Telugu govt jobs   »   Current Affairs   »   Vizag SEZ Exports Crossed Rs.1 Trillion...

Vizag SEZ Exports Crossed Rs.1 Trillion in April-September 2023 | వైజాగ్ SEZ ఎగుమతులు ఏప్రిల్-సెప్టెంబర్ 2023లో రూ.1 ట్రిలియన్‌ దాటాయి

Vizag SEZ Exports Crossed Rs.1 Trillion in April-September 2023 | వైజాగ్ SEZ ఎగుమతులు ఏప్రిల్-సెప్టెంబర్ 2023లో రూ.1 ట్రిలియన్‌ దాటాయి

విశాఖపట్నం స్పెషల్ ఎకనామిక్ జోన్ (VSEZ) గత 32 ఏళ్లలో మొదటిసారిగా 2020-21లో రూ. 1 ట్రిలియన్ ఎగుమతులను సాధించి ఒక రికార్డు ను సృష్టించింది. తాజాగా ఈ ఏప్రిల్-సెప్టెంబర్ మధ్యన మరోసారి రూ.1ట్రిలియన్ మార్కును దాటాడమే కాకుండా గత ఏడాదితో పోలిస్తే 30శాతం వృద్ధి ని నమోదు చేసింది అని VSEZ అధికారి శ్రీనివాస్ ముప్పాల తెలిపారు. వృద్ధి పరంగా దేశంలోని అన్ని సెజ్‌లలో మొదటి స్థానంలో నిలిచింది. VSEZ డెవలప్‌మెంట్ కమీషనర్ ARM రెడ్డి ఈ మైలురాయిని తెలిపారు. 2019-20లో రూ. 96,886 కోట్ల ఎగుమతులు ఈ ఏడాదిలో రూ. 1,03,513 కోట్లకు చేరుకున్నాయి. సేవల ఎగుమతులు రూ.76,413 కోట్లు, వాణిజ్య ఎగుమతులు రూ.28,315 కోట్లు గా నమోదయ్యాయి. అంతక్రితం ఏడాదితో పోలిస్తే సేవల ఎగుమతులు 34 శాతం, వాణిజ్య ఎగుమతులు 21 శాతం పెరుగుదల నమోదైంది.  VSEZ కు రూ.1.04 కోట్ల పెట్టుబడితో పాటు, 2023లో 6.61 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి.

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 61 సెజ్‌లు VSEZ కిందకు వస్తాయి మరియు కొత్త యూనిట్ల స్థాపనకు 11 కొత్త సెజ్ యూనిట్ల నుంచి ప్రతిపాదనలు అందాయి. వీటిలో రెండు ఎగుమతి ఆధారిత యూనిట్లు మంజూరయ్యాయి అని శ్రీనివాస్ తెలిపారు. తెలంగాణ లో 6 మరియు ఆంధ్రప్రదేశ్‌లో 5 కొత్త సెజ్ యూనిట్లు ఆమోదం పొందాయి. ఆంధ్రప్రదేశ్ కొత్త యూనిట్ నుంచి దాదాపుగా 170కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నాయి తద్వారా 4,048 మందికి ఉపాధి లభించనుంది అని కూడా తెలిపారు.

TSPSC Group 2 Quick Revision Live Batch | Online Live Classes by Adda 247

 

మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!