Telugu govt jobs   »   Andhra Pradesh tops country in health...

Andhra Pradesh tops country in health scheme coverage – బీమా కవరేజీలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన ఆంధ్ర రాష్ట్రం

బీమా కవరేజీలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన ఆంధ్ర రాష్ట్రం

Andhra Pradesh tops country in health scheme coverage – బీమా కవరేజీలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన ఆంధ్ర రాష్ట్రం_2.1

ప్రజలకు బీమా కవరేజీ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచినట్లు నీతి ఆయోగ్‌ ప్రకటించింది,2020–21కి గానూ దేశవ్యాప్తంగా ఏఏ రాష్ట్రాల్లో ఎంతమంది బీమా కింద ఉచితంగా వైద్యం పొందుతున్నారో జూలై 13న గణాంకాలను విడుదల చేసింది. ఈ గణాంకాల ప్రకారం… ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం 74.60% కవరేజీతో మొదటి స్థానంలో నిలిచింది. ప్రభుత్వమే ప్రజల తరఫున బీమా ప్రీమియం చెల్లించడం.. అలాగే, ఉచిత వైద్యం అందిస్తుండడంతో ఏపీ సర్కార్‌ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచినట్లు నీతి ఆయోగ్‌ పేర్కొంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 2,436 రకాల చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చి, ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా ఉచితంగా చికిత్స చేసేలా.. ఇన్సూరెన్స్‌ కంపెనీకి ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లించి అమలుచేస్తోంది.

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

రాష్ట్రాల వారీగా జాబితా

రాష్ట్రం

శాతం

ఆంధ్రప్రదేశ్‌

74.60

ఛత్తీస్‌ఘడ్‌

68.50

తెలంగాణ

66.40

తమిళనాడు

64.00

కేరళ

47.70

ఒడిశా

47.70

పశ్చిమబెంగాల్‌

33.40

కర్ణాటక

28.10

గుజరాత్‌

23.10

పంజాబ్‌

21.20

ఉత్తరాఖండ్‌

19.50

రాజస్థాన్‌

18.70

మధ్యప్రదేశ్‌

17.70

మహారాష్ట్ర

15.00

జార్ఖండ్‌

13.30

ఉత్తరప్రదేశ్‌

6.10

 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

మే నెల వారి కరెంట్ అఫైర్స్ PDF  తెలుగులో  మే నెలవారీ కరెంట్ అఫైర్స్PDF  English లో
జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF
తెలంగాణా స్టేట్ GK PDF తెలుగు లో Static, Banking, Computer Awareness PDF

 

Sharing is caring!