Telugu govt jobs   »   Monthly & Weekly Current Affairs   »   AP and Telangana states August Weekly...

AP and Telangana states August Weekly Current affairs , ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఆగస్టు వారాంతపు కరెంట్ అఫైర్స్ పార్ట్ 4

AP and Telangana state Weekly Current affairs, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వారాంతపు కరెంట్ అఫైర్స్

Current affairs play a very important role in the competitive examinations and hence, aspirants have to give undivided attention to it while doing preparation for the government examinations. The banking or state govt examinations comprise a section of “General Awareness” to evaluate how much the aspirant is aware of the daily happenings taking place around the world. To complement your preparation, we are providing you with a compilation of the  Current affairs of August 4th week.

 

AP and Telangana state Weekly Current affairs, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వారాంతపు కరెంట్ అఫైర్స్

Weekly current Affairs PDF in Telugu : APPSC, TSPSC గ్రూప్స్ , SI మరియు కానిస్టేబుల్ పరీక్షలలో  జనరల్ అవేర్‌నెస్ చాలా ముఖ్యమైన విభాగాలలో ఒకటి మరియు మీరు మీ సమయాన్ని హృదయపూర్వకంగా కేటాయించినట్లయితే ఈ అంశం నుండి చాలా మంచి మార్కులు సాధించగలరు. పరీక్షల  ముందు అప్పటికప్పుడు  ఈ అంశాన్ని చదువుకొని వెళ్ళడం ద్వారా ఎక్కువ మార్కులు సాధించడం అసాధ్యం.  GA మీరు 10-15 రోజుల్లో పూర్తి  చేయగల విభాగం కాదు. మీరు జనరల్ అవేర్నెస్ పై పట్టు సాధించడానికి  ఉత్తమ మార్గం రోజూ వార్తాపత్రికలను చదవడం లేదా వారపు వార్తల ద్వారా వెళ్ళడం.

దీని ద్వారా   నెలవారీ లేదా 6 నెలల వార్తల ద్వారా తెలుసుకొనే సమాచారం కంటే ఎక్కువ సమాచారం తెలుసుకోవచ్చు. ఇక్కడ మేము మీకు అన్ని వార్తాపత్రికల నుండి సమకాలీన అంశాల సారాంశాన్ని అందిస్తున్నాము, ఇది మీ సమయాన్ని ఆదా చేస్తుంది మరియు మీరు ఆ సమయాన్ని వారాంతపు సమకాలీన అంశాలు 2022 అధ్యయనం కోసం కేటాయించవచ్చు.

AP and Telangana states August Weekly Current affairs_40.1APPSC/TSPSC Sure shot Selection Group

 

Telangana State Weekly Current affairs

1. తెలంగాణలోనూ ‘ఆర్బీకే’ తరహా సేవలు

AP and Telangana states August Weekly Current affairs_50.1
RBKs

రైతు భరోసా కేంద్రాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సేవలను పరిశీలించేందుకు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందం  ఏపీలో పర్యటించబోతోంది. తెలంగాణ వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి నేతృత్వంలోని ఈ బృందం గుంటూరు జిల్లాలోని ఆర్బీకే, ఇంటిగ్రేటెడ్‌ అగ్రి ల్యాబ్, మినుము ప్రాసెసింగ్‌ యూనిట్, అరటి వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించనుంది. మంత్రి నిరంజన్‌రెడ్డి గతంలో కూడా ఏపీలోని పలుప్రాంతాల్లో పర్యటించి ఆర్బీకేల ద్వారా గ్రామ స్థాయిలో రైతులకు అందిస్తోన్న సేవలను పరిశీలించారు.

తెలంగాణలో కూడా ఇంటిగ్రేటెడ్‌ కాల్‌ సెంటర్‌తో పాటు ఆర్బీకే చానల్‌ తరహాలో ఓ అగ్రి చానల్‌ను ప్రారంభిస్తామని నిరంజన్‌రెడ్డి అప్పట్లో ప్రకటించారు. అలాగే ఆర్బీకేల్లోని కియోస్క్‌లను తెలంగాణలోని రైతు వేదికల్లో కూడా అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. వాటిని ఏర్పాటు చేసేందుకు ప్రస్తుతం కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి నిరంజన్‌రెడ్డి గురువారం మధ్యాహ్నం 3 గంటలకు గుంటూరు జిల్లా కొల్లిపర మండలం వల్లభాపురం చేరుకొని.. అరటి వ్యవసాయక్షేత్రాన్ని సందర్శించి రైతు లతో మాట్లాడుతారు. అనంతరం తెనాలిలో  వైఎస్సార్‌ ఇంటిగ్రేటెడ్‌ అగ్రికల్చర్‌ ల్యాబ్‌ను సందర్శిస్తారు. తర్వాత అంగలకుదురులోని ఆర్బీకేను పరిశీలించి రైతులతో సమావేశమవుతారు. ఏటుకూరు సమీపంలోని బొంత పాడు రోడ్‌లో ఉన్న మినుము సీడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను  పరిశీలిస్తారు.

