Telugu govt jobs   »   Monthly & Weekly Current Affairs   »   AP and Telangana states August Weekly...

AP and Telangana states August Weekly Current affairs , ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఆగస్టు వారాంతపు కరెంట్ అఫైర్స్ పార్ట్ 2

AP and Telangana state Weekly Current affairs, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వారాంతపు కరెంట్ అఫైర్స్

Current affairs play a very important role in the competitive examinations and hence, aspirants have to give undivided attention to it while doing preparation for the government examinations. The banking or state govt examinations comprise a section of “General Awareness” to evaluate how much the aspirant is aware of the daily happenings taking place around the world. To complement your preparation, we are providing you with a compilation of the  Current affairs of August 2nd week.

 

AP and Telangana state Weekly Current affairs, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వారాంతపు కరెంట్ అఫైర్స్

Weekly current Affairs PDF in Telugu : APPSC, TSPSC గ్రూప్స్ , SI మరియు కానిస్టేబుల్ పరీక్షలలో  జనరల్ అవేర్‌నెస్ చాలా ముఖ్యమైన విభాగాలలో ఒకటి మరియు మీరు మీ సమయాన్ని హృదయపూర్వకంగా కేటాయించినట్లయితే ఈ అంశం నుండి చాలా మంచి మార్కులు సాధించగలరు. పరీక్షల  ముందు అప్పటికప్పుడు  ఈ అంశాన్ని చదువుకొని వెళ్ళడం ద్వారా ఎక్కువ మార్కులు సాధించడం అసాధ్యం.  GA మీరు 10-15 రోజుల్లో పూర్తి  చేయగల విభాగం కాదు. మీరు జనరల్ అవేర్నెస్ పై పట్టు సాధించడానికి  ఉత్తమ మార్గం రోజూ వార్తాపత్రికలను చదవడం లేదా వారపు వార్తల ద్వారా వెళ్ళడం.

దీని ద్వారా   నెలవారీ లేదా 6 నెలల వార్తల ద్వారా తెలుసుకొనే సమాచారం కంటే ఎక్కువ సమాచారం తెలుసుకోవచ్చు. ఇక్కడ మేము మీకు అన్ని వార్తాపత్రికల నుండి సమకాలీన అంశాల సారాంశాన్ని అందిస్తున్నాము, ఇది మీ సమయాన్ని ఆదా చేస్తుంది మరియు మీరు ఆ సమయాన్ని వారాంతపు సమకాలీన అంశాలు 2022 అధ్యయనం కోసం కేటాయించవచ్చు.

AP and Telangana states August Weekly Current affairs_40.1APPSC/TSPSC Sure shot Selection Group

 

Telangana State Weekly Current affairs

1. జాతీయ చేనేత పురస్కారాల ప్రదానం

AP and Telangana states August Weekly Current affairs_50.1

చేనేత కళను నమ్ముకుని కొన్ని దశాబ్దాలుగా జీవనం సాగిస్తున్న యాదాద్రి భువనగిరి జిల్లా పుట్టపాక చేనేత కళాకారులు కొలను పెద్దవెంకయ్య, ఆయన కుమారుడు రవీందర్‌లు జాతీయ హస్తకళల పురస్కారాన్ని అందుకున్నారు. దిల్లీలో జరిగిన జాతీయ చేనేత దినోత్సవంలో కేంద్ర జౌళి శాఖ మంత్రి పీయూష్‌ గోయల్, జౌళి శాఖ సహాయ మంత్రి దర్శనావిక్రమ్‌ జర్దోష్‌ల చేతుల మీదుగా స్వీకరించారు. వీరిద్దరూ కలిసి పది నెలల పాటు శ్రమించి మగ్గంపై నేసిన ‘తేలియా రుమాల్‌ డబుల్‌ ఇక్కత్‌ చీర’ను చేనేత, జౌళి మంత్రిత్వ శాఖ జాతీయ స్థాయిలో 2018 సంవత్సరానికి చేనేత కళాకారుల విభాగంలో పురస్కారానికి ఎంపిక చేసింది.

