Telugu govt jobs   »   Monthly & Weekly Current Affairs   »   AP and Telangana states August Weekly...

AP and Telangana states August Weekly Current affairs , ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఆగస్టు వారాంతపు కరెంట్ అఫైర్స్ పార్ట్ 3

AP and Telangana state Weekly Current affairs, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వారాంతపు కరెంట్ అఫైర్స్

Current affairs play a very important role in the competitive examinations and hence, aspirants have to give undivided attention to it while doing preparation for the government examinations. The banking or state govt examinations comprise a section of “General Awareness” to evaluate how much the aspirant is aware of the daily happenings taking place around the world. To complement your preparation, we are providing you with a compilation of the  Current affairs of August 3rd week.

 

AP and Telangana state Weekly Current affairs, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వారాంతపు కరెంట్ అఫైర్స్

Weekly current Affairs PDF in Telugu : APPSC, TSPSC గ్రూప్స్ , SI మరియు కానిస్టేబుల్ పరీక్షలలో  జనరల్ అవేర్‌నెస్ చాలా ముఖ్యమైన విభాగాలలో ఒకటి మరియు మీరు మీ సమయాన్ని హృదయపూర్వకంగా కేటాయించినట్లయితే ఈ అంశం నుండి చాలా మంచి మార్కులు సాధించగలరు. పరీక్షల  ముందు అప్పటికప్పుడు  ఈ అంశాన్ని చదువుకొని వెళ్ళడం ద్వారా ఎక్కువ మార్కులు సాధించడం అసాధ్యం.  GA మీరు 10-15 రోజుల్లో పూర్తి  చేయగల విభాగం కాదు. మీరు జనరల్ అవేర్నెస్ పై పట్టు సాధించడానికి  ఉత్తమ మార్గం రోజూ వార్తాపత్రికలను చదవడం లేదా వారపు వార్తల ద్వారా వెళ్ళడం.

దీని ద్వారా   నెలవారీ లేదా 6 నెలల వార్తల ద్వారా తెలుసుకొనే సమాచారం కంటే ఎక్కువ సమాచారం తెలుసుకోవచ్చు. ఇక్కడ మేము మీకు అన్ని వార్తాపత్రికల నుండి సమకాలీన అంశాల సారాంశాన్ని అందిస్తున్నాము, ఇది మీ సమయాన్ని ఆదా చేస్తుంది మరియు మీరు ఆ సమయాన్ని వారాంతపు సమకాలీన అంశాలు 2022 అధ్యయనం కోసం కేటాయించవచ్చు.

AP and Telangana states August Weekly Current affairs_40.1APPSC/TSPSC Sure shot Selection Group

 

Telangana State Weekly Current affairs

1. తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్‌ అధ్యక్షుడిగా సంజయ్‌రెడ్డి

 

AP and Telangana states August Weekly Current affairs_50.1
talanagana pharmacy

తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్‌ (టీఎస్‌పీసీ) అధ్యక్షుడిగా ఆకుల సంజయ్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ నుంచి ఆయన పదవీబాధ్యతలు స్వీకరించారు. ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో కౌన్సిల్‌ సభ్యులు సంజయ్‌రెడ్డిని అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.

 2. కృత్రిమ మేధస్సు, వన్యప్రాణులకు ఆయుష్షు

 

AP and Telangana states August Weekly Current affairs_60.1
Artificial intelligence, life for wildlife

వన్యప్రాణుల సంరక్షణ, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగేసింది. టీ అటల్‌ ఇన్నొవేషన్‌ మిషన్‌ (ఎయిమ్‌) ఆధ్వర్యంలో కార్యాచరణకు పూనుకుంటోంది.  వన్యప్రాణుల అభివృద్ధి, కదలికలు, సంతతి అంశాల క్రోడీకరణకు సాంకేతికత రూపొందించడం, కృత్రిమ మేధస్సు(ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) ద్వారా వివరాలు సేకరించడానికి రాష్ట్రంలో పైలట్‌ ప్రాజెక్టు కింద మంచిర్యాల జిల్లా కవ్వాల్‌ టైగర్‌ జోన్‌లోని జన్నారం అటవీ డివిజన్‌ను ఎంపిక చేసింది.

వన్యప్రాణుల అభివృద్ధి, కదలికలు, సంతతి అంశాల క్రోడీకరణకు సాంకేతికత రూపొందించడం, కృత్రిమ మేధస్సు(ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) ద్వారా వివరాలు సేకరించడానికి రాష్ట్రంలో పైలట్‌ ప్రాజెక్టు కింద మంచిర్యాల జిల్లా కవ్వాల్‌ టైగర్‌ జోన్‌లోని జన్నారం అటవీ డివిజన్‌ను ఎంపిక చేసింది.