2. ఫిబ్రవరిలో బయో ఏషియా సదస్సు

AP and Telangana states August Weekly Current affairs_60.1
bio asia summit

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘‘బయో ఏషియా’’ సదస్సు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్నట్లు మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రకటించారు.  2023 సంవత్సరానికి గాను ఫిబ్రవరి 24 –26వ తేదీల్లో 20వ బయో ఏషియా సదస్సు నిర్వహించనున్నారు. ‘అడ్వాన్సింగ్‌ ఫర్‌ వన్‌: షేపింగ్‌ ద నెక్స్‌ట్‌ జనరేషన్‌ ఆఫ్‌ హ్యూమనైజ్డ్‌ హెల్త్‌ కేర్‌’ ఇతివృత్తంగా సాగుతుందని మంత్రి తెలిపారు.

శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్, బయో ఏషియా సీఈఓ శక్తి నాగప్పన్‌లతో కలిసి ఆయన సదస్సు లోగోను ఆవిష్కరించారు. భవిష్యత్‌ తరాల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వాలు, విద్య, పరిశోధన, నియంత్రణ సంస్థలు కలిసికట్టుగా పని చేయాల్సిన అవసరాన్ని కోవిడ్‌ మహమ్మారి మానవాళికి తెలిపిందని, అందుకే అదే ఇతివృత్తంగా సదస్సు నిర్వహిస్తున్నట్లు కేటీఆర్‌ తెలిపారు.

3. టీఆర్‌ఈఎఫ్‌ రాష్ట్ర కన్వీనర్‌గా దామెర శ్రీనివాస్‌

AP and Telangana states August Weekly Current affairs_70.1
TREF Convenor Damera Srinivas

తెలంగాణ రజక ఉద్యోగ సమాఖ్య రాష్ట్ర కన్వీన ర్‌గా దామెర శ్రీనివాస్‌ ఎన్నికయ్యారు.  సూర్యా పేటలో జరిగిన భేటీలో రాష్ట్ర అడ్‌హక్‌ కమిటీని ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా ఎ.పున్నయ్య వ్యవహరించారు. కో కన్వీ నర్లుగా పిల్లుట్ల శ్రీహరి, మీసాల కోటయ్య ఎన్నికయ్యారు.

4. హైదరాబాద్ లో ఎలక్ట్రిక్‌ డబుల్‌ డెక్కర్‌లు

AP and Telangana states August Weekly Current affairs_80.1
Electric Double Decker

భాగ్యనగర రోడ్లపై ఎలక్ట్రిక్‌ డబుల్‌ డెక్కర్‌ బస్సులను నడిపేందుకు టీఎస్‌ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. దేశంలోనే తొలిసారి ముంబైలో ఎలక్ట్రిక్‌ డబుల్‌ డెక్కర్‌లు రోడ్డెక్కిన నేప థ్యంలో వాటిని రూపొందించిన అశోక్‌ లేలాండ్‌ అను బంధ సంస్థ స్విచ్‌ మొబిలిటీతోపాటు మరో 2 కంపె నీలతో ఆర్టీసీ యాజమాన్యం చర్చలు జరుపుతోంది. ఇందులో ఓ కంపెనీతో చర్చలు దాదాపు కొలిక్కి వస్తు న్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. హైదరాబాద్‌లో 20–25 ఎలక్ట్రిక్‌ డబుల్‌ డెక్కర్‌ బస్సులు తిప్పాలని నిర్ణయించిన ఆర్టీసీ ధర విషయంలో స్పష్టత రాగానే ఆర్డర్‌ ఇవ్వనున్నట్లు సమాచారం.