‘మార్కెటింగ్‌ విభాగం’లో పుట్టపాకకు చెందిన చేనేత వస్త్ర వ్యాపారి గజం భగవాన్‌ పీయూష్‌ గోయల్, దర్శనా జర్దోష్‌ నుంచి జాతీయ పురస్కారాన్ని స్వీకరించారు. మార్కెటింగ్‌ విభాగంలో ప్రవేశపెట్టిన పురస్కారానికి 2018 సంవత్సరానికి ఎంపికైన భగవాన్‌ ‘నీహారిక సిల్క్‌ శారీస్‌’ పేరుతో హైదరాబాద్‌లో చేనేత వస్త్రాల వ్యాపారం నిర్వహిస్తున్నారు.

2. నేతన్న బీమా ఆగస్టు 7 నుంచి ప్రారంభం

AP and Telangana states August Weekly Current affairs_60.1

రైతు బీమా తరహాలో 60 ఏళ్లలోపు వయసున్న నేత కార్మికులకు ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు. ఈ పథకం ద్వారా తెలంగాణలో 80 వేల మంది చేనేత కార్మికులకు లబ్ధి కలుగుతుందన్నారు. చేనేత, మరమగ్గాలపై ఆధారపడిన కార్మికుల కుటుంబాలకు ఆర్థికంగా భరోసా ఇచ్చేందుకు బీమా పథకాన్ని అమలు చేయబోతున్నామని, లబ్ధిదారులు ఏదైనా కారణంతో మరణిస్తే 10 రోజుల్లో వారి కుటుంబ సభ్యుల ఖాతాలో రూ. 5 లక్షలు జమ చేస్తామన్నారు. చేనేత, జౌళి విభాగంఈ పథకం అమల్లో నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తుందని, ఈ పథకం అమలు కోసం ఎల్‌ఐసీతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నట్లు కేటీఆర్‌ వెల్లడించారు. బీమా వార్షిక ప్రీమియంను రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా చెల్లిస్తుందని, నేత కార్మికులు ఎలాంటి వాటా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఈ పథకం అమలు కోసం సుమారు రూ. 50 కోట్లు కేటాయించగా ఇప్పటికే రూ. 25 కోట్లు విడుదల చేశామన్నారు. అర్హులైన చేనేత, మరమగ్గాల కార్మికులకు ప్రయోజనం కలిగేలా ఈ పథకాన్ని సమర్థంగా అమలు చేసేందుకు జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలు ఏర్పాటు చేసినట్లు కేటీఆర్‌ చెప్పారు.

3. ఈటెండర్స్థానంలో ఆక్షన్‌ 

AP and Telangana states August Weekly Current affairs_70.1

రాబడికి సంబంధించిన కాంట్రాక్టుల కేటాయింపుల కోసం దక్షిణ మధ్య రైల్వే కొత్తగా ఈ–ఆక్షన్‌ విధానాన్ని ప్రవేశ పెట్టింది. ఎన్నో ఏళ్లుగా అనుసరిస్తున్న ఈ–టెండర్ల విధానం స్థానంలో ప్రవేశపెట్టిన ఈ–ఆక్షన్‌ విధానానికి నెల రోజుల్లోనే సానుకూల స్పందన లభిస్తోంది. పూర్తి పారదర్శకతతో సత్వరం కాంట్రాక్టులు కేటాయించేందుకు వీలుగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ–టెండర్ల విధానంలో ఎవరు ఎంతకు బిడ్‌ చేస్తున్నారనే విషయం అందరికీ తెలిసే అవకాశం లేదు.

దాంతో కొన్ని అవకతవకలకు ఆస్కారం ఉండేది. ఇక బిడ్లు తెరవడం, ఖరారు మొదలైన వాటికి ఎక్కువ సమయం పట్టేది. దీనికి పరిష్కారంగా ఈ–టెండర్ల స్థానంలో ఈ–ఆక్షన్‌ విధానానికి రైల్వే బోర్డు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వేలో తొలుత సికింద్రాబాద్‌ డివిజన్‌ ఈ–ఆక్షన్‌ విధానాన్ని ప్రవేశ పెట్టింది. ఇటీవల విజయవాడ డివిజన్‌లోనూ ఈ విధానాన్ని అమలులోకి తెచ్చింది. ఇందుకోసం ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులో ఉంచింది.