3. ఆహార భద్రత కార్డుదారులకూ ఆరోగ్యశ్రీ

 

AP and Telangana states August Weekly Current affairs_70.1
Arogya Shri for food security card holders

ఆరోగ్యశ్రీ– ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద అందించే ఉచిత వైద్య చికిత్సలు ఆహారభద్రత కార్డుపై కూడా చెల్లుబాటయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ ఆరోగ్యశ్రీ ట్రస్టు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో తెల్లరేషన్‌ కార్డు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ పథకం కింద కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్యశ్రీ కార్డులను అందజేశారు. అయితే తెలంగాణ ఏర్పాటయ్యాక రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌ కోసం తెల్లకార్డుల స్థానంలో 10లక్షల ఆహార భద్రత కార్డులను పంపిణీ చేసింది.

వాటిని కేవలం రేషన్‌ సరుకుల కోసం మాత్రమే పరిమితం చేసింది. ఆరోగ్యశ్రీ–ఆయుష్మాన్‌ భారత్‌ కింద చికిత్సలు పొందాలంటే సంబంధిత కార్డుగానీ, లేదా తెల్ల రేషన్‌ కార్డుగానీ ఉండాలనే నిబంధన ఉంది. దీనివల్ల ఆహార భద్రత కార్డుదారులు ఆరోగ్యశ్రీ సేవలను పొందలేకపోతున్నారు. దీనిపై ప్రజల నుంచి వినతులు రావడంతో.. ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. ఆహార భద్రత కార్డుదారులకు కూడా ఇక నుంచి ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద ఉచిత సేవలు లభిస్తాయి.

4. ఆయిల్‌ ఫెడ్‌ చైర్మన్‌గా కంచర్ల రామకృష్ణారెడ్డి 

 

AP and Telangana states August Weekly Current affairs_80.1
Oil Fed Chairman

తెలంగాణ రాష్ట్ర ఆయిల్‌ ఫెడ్‌ సంస్థ చైర్మన్‌గా కంచర్ల రామకృష్ణారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మరో రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నది. తాజా ఉత్తర్వులతో ఆయిల్‌ ఫెడ్‌ సంస్థకు వరుసగా నాలుగోసారి కూడా కంచర్ల చైర్మన్‌గా నియమితుల య్యారు.

మొదట 2018లో 2020 వరకు అవకాశం ఇవ్వగా, తరువాత 2020 నుంచి 2021 వరకు, అనంతరం 2021 నుంచి 2022 జూలై వరకు చైర్మన్‌గా కొనసాగారు. ప్రస్తుత ఉత్తర్వులతో 2024 జూలై వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. నాలుగోసారి కూడా తనకే చైర్మన్‌గా అవకాశమివ్వడంతో సీఎం కేసీఆర్‌కు రామకృష్ణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

 

AP and Telangana states August Weekly Current affairs_90.1

 

Andhra Pradesh state Weekly Current affairs

1. ఇథనాల్‌ హబ్‌గా ఏపీ

 

AP and Telangana states August Weekly Current affairs_100.1
Ethanol Hub

ఇథనాల్‌ తయారీ హబ్‌గా ఆంధ్రప్రదేశ్‌ ఎదుగుతోంది. వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కావడంతో చెరకు నుంచే కాకుండా బియ్యం నూక, మొక్కజొన్నలు లాంటి ఆహార ధాన్యాల నుంచి ఏపీలో ఇథనాల్‌ తయారీ యూనిట్లను నెలకొల్పేందుకు పలు కంపెనీలు ఆసక్తి వ్యక్తం చేస్తున్నాయి. భగ్గుమంటున్న ఇంధన ధరల నేపథ్యంలో 2025–26 నాటికి పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ కలిపి విక్రయించాలన్న లక్ష్యంతో ఆహార ధాన్యాల నుంచి ఇథనాల్‌ తయారీకి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది.

ఈ అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిపుచ్చుకోవడంతో ఏపీలో ఇథనాల్‌ తయారీ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నట్లు క్రిబ్‌కో, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్, అస్సాగో, ఈఐడీ ప్యారీ, డాల్వకోట్, ఎకో స్టీల్‌ లాంటి పలు కంపెనీలు ఇప్పటికే ప్రకటించగా మరికొన్ని కంపెనీలు చర్చలు జరుపుతున్నాయి. దీనివల్ల సుమారు రూ.1,917 కోట్ల విలువైన పెట్టుబడులు రాష్ట్రంలోకి రానున్నాయి.

