Telugu govt jobs   »   Telugu Current Affairs   »   YSR district is the first digital...

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తొలి డిజిటల్‌ జిల్లాగా అవతరించిన వైఎస్సార్‌ జిల్లా 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తొలి డిజిటల్‌ జిల్లాగా అవతరించిన వైఎస్సార్‌ జిల్లా 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బ్యాంకింగ్‌ రంగంలో పూర్తిస్థాయి తొలి డిజిటల్‌ జిల్లాగా వైఎస్సార్‌ జిల్లా రికార్డు సృష్టించింది. వైఎస్సార్‌ జిల్లాలోని ప్రతి బ్యాంకు ఖాతాదారుడు అందుబాటులో ఉన్న డిజిటల్‌ లావాదేవీల్లో కనీసం ఏదో ఒకదాన్ని వినియోగించడం ద్వారా ఈ రికార్డు నమోదైంది. దేశంలో నగదు లావాదేవీలు తగ్గించడంలో భాగంగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) దశలవారీగా ఎంపిక చేసిన జిల్లాల్లో డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తొలి దశలో వైఎస్సార్‌ జిల్లా ఎంపికైంది. ఈ కార్యక్రమం కింద ఆ జిల్లాలో ఉన్న ప్రతి బ్యాంకు ఖాతాదారుడిని కనీసం ఏటీఎం కార్డు లేదా నెట్‌ బ్యాంకింగ్, మొబైల్‌ బ్యాంకింగ్‌ల్లో ఏదో ఒకదాన్ని వినియోగించేలా ప్రోత్సహించారు.

రెండో దశలో శ్రీకాకుళం, గుంటూరు జిల్లాలను పూర్తి స్థాయి డిజిటల్‌ జిల్లాలుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ కన్వీనర్‌ బ్రహ్మానందరెడ్డి చెప్పారు.

 

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Telangana Geography -Vegetation And Forest of Telangana PDF In Telugu |_100.1

 

Sharing is caring!