4. ఎకనామిక్టైమ్స్పురస్కారానికి ఎంపికైన తెలంగాణ

సరళతర వ్యాపార నిర్వహణ (ఈవోడీబీ)లో తెలంగాణ రాష్ట్రం ఎకనామిక్‌ టైమ్స్‌ పురస్కారానికి ఎంపికైంది. ఆగస్టు 25న దిల్లీలో నీతి ఆయోగ్, కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్‌శాఖలతో పాటు ఇజ్రాయెల్, స్వీడన్‌ రాయబార కార్యాలయాలు సంయుక్తంగా నిర్వహించే ‘ది డిజీ టెక్‌ కాన్‌క్లేవ్‌- 2022’లో ఈ పురస్కారం అందజేయనున్నారు.

కేంద్ర ప్రభుత్వ శాఖలు విడుదల చేసే నివేదికలతో పాటు క్షేత్రస్థాయిలో పరిశోధన, అధ్యయనం తరువాతే తాము తెలంగాణ రాష్ట్రాన్ని ఎంపిక చేసినట్లు ఎకనామిక్‌ టైమ్స్‌ ఎడిటర్‌ టి.రాధాకృష్ణ చెప్పారు. సరళతర వ్యాపార నిర్వహణ, సంస్కరణల కోసం అమలుచేస్తున్న కార్యాచరణతో పాటు మీసేవ పోర్టల్‌తో ప్రజలకు అందిస్తున్న మెరుగైన డిజిటల్‌ సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం అందజేస్తున్నట్లు తెలిపారు.

 

AP and Telangana states August Weekly Current affairs_80.1

 

Andhra Pradesh state Weekly Current affairs

1. APలో ఆరోగ్యశ్రీ ఖైదీలకూ వర్తింపు

AP and Telangana states August Weekly Current affairs_90.1

ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలు, మధ్యతరగతి వర్గాలకు ఉచిత వైద్యం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మానవతా దృక్పథంతో ఖైదీలకు సైతం చికిత్స అందించనుంది.

ఈ మేరకు ఖైదీలకు కూడా ఆరోగ్యశ్రీని వర్తింపజేస్తూ తాజాగా జీవో విడుదల చేసింది. దేశంలోనే మరెక్కడా లేనివిధంగా తొలిసారి ఖైదీలకూ ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సేవలందించనుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాదు ప్రైవేటు/కార్పొరేట్‌ ఆస్పత్రుల్లోనూ వీరికి వైద్యం అందించనుంది. 2019 డిసెంబర్‌లో జరిగిన ప్రిజన్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌ ఖైదీల వైద్య సదుపాయాలపై నివేదిక సమర్పించాలని జైళ్ల శాఖను ఆదేశించారు. దీంతో స్వతహాగా వైద్యుడైన జైళ్ల శాఖ ఐజీ ఇండ్ల శ్రీనివాసరావుతో పాటు అప్పటి గుంటూరు జిల్లా జైలు సూపరింటెండెంట్‌ కె.రఘు, డీజీ అషాన్‌రెజా ఆధ్వర్యంలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఆ నివేదికను ఆమోదిస్తూ ప్రభుత్వం 2022 జూలై 22న జీవో విడుదల చేసింది. దీంతో ఇకపై రాష్ట్రంలోని వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు అనారోగ్యం పాలైతే వారు సాధారణ ప్రజల మాదిరిగానే ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సేవలు పొందొచ్చు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సంబంధిత జబ్బుకు చికిత్స లభించకపోతే ప్రైవేటు ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తారు. వీరి కోసం ఇప్పటికే ఆరోగ్యశ్రీ సీఈవో నెట్‌వర్క్‌ ఆస్పత్రులను గుర్తించారు. ఖైదీలు వైద్య సేవలు పొందడానికి ఆధార్‌/రేషన్‌ కార్డు ఉంటే సరిపోతుంది. అవి లేని ఇతర రాష్ట్రాల ఖైదీలకు చీఫ్‌ మినిస్టర్‌ క్యాంప్‌ ఆఫీస్‌ (సీఎంసీవో) కార్డును తాత్కాలికంగా జారీ చేస్తారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో జైళ్లలో శిక్ష అనుభవిస్తూ సరైన వైద్యం అందక మరణించే వారి సంఖ్య గణనీయంగా తగ్గనుంది.