2. పర్యావరణహిత ‘పవర్‌’

 

AP and Telangana states August Weekly Current affairs_110.1
Environmentally Friendly Power

పర్యావరణ హిత విద్యుత్‌ ఉత్పత్తి దిశగా రాష్ట్రంలో వేగంగా అడుగులు ముందుకు పడుతున్నాయి. దక్షిణ భారతదేశంలోనే అతి పెద్దదైన మొట్టమొదటి ఫ్లూ గ్యాస్‌ డీసల్ఫరైజేషన్‌(ఎఫ్‌జీడీ) ప్రాజెక్టు వచ్చే ఏడాది మార్చి నాటికల్లా విశాఖ నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌(ఎన్టీపీసీ)లో అందుబాటులోకి రానుంది. వ్యవసాయానికి పూర్తిగా సౌర విద్యుత్‌నే వినియోగించేలా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా నుంచి 7 వేల మెగావాట్ల విద్యుత్‌ కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. 33,240 మెగావాట్ల సామర్థ్యంతో 29 పంప్డ్‌ హైడ్రో స్టోరేజ్‌ పవర్‌ ప్లాంటు స్థాపించేందుకు చర్యలు చేపట్టింది.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఏపీలో కాలుష్యాన్ని తగ్గించే విద్యుత్‌ ప్రాజెక్టులు నెలకొల్పడానికి ఉత్సాహం చూపిస్తోంది. ఇందులో భాగంగానే విశాఖ ఎన్టీపీసీలో పర్యావరణ అనుకూల ఎఫ్‌జీడీ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టింది. బొగ్గును కాల్చే ప్రక్రియలో విడుదలయ్యే హానికర వాయువుల తీవ్రతను తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. దాదాపు 90 శాతం నిర్మాణం పూర్తయ్యిందని, వచ్చే ఏడాది మార్చి కల్లా అందుబాటులోకి తీసుకువస్తామని ఎన్టీపీసీ అధికారులు తెలిపారు. మొత్తం రూ.871 కోట్ల వ్యయంతో 2 వేల మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ ఎఫ్‌జీడీ దక్షిణ భారతదేశంలోనే తొలి ప్రాజెక్టు కావడం విశేషం.

3. మిస్‌ ఇండియా యూఎస్‌–2022 రన్నరప్‌గా సంజన

 

AP and Telangana states August Weekly Current affairs_120.1
Miss India US-2022

అమెరికా న్యూజెర్సీలో జరిగిన మిస్‌ ఇండియా యూఎస్‌–2022 పోటీల్లో పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం ఇలపర్రుకు చెందిన చేకూరి సంజన రెండో రన్నరప్‌గా నిలిచింది. బుధవారం రాత్రి విజేతలను ప్రకటించగా, ఆ వివరాలను  పెనుగొండ మండల సర్పంచ్‌ల చాంబర్‌ అధ్యక్షురాలు దండు పద్మావతి మీడియాకు వెల్లడించారు. తన సోదరుడు చేకూరి రంగరాజు, మధు దంపతుల కుమార్తె అయిన సంజన ఎంఎస్‌ చదువుతూ పోటీల్లో పాల్గొందని, గత 20 ఏళ్లుగా వారు అమెరికాలో ఉంటున్నట్టు తెలిపారు.

4. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ 8 కంపెనీలకు శంకుస్థాపన

 

AP and Telangana states August Weekly Current affairs_130.1
CM of AP

గతంలో ఎన్నడూ ఆంధ్రప్రదేశ్‌ వైపు కన్నెత్తి చూడని పారిశ్రామికవేత్తలు తాను సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు.

పరిశ్రమలకు తమ ప్రభుత్వం కల్పిస్తున్న‌ ప్రోత్సాహాన్ని గుర్తించే గత మూడేళ్లుగా ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీకి మొదటి స్థానం లభిస్తోందన్నారు. పరిశ్రమలకు ఎలాంటి సహాయం, సహకారం కావాలన్నా తమ ప్రభుత్వం ఒక్క ఫోన్‌ కాల్‌తో అందుబాటులో ఉంటుందని చెప్పారు. గత ప్రభుత్వాలు బకాయిపడ్డ వివిధ ప్రోత్సాహకాలను వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వచ్చాక చెల్లించిందని గుర్తు చేశారు. వచ్చే నెలలో విశాఖలో అదానీ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేయనున్నట్లు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. ఆగస్టు 16వ తేదీన అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో జపాన్‌కు చెందిన ప్రముఖ టైర్ల తయారీ కంపెనీ యెకహోమా నెలకొల్పిన అలయన్స్‌ టైర్స్‌ కంపెనీ (ఏటీసీ) మొదటి దశ ప్లాంట్‌లో ఉత్పత్తిని ప్రారంభించి టైర్‌పై సంతకం చేసిన అనంతరం రెండో దశ ప్లాంట్‌కు సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు. మరో 8 పరిశ్రమలకు కూడా సీఎం జగన్‌ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది.

***************************************************************

AP and Telangana states August Weekly Current affairs_140.1

మరింత చదవండి:

తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

 

Sharing is caring!

Download your free content now!

Congratulations!

AP and Telangana states August Weekly Current affairs_160.1

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Download your free content now!

We have already received your details!

AP and Telangana states August Weekly Current affairs_170.1

Please click download to receive Adda247's premium content on your email ID

Incorrect details? Fill the form again here

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Thank You, Your details have been submitted we will get back to you.