‘ఈ-ఆఫీస్’ వినియోగంలో ఆంధ్రప్రదేశ్‌లో ని విశాఖ పోర్ట్ రెండో స్థానంలో ఉంది
- విశాఖపట్నం పోర్టు అథారిటీ (విపిఎ), ప్రధాన ఓడరేవుల విభాగం, ఇ-ఆఫీస్‌ను సమర్ధవంతంగా నిర్వహించడంలో దేశంలోనే రెండవ స్థానంలో నిలిచిందని పోర్టు చైర్మన్ డాక్టర్ అంగముత్తు మే 18 న తెలిపారు.
- అదనంగా, 2022-23 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో అత్యంత పోటీతత్వ డేటా గవర్నెన్స్ క్వాలిటీ ఇండెక్స్‌లో షిప్పింగ్ మరియు జల రవాణా మంత్రిత్వ శాఖ రెండవ స్థానాన్ని పొందింది.
- NITI ఆయోగ్ నిర్వహించిన ఈ సర్వే లో , షిప్పింగ్ మరియు జల రవాణా మంత్రిత్వ శాఖకు 5 పాయింట్లకు గానూ కేంద్ర పోర్టులు షిప్పింగ్ జలరవాణా శాఖ 4.7 పాయింట్ స్కోర్‌ను అందించి, 66 మంత్రిత్వ శాఖలలో ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ (MoPSW) చెప్పుకోదగ్గ రెండవ స్థానాన్ని సాధించింది.
- ఇ-గవర్నెన్స్ ఇండెక్స్‌లో ప్రత్యేకంగా ఇ-ఆఫీస్ అనలిటిక్స్ విభాగంలో విశాఖపట్నం పోర్టు అథారిటీ(VPA) రెండవ ర్యాంక్‌ను కూడా సాధించింది.
- ఈ చెప్పుకోదగ్గ విజయాన్ని సాధించడంలో అమూల్యమైన సహకారం అందించినందుకు పోర్ట్ ఆపరేటర్లు మరియు స్టీవ్‌డోర్‌లకు డాక్టర్ అంగముత్తు తన అభినందనలు తెలియజేశారు.
- మేజర్ పోర్టులలో పనిచేసే ఉద్యోగులు అధికారులు ప్రణాలికా బద్దంగా నిబద్దతో పని చేస్తే రాబోయే రోజుల్లో జలరవాణా శాఖ అలాగే విశాఖపట్నం పోర్టు అధారిటీ సైతం మొదటి స్ధానంలో నిలపవచ్చని విశాఖపట్నం పోర్టు చైర్మన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
***************************************************************************