Telugu govt jobs   »   Study Material   »   విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ట్రైనీ రిక్రూట్మెంట్ 2023...

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ట్రైనీ రిక్రూట్మెంట్ 2023 డౌన్లోడ్ నోటిఫికేషన్ PDF

Table of Contents

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ట్రైనీ రిక్రూట్మెంట్ 2023: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (VSP) శ్రేష్ఠతకు మహోన్నత చిహ్నంగా ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ట్రైనీ రిక్రూట్‌మెంట్ కోసం ధరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ప్రతిష్టాత్మక సంస్థలో ప్రవేశించడానికి గ్రాడ్యూయేట్ ఎప్రింటీస్షిప్ ట్రైనీ మరియు టెక్నికల్ ఎప్రింటీస్షిప్ ట్రైనీ ఒక సువర్ణావకాశం. గ్రాడ్యూయేట్ ఎప్రింటీస్షిప్ ట్రైనీ మరియు టెక్నికల్ ఎప్రింటీస్షిప్ ట్రైనీ మొత్తం ఖాళీలు 250 గా ప్రకటించింది.  ఎప్రింటీస్షిప్ నోటిఫికేషన్ ను 11/07/2023న తన అధికారిక వెబ్సైట్ లో vizagsteel.comలో విడుదల చేసింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ట్రైనీ కింద చేరడానికి చూస్తున్న ఔత్సాహికులకి ఇది మంచి అవకాశం.  వైజాగ్ స్టీల్ ప్లాంట్ గ్రాడ్యూయేట్ ట్రైనీ రిక్రూట్మెంట్ 2023 కోసం ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవడానికి మేము డైరెక్ట్ లింకు ని అందిస్తున్నాము. ఈ కధనం లో విశాఖపట్నం గ్రాడ్యూయేట్ ఎప్రింటీస్షిప్ ట్రైనీ మరియు టెక్నికల్ ఎప్రింటీస్షిప్ ట్రైనీ గురించిన వివరాలు, ముఖ్యమైన తేదీలు, ఎంపిక ప్రక్రియ మరియు పూర్తి వివరాలు తెలుసుకోండి.

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ట్రైనీ రిక్రూట్‌మెంట్ యొక్క వివరాలను తెలుసుకునేందుకు పూర్తి కధనాన్ని చదవండి, విశాఖపట్నం గ్రాడ్యూయేట్ ఎప్రింటీస్షిప్ ట్రైనీ మరియు టెక్నికల్ ఎప్రింటీస్షిప్ ట్రైనీ మీకు అపరిమితమైన అవకాశాలతో నిండిన భవిష్యత్తుకు తలుపులు తెరిచేందుకు మరియు ఉక్కు పరిశ్రమ లో అనుభవాన్ని పొందేందుకు ఉపయోగపడుతుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ ట్రైనీ మిమ్మల్ని సంతృప్తికరమైన మరియు సంపన్నమైన కెరీర్ వైపు నడిపించే ఒక ఉత్తేజకరమైన ప్రయాణం కోసం మొదటి అడుగు అవుతుంది.

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ట్రైనీ రిక్రూట్మెంట్ 2023

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ట్రైనీ రిక్రూట్మెంట్ 2023 అవలోకనం 

సంస్థ పేరు రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ RINL/ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్
పోస్ట్ పేరు గ్రాడ్యూయేట్ ఎప్రింటీస్షిప్ ట్రైనీ (GAT) మరియు టెక్నికల్ ఎప్రింటీస్షిప్ ట్రైనీ
పోస్ట్‌ల సంఖ్య 250 పోస్ట్‌లు
నోటిఫికేషన్ విడుదల తేదీ 11 జూలై 2023
అప్లికేషన్ ప్రారంభ తేదీ 11 జూలై 2023
అప్లికేషన్ ముగింపు తేదీ 31 జూలై 2023
వర్గం ట్రైనీ
ఉద్యోగ స్థానం ఆంధ్ర ప్రదేశ్
అధికారిక సైట్ vizagsteel.com

APPSC Medical Officer Recruitment 2022_40.1

APPSC/TSPSC Sure shot Selection Group

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ట్రైనీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ pdf

