Visakhapatnam to host national sea kayaking competition in June: Andhra Pradesh, Visakhapatnam will host the National Sea Kayaking Championship – 2022. Under the auspices of the Kayaking and Canoeing Association of Andhra Pradesh, the Games will be held from June 24 to 26 at Rushikonda in Visakhapatnam.
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం వేదికగా జాతీయస్థాయి సీ కయాకింగ్ చాంపియన్‌షిప్–2022 నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కయాకింగ్ అండ్ కనోయింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో… విశాఖలోని రుషికొండలో జూన్ 24 నుంచి 26 వరకు ఈ క్రీడలు జరగనున్నాయి. ఈ పోటీలను దేశంలో రెండోసారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటిసారి నిర్వహిస్తున్నారు.
కయాకింగ్, కానోయింగ్ వాటర్ స్పోర్ట్స్‌కు దాదాపు అన్ని దేశాల్లోనూ మంచి గుర్తింపు ఉంది. సముద్రంలో అలలను చీల్చుకుంటూ.. ప్రత్యేకమైన నావలో గమ్యాన్ని చేరుకునేందుకు డైవర్లు పోటీ పడుతుంటారు. ఇటీవల అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వినోద క్రీడల్లో కయాకింగ్ అగ్ర భాగంలో ఉంది. ఇలాంటి క్రీడల్ని నిర్వహించే సా మర్థ్యం ఉన్న బీచ్‌లు దేశంలో అతి తక్కువగా ఉన్నాయి. అందులో విశాఖ తీరంలోను పోటీలకు అనువైన వాతావరణం ఉండటంతో రాష్ట్రంలో మొదటిసారి కయాకింగ్ పోటీలు జరగబోతున్నాయి.
***************************************************************************************
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
********************************************************************************************