2. వైజాగ్రైల్వే జోన్ ఏర్పాటుకు సర్వం సిద్ధం

AP and Telangana states August Weekly Current affairs_100.1

విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు సర్వం సిద్ధం చేసినట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. భవన నిర్మాణానికి స్థల సేకరణ కూడా పూర్తయ్యిందని, జోన్‌ ఏర్పాటుకు నిధులు కూడా సిద్ధంగా ఉన్నాయని అన్నారాయన. రాజ్యసభలో కేంద్రీయ విశ్వ విద్యాలయాల చట్ట సవరణ బిల్లుపై జరిగిన చర్చలో భాగంగా వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై ప్రశ్నించారు. దీనికి రైల్వే మంత్రి బదులిస్తూ.. రైల్వో జోన్‌ ఏర్పాటుకు సంబంధించిన డీపీఆర్‌ను ఆమోదించినట్లు వెల్లడించారు.

అంతకు ముందు బిల్లుపై శ్రీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ రైల్వేకు సంబంధించి రాష్ట్రంలో  పెండింగ్‌లో  ఉన్న సమస్యలపై రైల్వే మంత్రికి పలు సూచనలు, సలహాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో భాగంగా విశాఖ కేంద్రంగా ప్రకటించిన సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటును వేగవంతం చేయాలని కోరారు. రైల్వే మంత్రిత్వ శాఖ వద్ద  మూడు సంవత్సరాలుగా  డీపీఆర్‌ పెండింగ్‌లోనే ఉందని గుర్తు చేశారు.

3. ఫ్యామిలీ డాక్టర్‌ పథకం నెలలో 26 రోజులు గ్రామాల్లోనే వైద్య సేవలు

AP and Telangana states August Weekly Current affairs_110.1

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెడుతున్న ‘ఫ్యామిలీ డాక్టర్‌’ విధానం అమలుకు  వైద్య, ఆరోగ్య శాఖ ఎస్‌ఓపీ (స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌) రూపొందించింది. క్షేత్ర స్థాయిలో పనిచేసే ఆశా వర్కర్, ఏఎన్‌ఎం, వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌ ఎంఎల్‌హెచ్‌పీ (మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌), పీహెచ్‌సీ (ప్రాథమిక ఆరోగ్య కేంద్రం) వైద్యుడు.. ఇలా వీరందరి విధులు, బాధ్యతలను ఎస్‌ఓపీలో పొందుపరిచారు. ఎస్‌ఓపీపై జిల్లాల్లో అధికారులు, వైద్యులు, సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. గ్రామీణ ప్రజలకు ఉత్తమ వైద్యం, ఆరోగ్య సంరక్షణ కోసం ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రంలో ఈ విధానం అమలు చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిశ్చయించారు. ఈ క్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాట్లు ముమ్మరం చేసింది.

రోజంతా గ్రామంలోనే..

రాష్ట్ర వ్యాప్తంగా 1142 పీహెచ్‌సీలు ఉన్నాయి. ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులు ఉండేలా వైద్య శాఖ చర్యలు తీసుకుంటోంది. ఫ్యామిలీ డాక్టర్‌ విధానం అమలులో భాగంగా ఇద్దరు పీహెచ్‌సీ వైద్యులకు తమ పరిధిలోని సచివాలయాలు/విలేజ్‌ క్లినిక్‌లను విభజిస్తున్నారు. ఏ రోజు ఏ సచివాలయం/విలేజ్‌ క్లినిక్‌ పరిధిలో వైద్య సేవలు అందించాలన్న దానిపై టైమ్‌ టేబుల్‌ వేస్తున్నారు. దాని ఆధారంగా ఒక్కో వైద్యుడు రోజు మార్చి రోజు గ్రామాలు సందర్శించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో పీహెచ్‌సీ వైద్యుల సేవలు నెలలో 26 రోజుల పాటు గ్రామాల్లోనే అందుతాయి. గ్రామాలకు వెళ్లే వైద్యుడు 104 మొబైల్‌ మెడికల్‌ యూనిట్‌తో పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ గ్రామంలోనే ఉంటాడు. అతనితో పాటు ఎంఎల్‌హెచ్‌పీ, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్‌లతో కూడిన బృందం గ్రామీణ ప్రజలకు సేవలు అందిస్తుంది. ప్రారంభంలో ప్రతి గ్రామానికి నెలలో ఒక సారి సందర్శన ఉంటుంది. తర్వాత నెలలో రెండు సార్లు 104 ఎంఎంయూ సందర్శించేలా సేవలు విస్తరిస్తారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న 656 వాహనాలకు అదనంగా 432 వాహనాలను ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది.