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ట్రైనీ నోటిఫికేషన్ 2023 PDF: ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నంలో ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ జులై 11, 2023 న ట్రైనీ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. అధికారిక వెబ్సైట్ లో నోటిఫికేషన్ అందుబాటులో ఉంది. సంబంధిత విభాగాల్లో డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ట్రైనీ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు 11 జులై 2023 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ గ్రాడ్యూయేట్ అప్రెంటీస్షిప్ ట్రైనీ మరియు టెక్నికల్ ఎప్రింటీస్షిప్ ట్రైనీ ఎంపిక ప్రక్రియ, వయోపరిమితి మొదలైన పరీక్షల వివరాలను కలిగి ఉంటుంది. క్రింద ఇవ్వబడిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ట్రైనీ నోటిఫికేషన్ pdf ని డౌన్లోడ్ చేసుకోండి.

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ట్రైనీ నోటిఫికేషన్ pdf 

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ట్రైనీ ఖాళీలు 2023 

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో గ్రాడ్యూయేట్ ఎప్రింటీస్షిప్ ట్రైనీ మరియు టెక్నికల్ అప్రెంటీస్షిప్ ట్రైనీ కోసం దరఖాస్తుల కోసం నోటిఫికేషన్ ను ఆహ్వానించింది, ఖాళీల వివరాలను తనిఖీ చేయండి.

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ట్రైనీ ఖాళీలు 2023
B.E/B.TECH Diploma (50)
గ్రూపులు :మెకానికల్, ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, మెటలర్జీ, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, కెమికల్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్, సెరామిక్స్ మెకానికల్, ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, సివిల్, మైనింగ్, సెరామిక్స్, మెటలర్జీ, కెమికల్, కంప్యూటర్ సైన్స్,
ఖాళీల సంఖ్య 200 ఖాళీల సంఖ్య 50

 

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ట్రైనీ రిక్రూట్‌మెంట్ 2023 దరఖాస్తు విధానం

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ట్రైనీ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు ముందుగా MHRD NATS వెబ్ పోర్టల్ (www.mhrdnats.gov.in)లో నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకున్న అభ్యర్ధులు దిగువన అందించిన గూగుల్ ఫోరం పూరించండి.

BIODATA FORM FOR GRADUATE AND TECHNICIAN APPRENTICESHIP IN RINL-VSP (google.com)

Google ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ: 31/07/2023

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ట్రైనీ రిక్రూట్‌మెంట్ 2023 అర్హత ప్రమాణాలు

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ట్రైనీ రిక్రూట్మెంట్2023 అర్హతా ప్రమాణాలు అభ్యర్ధులు తప్పనిసరిగా సరిచూసుకోవాలి, 2023కి సంబందించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ట్రైనీల కోసం ధరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గ్రాడ్యూయేట్ అప్రెంటీస్షిప్ ట్రైనీ మరియు టెక్నికల్ ఎప్రింటీస్షిప్ ట్రైనీ కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చెయ్యాలి అనుకున్న అభ్యర్ధులు సంబందిత అర్హతా ప్రమాణాలు గురించి కొంత ఆలోచన కలిగి ఉండాలి. రిక్రూట్మెంట్ అర్హత ప్రమాణాలు వయోపరిమితి, విద్యార్హత మొదలైన పారామితులపై ఆధారపడి ఉంటాయి.

వయో పరిమితి

నిబంధనల ప్రకారం ఇంజనీరింగ్ లేద డిప్లొమా 2021/2022/2023 సంవత్సరాలలో పూర్తి చేసి ఉండాలి.

విద్యార్హతలు

B.E/B.TECH కి చెందిన అభ్యర్ధులు ఈ క్రింది గ్రూప్లను చదివి ఉండాలి

గ్రూపులు :మెకానికల్, ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, మెటలర్జీ, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, కెమికల్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్, సెరామిక్స్

డిప్లొమా కి చెందిన అభ్యర్ధులు ఈ క్రింది గ్రూప్లను చదివి ఉండాలి

మెకానికల్, ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, సివిల్, మైనింగ్, సెరామిక్స్, మెటలర్జీ, కెమికల్, కంప్యూటర్ సైన్స్,

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ట్రైనీ రిక్రూట్‌మెంట్ 2023 నియమాలు

