Andhra Pradesh Schemes Quiz in Telugu: Andhra Pradesh Schemes is an important topic in every competitive exam. here we are giving the Indian Andhra Pradesh Schemes Section which provides you with the best compilation of Andhra Pradesh Schemes. Andhra Pradesh Schemes is a major part of the exams like AP Police Constable & APPSC GROUPs. Many aspirants for government exams have benefited from our website now it’s your turn.
This is the best site to find recent updates on Andhra Pradesh Schemes not only for competitive exams but also for interviews.
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే SSC, రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.
Andhra Pradesh Schemes Quiz in Telugu (తెలుగులో)
Q1. YSR రైతు భరోసా పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎక్కడ ప్రారంభించింది.
(a) గణపవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఉంగుటూరు నియోజకవర్గం, ఏలూరు జిల్లా
(b) నెల్లూరు జిల్లా, వెంకటాచలం (M), కాకుటూరు (G)
(c) అనంతపురం జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల
(d) కృష్ణా జిల్లా – జగ్గయ్యపేట మండలం
Q2. గ్రామాల్లోని రైతులకు వ్యవసాయ సంబంధిత సేవలన్నీ అందించాలనే లక్ష్యంతో ప్రారంభించిన పథకం ఏది
(a) YSR రైతు బంధు
(b) YSR రైతన్న
(c) వైఎస్ఆర్ రైతుమిత్ర
(d) వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు
Q3. ఏప్రిల్ 1, 2007న మాజీ ముఖ్యమంత్రి YS రాజశేఖరరెడ్డి ప్రారంభించిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని YS జగన్మోహన్ రెడ్డి ఏ తేదీన YSR ఆరోగ్యశ్రీగా మార్చారు.
(a) 31 మే 2020న
(b) 30 జూన్ 2021న
(c) 2019 మే 30న
(d) 10 జూలై 2022న
Q4. భారతదేశంలో కోవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చిన మొదటి రాష్ట్రం ఏది –
(a) జార్ఖండ్
(b) తెలంగాణ
(c) ఆంధ్రప్రదేశ్
(d) తమిళనాడు
Q5. ఆరోగ్యశ్రీలో భాగమైన YSR ఆరోగ్య ఆసరా పథకం ద్వారా రోగికి గరిష్టంగా నెలకు రూ.5000 అందజేస్తారు, ఆపరేషన్ తర్వాత రోజుకు ఎంత అందజేస్తారు.
(a) రూ.225
(b) రూ.256
(c) రూ.258
(d) రూ.295
Q6. 2019 – అక్టోబరు – 10న అనంతపురం జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో YSR కాంతి వెలం పథకాన్ని ప్రారంభించారు. కానీ ఈ పథకం యొక్క ఉద్దేశ్యం:-
(a) నివారించగల అంధత్వాన్ని 1 శాతం నుండి 0.7 శాతానికి తగ్గించడం
(b) నివారించగల అంధత్వాన్ని 1 శాతం నుండి 0.9 శాతానికి తగ్గించడం
(c) నివారించగల అంధత్వాన్ని 1 శాతం నుండి 0.3 శాతానికి తగ్గించడం.
(d) నివారించగల అంధత్వాన్ని 1 శాతం నుండి 0.5 శాతానికి తగ్గించడం
Q7. YSR చిరునవ్వు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని ఏ తరగతి విద్యార్థులందరికీ ఉచితంగా దంత పరీక్షలు నిర్వహిస్తారు.
(a) 2వ తరగతి నుండి 7వ తరగతి వరకు
(b) క్లాస్ 1 నుండి క్లాస్ 6 వరకు
(c) 3వ తరగతి నుండి 8వ తరగతి వరకు
(d) 1 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు
Q8. కోటి ఎకరాలకు సాగునీరు, 2 కోట్ల మందికి తాగునీరు, దీర్ఘకాలికంగా అసంపూర్తిగా ఉన్న నీటి పారుదల ప్రాజెక్టులను పూర్తిచేయాలనే లక్ష్యంతో మాజీ ముఖ్యమంత్రి YS రాజశేఖరరెడ్డి YSR జలయజ్ఞం పధకం ఎప్పుడు ప్రారంభించారు.