4. Talaq రాతపూర్వకంగా కూడా చెల్లదు

AP and Telangana states August Weekly Current affairs_120.1

ఏక వాక్యంలో మూడుసార్లు చెప్పే తలాక్‌కు ఎలాంటి గుర్తింపు లేదంది. మూడుసార్లు తలాక్‌ చెప్పి, దాన్ని రాతపూర్వకంగా పంపడం చెల్లుబాటు కాదని స్పష్టం చేసింది. ఒకవేళ ఇస్లాం చట్ట నిబంధనల ప్రకారం విడాకులు తీసుకోవాలంటే.. భార్య, భర్త ఇద్దరి తరపు మధ్యవర్తులు వారి మధ్య సయోధ్యకు ప్రయత్నించాలంది. అది సాధ్యం కానప్పుడే సహేతుక కారణాలతో తలాక్‌ చెప్పొచ్చునని, అలా చెప్పే తలాక్‌ల మధ్య తగిన వ్యవధి ఉండి తీరాలని తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ రవినాథ్‌ తిల్హారీ ఇటీవల తీర్పు వెలువరించారు.

5. నల్లమలలో 73 పెద్ద పులులు

AP and Telangana states August Weekly Current affairs_130.1

దేశంలోనే అతిపెద్ద అభయారణ్యమైన నల్లమల టైగర్‌ రిజర్వు ఫారెస్టులో 73 పెద్దపులులు ఉన్నట్లు పులుల గణనలో తేలింది. 2020లో 63 ఉండగా రెండేళ్లలో పెద్దపులుల సంఖ్య మరో పది పెరిగింది. ఇక్కడ 2018లో 47 పులులే ఉన్నాయి. పులుల గణన ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు కొనసాగింది.

రాష్ట్రవ్యాప్తంగా వీటిసంఖ్య 75 ఉన్నట్లు అటవీ అధికారులు తెలిపారు. అదనంగా చేరిన రెండు పులులు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నుంచి పాపికొండల్లో సంచరిస్తున్నట్లు గుర్తించారు. నాలుగేళ్లలో పులుల పెరుగుదల 60 శాతం ఉండటం గొప్ప విషయమని అటవీ అధికారులు తెలిపారు. నాగార్జునసాగర్‌ ఫారెస్టు నుంచి కూడా పులుల సంచారం జరుగుతోంది.

6. జాంధానీ చీరకు జాతీయ పురస్కారం

AP and Telangana states August Weekly Current affairs_140.1

ఉప్పాడ జాంధానీ చేనేత చీరలను జాతీయ స్థాయిలో మార్కెటింగ్‌ చేసి విశేష ప్రతిభ కనబరిచిన కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం వాకతిప్పకు చెందిన వెంకట రామలక్ష్మి ఫ్యాబ్రిక్స్‌ సంస్థకు జాతీయ పురస్కారం లభించింది. సంస్థ అధినేత లొల్ల సత్యనారాయణ దిల్లీలో కేంద్ర చేనేత జౌళి శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ సమక్షంలో పురస్కారం అందుకున్నారు. 2019లో కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ప్రకటించింది. కరోనా వ్యాప్తి కారణంగా పురస్కార ప్రదానం జరగలేదు.

Also read: AP and Telangana state August Weekly Current affairs part 1

*******************************************************************

AP and Telangana states August Weekly Current affairs_150.1

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

Download your free content now!

Congratulations!

AP and Telangana states August Weekly Current affairs_170.1

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Download your free content now!

We have already received your details!

AP and Telangana states August Weekly Current affairs_180.1

Please click download to receive Adda247's premium content on your email ID

Incorrect details? Fill the form again here

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Thank You, Your details have been submitted we will get back to you.