  •  ఇంజనీరింగ్ / డిప్లొమా ఉత్తీర్ణత (2021/2022/2023 సంవత్సరాలలో  పూర్తి చేసినవారు మాత్రమే అర్హులు) మరియు అభ్యర్ధులు MHRD NATS పోర్టల్ (www.mhrdnats.gov.in)లో నమోదు చేసుకుని ఉండాలి, ఇది తప్పనిసరి.
  • గతంలో అప్రెంటిస్‌షిప్ పొందిన మరియు/లేదా ప్రస్తుతం చదువుతున్న అభ్యర్థులు/
    అప్రెంటిస్‌షిప్ శిక్షణ లేదా ప్రస్తుతం వేరే చోట ఉద్యోగంలో ఉన్న అభ్యర్ధులు నమోదు చేసుకునేందుకు కుదరదు.
  • అప్రెంటీస్ (సవరణ) చట్టం 1973 ప్రకారం వేరే చోట అప్రెంటిస్‌షిప్ శిక్షణ పొంది ఉన్న వారికి కూడా, అర్హత లేదు.

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ట్రైనీ రిక్రూట్‌మెంట్ 2023 ఎంపిక ప్రక్రియ

  • ఆన్లైన్ అప్లికేషన్
  • మౌఖిక పరీక్ష

అభ్యర్థులు సంబంధిత రిజర్వేషన్ నిబంధనలను పరిగణనలోకి తీసుకుని సంబంధిత క్రమశిక్షణ/బ్రాంచ్‌లో సాధించిన మార్కుల శాతం ఆధారంగా పర్సనల్ ఇంటర్వ్యూకు పిలుస్తారు. NATS పోర్టల్‌లో బయో-డేటా ఫారమ్/ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌లో ఇవ్వబడిన మొబైల్ నంబర్ మరియు ఇ-మెయిల్ ID తప్పనిసరిగా సరైనవి ఇవ్వాలి. ఇది కమ్యూనికేషన్ ప్రయోజనం కోసం కనీసం పన్నెండు నెలల పాటు చెల్లుబాటులో ఉండాలి.
ఇంటర్వ్యూ కోసం షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులు షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఇచ్చిన సమాచారం ప్రకారం పుట్టిన తేదీ, అర్హత, వర్గం (వర్తించే విధంగా) మొదలైన వాటికి సంబంధించిన పత్రాలను అందించాల్సి ఉంటుంది.
*గమనిక: ఎంపిక చేయబడిన అభ్యర్థులు సంబంధిత యూనిట్లు/ప్లాంట్‌లోని అవసరాల ఆధారంగా విశాఖపట్నంలోని RINL- ప్లాంట్ మరియు RINL యొక్క ఇతర యూనిట్లలో (ఉదా: FWP, Madharam వద్ద గనులు మొదలైనవి.) పోస్ట్ చేయబడతారు.

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ట్రైనీ అప్రెంటీస్షిప్ 2023 కాలపరిమితి

అప్రెంటీస్‌ చట్టం 1973 ప్రకారం అప్రెంటిస్‌షిప్ శిక్షణ వ్యవధి 1(ఒకటి) సంవత్సరం పాటు ఉంటుంది. ఆతర్వాత అభ్యర్ధులకి అప్రెంటీస్షిప్  పూర్తి చేసిన సర్టిఫికేట్ ను అందజేస్తారు.

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ట్రైనీ అప్రెంటీస్షిప్ 2023 గౌరవ వేతనం

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ట్రైనీ అప్రెంటీస్షిప్ చేస్తున్న అభ్యర్ధులకు ప్రతీ నెలా గౌరవ వేతనం అందిస్తారు. అది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్‌ ట్రైనీలకు  (GAT) నెలకు ₹9,000/- మరియు  డిప్లొమా ఇంజనీరింగ్ ట్రైనీలకు (TAT) కోసం నెలకు ₹8,000/- అందిస్తారు.

 

Telangana Prime Test Pack 2023-2024 | Complete Bilingual Online Test Series by Adda247

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ట్రైనీ రిక్రూట్మెంట్ 2023 లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి?

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ట్రైనీ రిక్రూట్మెంట్ 2023 లో మొత్తం 250 ఖాళీలు ఉన్నాయి.