(a) 2004 – అక్టోబర్
(b) 2005 – అక్టోబర్
(c) 2005 – జూన్
(d) 2006 – జూలై
Q9. కోవిడ్-19 నివారణ చర్యల్లో భాగంగా టెలిమెడిసిన్ అమలు కోసం కేటాయించబడిన డాక్టర్ YSR టోల్ ఫ్రీ నంబర్ ఏది –
(a) 14510
(b) 14410
(c) 13410
(d) 14420
Q10. YSR ఆసరా పధక్ పథకంలో భాగంగా, ముఖ్యమంత్రి YS జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మొదటి విడతగా ఆయా కార్పొరేషన్ల ద్వారా రూ.6,792.20 కోట్లు ఏ రోజున డిపాజిట్ చేశారు.
(a) 12 సెప్టెంబర్ 2022న
(b) 11 సెప్టెంబర్ 2020న
(c) 11 నవంబర్ 2022న
(d) 17 మే 2022న
Solutions:
S1.Ans(b)
sol. YSR రైతు భరోసా పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రదేశం:- వెంకటాచలం (M), నెల్లూరు జిల్లా కాకుటూరు (G).
S2.ans(d)
Sol. YSR రైతు భరోసా కేంద్రాలు: ఉద్దేశ్యం: గ్రామాల్లోని రైతులకు అన్ని వ్యవసాయ సంబంధిత సేవలను అందించడం. ఇవి రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందజేస్తాయి.
S3.ans(c)
Sol. YSR ఆరోగ్యశ్రీ: మాజీ ముఖ్యమంత్రి YSR 2007 ఏప్రిల్ 1న ప్రారంభించిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మే 30, 2019న YSR ఆరోగ్యశ్రీగా మార్చింది.
S4.ans(c)
sol. భారతదేశంలో కోవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.
S5.Ans(a)
Sol. YSR ఆరోగ్య ఆసరా పథకం: శస్త్రచికిత్స తర్వాత కోలుకునే సమయంలో రోగులకు ఆరోగ్యశ్రీ ఆర్థిక సహాయం అందిస్తుంది. ఆరోగ్యశ్రీలో భాగమైన YSR ఆరోగ్య ఆసరా పథకం ద్వారా, శస్త్రచికిత్స అనంతర రోగికి రోజుకు రూ.225 గరిష్టంగా నెలకు రూ.5000 వరకు అందించబడుతుంది.
S6.Ans(c)
sol. YSR కాంతి వెలుగు పథకం అనంతపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అక్టోబర్ – 10, 2019న ప్రారంభించబడింది. లక్ష్యం :- నివారించగల అంధత్వాన్ని 1 శాతం నుండి 0.3 శాతానికి తగ్గించడం.
S7.Ans(b)
Sol. YSR స్మైల్ కార్యక్రమం: ప్రారంభం: 2020 – జూలై – 8 . రాష్ట్రంలోని 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరికీ డాక్టర్ YSR చిరునవ్వు ద్వారా ఉచితంగా దంత పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి విద్యార్థికి టూత్ పేస్టు, బ్రష్ ఉచితంగా అందజేస్తామన్నారు.
S8.Ans(a)
sol. YSR జలయజ్ఞం పధకం అక్టోబర్ 2004లో మాజీ ముఖ్యమంత్రి YSR చేతుల మీదుగా ప్రారంభించారు.
లక్ష్యం: కోటి ఎకరాలకు నీరందించడం, 2 కోట్ల మందికి తాగునీరు అందించడం, దీర్ఘకాలిక అసంపూర్తి నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేయడం.
S9.Ans(a)
sol. కోవిడ్-19కి వ్యతిరేకంగా నివారణ చర్యల్లో భాగంగా ఏప్రిల్ 13, 2020న డాక్టర్ YSR టెలిమెడిసిన్ పథకం ప్రారంభించబడింది. ఈ పథకం ద్వారా కోవిడ్-19 కేసులను గుర్తిస్తారు. టోల్ ఫ్రీ నంబర్- 14410 టెలిమెడిసిన్ అమలు కోసం కేటాయించబడింది.
S10.Ans.(b)
Sol. YSR ఆసరా పథకం ఉద్దేశ్యం: మహిళా SHGలకు ఆర్థిక సహాయం అందించడం. మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు అందించడం. ఈ పథకంలో భాగంగా ముఖ్యమంత్రి YS జగన్‌మోహన్‌రెడ్డి తొలి విడతగా 11 సెప్టెంబర్ 2020న సంబంధిత కార్పొరేషన్ల ద్వారా రూ. 6,792.20 కోట్లు విడుదల చేసారు.
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |