర్వహించినట్లు నివేదిక వెల్లడించింది. ఇందులో చట్టబద్ధత, చట్టబద్ధతలేని సేవల లావాదేవీలు 4.16 కోట్లని నివేదిక పేర్కొంది. ఇక యుటిలిటీ బిల్లుల చెల్లింపుల లావాదేవీలు 10.76 కోట్లు, సమాచార సేవల లావాదేవీలు 4.13 కోట్లు సామాజిక ప్రయోజనాల లావాదేవీలు 33.83 కోట్లు బిజినెస్‌ సిటిజన్‌ సేవల లావాదేవీలు 23 వేలు నిర్వహించినట్లు నివేదిక పేర్కొంది.

6. ‘సంక్షేమం’ ఖర్చులో ఏపీదే అగ్రస్థానం

AP is at the top of welfare expenditure
AP is at the top of welfare expenditure

సమాజంలో పేదరిక నిర్మూలన కోసం సంక్షేమ పథకాలపై భారీ మొత్తాలను ఖర్చుచేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌దే అగ్రస్థాన మని సొసైటీ ఫర్‌ ఎలిమినేషన్‌ ఆఫ్‌ రూరల్‌ పావర్టీ (సెర్ప్‌) హైకోర్టుకు నివేదించింది. కేంద్రం మంజూరు చేసిన పెన్షన్లకు, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్లకు పొంతనే లేదని, కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద సంఖ్యలో అత్యధిక మొత్తాన్ని చెల్లిస్తోందని సెర్ప్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ) మహ్మద్‌ ఇంతియాజ్‌ హైకోర్టుకు వివరించారు.

వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పథకం కింద వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, డప్పు కళాకారులు, చర్మకారులకు నెలకు రూ.2,500, వికలాంగులకు నెలకు రూ.3 వేలు, తీవ్రమైన కిడ్నీ జబ్బులతో బాధపడుతూ డయాలసిస్‌ చేయించుకుంటున్న వారికి నెలకు రూ.10 వేలు చెల్లిస్తోందన్నారు. పెన్షన్ల అర్హత వయసు కూడా 65 నుంచి 60కి తగ్గించిందన్నారు.

7.  ఏపీ వరుసగా రెండో ఏడాది జాతీయ అవార్డు

ap swacha-awards
ap swacha-awards

జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌ మరోసారి సత్తా చాటుకుంది. వరుసగా రెండో ఏడాది కూడా స్వచ్చ సర్వేక్షన్‌లో జాతీయ అవార్డులు అందుకుంది. కాగా, స్వచ్చ సర్వేక్షన్‌ కార్యక్రమంలో భాగంగా తిరుపతి కార్పొరేషన్‌కు జాతీయ అవార్డు లభించింది.

అలాగే, విశాఖ, విజయవాడ, పుంగనూరు, పులివెందులకు కూడా స్వచ్చ సర్వేక్షన్‌ అవార్డులు వచ్చాయి. ఈ సందర్భంగా ఢిల్లీలో జరిగిన అవార్డు ప్రదానోత్సవంలో ఏపీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ శనివారం.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సురేష్‌తో పాటుగా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి పాల్గొన్నారు.

adda247

మరింత చదవండి:

తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

 

Sharing is caring!

AP and Telangana State October Weekly Current Affairs_18.1