హైదరాబాద్‌లో డబుల్‌ డెక్కర్‌ బస్సులను పునః­ప్రారంభించే విషయమై మంత్రి కేటీఆర్‌ చేసిన సూచ­నకు రవాణాశాఖ మంత్రి పువ్వా­డ అజయ్‌కుమార్‌ సానుకూలంగా స్పందించడంతో కొత్త డబుల్‌ డెక్కర్‌ బస్సులు కొనాలని గతేడాది నిర్ణయించారు. ఈ మేరకు టెండర్లు కూడా పిలిచారు. కానీ కొత్త బస్సులు కొనేందుకు నిధుల్లేకపోవడంతో ఆర్టీసీ చేతులెత్తేసింది.అయితే ఇది కేటీఆర్‌ ప్రతిపాదన కావడంతో పురపాలక శాఖ ఆర్థిక సాయం చేస్తుందన్న అంశం తెరపైకి వచ్చినా అది సాకారం కాలేదు.

5. అగ్రశ్రేణి కంపెనీలకు గమ్యస్థానంగా తెలంగాణ 

AP and Telangana states August Weekly Current affairs_90.1
Telangana is a destination for top companies

పెట్టుబడిదారులకు స్నేహపూర్వక వాతావరణం, పారదర్శకమైన ప్రభుత్వ పాలసీలతోపాటు దేశంలోనే అత్యుత్తమ వాతావరణం తెలంగాణ సొంతమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. వ్యవసాయం, పారిశ్రామిక, సేవారంగాల్లో గత ఎనిమిదేళ్లుగా నమోదైన ప్రగతితో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ భారీగా వృద్ధి చెందిందన్నారు. తెలంగాణ ప్రభుత్వ విప్లవాత్మక విధానాలు, ప్రోత్సాహకాలతో ఐటీ, లైఫ్‌ సైన్సెస్, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగాలకు చెందిన ప్రపంచంలోని అగ్రశ్రేణి కంపెనీలు తెలంగాణను గమ్యస్థానంగా ఎంచుకున్నాయన్నారు.

తెలంగాణకు భారీ పెట్టుబడులను రప్పించడం లక్ష్యంగా మంత్రి కేటీ ఆర్‌  ‘డిప్లొమాట్‌ ఔట్‌రీచ్‌ ప్రోగ్రామ్‌’ను నిర్వహించారు. టీ–హబ్‌ 2.0లో జరిగిన ఈ సమావేశానికి సుమారు 50 దేశాలకు చెందిన రాయబారు లు, ప్రతినిధులు, కాన్సుల్‌ జనరల్స్, గౌరవ కాన్సు ల్‌ జనరల్స్, హైకమిషనర్లు, ట్రేడ్‌ కమిషనర్లు హాజరయ్యారు. తెలంగాణలోని పెట్టుబడి అవకాశాలు, పెట్టుబడిదారులకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంపై కేటీఆర్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ప్రభుత్వ పారిశ్రామిక విధానాన్ని వివరించారు.

6. 12 జిల్లాల్లో సెంట్రల్‌ మెడిసిన్‌ స్టోర్లు

AP and Telangana states August Weekly Current affairs_100.1
Central Medicine Stores

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుప త్రులకు వచ్చే రోగులకు అవసరమైన మందులు అన్నింటినీ ఉచితంగా ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు చాలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్‌ మందులు రాశాక రోగులకు నిర్దేశిత రోజులకు అవసరమైనన్ని మందులు కాకుండా తక్కువ రోజులకు ఇస్తున్న పరిస్థితి ఉంది.  ఈ నేపథ్యంలో రోగులకు అవసరమై నన్ని మందులను ఉచితంగానే ఇవ్వాలని ప్రభు త్వం నిర్ణయించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) మొదలు ఏరియా, సామాజిక, జిల్లా, బోధనాసుపత్రుల వరకు అన్ని చోట్లా దీన్ని అమలు చేస్తారు. వైద్యులు అక్కడుండే మందులనే రాసి రోగులు బయట కొనే పరిస్థితి లేకుండా చూడాల్సి ఉంటుంది. ఇన్‌పేషెంట్లు, ఔట్‌ పేషెంట్లు అందరికీ నిర్ణీత కోర్సు మేరకు మందులు ఇస్తారు. ప్రభుత్వం మందుల కోసం ఈ ఏడాది బడ్జెట్లో రూ. 500 కోట్లు కేటాయించింది.

7. దేశంలోనే తొలిసారిగా.. జడ్జీల కోసం రిక్రియేషన్‌ సెంటర్‌

AP and Telangana states August Weekly Current affairs_110.1
Recreation Center

న్యాయమూర్తుల కోసం గెస్ట్‌హౌస్‌లు ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఉన్నాయని కానీ, దేశంలోనే తొలిసారిగా హైకోర్టు జడ్జీల కోసం రిక్రియేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేయనుండటం ఆనందదాయకమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ పేర్కొన్నారు.

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ రోడ్‌ నెం 7లోని వికార్‌ మంజిల్‌లో హైకోర్టు న్యాయమూర్తులకు సంబంధించిన కల్చరల్‌ సెంటర్, గెస్ట్‌హౌస్‌ నిర్మాణానికి ఆగస్టు 19వ తేదీన (శుక్రవారం) ఆయన భూమి పూజ చేశారు. అనంతరం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. సుదీర్ఘకాలంగా న్యాయమూర్తుల గెస్ట్‌హౌస్‌ అంశం పెండింగ్‌లో ఉందన్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన హైకోర్టు న్యాయమూర్తులు, వారి కుటుంబసభ్యులు పలు అవసరాల కోసం వస్తే వసతి కల్పనకు ప్రభుత్వంపై ఆధారపడాల్సి వస్తోందని అన్నారు. దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చే న్యాయమూర్తులకు వసతి కల్సించేందుకు ఈ గెస్ట్‌హౌస్‌ ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. ఇప్పటివరకు సుప్రీంకోర్టులో మాత్రమే జిమ్, స్విమ్మింగ్‌ పూల్‌ వంటివి ఉన్నాయని, ఇప్పుడు హైకోర్టుల్లో ఆ తరహా వసతుల కల్పన చేయబోయేది తెలంగాణ హైకోర్టేనని చెప్పారు.

AP and Telangana states August Weekly Current affairs_120.1

 

Andhra Pradesh state Weekly Current affairs

1. Flipkart గ్రోసరీ ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్‌ ప్రారంభం

AP and Telangana states August Weekly Current affairs_130.1
Flipkart Grocery

ఈ – కామర్స్‌ మార్కెట్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటి గ్రోసరీ ఫుల్‌ఫిల్‌మెంట్‌ కేంద్రాన్ని విజయవాడలో ఏర్పాటు చేసింది. విజయవాడ సమీపంలోని గన్నవరం వద్ద ఏర్పాటు చేసిన ఈ నూతన ఫెసిలిటీని ఆగష్టు 22న  ప్రారంభించింది. ఈ కేంద్రం ప్రారంభంతో ఫ్లిప్‌కార్ట్‌ సరఫరా చైన్‌ నెట్‌వర్క్‌ను మరింతగా విస్తరించింది. ఈ కేంద్రం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 1,000 మందికి ఉపాధి కలగడంతో పాటు వేలాది మంది స్థానిక విక్రేతలు, ఎంఎస్‌ఎంఈలు, చిన్న రైతులకు మార్కెట్‌ అవకాశాలు లభిస్తాయి. ఈ ఫెసిలిటీతో రాబోయే ప్రతిస్టాత్మక ఫ్లిప్‌కార్ట్‌ కార్యక్రమం బిగ్‌ బిలియన్‌ డేస్‌ 2022లో రోజుకు 4 వేల గ్రోసరీ ఆర్డర్లును నిర్వహించగలదు.

2. ఉన్నత విద్యా రంగంపై గోవా ప్రతినిధుల అధ్యయనం

ఉన్నత విద్యా రంగంలో రాష్ట్రం అమలు చేస్తున్న విధానాలను గోవా ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలోని ప్రతినిధుల బృందం అధ్యయనం చేసింది. జాతీయ విద్యా విధానం-2020 అమలులో భాగంగా చేపట్టిన కార్యక్రమాలు, పునర్నిర్మాణం, సాధారణ ప్రవేశ పరీక్షల నిర్వహణ, డిగ్రీలో ఇంటర్న్‌షిప్‌ తదితర అంశాలను పరిశీలించింది. ఎన్‌ఏఏసీ, ఎన్‌ఐఆర్‌ఎఫ్, ఎన్‌బీఏ ర్యాంకులు సాధించేందుకు ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తుందో కూడా బృందం తెలుసుకుంది. గోవా ప్రతినిధుల బృందంలో ఆచార్య నియాన్‌ మార్కోన్, ఎఫ్‌ఎం నదాఫ్, వందనా నాయక్, సందేశ్‌ గాంకర్, సిద్ధి బండాంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

***************************************************************

AP and Telangana states August Weekly Current affairs_140.1

మరింత చదవండి:

తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

 

Sharing is caring!

Download your free content now!

Congratulations!

AP and Telangana states August Weekly Current affairs_160.1

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Download your free content now!

We have already received your details!

AP and Telangana states August Weekly Current affairs_170.1

Please click download to receive Adda247's premium content on your email ID

Incorrect details? Fill the form again here

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Thank You, Your details have been submitted we will get back to you.